అయోధ్య రాముడి అక్షింతలు, గుడి ప్రారంభం, ప్రాణప్రతిష్ట అయిపోయాయి… బీజేపీకి రావల్సినంత మైలేజీకన్నా ఎక్కువే వచ్చింది… దానికి విరుగుడు ఏమిటో తెలియక ఇండి కూటమి విలవిల్లాడిపోయింది… ఈలోపు బీజేపీ విసిరిన భారతరత్న దెబ్బకు ఏకంగా ఆ కూటమి నుంచి జేడీయూ బయటపడి, కూటమికి మరో షాక్ తగిలింది…
పార్లమెంటులో ఓట్ ఆన్ అకౌంట్ లేదా ఫుల్ బడ్జెట్ పెట్టేసిన వెంటనే ఎన్నికల సంఘం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగించబోతోంది… మరి ఎన్నికలకు ముందు మరో బాంబ్ ఏమైనా వేయబోతోందా బీజేపీ… చూడబోతే సీఏఏ అలియాస్ పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రయోగించనున్నట్టు కనిపిస్తోంది…
బెంగాల్‌కు చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కాక్‌ద్వీప్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ… ‘నాదీ గ్యారంటీ… సీఏఏ వారం రోజుల్లో అమలుకు రాబోతోంది… అంతా రెడీ’ అన్నాడు… ‘బెంగాల్‌లో మాత్రమే కాదు, దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తాం, మన హోం మంత్రి అమిత్ షా చెప్పింది కూడా ఇదే’ అని పొడిగించాడు…
Ads
మొన్నటి డిసెంబరులో సీఏఏను బలంగా వ్యతిరేకించిన మమతా బెనర్జీని ఉద్దేశించి కలకత్తా ర్యాలీలో మాట్లాడుతూ ‘ఎవరూ సీఏఏ అమలు గాకుండా ఆపలేరు… కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయబోతోంది’ అని ప్రకటించాడు… ఆ ర్యాలీలో ఆయన బెంగాల్‌లోకి జొరబాట్లు, ఆ ప్రభుత్వ అవినీతి, రాజకీయ హింస, మైనారిటీల బుజ్జగింపు వంటి చాలా విషయాల్లో ఆమెను టార్గెట్ చేస్తూ ప్రసంగించాడు… 2026 ఎన్నికల్లో ఆమెను గద్దె దింపాల్సి ఉంటుంది, రెడీగా ఉండండీ అని ప్రజలకు పిలుపునిచ్చాడు… సరే, అదంతా వేరే కథ…
ఐతే… రామమందిరం వేరు, పౌరసత్వ సవరణ చట్టం వేరు… రామమందిరం ఇంపాక్ట్ దేశమంతా బలంగా ఉంటుందని బీజేపీ ఆశించి వుండవచ్చు… కానీ పౌరసత్వ సవరణ చట్టం ప్రభావం మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి వచ్చే హిందువులపైనే ఉంటుంది… 2019లో దీనిపై ఉద్యమించిన మమత వంటి విపక్ష పార్టీలు ఇప్పుడు దీన్ని ఎన్నికల ప్రచారాంశంగా మారుస్తాయా..? చూడాలి..!!
Share this Article