Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దక్షిణాది సినిమా నిజంగా బాలీవుడ్ కొమ్ములు విరిచేసినట్టేనా..? కాదు… లేదు…!!

April 14, 2022 by M S R

మరీ అంతగా భుజాలు చరుచుకోవాల్సిన పనిలేదు… దక్షిణాది సినిమా బాలీవుడ్ కొమ్ములు విరిచేసిందని అప్పుడే ఓ నిర్ధారణకు వచ్చేయకండి… నిజమే…  ఒకప్పుడు రజినీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి వంటి చాలామంది సౌతిండియన్ హీరోలు హిందీ మార్కెట్‌లోకి అడుగుపెట్టి, వాపస్ వచ్చేశారు… నిజానికి హిందీ ఇండస్ట్రీ దక్షిణాది హీరోయిన్లను తప్ప ఇంకెవరినీ ఎప్పుడూ సహించదు… హిందీ ప్రేక్షకులు కూడా సౌత్ ఇండియన్ సినిమాలంటేనే అదోరకంగా చూసేవాళ్లు…

తెలుగు, తమిళ సినిమాల రీమేక్ హక్కుల్ని కొని, బాలీవుడ్ నిర్మాతలు హిందీ తారల్ని పెట్టుకుని, తమ ధోరణులకు అనుగుణంగా పునర్నిర్మించుకునేవాళ్లు… అప్పటి సూపర్ స్టార్ కృష్ణ సినిమా సింహాసనం టెక్నికల్‌గా ఓ సెన్సేషన్… ప్రజెంట్ ట్రెండ్ అయితే దాన్ని డబ్ చేసి నేరుగా పాన్ ఇండియా పేరిట విడుదల చేసేవాళ్లేమో…

బాహుబలితో పరిస్థితి మారుతున్నదీ అనేది నిజం… ప్రభాస్ ఎవరో, రాజమౌళి ఎవరో హిందీ ప్రేక్షకులకు తెలియదు… ఉత్త చందమామ కథ… ఐతేనేం, ప్రేక్షకుడిని కనెక్టయ్యేలా సీన్ల చిత్రీకరణ జరిగింది… బాహుబలి రెండో పార్ట్ ఏకంగా 1000 కోట్లకు పైగా (భారతీయ సినిమాలో దంగల్ తరువాత బాహుబలి-2 మాత్రమే… బహుశా ఇప్పుడు ఆర్ఆర్ఆర్…) వసూళ్లు చేసింది… బాలీవుడ్ షాకింగుగా చూస్తూ ఉండిపోయింది…

Ads

పుష్ప సరేసరి… బన్నీ కేరళ, ఏపీ, తెలంగాణలకు మాత్రమే తెలిసిన స్టార్… కానీ పుష్ప తనను ఏకంగా పాన్ ఇండియా హీరోను చేసింది… ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్, రాంచరణ్ కూడా నేషనల్ లెవల్ ఇమేజీని పొందారు… కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ కూడా హిందీలో మంచి కలెక్షన్లనే సాధించింది… సెకండ్ పార్ట్ బిజినెస్ భారీగా సాగింది… రిజల్ట్ చూడాల్సి ఉంది…

ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ తన జెర్సీ సినిమాను వాయిదా వేసుకున్నాడు… పుష్ప సినిమా ప్రభంజనం ముందు 83 సినిమా వెలవెలాపోయింది… అవును, బాలీవుడ్ మార్కెట్ సౌతిండియన్ సినిమాను అడ్డుకునే స్థితి లేదు… దారులు తెరుస్తోంది… గతంలోలాగా మోకాళ్లు అడ్డుపడితే ఆ మోకాలి చిప్పలే పగిలిపోతాయి, అంతే… సౌతిండియన్ నిర్మాతలు హిందీ బెల్టులో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నారు… పట్టు దొరికింది… కరెన్సీ మింట్ చేసుకుంటున్నారు… ఓ మోస్తరు సినిమాను కూడా హిందీలో డబ్ చేయడం, శాటిలైట్ టీవీ హక్కులు, ఓటీటీ హక్కులతో గల్లాపెట్టె నింపుకోవడం…

అయితే నిజంగా అంతా బాగానే ఉందా..? ఈ ప్రశ్నకు సమాధానం…. లేదు..!! హిందీ ప్రేక్షకులు అంత గుడ్డిగా ఏమీ ఆరాధించడం లేదు… సెలెక్టివ్… అజిత్ నటించిన వలిమై సినిమాకు జీస్టూడియోస్, బోనీకపూర్ నిర్మాతలు… యాక్షన్ ప్యాక్డ్ మూవీ… అయితేనేం, తన్నేసింది… సేమ్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన భారీ సినిమా మరక్కర్… అదీ తీవ్రంగా నిరాశపరిచింది… అంతెందుకు..? బాహుబలి రెండు పార్టులు ప్లస్ సాహోతో హిందీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ డిజాస్టర్‌గా నిలిచింది… విజయ్ నటించిన బీస్ట్ కూడా తన్నేసినట్టే… (హిందీలో సినిమా పేరు ‘రా’)…

సో, అంతా బాగా ఏమీ లేదు… ఒక ఆర్ఆర్ఆర్, ఒక పుష్ప, ఒక కేజీఎఫ్ హిట్టయిపోగానే ఇక బాలీవుడ్ మెడలు వంచినట్టేమీ కాదు… ఇప్పుడొస్తున్న హిందీ సినిమాలతో పోలిస్తే సౌతిండియన్ సినిమాలు కొన్ని మితిమీరిన హీరోయిజంతో మాస్ ప్రేక్షకులకు కనెక్టవుతున్నయ్… ఇదెంతకాలమో చూడాలి… కాకపోతే సౌతిండియన్ సినిమాలు హైఎండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నయ్… చిత్రీకరణ పోకడల్లో కొత్త పంథాలు తొక్కుతున్నయ్…

ప్రస్తుతం హిందీ ప్రేక్షకులను తండోపతండాలుగా థియేటర్లకు పట్టుకురాగల హీరోలు కనిపించడం లేదు… పాతవాళ్లు మరీ పాతబడిపోయారు… కానీ బాలీవుడ్ చూస్తూ ఊరుకోదు కదా… దాని మార్కెట్ పెద్దది… ఓ మోస్తరు సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద టాస్కేమీ కాదు వాళ్లకు… ఎటొచ్చీ కథలు, సంగీతం, స్క్రీన్ ప్లే విషయాల్లో డౌన్ అయిపోయింది… అందుకే సౌతిండియన్ సినిమా కథల్ని కొనుక్కుంటున్నారు…

గతంలో హిందీలో సూపర్ హిట్టయిన సౌతిండియన్ సినిమాలు లేవా..? ఉన్నయ్… రజినీకాంత్, ఐశ్వర్యారాయ్ నటించిన యెంతిరన్ (రోబో), దాని సీక్వెల్ 2.0 వసూళ్లను దున్నుకున్నాయి… అధిక వసూళ్ల ఇండియన్ సినిమాల జాబితాలో 2.0 కూడా ఉంది… సో, హిందీ ప్రేక్షకులు ఇప్పటికైతే సెలెక్టెడ్‌గా కొన్ని సౌతిండియన్ సినిమాల్ని ఇష్టపడుతున్నారు… కారణాలు బోలెడు ఉండవచ్చుగాక… ఇదెంతకాలమో చూడాలి… ప్రభాస్ చేతిలో ఆదిపురుష్ వంటి రెండుమూడు పెద్ద ప్రాజెక్టులున్నయ్… పెద్ద హీరోల సినిమాలన్నీ హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు… ఈ పొంగు ఎన్నాళ్లు..? చూడాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions