.
ఒకరకంగా బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు బీసీల ఆకాంక్షలను, ఆందోళనలను, ఆశలను అవమానిస్తున్నట్టేనా..? ఈ ప్రశ్న ఎందుకో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి…
నిన్న ఎక్స్‌లో ట్వీటుతూ… ‘‘ఆ రెండు పార్టీలది కపట ప్రేమ, బీసీలపై చిన్నచూపు, ఢిల్లీలో కొట్లాడాల్సిన పార్టీలు గల్లీలో డ్రామాలు’’ అన్నాడు…
Ads
ఏ పార్టీలు…? బీజేపీ, కాంగ్రెస్ అట… బీసీలపై చిన్నచూపు అట… గల్లీలో డ్రామాలు అట… ఏదో నేను ఆ రెండు పార్టీలనూ భలే తిట్టాను అనుకుని సంబరపడుతున్నాడేమో… కానీ ఏ ఫ్రస్ట్రేషన్‌లోకి జారిపోతున్నాడో గానీ తన మాటపై తనకే అదుపు తప్పుతోందని గమనించలేకపోతున్నాడు…
1) బీసీలపై చిన్నచూపు ఎవరిది..? గతంలో బీసీ రిజర్వేషన్లను అడ్డగోలుగా కుదించిన బీఆర్ఎస్‌ది కాదా..? అప్పుడు పార్ఠీలో ఏ బీసీ నేతైనా మాట్లాడాడా..?
2) నిన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీ బంద్‌కు మద్దతు ప్రకటించాయి తప్ప, అవి నిర్వహించిన బంద్ కాదు, అది బీసీ జేఏసీ, అంటే అన్ని పార్టీల బీసీలూ కలిసి నిర్వహించిన సంపూర్ణ బంద్…
3) ఆ బంద్‌లో పేరుకు బీఆర్ఎస్ నాయకులు పార్టిసిపేట్ చేశారు తప్ప… కేటీయార్, హరీష్ రావు వంటి ముఖ్యనేతల జాడ లేదు… అంటే మీరు పాల్గొనరు, పేరుకు మద్దతు, అంటే చిత్తశుద్ధి లేదని చాటుకున్నట్టేగా బీసీల ఆందోళనలకు, ఆకాంక్షలంటే చిన్నచూపు ఎవరికి..?
4) పైగా గల్లీలో డ్రామాలు అని వెటకారం… పేరుకు ఆ రెండు పార్టీలను తిట్టినట్టుగా ఉన్నా… స్థూలంగా నిన్నటి బంద్ కేవలం ఉత్త గల్లీ డ్రామా అని వెక్కిరిస్తున్నట్టే కదా… అంటే బీసీ మూవ్‌మెంట్‌ను అవమానపరచడం కాదా..?
5) నిన్నటి బీసీ బంద్ బీసీ కృష్ణయ్య తదితరుల నాయకత్వంలో జరిగింది… బీజేపీ, కాంగ్రెస్ పిలుపు కాదు అది… పైగా బీఆర్ఎస్ అధినేత కేసీయార్ బిడ్డ కవిత కూడా మద్దతు పలికి, మానవహారంలో పాల్గొంది… ఈమాత్రం పార్టిసిపేషన్, మద్దతు కేటీయార్, హరీష్ రావు నుంచి ఎందుకు కరువైంది..? మీ పార్టీ బీసీ మద్దతులో నిజాయితీ ఏముంది..?
6) అదేమంటే..? కాంగ్రెస్ బాధ్యత, బీజేపీ బాధ్యత అంటాడేమో… కాంగ్రెస్ తన వంతు ధర్మంగా చట్టం తెచ్చింది, జీవోలు చేసింది, లీగల్‌గా కొట్లాడుతోంది… చివరకు బీసీ బంద్‌కు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది… బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ కూడా మద్దతుగా వచ్చాడు… అసలు నాయకత్వమే బీ(సీ)జేపీ నేత కృష్ణయ్య కదా…
7) మరి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు పాల్గొనలేదు అంటాడేమో… వాళ్లు కేంద్రంలో మంత్రులు, వాళ్లు బంద్‌లో పార్టిసిపేట్ చేస్తే తమ సొంత ప్రభుత్వ పోకడపై తామే తిరగబడినట్టు ఉంటుంది, సున్నితంగా ఉంటుంది, వాళ్లు అవాయిడ్ చేశారు, మరి కేటీయార్‌కు, హరీష్‌కు ఆ జస్టిఫికేషన్ ఏముంది..?
8) ఎలాగూ మద్దతు ప్రకటించారు కదా బంద్‌కు… పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు కదా… ప్రతిపక్షంలో ఉంటూ ప్రధాన బీసీ సామాజికవర్గాల సామాజికన్యాయం ఆకాంక్షలకు మద్దతుగా నిలవడంలో కూడా నిజాయితీ లేదు సరికదా… గల్లీ డ్రామాలు అని ఈ బీసీ ఉద్యమాన్ని వెక్కిరించడం దేనికి..?!
Share this Article