Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టాప్-5 ఫైనలిస్టులు ఖరారు..! ఈ ఇద్దరు స్నేహితులు జాయింటుగా ఔట్..!

December 14, 2025 by M S R

.

సాధారణంగా బిగ్‌బాస్ హౌజులోకి వచ్చేటప్పుడు కొందరి ఏవీలు వేస్తుంటారు, పర్‌ఫామెన్స్ వీడియోలు ప్లే చేస్తారు… ఎలిమినేటయ్యాక వేదిక మీద జర్నీ వివరాల ఏవీలు వేస్తారు… ఫైనలిస్టుల ఏవీలను లాస్ట్ వీక్ స్పెషల్ అప్రిసియేషన్ల సందర్భంలో వేసి చూపిస్తారు…

కానీ అనూహ్యంగా శనివారం వీకెండ్ షోలో అసాధారణంగా సుమన్ శెట్టి, భరణిల స్నేహబంధం మీద ఏవీ ప్లే చేశారు… అప్పుడే డౌటొచ్చింది… నిజమే… రాత్రి సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు… ఈరోజు భరణి ఎలిమినేట్ అవుతున్నాడు… ఇద్దరి స్నేహితుల్నీ డబుల్ ఎలిమినేషన్ పేరిట పంపించేస్తున్నారు…

Ads

సో, ఇక మిగిలిన ఫైనలిస్టులు తనూజ, కల్యాణ్, డిమోన్, ఇమాన్యుయెల్, సంజన… పిక్చర్ క్లియర్… నిజానికి సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని ఊహిస్తున్నదే… డల్ అయిపోయాడు, లీస్ట్ వోటింగ్… అసలు తనే ఓసారి చెప్పుకున్నట్టు తను ఇన్ని వారాలు సర్వయివ్ కావడమే గొప్ప… బట్ హంబుల్, డౌన్ టు ఎర్త్…

భరణిని ఎలిమినేట్ చేయడం కూడా కరెక్టే… నిజానికి తనది రీఎంట్రీ… ఎవరి ప్రోద్బలం, పలుకుబడి పనిచేసిందో గానీ… శ్రీజతో పాటు రీఎంట్రీ ఇప్పించి, ఓ డ్రామా ప్లే చేసి, శ్రీజను మళ్లీ బయటికి పంపించేసి బకరీని చేశారు… బయటికి వెళ్లి, మళ్లీ వచ్చేవాళ్లకు కొంత అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది… అందుకని భరణిని ఫైనల్స్‌కు ముందే పంపించేయడం సరైనదే… మొహమాటాల్ని కత్తిరించేసుకుని..!!

సరే, తనూజ ఎలాగూ ఫైనలిస్టు… అదెప్పుడో ఖరారైంది, అర్హురాలు… సంజన ఉండిపోవడం కూడా గొప్పే నిజానికి… టాస్కులు గట్రా ఎలా ఉన్నా సరే, హౌజులో పెద్దగా ఎవరితోనూ బలమైన బంధం లేదు, సపోర్టు లేదు… నోటి దురుసు సరేసరి… బహుశా ఫైనల్స్‌లో ఫస్ట్ పడే వికెట్ ఆమే కావచ్చు ఇక…

డిమోన్ పవన్… రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యాక గాడిలో పడ్డాడు… జోక్స్ వేస్తున్నాడు, పాడుతున్నాడు, రకరకాల వంటలు చేస్తున్నాడు… హౌజు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు… రీతూ వెళ్లిపోయాక వోటింగులో కూడా పుంజుకున్నాడు… కాకపోతే తను విన్నర్ పోటీదారు కాదు… జస్ట్, ఏ ఫైనలిస్టు…

ఇమాన్యుయేల్… మొదటి నుంచీ తనూజకు బాగా పోటీ ఇచ్చి, ఒక దశలో ఇక విన్నర్ తనే అన్నంత పాపులారిటీ వచ్చింది… తరువాత క్రమేపీ డౌన్ అయిపోయింది… అసలు తను నామినేషన్లకు వచ్చిందే తక్కువ… ఈ వారం వోటింగులో కూడా పెద్ద సానుకూలత లేదు… బహుశా టాప్ త్రీలో ఒకడిగా ఉంటాడేమో…

పడాల కల్యాణ్ బలమైన పోటీదారు తనూజకు… వోటింగు బాగా పెరిగింది, ఫస్ట్ పైనలిస్టు… విన్నర్ కల్యాణా, తనూజా..? కామనరా, సెలబ్రిటీయా..? ఫస్ట్ లేడీ విన్నరా..? ఎప్పటిలాగే మగ విన్నరేనా..? ఫినాలేలో తేలుతుంది…!! ఈ వారం నామినేషన్లు, టాస్కులు, ట్విస్టులు మన్నూమశానం ఏమీ ఉండవు కాబట్టి పెద్దగా ప్రేక్షకులకు కూడా ఆసక్తి పెద్దగా ఏమీ ఉండదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాహుల్ గాంధీ, లియోనిల్ మెస్సీ… ఇద్దరినీ స్పానిష్ కనెక్ట్ చేసింది…
  • భవిత మండవ… ఓ కొత్త ఫ్యాషన్… ఆ విజయం వెనుక అసలు కథేమిటంటే…
  • నాటి తన వ్యాధి పీడిత కాళ్లు… నేడు కోట్ల మందికి ఆరాధ్యుడిని చేశాయి…
  • శ్రీలేఖ ఐపీఎస్… ఈమె గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే..?
  • టాప్-5 ఫైనలిస్టులు ఖరారు..! ఈ ఇద్దరు స్నేహితులు జాయింటుగా ఔట్..!
  • అదీ తేడా… అక్కడ మమత అట్టర్ ఫెయిల్… ఇక్కడ రేవంత్ సూపర్ గోల్…
  • నవ్య హరిదాస్..! ఇప్పుడు మరోసారి అందరి దృష్టీ ఈమెపై… దేనికంటే..?
  • కార్తీకదీపం..! వెలుతురు- చీకటి…! జస్టిస్ స్వామినాథన్‌కు మద్దతు..!!
  • ఆ బ్రాండ్ ఐస్‌క్రీమ్‌కూ కారు స్టార్ట్ గాకపోవడానికీ లింకేమిటి అసలు..?!
  • జస్టిస్ సూర్యకాంత్… న్యాయవ్యవస్థ మార్పులపై పెరుగుతున్న ఆశలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions