త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే తన దర్శకత్వం, తన కథ కమామిషు గాకుండా తన డైలాగులు గుర్తొస్తాయి… అతడు సినిమాలో ‘నేనూ వస్తా, నేనే వస్తా’ అనే డైాలాగ్ అద్భుతం… మాయాబజార్‌లో ఓ ఫేమస్ డైలాగ్ ‘అమ్మో, అమ్మే’ అనే డైలాగును అసలు ఎవరూ మరిచిపోలేరు… నెంబర్ వన్ టాప్ డైలాగ్ అది… తరువాత అంతటి పవర్ ఫుల్ డైలాగ్ ఇదేనేమో… ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్నది బుర్రా సాయిమాధవ్…
ఆ తల వంచకు, అది నేను గెలిచిన తల… మగనాలికి గాజులు అందం, మగవాడికి గాయాలు అందం… అథములం కాదు, ప్రథములం… వంటి డైలాగులు శాతకర్ణిలో అదరగొట్టాడు… అఫ్ కోర్స్, త్రివిక్రమ్ అన్ని ఎమోషన్స్ రాయగలడు… సాయిమాధవ్ కామెడీని పండించలేడు… సరే, ఎవరి బలాలు వాళ్లవి, ఎవరి బలహీనతలు వాళ్లవి… కానీ స్థూలంగా త్రివిక్రమ్‌కు తిరుగులేదు… ఈమధ్య తను వద్దనుకుని డైలాగ్స్ రైటింగ్ బాధ్యతను సాయిమాధవ్‌కు అప్పగించిన త్రివిక్రమ్ మళ్లీ అది కేన్సిల్ చేసి, తనే ఆ బాధ్యతను నెత్తిమీద వేసుకున్నాడు…
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా వస్తోంది కదా… అందులో సాయిధరమ్ తేజ కూడా ఉన్నాడు… దీనికి మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకున్నాడు మొదట్లో… తరువాత ఎందుకో తనే సాయిమాధవ్ పేరు చెప్పి, డైలాగ్స్ బాధ్యతను ఆయనకు అప్పగించాడు… కానీ ఆ ప్రయోగాలు వద్దు, నువ్వే రాయాలి అని పవన్ కల్యాణ్ చెప్పినా సరే, తనకు మహేశ్’బాబు సినిమా ఓవర్ లోడ్ అయిపోతోందనీ, సాయిమాధవ్ కూడా చేయి తిరిగిన రచయితే అని చెప్పి త్రివిక్రమ్ ఒప్పించాడు…
Ads
ఇది వినోదయ సీతమ్ కథపై ఆధారపడి రూపొందుతున్న సినిమా కదా… దానికి పవన్ కల్యాణ్ ఇమేజీకి తగినట్టు కొన్ని మార్పులు చేసి, ఆ కథను సాయిమాధవ్ చేతిలో పెట్టాడు దర్శకుడు సముద్రఖని… ఆయన కూడా నెలలో డైలాగ్ వెర్షన్ పూర్తిచేసి ఇచ్చేశాడు… కానీ అంత వేగంగా షూటింగ్ జరగడం లేదు… స్లో పేస్‌లో నడుస్తోంది… ఈలోపు ఈ కథలోకి త్రివిక్రమ్ ఎంటరయ్యాడు… ఎందుకంటే..? కథలో పవన్ కల్యాణ్ పాత్రకన్నా సాయిధరమ్ తేజ పాత్ర ఇంపార్టెన్స్ ఎక్కువ కనిపిస్తోంది…
మరేం చేయుట..? పవన్ కల్యాణ్ కాస్త సీరియస్‌గా చూసి, ఏం చేస్తావో చేయి అన్నాడు త్రివిక్రముడితో… ఇక తప్పేదేముంది..? కథలో మార్పులు చేర్పులకు పూనుకున్నాడు… తీరా చూస్తే ఒరిజినల్‌కు భిన్నమైన కథ తయారైంది… ఐనాసరే పవన్‌కు దర్శకుడికి నచ్చింది… దీన్ని బట్టి డైలాగులు రాయాలని అంటారు నిర్మాత, త్రివిక్రమ్… ఆల్‌రెడీ నెలరోజులు కష్టపడి రాసేశాను, మళ్లీ రాయమంటే రాస్తాను గానీ నాకు వేరే సినిమాల లోడ్ ఎక్కువగా ఉంది అంటాడు సాయిమాధవ్…
ఆల్‌రెడీ డైలాగ్ వెర్షన్ రాసిచ్చేశాడు, వీళ్లు వోకే అన్నారు, మళ్లీ రాయమంటే అదెలా సాధ్యం అవుతుంది..? ఈ స్థితిని త్రివిక్రమ్ అర్థం చేసుకుని, అయ్యా, నీకిచ్చిన డబ్బులు వాపస్ ఇవ్వాల్సిన పనిలేదులే గానీ, నీ వేరే పని చూసుకో అని చెప్పాడట… త్యాగశీలి… తన డబ్బు కాదు కదా… ఇక తప్పేదేముంది..? పనిభారం ఎక్కువవుతున్నా సరే, ఆ డైలాగులు కూడా తానే రాయడానికి పూనుకున్నాడు… హమ్మయ్య, బతికించారు అనుకుని ఆనందపడిపోయాడు బుర్రా సాయిమాధవ్…
Share this Article