ఒకవేళ నిజమే అయితే జగన్ తీసుకోబోయే నిర్ణయానికి అభినందన..! ‘‘ఆనందయ్య మందును ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంపిణీ చేస్తారు, 108, 104 వాహనాలను వాడతారు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను ఇన్వాల్వ్ చేస్తారు, అత్యవసరమైన వారికే తొలిప్రాధాన్యం, ఒకటీరెండు రోజుల్లో అధికారిక ప్రకటన…’’ ఇదీ ఆంధ్రప్రభ ఫస్ట్ పేజీ బ్యానర్… నమ్ముదాం, ఆశిద్దాం… అయితే నిన్న ఆనందయ్య మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడుతున్న వీడియో ఒకటి కనిపించింది… ‘‘నేను ఇప్పుడు హోం క్వారంటైన్లో ఉన్నాను’’ అన్నాడు… కరోనాకు అద్భుతమైన మందు కనిపెట్టి, 70 వేల మందికి ఆ మందు అందించి ఆదుకున్న వ్యక్తి తను హోం క్వారంటైన్లో ఉండటం ఏమిటి..? అత్యంత ఆశ్చర్యకరంగా ఆ మాటలు అనిపించారా ఎవరైనా తనతో..? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..? ఇదొక మిస్టరీ… ప్రజలందరికీ డౌట్లే… సరే, ఆంధ్రప్రభ వార్తే నిజం అనుకుందాం… కొన్ని చిక్కులు, పరిష్కారాలు గట్రా చూడాలి…
ప్రజలు బలంగా ఆ మందు కోరుకుంటున్నారు… సో, జగన్ పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే అది జనం మెచ్చే నిర్ణయమే అవుతుంది… ప్రధాన పార్టీల మద్దతు ఆనందయ్య మందుకే ఉంది కాబట్టి రాజకీయంగా జగన్ నిర్ణయం పట్ల విమర్శలేమీ ఉండవు… అఫ్ కోర్స్, ప్రభుత్వం ఓ ఫరమ్ నిర్ణయం గనుక తీసుకుంటే ఒకవేళ విపక్షాలు రాజకీయ లబ్ఢి కోసం మాటమార్చినా సరే, పట్టించుకోవాల్సిన పనిలేదు… ప్రయోజపయోగమే లక్ష్యం కావాలి… వచ్చే చిక్కులు కొన్ని ఉంటయ్… మొదటి నుంచీ ఆనందయ్య మందుపై విషయం కక్కుతున్న సోకాల్డ్ మేధావులు ఎవరైనా ఫార్మాసురుల కోసం కోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది… 1) ఆనందయ్య క్వాలిఫైడ్ డాక్టర్ కాదు… 2) ఓ నాటుమందును ప్రభుత్వం పంపిణీ చేయకూడదు… 3) ప్రభుత్వం అశాస్త్రీయతను ఎంకరేజ్ చేయకూడదు… 4) రేప్పొద్దున నష్టం జరిగితే ప్రభుత్వం బాధ్యత ఎంత..? ఇలా వాదిస్తారేమో… కానీ…
Ads
- ఆనందయ్య మందుకు నాటు మందు అని పేరుపెట్టినా సరే… తను వాడేవన్నీ సిద్ధవైద్యంలో వాడే మామూలు సరుకులే… ప్రమాదకారకాలు కాదు… ఈమేరకు ఆయుష్ విభాగం క్లారిటీ ఇచ్చింది… ఎవరికీ సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రభుత్వాధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది… రేప్పొద్దున ఐసీఎంఆర్ గనుక నిజాయితీగా వ్యవహరిస్తే, పాజిటివ్ రిపోర్టే రావచ్చు… తయారు చేసేది ప్రభుత్వ శాఖ ఆయుష్ అధికారులే కాబట్టి ఆనందయ్య క్వాలిఫికేషన్ అనేది పరిగణనలోకి రాదు…
- నాటు మందు అని భావించే పక్షంలో… దాన్ని కరోనా మందు అనకుండా, ఇమ్యూనిటీ బూస్టర్ పేరిట పంపిణీ చేయొచ్చు… నిజానికి ఆనందయ్య మందు చేసే పని అదే… అయితే ఏదేని సోషల్ ట్రస్టు పేరిట పంపిణీ చేస్తూ, ప్రభుత్వం సహకరించడం బెటరా..? ప్రభుత్వమే స్వయంగా పంపిణీ చేయడం బెటరా..? మరోసారి ఆలోచించాలి… టీటీడీని కూడా ఇన్వాల్వ్ చేయడం కరెక్టు కాదు…
- ఈ నిర్ణయం గనుక తీసుకుంటే… పాండెమిక్ యాక్ట్‌లోని సెక్షన్లను వాడుకోవాలి… ప్రభుత్వ చర్యకు ప్రొటెక్షన్ లభిస్తుంది…
- శాస్త్రీయం అనేది ఓ బ్రహ్మపదార్థం… ఏది సైన్సో, ఏది సైన్స్ కాదో ఎవరూ నిర్ధారించలేరు, పైగా ఇదేమీ మూఢవిశ్వాసాలకు సంబంధించి తంతు ఏమీ కాదు… సో, కోర్టులో ఈ వాదన కూడా నిలవకపోవచ్చు… సీరియస్ కేసులకే ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి రెండు మూడు రోజులు నిఘా వేయగలిగితే చాలు, ఐనా గతంలో మందు వాడినవారికి ఏ నష్టమూ వాటిల్లలేదు కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వానికి ఆందోళన అనవసరం… ఎటొచ్చీ… అసలు ప్రశ్న మిగిలే ఉంది… నిజంగా జగన్ ఈ సాహసం చేయగలడా..? సూచనలు, సంకేతాలు నిజంగా ఉన్నాయా..? రోజూ 20 వేల దాకా కేసులు నమోదవుతూ… బ్లాక్, వైట్ ఫంగసులు పెరుగుతూ… బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క… నేటికీ కలవరం తగ్గని స్థితిలో ప్రభుత్వం ఒక ఇమ్యూనిటీ బూస్టర్‌ను పంపిణీ చేస్తే తప్పేముంది..? కానీ ఈ భావనకు జగన్ స్టికాన్ అయి ఉంటాడా..? చూద్దాం…!!
Share this Article