ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమంటున్నాడంటే… ఈ దేశానికి వ్యూహకర్తల దరిద్రం పట్టుకుందట… కరెక్టు… రాజకీయ గండరగండడు అనిపించుకున్న కేసీయార్ సైతం ఎన్నికల వ్యూహకర్త పీకే సాయం తీసుకోవడం ఓ విషాదం… కరెక్టు… తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు అందరినీ ముఖ్యమంత్రుల్ని చేస్తున్న తనే ముఖ్యమంత్రి అయితే తప్పేమిటి అనుకుని సొంత పార్టీ పెట్టేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్… కరెక్టు… పార్టీల సిద్ధాంతాలు గాలికి ఎగిరిపోయి వక్ర పద్ధతుల్లో ప్రజాభిప్రాయాన్ని మార్ఫింగ్ చేసే వ్యూహకర్తల ప్రాధాన్యం పెరిగింది… కరెక్టు…
ఇలా పీకే మీద చాలా అగ్గిఫైరయ్యాడు ఆర్కే… కరెక్టే అనుకుందాం… నిజంగానే బుద్ధిజీవుల్లో ఆ ఆందోళన ఉంది… అయితే పార్టీలే తప్పుడు పద్ధతుల్లో జనాన్ని భ్రమల్లో ముంచెత్తుతూ, వోట్ల కోసం నానా గడ్డీ కరుస్తున్న దశలో ఒక్క ప్రశాంత్ కిషోర్‌నో, ఎన్నికల వ్యూహకర్తల్నో ఎలా తప్పుపట్టగలం..?! ప్రభుత్వాల మీద వ్యతిరేకత పెంచడం, సానుకూల పార్టీల జెండాల్ని, ఎజెండాల్ని మోయడం ద్వారా మీడియా చేస్తున్న పనీ దాదాపు అదే కదా..!!
ఈమధ్యకాలంలో మరీ పీకే ప్రతిరోజూ వార్తల్లో కనిపిస్తున్నాడు… ఎనలేని ప్రాధాన్యాన్ని మీడియా ఇస్తోంది… ఆయన మంత్రదండం ఊపేసి, అబ్రకదబ్ర అనగానే ఎవరినైనా అధికారంలోకి తీసుకురాగలడు అన్నంత ప్రచారం వచ్చేసింది… నిజానికి తనకు అపజయాలున్నయ్… పాదయాత్ర చేస్తే చాలు, జనం ఎవరికైనా వోట్లు వేస్తారా..? బీహార్‌లో 3 వేల కిలోమీటర్ల పాదయాత్రతో ఏకంగా సీఎం అయిపోతాడా..? నిజంగా తన చేతిలో మంత్రదండం ఉంటే, దానికి మహత్తే ఉంటే… బీహార్‌లో ఏం సాధించగలడో చూద్దాం… అయితే..?
Ads
రాధాకృష్ణ తాజాగా ప్రశాంత్ కిషోర్‌పై ఎందుకు నిప్పులు కక్కాడు..? జగన్‌ను గెలిపించినట్టు ప్రచారంలో ఉన్న పీకే ఇప్పుడు కేసీయార్‌కూ పనిచేస్తున్నాడు కాబట్టి..! వీకెండ్ కామెంట్‌లో ప్రశాంత్ కిషోర్ ఫోటోతో పాటు ప్రస్తుతం కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలకు వ్యూహకర్తగా పనిచేస్తున్న కనుగోలు సునీల్ ఫోటో కూడా పెట్టాడు… ప్రస్తావించాడు… పీకే వంటి అనుచిత శక్తులను కాదన్నందుకు, కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్నందుకు, ఓ దశలో ప్రియాంక, సోనియాలను కూడా కాదని పీకేను కాంగ్రెస్‌లోకి రాకుండా చేశాడంటూ రాహుల్‌ను కూడా రాధాకృష్ణ అభినందించాడు…
అయితే ఎన్నికల వ్యూహకర్తలు అనేది ప్రస్తుతం దేశ రాజకీయాలకు ఓ జాడ్యమే అనుకుందాం… ఆర్కే వాదనకు సై అందాం… కానీ ఈ ఇద్దరేనా..? ప్రస్తుతం దేశంలో చాలామంది చాలా పార్టీలకు, చాలా మంది నేతలకు వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారు… ఎక్కువగా సర్వేలు, సోషల్ మీడియా యాక్టివిటీ, బ్రాండింగ్, పొలిటికల్ కౌంటర్లు, విమర్శల పనులు చేస్తుంటారు… అంతేతప్ప నిజానికి ఇవే ఏ నాయకుడినీ, ఏ పార్టీని గెలిపించలేవు… రకరకాల కారణాలు ఉంటాయి ఎన్నికల్లో జయాపజయాలకు…
కానీ పీకే, సునీల్ మాత్రమే వ్యూహకర్తలుగా కనిపిస్తున్నట్టున్నారు రాధాకృష్ణకు… అన్నింటికీ మించి తెలుగుదేశంలో ఆఫీసులోనే అడ్డా వేసి, చంద్రబాబు కోసం చాన్నాళ్లుగా పనిచేస్తున్న రాబిన్ శర్మను మరిచిపోయినట్టున్నాడు… మొదట్లో పీకేను తిట్టిపోసిన చంద్రబాబు తరువాత నాకూ ఓ వ్యూహకర్త కావాలనుకుని, పీకేతో పాటు ఐప్యాక్ ఫౌండేషన్ టీంలో పనిచేసిన రాబిన్ శర్మను తెచ్చిపెట్టుకున్నాడు…
…… (రాబిన్ శర్మ అనగానే మీకు నెట్‌లో చాలా ఫోటోలు కనిపిస్తాయి… ఆయన వేరు… ప్రపంచ ప్రఖ్యాత రచయిత, మోటివేషనల్ స్పీకర్… ఉగాండాలో పుట్టి కెనడాలో స్థిరపడ్డాడు… ఈ వ్యూహకర్త రాబిన్ శర్మ ఫోటోలు బయట కనిపించవు… ఈ ఫోటో తన సంస్థ https://showtimeconsulting.in/ సైటులో కనిపిస్తుంది.. 2014 ఎన్నికల్లో మోడీ కోసం చాయ్‌పేచర్చా రూపకర్త ఈయనే… పీకేకు ఏమీ తక్కువ కాదు… పీకే మానిప్యులేటర్, రాబిన్ శర్మ తెర వెనుక కేవలం వ్యూహకర్త, ఆర్గనైజర్, బయట కనిపించడు…)…..
నిజానికి ఇప్పుడు ఆర్కే ప్రస్తావిస్తున్న కనుగోలు సునీల్ సేవల్ని తనే వాడుకుని, రాబిన్ శర్మకు బైబై చెప్పాలని కూడా చంద్రబాబు ఓ దశలో అనుకున్నాడు… మరి వ్యూహకర్తలపై రాయబడిన, ప్రసారం చేయబడిన అంత పెద్ద వ్యాసాభిప్రాయకథనంలో రాబిన్ శర్మ పేరెందుకు కనిపించలేదు..? తెలుగుదేశానికి పనిచేస్తున్నంత మాత్రాన ఆర్కే నిందల నుంచి మినహాయింపు లభించిందా..? పీకే, సునీల్ దేశరాజకీయాలకు డేంజరస్ కేరక్టర్లు అయినప్పుడు, తెలుగుదేశానికి అదే పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా డేంజరే కావాలి కదా లెక్కప్రకారం..?! వాటీజ్ దిస్ ఆర్కే సాబ్… హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ ఎవరెవరిని కలిశాడు, ఆ మార్మిక రాజకీయం ఏమిటో కూడా కాస్త రాస్తే మాంచి థ్రిల్లింగ్ ఉండేది కదా మీ వ్యాసం..?!
Share this Article