Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దమ్ మారో దమ్… లెటజ్ గం‘జాయ్’… మోడీ సర్కారు కొత్త ఆలోచన…

January 3, 2021 by M S R

నిజం… నమస్తే తెలంగాణ ఎప్పుడోసారి చుక్క తెగి రాలిపడ్డట్టుగా… ఓ మంచి కథనాన్ని ప్రజెంట్ చేస్తుంది… మోడీ ప్రభుత్వం గంజాయిని నిషిద్ధ, నార్కొటిక్స్ జాబితా నుంచి తొలగించే ఆలోచనలో ఉందనే ఓ స్టోరీ ఇంట్రస్టింగుగా ఉంది… నిజానికి గంజాయి, వీడ్, మారిజువానా పేరు ఏదైతేనేం..? తరతరాలుగా మన జాతి మత్తుపదార్థం అది… ఈరోజుకూ ఉత్తరాదిలోని అనేక ప్రాంతాల్లో శుభ కార్యాల్లో భంగ్ వాడకం సహజం… హోళీ వంటి సందర్భాల్లోనైతే స్వీట్లు, తాంబూలాలు, లస్సీలు… ఏదోరకంగా భంగ్ కలుపుకుని మహిళలతోసహా గం‘జాయ్’ చేస్తారు… గంజాయి పొగ చాలా మందికి అలవాటు కూడా…

ganja

ఎవడో అమెరికాలో ఏ ప్రయోజనం కోసమో గంజాయిని ప్రమాదకర మత్తుపదార్థంగా ముద్రవేశాడు… ఆ కథ మరోసారి చెప్పుకుందాం… ఇంకేం…? ప్రభుత్వం దీని సాగును నిషేధించింది… దీని ఔషధ విలువలనూ కాలరాచింది… దాన్ని చూసి అనేక దేశాలూ అదే పనిచేశాయి… నిజానికి గంజాయి నాటు సారా, చీప్ లిక్కర్, గుట్కాలు, బీడీలు, సిగరెట్లు, చీప్ డ్రగ్స్‌తో పోలిస్తే తక్కువ ప్రమాదకరం… కానీ వినేవాడెవడు..?

1985లో మన దేశం కూడా దీన్ని నార్కొటిక్స్ జాబితాలోకి చేర్చేసి… సాగును, నిల్వను, వాడకాన్ని, రవాణాను తీవ్ర నేరాలుగా గుర్తించింది… వాస్తవంగా గంజాయి ఎక్సయిజు, పోలీసులు, లాయర్లకు బాగా డబ్బు మత్తు కలిగించే మత్తుపదార్థం… అంతకుమించి సాగు ఏమీ తగ్గదు… కొన్నిచోట్ల బ్రోకర్లే నాణ్యమైన విత్తనాలు ఇచ్చి మరీ సాగు చేయించి, పొలం దగ్గరే డబ్బు చెల్లించి, మద్దతు ధర ముట్టజెప్పి మరీ తీసుకెళ్తారు…


weed1

ఇప్పుడు గోవాలో బీజేపీ సర్కారు గంజాయి మీద ఆంక్షలు తొలగించింది, మోడీ సర్కారు దేశంలోనే దీనిపై ఆంక్షలు తీసేయబోతున్నదీ అనేది నమస్తే తెలంగాణ కథనం… ‘యూఎన్ కమిషన్ ఆన్ నార్కొటిక్స్ డ్రగ్స్’‌పై ఒత్తిడి తెచ్చి, ఈ నిషేధాలన్నీ తొలగించేలా చేయడానికి ఇండియా మాత్రమే కాదు, మరో 20, 30 దేశాలు ప్రయత్నిస్తున్నాయి…

అయితే కేవలం దీనివల్ల డబ్బు వస్తుందనే కాదు… దాన్ని గుడ్డిగా వ్యతిరేకించాల్సిన పనిలేదు… వీథి చివర పాన్ షాపు, పక్క వీథిలో వైన్స్, చాటుమాటుగా దొరికే డ్రగ్స్… వీటికన్నా గంజాయి ఎక్కువ అనారోగ్యకారకం ఏమీ కాదు… పైగా ఔషధాల్లో సరిగ్గా వాడుకుంటే అనేక సమస్యలకు… ప్రత్యేకించి మానసిక వ్యాధులకు మంచి మందు… అయ్యో, అయ్యో, ఇంత ఘోరమా… గంజాయిని చట్టబద్ధం చేస్తారా..? ఇంత దుర్మార్గమా..? అని ఏడ్చి మొత్తుకునే గొంతులు మళ్లీ వినిపిస్తాయి… అందులోనూ మోడీ ప్రభుత్వం చేస్తున్నదీ అంటే అవి మరింత హైపిచ్‌లో కేకలు వేస్తాయి… దానికి రెడీగా ఉండాలి..!!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • సరికొత్త డ్రామా కంపెనీ… ఈటీవీ షో అంటేనే కామెడీ అయిపోయింది…
  • విజ్జెక్క ఆ సీటుకు ఎలా ఆప్ట్..? ఈ ప్రచారం తెరమీదికి తెస్తున్నదెవరు..?
  • ఓహ్… షర్మిల తిరుగుబాటు వెనుక ఇంత భారీ వ్యూహం దాగుందా..?!
  • తెలంగాణ సీఎం కుర్చీ అంత ఈజీయా..? జగన్-షర్మిల వార్… పార్ట్-2…
  • జగన్- షర్మిల డిష్యూం డిష్యూం..! వైఎస్ కుటుంబంలో చీలిక..! పార్ట్-1…
  • రోజాతో ఢీకి ఓంకార్ సై..! వర్షిణికి భలే చాన్స్..! అసలేం జరుగుతున్నదంటే..?!
  • కాకి బంగారం..! అల్లరిపాలైన నరేష్..! బావురుమన్న బాలయ్య టైటిల్..!!
  • లక్-కీ..! దగ్గుబాటి సురేషుడు లక్కీయేనా..? తొక్క మీద కాలేశాడా కొంపదీసి..!
  • పర్ సపోజ్, ఆమె వేరే పెళ్లిచేసుకుంటే… మాజీ భర్త వీర్యంపై హక్కులేమవుతయ్..?
  • తటస్థ నాగేశ్వరా… బీజేపీని తిట్టాలంటే భద్రాచలం రాముడు కావాలా ఏం..?

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now