Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘మీ పెళ్లాల చీరెల్ని తగులబెట్టండి, ఇండియన్ మసాలాల్లేని వంటలే తినండి..’

April 1, 2024 by M S R

చైనా అమలు చేస్తున్న వ్యతిరేక భారత కుట్రల్లో భాగంగా మాల్దీవుల భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్న విషయం తెలిసిందే కదా… దాని ప్రభావం బంగ్లాదేశ్ మీద కూడా పడినట్టుంది… కాకపోతే బంగ్లాదేశ్ అధికార పార్టీ కాదు, అక్కడి ప్రతిపక్ష పార్టీలు భారత వ్యతిరేక ప్రచారానికి దిగాయి… మనవాళ్లు అప్పట్లో ‘చైనా వస్తువులు’ బహిష్కరణ’ ఆన్‌లైన్ ఉద్యమాలు చేసినట్టే, అక్కడి ప్రతిపక్షాలు ఇప్పుడు ‘భారత ఉత్పత్తుల బహిష్కరణ’ ఉద్యమాన్ని ప్రారంభించాయి… ఆన్‌లైన్‌లోనే…

ఇక్కడ తేడా..? బంగ్లాదేశ్ ప్రధాని ప్రతిపక్షాలు చేస్తున్నది నిజానికి బంగ్లా షేక్ హసీనా మీద వ్యతిరేకతతో ‘బాయ్‌కాట్ ఇండియన్ ప్రొడక్ట్స్’ పేరుతో కదులుతున్నాయి… ఎందుకంటే..? షేక్ హసీనా ఇండియాతో స్నేహాన్ని కోరుకుంటుంది… దాంతో మొన్నటి ఎన్నికల్లో షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ ఘనవిజయం సాధించడానికి ఇండియా దోహదపడిందని ప్రతిపక్షాలు ఆరోపణలకు దిగాయి… ఆ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) పోలింగ్ బహిష్కరించింది…

ఇప్పుడు ఆ పరిణామాలన్నీ యాంటీ ఇండియా క్యాంపెయిన్ వైపు మళ్లాయి… అధికార పార్టీ ‘ప్రొ-ఇండియా’ కాబట్టి ప్రతిపక్షాలు ‘యాంటీ-ఇండియా’ స్టాండ్ తీసుకున్నాయి… ఇదీ నేపథ్యం… మరి దీన్ని అధికార పార్టీ అవామీ లీగ్, దాని అధినేత-ప్రధాని షేక్ హసీనా ఊరుకుంటోందా ..? లేదు… తను ఇండియన్ చీరలను బాగా ఇష్టపడుతుంది… అందుకే ప్రతిపక్షాలను కొట్టడం స్టార్ట్ చేసింది…

Ads

ఆమె ఎదురుదాడి విభిన్నంగా ఉంటుంది… ‘మీరు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని చెప్పారు కదా, ముందు మీ భార్యలను ఇండియన్ చీరలను కట్టుకోకుండా ఆపండి, మీ ఇళ్లల్లో ఉన్న చీరెలు ఎన్నో చెప్పండి… మీలో చాలామంది భార్యలే స్వయంగా ఇండియన్ చీరెలను తెప్పిస్తారు, ఇక్కడ అమ్ముకుంటారు, పైగా భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని ఫేక్ పిలుపులు దేనికి.. ? ఓ పనిచేయండి, మీరు మీ ఇళ్లల్లో ఉన్న చీరల్ని తీసుకొచ్చి మీ పార్టీల ఆఫీసుల ఎదుట దహనం చేయండి, అప్పుడు ప్రజలు మీ పిలుపుల్ని నమ్ముతారు’… ఇలా సాగుతోంది ఆమె దాడి…

ఈ దాడిని మెల్లిగా ఇండియన్ మసాలాల వైపు మరల్చింది ఆమె… ఉల్లి, వెల్లుల్లి, అల్లం ఇతర మసాలా ద్రవ్యాలకు బంగ్లాదేశీయులు ఇండియా నుంచి దిగుమతులపైనే ఆధారపడతారు… ‘‘ఓ పనిచేయండి మీరు, మీ ఇళ్లల్లో ఇకపై ఇవేవీ లేకుండా వండటం స్టార్ట్ చేయండి, మీరు వాటిని తినొద్దు… ఇండియన్ ఉత్పత్తులంటే అవి కూడా బహిష్కరించాలి కదా మీరు… మీ భార్యల్ని కూడా ఈ ఆందోళనల్లోకి తీసుకురండి, వాళ్లే జవాబులు చెబుతారు మీకు…’ అంటోంది ఆమె…

నిజానికి విదేశాల్లో స్థిరపడిన బంగ్లాదేశీయులే ఈ భారత వ్యతిరేక ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికలుగా అధికం చేస్తున్నారు… దీని ప్రభావం కొంత పడింది కూడా… ఢాకా మార్కెట్ షాపుల్లో ఎక్కువగా ఇండియన్ సరుకులే కనిపిస్తుంటాయి… ఇప్పుడు వంటనూనెలు, ప్రాసెస్డ్  ఫుడ్, సౌందర్య సాధనాలు, దుస్తులపై ఈ ప్రభావం పడింది… దాంతో ప్రధాని షేక్ హసీనా రంగంలోకి దిగి భారత వ్యతిరేక ప్రచారాన్ని కౌంటర్ చేయడం స్టార్ట్ చేసింది…

ఈ భారత వ్యతిరేక ప్రచారానికి సంబంధించి బీఎన్పీలోనే భిన్నాభిప్రాయాలున్నయ్… తలా ఓ తోవ… గయేశ్వర్ చంద్ర రాయ్ ఏమంటాడంటే… షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ అతి పెద్ద భారతీయ ఉత్పత్తులు, వాటిని బహిష్కరిస్తే చాలు, ఇండియా ఉత్పత్తులన్నీ కాదు’ అని… రీసెంటుగా మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నుల ఉల్లి ఎగుమతులకు అనుమతించింది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘నాకు ఇండియాతో అనుబంధం ఉంది… హైదరాబాద్‌లో వర్క్ హేపీ…’’
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…
  • మీకు తెలుసా..? ఇండియాలో ఫస్ట్ మొబైల్ కాల్ ఎప్పుడు, ఎవరు, ఎవరికి..?!
  • ఈ ట్రంపరి వేషాలతో… నాటి జార్జి ఫెర్నాండెజ్ మళ్లీ గుర్తొస్తున్నాడు…
  • ఆహా… కడుపు పండిన ఓ కొత్త కథ…! 30 ఏళ్ల పిండం ప్రాణం పోసుకుంది..!!
  • హవ్వ… KCR పార్టీ ఫిరాయింపులు, రాజకీయ నైతికతలపై మాట్లాడడమా..?!
  • ట్రంపు దుర్బుద్ది, ఆంక్షల విషం వెనుక ‘అణువార్ హెడ్స్’… పార్ట్-3…
  • పాకిస్థాన్‌లోని ఆ అణు వార్‌హెడ్స్ అమెరికావే… ఎందుకంటే..? (పార్ట్-2)
  • ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న అణు వార్‌హెడ్స్ అమెరికావే..! (Part-1)
  • అల్లు అర్జున్ తొలి సినిమా ఇది… ఇక్కడే పడింది అసలైన పునాది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions