Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాకు ఎన్టీయార్ ఇంటర్వ్యూ దక్కింది… నా మిత్రుడికి బిర్యానీతో కడుపు నిండింది…

May 8, 2023 by M S R

Murali Buddha………    అటు బిర్యానీ -ఇటు ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

ఓ జర్నలిస్ట్ కు మూడు కోట్ల రూపాయల పాఠం

ఓ జ్ఞాపకం ….

Ads

రాక్సీ లో నార్మా షేరర్

బ్రాడ్వే లో కాంచన మాల

ఉడిపి శ్రీకృష్ణ విలాస్ లో –

అటు చూస్తే బాదం హల్వా

ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ …

రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలో శ్రీ శ్రీ కే కాదు ఎవరికైనా కష్టమే .. జర్నలిస్ట్ కే కాదు ప్రతి మనిషి జీవితం లో ఇలా రెండింటిలో ఒకటి నిర్ణయించు కోవలసి ఉంటుంది …

95లో ఎన్టీఆర్ ను దించేశాక కొన్ని రోజులకు ఎన్టీఆర్ మీడియాకు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు .. ఈనాడు , జ్యోతిని ఎన్టీఆర్ , ఆయన పార్టీ ఇంటి మీడియాగా భావించే వారు .. ఇంటి పత్రికల జర్నలిస్ట్ లను ఇంటి మనుషులుగా చూసే వారు . మిగిలిన వారిని అసలు పట్టించుకునే వారు కాదు . ఇంటి మీడియానే అల్లుడితో కలిసి వెన్నుపోటు పొడవడం తో విలవిల లాడిన ఎన్టీఆర్ ఇతర మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వసాగారు.

ఆంధ్రభూమి తరపున ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేసేందుకు నేను , మరో రిపోర్టర్ కేఎన్ చారి వెళ్లాం . ఇంటి ముందు నిరీక్షణ ఇంకా మా వంతు రాలేదు . ఈలోపు చారికి మరో జర్నలిస్ట్ నుంచి ఫోన్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారో తెలియదు … ఈ లోపు బిర్యానీ తినివద్దాం అని పిలుపు … అదే విషయం చారి చెబితే నేను రాను ఈ లోపు వాళ్ళు పిలిస్తే ఎలా అన్నాను … బిర్యానీ , ఎన్టీఆర్ ఇంటర్వ్యూ లో నేను ఇంటర్వ్యూ కే ఓటు వేసి నీ ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళు అన్నాను . చారి వెళ్ళాడు …

కొద్ది సేపటి తరువాత ఎన్టీఆర్ నుంచి పిలుపు… నేను వెళ్లి ఇంటర్వ్యూ చేశాను … అల్లుడు చేసిన ద్రోహం తన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఎన్టీఆర్ చెప్పుకుంటూ వచ్చారు … కనిపిస్తే చాలు పాదాల పై పడి పోయే తమ్ముళ్లే వెన్ను పోటు పొడవడం తట్టుకోలేక పోయారు … నీరసించి పోయారు . మునుపటి రాజసం లేదు .

చారితో పాటు అప్పుడు బిర్యానీ కోసం వెళితే జీవితంలో మళ్ళీ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ దొరికేది కాదు … ఎందుకంటే ఆ తరువాత కొన్ని రోజులకే ఎన్టీఆర్ మరణించారు . ఒక జర్నలిస్ట్ కు తమ కాలం నాటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేయాలి అని బలంగానే ఉంటుంది .

****

నామాల విశ్వేశ్వర్ రావు అని జర్నలిస్ట్ మిత్రుడు ఆంధ్రప్రభలో ఉండే వారు … పర్మనెంట్ ఉద్యోగి… జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ ఫారం , డీడీ తీసి జర్నలిస్ట్ నాయకుడికి ఇచ్చారు . ఆ నాయకుడు నాలుగిళ్ళ పూజారి . అన్ని యూనియన్లు అతని చేతిలోనే …

కొంత కాలానికి సభ్యులకు ప్లాట్ కు డబ్బు కట్టమని నోటీసులు . తాను పర్మనెంట్ ఉద్యోగి , సీనియర్ ను తనకన్నా జూనియర్లు, పైగా పర్మనెంట్ కాదు, వారికి నోటీసు, నాకు మాత్రం రాలేదు అని సొసైటీ ఆఫీస్ కు వెళితే…. నువ్వసలు సభ్యత్వ దరఖాస్తే చేయలేదు పో అన్నారు … అక్కడ దుమ్ము దూళి తీసి చెత్తా చెదారాన్ని వెతికితే ఓ చోట అతని దరఖాస్తు ,డీడీ పడి ఉంది … అప్పటి కే పుణ్యకాలం తీరిపోయింది … నాలుగిళ్ళ పూజారి అయిన నాయకుడికి ఎన్నో పనులు ఉండవచ్చు . నీ దరఖాస్తు పై నీకు శ్రద్ద లేనప్పుడు అతనికి ఉండాలి అని ఏముంది ?

నాయకుడికి ఇవ్వకుండా తన దరఖాస్తు తానే ఆఫీస్ లో ఇచ్చి ఉంటే ఇప్పుడు ఓ ప్లాట్ కు ఓనర్ అయి ఉండేవాడు . గోపనపల్లి లోని జర్నలిస్ట్ కాలనీలో ఆ ప్లాట్ విలువ ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు .. ఆ రోజు అతనికి ఎంత ముఖ్యమైన పని ఉన్నా మూడు కోట్ల రూపాయలకు మించిన పని ఐతే కాదు ..

జర్నలిస్ట్ అనే కాదు, ఎప్పుడు ఏది ముఖ్యమో ఆ పని చేయాలి లేదంటే … చదువుకొనే వయసులో సినిమా హాలులో హీరో కటౌట్ ను పాలతో కడగడంలో బిజీ గా ఉంటే చదువు తరువాత సినిమా హాల్స్ కడిగే పనే దక్కుతుంది . బిర్యానీ కోరుకునే వారికి బిర్యానీ దక్కుతుంది.  ఎన్టీఆర్ ఇంటర్వ్యూ కోరుకున్న వారికి ఇంటర్వ్యూ దొరుకుతుంది. ఏం కోరుకుంటున్నారో అది సాధించేందుకు ప్రయత్నించాలి …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions