Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ సినిమా పుణ్యాన నాగార్జున సాగర్ ప్రేమికుల డెస్టినేషన్ అయింది

April 21, 2024 by M S R

Subramanyam Dogiparthi….   సినిమా అంతా యస్ వరలక్ష్మే . ఆమె చుట్టూ అన్ని పాత్రలూ తిరుగుతుంటాయి . ఇలాంటి పాత్రలు ఆమెకు కొట్టిన పిండే . శివాజీ గణేశన్ లాగా అరుస్తూ ఊగిపోతుంటుంది . ఫుల్ ఏక్షన్ . భర్త , ఓ అల్లుడూ , ఓ కాబోయే అల్లుడూ అందరూ ఆమెతో పందెం కడతారు . సినిమా చాలా బాగుంటుంది . ఎక్కడా బోర్ కొట్టదు . హుషారు హుషారుగా సాగుతుంది . విషాదాంతాలు తీసే బాలచందర్ చక్కటి వినోదభరిత సినిమా తీయటం విశేషమే . 1971 లో వచ్చిన మన ఈ బొమ్మా బొరుసా తెలుగు సినిమాకు మాతృకయిన పూవా తలయ్యా సినిమాకు కూడా ఆయనే దర్శకుడు .

చలం అల్లరి , చంద్రమోహన్ గడసరితనం , రామకృష్ణ అమాయక నమ్మకం , వెన్నిరాడై నిర్మల అందం ప్రేక్షకకులకు బాగా నచ్చుతాయి . చలం భార్యగా సచ్చు పాత్ర ఎమోషనల్ గా , ఉదాత్తంగా బాగుంటుంది . నాగార్జున సాగర్ హోటల్ ఓనరుగా ముక్కామల నటన సరదాగా ఉంటుంది . సినిమా చివర్లో ఆయనే యస్ వరలక్ష్మి భర్త అని తెలుస్తుంది . ఇంక రాజబాబు , రమాప్రభ , అల్లు రామలింగయ్యల గోల కూడా బాగుంటుంది . సినిమాలో నాగార్జున సాగర్ నేపథ్యంలో జరిగే సీన్లన్నీ చాలా బాగుంటాయి . ఈ సినిమా పుణ్యాన నాగార్జున సాగర్ ప్రేమికుల డెస్టినేషన్ అయింది . అక్కడ ఉన్న టూరిస్ట్ హోంకు డిమాండ్ క్రియేట్ అయింది . విజయ విహార్ పెద్దోళ్ళ స్పాట్ అయింది .

ఆర్ గోవర్ధన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టయ్యాయి . బొమ్మాబొరుసా పందెం వేయి నీదో నాదో పైచేయి , వేసుకుంటా చెంపలూ వేసుకుంటా , సర్లే పోవోయ్ వగలాడి చాల్లే పోవోయ్ బుంగమూతి పాటలు హుషారుగా ఉంటాయి .

AVM వారి సినిమా కదా ! సాధారణంగా వాళ్ళ సినిమాలు జాగ్రత్తగా తీస్తారు . ఆ క్రమంలోనే ఈ సినిమా కూడా కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయింది . నేనయితే ఎన్ని సార్లు చూసానో మా నరసరావుపేటలో కానీ , టి వి లో కానీ . యూట్యూబులో ఉంది . చూడనివారు ఎవరయినా ఉంటే చూసేయండి . మీకు నచ్చుతుంది . నాదీ గ్యారంటీ . ఎలక్షన్స్ టైం కదా ! బడా బడా నాయకులందరూ గ్యారంటీలు ఇస్తున్నారు కదా ! నేనేమయినా తీసిపోయానా ?! నేనూ ఓ గ్యారంటీ పడేసా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • పవర్ పాలసీ..! కేసీయార్ నష్టకారకాలు Vs రేవంత్ రెడ్డి కొత్త టెక్నాలజీలు..!!
  • సుహాసిని, విజయశాంతి ఓవర్ డోస్ ఎదుట అంతటి కుయిలీ వెలవెల..!!
  • అందరికీ కొత్త ఆధార్ కార్డులు..! అవసరం ఏమిటి..? ఎప్పటి నుంచి..?!
  • స్మృతి మంధానా పెళ్లికి ఈ విఘ్నాల వెనుక అసలు మర్మమేమిటో..!?
  • వందల కోట్లు కాదు… సినిమా పెద్ద తలలు చూడాల్సిన ఓ వండర్ ఇది…
  • అసలు ఏమిటీ చండీగఢ్ లొల్లి..? మోడీ ఏమైనా తప్పుచేశాడా..?
  • అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!
  • నాగార్జునా… ఈ కల్యాణ్ అనే రూడ్ కేరక్టర్‌ను బయటికి పంపించగలవా..?
  • హిడ్మా..! తెలంగాణలో రోజుకూలీగా అనామకంగా బతికాడా..? దేనికి..?!
  • ధర్మేంద్ర వందల కోట్ల ఆస్తులకు వాస్తవ హక్కుదారులు ఎవరు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions