నిన్నటి టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ వార్తల్లో ఇంపార్టెంట్ ఏమిటంటే..? మరో పదేళ్లు నేనే సీఎం, ఇక పిచ్చిప్రచారాలు ఆపేయండి అని హెచ్చరికలు జారీచేశాడనేది ఆ ప్రధాన వార్త… మరి ఇన్నిరోజుల వారసత్వ పట్టాభిషేక ప్రచారాన్ని ఆదిలోనే తుంచే ప్రయత్నం ఎందుకు చేయలేదు..? అలసిపోయాను, అదికారం ఇక చాలు అనే సంకేతాలు సాక్షాత్తూ ఆయనే ఇచ్చాడని కదా ప్రచారం… మరి ఇంతలోనే ఏమైంది..? ప్రజల్లో నెగెటివిటీ వ్యక్తమైందా..? పార్టీలో కొత్త కుంపట్లు రేగే ప్రమాదం కనిపించిందా..? లేక ఇదంతా తనే కావాలని జరిపించిన డైవర్షన్ యాగమా..? నిజానికి సీఎం కేసీయార్‌కు సంబంధించి పదే పదే ఒక ప్రచారం బాగా జరుగుతున్నదీ అంటే అది కచ్చితంగా జరగదు అని అర్థం, అది మరోసారి నిరూపితం… మరి తనెందుకు ఈ ప్రచారం జరగాలని కోరుకున్నాడో తెలియదు… ఐనా కేసీయార్ రాజకీయ ఆలోచనల్ని, ప్లాన్డ్ అడుగుల్ని పట్టుకోవడం పెద్ద పెద్ద తోపు విశ్లేషకులకే సాధ్యం కాదు… కాబట్టి అదలా వదిలేసి, వేరే ఇష్యూలోకి వెళ్దాం…
‘‘‘టీఆర్ఎస్ పార్టీకి ఎవరూ పోటీకాదు… రెండు ఎమ్మెల్సీ స్థానాలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్సే గెలవాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు……’’’ ఇదీ నిన్నటి వార్తల్లోనే ఉన్న మరో చిన్న బిట్… చిన్నదేమీ కాదు, ఇంపార్టెన్స్ ఉన్నదే… వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సరే… సాగర్ ఉపఎన్నిక సరే… కానీ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పార్టీ అధికారికంగా పోటీపడుతుందా..? గతంలో ఓసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ అనధికారికంగా ఫలానావాళ్లు మావాళ్లు అని మ్యాండేట్ ఇచ్చిందే తప్ప అధికారికంగా నిలబెట్టలేదు… వాళ్లు ఓడిపోయారు, అది వేరే కథ… ఈసారి ఖమ్మం-వరంగల్-నల్గొండ సీటు నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి పోటీచేస్తున్నాడు… ప్రచారం చేస్తున్నాడు… అధికారిక అభ్యర్థిగా నిన్న సీఎం స్వయంగా ప్రకటించాడు… Clear… కానీ మరి హైదరాబాద్ సీటు..? ఒక ప్రచారం లోలోపల ఊపందుకున్నది… ఏమిటంటే..?
Ads
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వబోతోందని… దీనికోసమే ఆయన తటస్థుడిగా రంగంలోకి దిగుతున్నాడనే ప్రచారం కొద్దిరోజులుగా ఉన్నదే… ‘‘రెండు ఎమ్మెల్సీ స్థానాలూ మనమే గెలవాలి’’ అని కేసీయార్ కార్యవర్గ భేటీలో చెప్పాడు… అంటే నాగేశ్వర్‌కు మద్దతు అనేది తూచ్ అనుకోవాల్సిందేనా..? నిజానికి నాగేశ్వర్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించడం దేనికి అంటే..? ‘‘టీఆర్ఎస్ గెలిచేట్టు లేదు కాబట్టి, బీజేపీ గెలవకూడదు కాబట్టి, మధ్యేమార్గంగా నాగేశ్వర్‌ను గెలిపించాలి’’ అనేది ఎత్తుగడగా చెబుతున్నారు… కానీ అలా చేస్తే మటుకు టీఆర్ఎస్కు రాజకీయంగా చాలా నష్టం… 1) నాగేశ్వర్ పక్కా సీపీఎం క్యాంపు… తను బాగా వ్యతిరేకించే సీపీఎం పార్టీకి కేసీయారే అప్పనంగా ఓ సీటు ఇచ్చినట్టవుతుంది… టీఆర్ఎస్కు వచ్చే పొలిటికల్ ఫాయిదా ఏమీ ఉండదు… 2) ఓడిపోయి, ముందే బరి విడిచి పారిపోయాడు అని బీజేపీ ప్రచారం చేస్తుంది, అది బాగా పరువు తీసే వ్యవహారం… సో, టీఆర్ఎస్ పార్టీ ఇమేజీ దృష్ట్యా అది కరెక్టు కాదు.., గెలిచినా, ఓడిపోయినా సరే, తనే బరిలో ఉండాలి… 3) అధికారంలో ఉన్న పార్టీ తనే ముందే తప్పుకుని, వేరే ఎవరికో మద్దతు ప్రకటించడం ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది… అంతిమంగా కేసీయార్ ఏం చెబుతాడో వేచి చూడాల్సిందే ఇక…!!
Share this Article