Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కడ పుట్టిన పసి పిల్లలకూ ఇక వీసాలు, స్టాంపింగులు..!!

January 22, 2025 by M S R

.

అమెరికా గడ్డ మీద పుట్టినంతమాత్రాన ఆ పౌరసత్వం ఆటోమేటిక్‌గా వస్తుందనే ఓ పాత చట్టాన్ని ఖాతరు చేయకుండా కొత్త అధ్యక్షుడు ట్రంపు ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిపారేశాడు… మన ఇండియన్ నేతలు చెబుతుంటారు కదా… తొలి సంతకం అని… అలాంటిదే ఇది…

ప్రవాస భారతీయ సర్కిళ్లలో, మన దేశంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం… ఎందుకంటే, ఈ వీసా ఆర్డర్‌తో నష్టపోయేది ప్రధానంగా భారతీయులే కాబట్టి… జస్ట్, అది ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే… కనీసం మన ఆర్డినెన్స్ తరహా కూడా కాదు…

Ads

అది అమలవుతుందా..? దీనిపై బోలెడు ఈక్వేషన్లు చర్చకు వస్తున్నాయి… ఇది ట్రంప్ ఎన్నికల హామీ అనేది నిజమే… కానీ… చాలామంది అనుమానం ఏమిటంటే..? ట్రంపు గెలుపులో ఎలన్ మస్క్ ధనసాయం, పాత్ర అందరికీ తెలిసిందే కదా… ప్రస్తుతం ట్రంపు నిర్ణయాల్ని బాగా ప్రభావితం చేస్తున్నది మస్కే…

తను టెస్లా ఎలక్ట్రిక్ కార్లను అతిపెద్ద మార్కెటైన ఇండియాలోకి ప్రవేశపెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు కొన్నాళ్లుగా… చైనా వెళ్లాడు, అక్కడ తయారీ చేస్తాడట, వాటిని ఇండియాలోకి ప్రవేశపెట్టి అమ్మడానికి అనుమతించాలట…

నథింగ్ డూయింగ్… మేకిన్ ఇండియా అండ్ సెల్ అంటున్నాడు మోడీ… వ్యక్తిగతంగా మోడీని కలిసి విజ్ఞప్తి చేసినా అంగీకరించలేదు… ఎలాగూ ఇండియా ఈ జన్మ పౌరసత్వాలు, వర్కింగ్ వీసాల కుదింపు, నవీకరణ ఆంక్షలు వంటి ఇష్యూస్ మీద భారత విదేశాంగ శాఖ సంప్రదింపులకు దిగుతుంది కదా… అప్పుడు ఈ టెస్లా బాపతు ఒత్తిడి పెడతాడు మస్క్, అంటే ట్రంప్ అధికార ప్రతినిధి…

(ఇదొక సందేహం… ఆ నిర్ణయం అన్ని దేశాలకూ వర్తించినా సరే, ప్రధానంగా నష్టపోయేది భారతీయ వలసదారులే కాబట్టి… స్థూలంగా చూస్తే మనకు అబ్సర్డ్ అనిపించినా సరే, అది అమెరికా, బలమైన లాబీలు ప్రభుత్వ నిర్ణయాల్ని తమ స్వార్థం కోసం ఏమైనా చేయగలవు, ప్రభావితం చేయగలవు… అసలే ఏమాత్రం నమ్మదగని దేశం అది…)

అమెరికాలోని భారతీయులలో తెలుగు వారు 14% , గుజరాతీయులు 14% , మహారాష్ట్రీయులు 12% , తమిళులు 9% , పంజాబీలు 8% . తెలుగు వారు 14% అయితే 10% ఆంధ్రా వాళ్ళు …

ఇప్పుడు సమస్య ఏమిటంటే..? హెచ్1బీ వీసాదారులు అమెరికాకు వెళ్లాక పిల్లలు పుడితే… వాళ్లు ఏ దేశపౌరులు అవుతారు… తల్లిదండ్రులు ఇండియన్సే కాబట్టి ఆ దేశంలో పుట్టినా ఇండియా పౌరసత్వం ఇవ్వాలా..? సరే, మనవాళ్లే కదా ఇస్తాం, ఇద్దాం… ఇక ప్రతిసారీ ఆ పిల్లాడికీ డిపెండెంట్ వీసా తీసుకుని, రెగ్యులర్ స్టాంపింగులు చేయించుకుంటే తప్ప అమెరికాలో ఆ పిల్లల్ని ఉండనివ్వరా..? పేరెంట్స్ అక్కడే ఉంటే ఎక్కడికి డిపోర్ట్ చేస్తారు..?

అమెరికన్ గ్రీన్‌కార్డు, పౌరసత్వం ఉన్నవాళ్లకు పర్లేదు, కానీ ఆ గ్రీన్‌కార్డు కోసం ఇప్పుడు వెయిటింగ్ లిస్టు క్లియర్ చేయడానికే ఏళ్లూపూళ్లూ పడుతుంది… సో, హెచ్1బీ వీసాల రెన్యువల్స్ మీద కూడా ఆంక్షలు పెడితే అది ఇక అమెరికాకు వలసల మీదే తీవ్ర ప్రభావం చూపిస్తుంది… స్టూడెంట్ వీసాలకూ వర్తింపజేస్తే అమెరికా యూనివర్శిటీలు దివాలా తీస్తాయి…

హెచ్1బీ వీసాలున్న నిపుణులు అమెరికాను వదిలేస్తే నష్టపోయేది అమెరికాయే… సాఫ్ట్‌వేర్, ఐటీ లేకుండా ప్రపంచం లేదు… వాళ్లు లేకుండా అమెరికా లేదు… తన గత హయాంలో కూడా ట్రంపు ఇలాంటివి ఏవేవో చేయాలని అనుకున్నాడు, చేయలేకపోయాడు… ఇప్పుడూ తను పెద్దగా అమలు చేయగలిగేది లేదనే చెప్పాలి…

trump

ఎందుకంటే..? ఈ నిర్ణయాల్ని సుప్రీంకోర్టు సమర్థించాలి… అది జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి… దానికి సరిపడా మెజారిటీ కావాలి… ఫెడరల్ కోర్టులు కూడా వోకే అనాలి… 291 మంది కాంగ్రెస్ సభ్యులు ప్లస్ 67 మంది సెనేటర్ల మద్దతు కావాలి… అంటే 68 మంది డెమోక్రాట్ హౌస్ సభ్యులు ప్లస్ 23 మంది డెమోక్రాట్ సెనేటర్ల మద్దతు కావాలి…

రెండవ దశలో 2/3 మెజారిటీ ఉండాలి రాజ్యాంగ సవరణ చేయాలి అంటే… అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 34 రాష్ట్రాలు ఒప్పుకోవాలి… వీటిలో 5 రాష్ట్రాలు డెమోక్రాట్స్ చేతిలో ఉన్నాయి… ఆల్రెడీ 22 రాష్ట్రాలు జన్మపౌరసత్వంపై ట్రంపు ఆర్డర్‌ను కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించేశాయి… సో, ట్రంపు ఈ విషయంలో తన ఆర్డర్‌ను అమలు చేయడం దాదాపుగా అసాధ్యం… సో, ట్రంపు వచ్చాడు కదాని సంబరపడిపోవడానికి ఏమీ లేదు..!

మెక్సికో, కెనడాలను ట్యాక్సులతో బాదుతాను అంటున్న ట్రంపు ఇండియాను కూడా వదిలిపెట్టడు… బ్రిక్స్‌లో ఉంటే, బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తే 100 శాతం పన్నులతో బాదుతానని ఆల్రెడీ చెప్పాడు కూడా… సో, ఇండియా అమెరికాల నడుమ ఇలా చాలా ఇష్యూస్ రాబోతున్నాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions