.
అప్పట్లో… ఏ భూముల విషయమో గానీ… ఏదో ఫక్తు యెల్లో పత్రిక ఆ భూముల్లో లేళ్లు, సెలయేళ్లు అని ఏదేదో రాసింది… అంటే ఆ అడవి, ఆ ప్రకృతి ధ్వంసమే అని చెప్పడానికి…
ఆ రాతలు చదివి వినిపిస్తూ వైఎస్ ఆ పత్రికను ఏకిపారేశాడు… అదీ డిఫెండ్ చేసుకోవడం… హెచ్‌సీయూ భూములకు సంబంధించి బీఆర్ఎస్ సాగిస్తున్న ముప్పేట దాడిలో రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు…
Ads
అవి ఆల్రెడీ ఓ అనకొండ అమాంతం కబళించబోయిన భూములు… యూనివర్శిటీకి సంబంధం లేదు… ఐనా డిఫెండ్ చేసుకోలేక చేతులెత్తేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం… ఇదే కాదు, లగచర్ల, మూసీ కూల్చివేతలు, వాట్ నాట్..? ప్రతి ఇష్యూలోనూ బీఆర్ఎస్ సోషల్ మీడియా స్పష్టంగా కాంగ్రెస్ మీడియాను డామినేట్ చేస్తోంది… డిఫెన్స్‌లోకి నెట్టేస్తోంది…
పెయిడ్ బ్యాచ్‌తో ఆందోళనలు చేయిస్తోంది బీఆర్ఎస్ అని పొంగులేటి అంటున్నాడు… కావచ్చు, పెయిడ్ డర్టీ క్యాంపెయినర్లను కూడా జర్నలిస్టులుగా ముద్రేసి, రేవంత్ సర్కారు మీదకు వెగటు వీడియోల్ని వదిలి, జైళ్లకు వెళ్లి పరామర్శలు చేయించిన తీరు గుర్తుంది కదా… రాజకీయంగా కేటీయార్, హరీష్‌లు దాడులు చేస్తారు, సోషల్ మీడియా ఎఐ ఫోటోల్ని, ఎడిటెడ్ వీడియోల్ని కూడా వదిలి ఇష్యూలో ట్యాంకర్ల కొద్దీ పెట్రోల్ పోస్తుంది…
నవ్వొచ్చేది ఏమిటంటే..? ఈ ఎఐ ఫోటోలు, ఈ ఎడిటెడ్ వీడియోల బ్యాచ్ గతంలో స్వచ్ఛ సోషల్ మీడియా అని ఉద్యమం నడిపింది… ఈ ఎఐ ఫోటోల ప్రచారం ఎంతవరకూ వచ్చిందంటే… అందరూ అదే నమ్మేసి, చివరకు ఎవరైనా నిజాలు మాట్లాడితే పర్యావరణ, జీవ కారుణ్య వ్యతిరేక కర్కశులు అని ముద్రలు వేసేంత..! కేవలం ఈ ఫేక్ ప్రచారాలతో సినిమా సెలబ్రిటీలు కూడా రేవంత్‌ను ఓ విధ్వంసకారుడిగా ముద్రవేస్తూ ట్వీట్లు కొడుతున్నారు…. బన్నీ అరెస్టు బాపతు భయం ఎగిరిపోయింది…
ఎస్, అవకాశం దొరికితే ఏదీ వదలడం లేదు బీఆర్ఎస్, రాజకీయంగా వోకే, బట్ట కాల్చి మీద వేయడమే కాదు, గాలి నుంచి కూడా ఇష్యూ పుట్టించి కాంగ్రెస్ మీద దాడి చేయించగల ఎఫీషియెంట్ టీమ్ అది… బీజేపీకి పెద్ద చేతకాదు, దూకుడుగా వెళ్లే నాయకత్వం లేదు గానీ, బీఆర్ఎస్ ముప్పేట దాడిని ఎదుర్కోవడంలో రేవంత్ ఒకరకంగా ఫెయిల్యూరే…
హెచ్‌సీయూలో ఇప్పటికిప్పుడు చెట్లు నరికేస్తూ వందల బుల్‌డోజర్లు దండయాత్రకు వెళ్లి, కదం తొక్కాల్సిన పనేముంది..? ఏమైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారా..? చదును చేసి, 200, 300 గజాల ప్లాట్లు చేస్తున్నారా..?
పోనీ, బీఆర్ఎస్ వైపు నుంచి భీకరమైన దాడి జరుగుతుంటే… ఇదే కేసీయార్ 111 జీవో ఎత్తేసి వేల ఎకరాల్లో ప్రకృతికి చెరబట్టే ప్రయత్నం చేయలేదా..? దాదాపు 450 ఎకరాల భూములు అమ్ముకోలేదా..? ఎకరం 100 కోట్లు ఆహా ఓహో అని వార్తలు రాయించుకోలేదా..? అవి సిటీ లంగ్స్ కావా..?
ఆ భూముల్లో చెట్లు ఉండేవి కావా..? గుట్టల్ని పిండి చేసి చదును చేయలేదా..? ఫాఫం, అక్కడ జీవరాశులే ఉండేవి కావా..? యూనివర్శిటీలు, భూముల గురించి మాట్లాడుతున్నారు… పదేళ్లలో వర్శిటీలు ఎంత కునారిల్లిపోయాయో తెలియదా..? ఇదే ఓయూకు కేసీయార్ వెళ్లడానికి అయిష్టత చూపలేదా..? తవ్వితే సవాలక్ష… ఇవన్నీ చెప్పుకునేవాడు ఏడీ..?
ఐతే వాళ్లు చేశారు కాబట్టి వీళ్లూ చేయాల్సిందే అనడం కాదు ఇది… వాళ్లకన్నా ఆదర్శంగా ఉండొచ్చు… ఆలోచన, అడుగులు జనామోదం పొందేలా ఉండాలి… కానీ ఆ సోయి కూడా లేదు వీళ్లలో… చంద్రబాబును చూసి నేర్చుకోవాలి వీళ్లు…
బీఆర్ఎస్ విసిరే ట్రాపుల్లో పడి అన్ని హామీలను నెరవేర్చడానికి ఆపసోపాలు పడుతూ, డబ్బుల కోసం ఇదుగో ఈ అగచాట్లు… సింపుల్‌గా చంద్రబాబు తాపీగా ఒక్కో హామీని అరకొర చేస్తూ, అదేమంటే పీ4 ఎట్సెట్రా డైవర్షన్లతో కాలం గడిపేస్తున్నాడు… శిష్యుడు మాత్రం ప్రతిపక్షం లాగుతున్నకొద్దీ నెగెటివిటీ మూటగట్టుకుంటూ రోజురోజుకూ కూరుకుపోతున్నాడు..!!
Share this Article