ఇటీవలి రాజకీయ పరిణామాలలో BRS (రాజ్యసభ) నుండి పార్లమెంటు సభ్యులు (MPలు) భారతీయ జనతా పార్టీ (BJP)లో విలీనం కాబోతున్నారని ఢిల్లీ రాజకీయ సర్కిల్‌లోని ఉన్నత స్థాయి వర్గాలు సూచిస్తున్నాయి… రెండు పార్టీల మధ్య కుదిరిన అవగాహనలో భాగమే ఈ చర్య అట… రాజ్యసభలో అవసరమైన సంఖ్యలో సీట్ల కొరతను ఎదుర్కొంటున్న బిజెపి, “ఆపరేషన్ కమలం” అని వ్యవహారికంగా పిలవబడే ఆపరేషన్ మళ్లీ ప్రారంభించింది… ఇతర పార్టీల నుండి ఎన్నికైన సభ్యులను బిజెపిలో చేరేలా ఆకర్షించడం ఈ ఆపరేషన్ లక్ష్యం… తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై ఈ ఆపరేషన్ దృష్టి సారించింది…
1. ఒడిశా ఎంపీలు (RS):
– విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఒడిశాకు చెందిన 3- 4 మంది ఎంపీలు వెంటనే బీజేపీకి విధేయత చూపేందుకు సిద్ధమయ్యారు… అయితే, ఈ ఎంపీలను రాష్ట్రం నుంచి పార్టీ తరపున మళ్లీ ఎంపిక చేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా యోచిస్తోంది… (సరిపడా బలం సమకూరింది కాబట్టి)
– ఎంపీలందరూ రాజీనామా చేసి ఏకకాలంలో బీజేపీలో చేరే బదులు (అసెంబ్లీలో వారి ప్రస్తుత బలం ప్రకారం వారు మళ్లీ ఎన్నికయ్యే అవకాశం ఉంది) పార్టీ ఆర్గానిక్ మెథడ్ ఫాలో కావడం అన్నమాట…
– ఈ ప్రక్రియలో ఒక ఎంపీ రాజీనామా చేయడం, ఆ తర్వాత మళ్లీ ఎన్నిక కావడం… తదనంతరం, తదుపరి ఎంపీ రాజీనామా చేసి తిరిగి అదే విధంగా ఎన్నికవడం… ఎంపీలందరూ వ్యక్తిగతంగా తిరిగి ఎన్నికయ్యే వరకు ఈ క్రమానుగత ప్రక్రియ కొనసాగుతుంది…
2. తెలంగాణ దృశ్యం:
Ads
– ఇది మరో సంక్లిష్ట దృశ్యం… – తెలంగాణలో బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ విచారణ దాడులు కొనసాగుతుంటాయి, రేవంత్ ఆలోచనలు, వ్యవహారిక శైలిని బట్టి, తనను గతంలో కేసీయార్ జైలుకు పంపించినందుకు తీర్చుకుంటాడనుకునే ప్రతీకారం కోణంలో… కేసీయార్‌ను లేదా కేటీయార్‌ను ఎక్కడో ఓచోట గట్టిగా బుక్ చేస్తాడనే అంచనాలు….
– కవిత జైలులో ఉంది, ఆ కేసులో బెయిల్ రావడం లేదు… బీజేపీతో సయోధ్య లేనిదో బెయిల్ రాదనే ప్రచారం… పైగా కాంగ్రెస్ దాడుల నుంచి ఆత్మరక్షణ అవసరం… పార్టీ కేడర్ ఫుల్లు డిమోరల్ అయిపోయి ఉంది… ఈ నేపథ్యంలో తన నలుగురు రాజ్యసభ ఎంపీలను ఇస్తాం, ప్రతిగా కవితను విడుదల చేయించండి అనే బేరం… క్విడ్ ప్రోకో ఆర్ ఓ తరహా లంచం… గతంలో చంద్రబాబు చేసిందీ అదే, జగన్ దాడుల నుంచి రక్షణ కోసం…
– బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రచారం జరుగుతోంది గానీ, కేసీయార్ అంగీకరించడు, తను వ్యూహకర్త, తాత్కాలిక ప్రయోజనాల కోసం బీజేపీతో దోస్తీ నటించి, నలుగురు ఎంపీలను ఇచ్చి రాజీ కుదుర్చుకుంటాడు, అంతే తప్ప విలీనం, ఎన్డీయేలో చేరిక గట్రా ఉండకపోవచ్చు… దానికి బీజేపీ గనుక అంగీకరిస్తే, అసలు దాని ఆలోచనల్లోనే ఏదో దరిద్రం ఉన్నట్టు లెక్క…
3. ఆంధ్రప్రదేశ్ (AP) దృశ్యం:
– బీజేపీ అగ్ర నాయకత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఎంపీలతో సంప్రదింపులు జరుపుతోంది… ప్రక్రియ ఇంకా నడుస్తోంది… మొదటి నుంచీ జగన్ పార్టీ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోంది, కానీ ఇప్పుడు చంద్రబాబు, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో, తనపై ప్రతీకార వాంఛ పెరుగుతుందని జగన్ భయం… అందుకే తన ఎంపీలను బీజేపీకి ఇచ్చేయాలని ఆలోచనగా తెలుస్తోంది.., గతంలో చంద్రబాబు చేసినట్టుగానే… ఈ మొత్తం వ్యవహారంలో అసలు ప్రశ్న… నిజంగా బీజేపీకి ఇప్పుడు రాజ్యసభ ఎంపీల కోసం తన్లాట, వెంపర్లాట అవసరమా..? ఎలాగూ ప్రతిపక్షాలకు బిల్లుల్ని అడ్డుకునేంత బలం లేదు, మరెందుకు ఈ అప్రజాస్వామిక పోకడలు..?! ఎదుటి పార్టీల లంచాలు, ప్రలోభాలకు ఎందుకు లొంగిపోవడం..?!
చివరగా… గతంలో బీజేపీ తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని కేసీయార్ గాయిగత్తర చేశాడు, ఏదో డ్రామా క్రియేట్ చేశాడు, దేశమంతా ఆ డొల్ల వీడియోలు పంపించాడు… ఎవడూ పట్టించుకోలేదు, ఎవడూ నమ్మలేదు… అలాంటిది తనే నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించేందుకు తనే ప్రయత్నిస్తూ దేబిరిస్తున్నతీరు… అదే డెస్టినీ, అదే రాజకీయం, అదే ఐరనీ..!!
Share this Article