.
మిత్రుడు Pardha Saradhi Potluri అభిప్రాయం ఏమిటంటే..? కొన్నాళ్ళ నుండి కాంగ్రెస్ MP శశిధరూర్ ప్రవర్తనలో మార్పు కనపడుతున్నది!
బహుశా బీజేపీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాడా అని అనుమానాలు ఉన్నాయి!ఈ రోజు కేరళలోని కోచ్చిన్ లో విఝిజినం పోర్టు ప్రారంభం చేయడానికి మోడీ వచ్చినప్పుడు శశి ధరూర్ విమానాశ్రయానికి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు!
Ads
అయితే శశి ధరూర్ కేరళ వాడు కాబట్టి మోడీకి స్వాగతం పలకడానికి వచ్చాడు కాబట్టి నేను ఇలా అనడం లేదు! మోడీ విదేశాంగ విధానం చాలా బాగుంది అని పొగుడుతున్నాడు ఈ మధ్య! మణి శంకర్ అయ్యర్ అయితే ఏకంగా రాజీవ్ గాంధీనే విమర్శిస్తున్నాడు!
శశి ధరూర్ ఒక మంచి వక్త అనడంలో సందేహం లేదు కానీ కాంగ్రెస్ లో బాగా చదువుకొని తెలివితేటలు ఉన్నవాడిని ఎదగనివ్వరు అన్నది తెలిసిందే కదా!
చూద్దాం, మరో నెలరోజులలోపే కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరుతాడేమో ఎవరికి తెలుసు?
గౌతమ్ అదానీ పోర్టుని నిర్మించి పార్టీలకి అతీతంగా కమ్యూనిస్టు, కాంగ్రెస్, బీజేపీలని ఒకే వేదిక మీదకి తీసుకురావడం ముదావహం! ఇక్కడ మమ్మల్ని ఇలా చూడటం వల్ల కొందరికి ఈరాత్రి నిద్ర పట్టదు అని మోడీ వ్యంగ్యంగా ఓ విసురు విసిరాడు కూడా…
సరే, ఇంకాస్త వివరాల్లోకి వెళ్తే…. కాంగ్రెస్ తాజా రాజకీయ ధోరణుల మీద విమర్శల మాటెలా ఉన్నా… పార్టీలో అంతర్గతంగానే చాలామందికి నచ్చడం లేదు, ప్రత్యేకించి రాహుల్ గాంధీ నాయకత్వం మీద ఇంకా ఇంకా వ్యతిరేకత పెరుగుతోంది…
ఐతే శశిధరూర్ బీజేపీలోకి రావడం వల్ల బీజేపీకి ఉపయోగం ఏమిటనేది ప్రశ్న… 70 ఏళ్లు ఇప్పుడు… కేరళ, తిరువనంతపురం ఎంపీ… కానీ కాంగ్రెస్ కాబట్టి గెలుస్తున్నాడు… బీజేపీలోకి చేరితే ఆ ఆదరణ దక్కుతుందా..? ఎవరూ లేనిచోట ఎవరైతేనేం అనుకుంటే తప్ప బీజేపీకి తను పెద్ద ఫాయిదా ఏమీ కాదనిపిస్తోంది…
ఐరాసలో పనిచేసిన తను విద్యాధికుడు, రచయిత, పొలిటిషియన్… రసపురుష్… తనందుకో నమ్మబుల్ వ్యక్తి కాదనే భావనే చాలామందిలో ఉంది… కాస్త ఆ నేపథ్యంలోకి వెళ్తే…
కశ్మీరీ పండిట్, ఆర్మీ ఫ్యామిలీకి చెందిన సునందకు శశిధరూర్ మూడో భర్త… ఆమెది ఉగ్రవాద బాధిత కుటుంబం… మొదటి భర్తతో విడాకులు, రెండో భర్త ప్రమాద మరణం తరువాత కొన్నాళ్లకు శశిధరూర్‌ను మలయాళీ పద్ధతిలో 2010లో పెళ్లి చేసుకుంది…
చదువుకున్నది, తెలివైంది… శశిధరూర్ మంత్రయ్యాక ఐపీఎల్ కొచ్చి టస్కర్స్ టీమ్‌లో బినామీ వాటాలపై ఆరోపణలు వచ్చాయి… అవన్నీ ఎలా ఉన్నా… శశిధరూర్‌కు కూడా ఇది మూడో పెళ్లి… మొదటి భార్యతో విడాకులు, రెండో భార్యతో (కెనడా దౌత్యవేత్త) స్వల్పకాలం బంధం… తరువాత సునంద…
ఆమె తనను భరిస్తూ వచ్చింది… పాకిస్థానీ లేడీ జర్నలిస్టు మెహర్ తరార్ శశిధరూర్ మీద హానీట్రాప్ విసిరిందనేది సునంద పుష్కర్ ఆరోపణ… హఠాత్తుగా 2014లో అనుమానాస్పద స్థితిలో శవంగా మారింది… తొలుత ఆత్మహత్య అన్నారు గానీ, తరువాత మార్చి శశిధరూర్ మీద కూడా సెక్షన్లు నమోదు చేసి దర్యాప్తు చేశారు…
ఆమె శరీరంలో విషం కనుగొన్నారు, దేహంపై గాయాలున్నాయి… సునంద హత్యకు గురైందనే చార్జ్ షీటు… కానీ చివరకు ఏమైంది..? కోర్టు తనను నిర్దోషిగా వదిలేసింది… ఇప్పుడు ఆ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదు కానీ… శశిధరూర్ నమ్మదగిన కేరక్టరేనా..? ప్రత్యేకించి బీజేపీ నమ్మొచ్చా..? నమ్మి అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉందా..? ఇవీ ప్రశ్నలు…
శశిధరూర్ మొహం చూడగానే సునంద పుష్కర్ గుర్తొస్తుంది… ఆమె కుటుంబం ఉగ్రవాద బాధిత కుటుంబం… చివరకు వ్యక్తిగత జీవితంలో కూడా పాకిస్థానీ బాధితురాలేనా..? పాపం..!!
Share this Article