Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’

September 25, 2023 by M S R

ఖలిస్థానీ శక్తులకు కెనడా అడ్డాగా మారిపోవడం, ప్రధాని ట్రూడా మద్దతు ఆ శక్తులకు లభించడంతో… కెనడాలో ఉంటున్న హిందువులు భయపడిపోతున్నారని సాక్షాత్తూ ట్రూడా నేతృత్వం వహిస్తున్న లిబరల్ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశాడు… ఇది ఒక వార్త… ఇందిర హత్య రోజున సెలబ్రేషన్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటున్నాడు ఆయన…

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కాల్చివేతకు సంబంధించి ఫైవ్ ఐస్ దేశాలు ముఖ్యమైన రహస్య సమాచారాన్ని పంచుకుంటున్నాయి… ఈమధ్యకాలంలో ఇండియాకు దగ్గరగా వ్యవహరిస్తున్న అమెరికా ఈ హత్య కేసుకు సంబంధించి కెనడాను వెనకేసుకొస్తూ ఇండియా పట్ల వ్యతిరేక వైఖరి తీసుకుంది… ఇది మరో వార్త…

మరో 19 మంది ఖలిస్థానీ లీడర్ల జాబితాను రెడీ చేసింది ఇండియాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ… వీళ్లు ఇతర దేశాల్లో నివాసం ఉంటున్నారు… ప్రత్యేకించి కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో… ఒకరిద్దరు దుబాయ్‌లో… ఇక యాంటీ ఇండియా టెర్రరిస్టులకు పాకిస్థానే బెటర్ అడ్డా కాబట్టి కొందరు ఆ దేశంలోనూ ఉన్నారు… మొన్న ఓ ఉగ్రవాది ఆస్తుల్ని జప్తు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఈ 19 మంది ఆస్తులనూ జప్తు చేయడానికి రెడీ అయిపోతోంది… వీళ్లందరికీ లైఫ్ థ్రెట్ కూడా పొంచి ఉన్నట్టే లెక్క… ఇది ఇంకో వార్త…

Ads

నిజానికి ఈ వార్తల నడుమ మరో వార్త బాగా ఆకర్షించింది… ఈ ట్రూడా ప్రభుత్వం నడుస్తున్నదీ అంటే దానికి కారణం న్యూ డెమొక్రటిక్ పార్టీ మద్దతు… ఈ ఎన్‌డీపీ సిక్కుల ప్రాబల్యం ఉన్న పార్టీ… ఖలిస్థానీ శక్తుల పట్ల సానుభూతి ఉన్న పార్టీ… అందుకని ట్రూడా కూడా ఖలిస్థానిజం పట్ల మెతక వైఖరి అవలంబిస్తుంటాడు… అయితే ఇన్నేళ్లూ ప్రశాంతంగా ఉన్న కెనడాను ట్రూడా ప్లస్ ఖలిస్థానీ శక్తులు కలిసి అశాంతి వైపు తీసుకుపోతున్నారనే భావన ఆ దేశంలో ప్రబలింది…

రీసెంట్‌గా ఓ సర్వే జరిగింది… అందులో ట్రూడా పట్ల బలమైన వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది… పీర్ పోలిర్… ఈయన కెనడా ప్రతిపక్ష నేత… ఈయన పార్టీ కన్జర్వేటివ్… ఈ సర్వే ఏమంటున్నదీ అంటే ప్రస్తుతం కెనడా ప్రజల్లో ఏకంగా 40 శాతం మంది పీర్ పోలిర్ కెనడా ప్రధాని అయితే బాగుండునని కోరుకుంటున్నారు… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ కన్జర్వేటివ్స్‌కు 39 శాతం వోట్లు వస్తాయనీ, ట్రూడా పెత్తనం చేసే లిబరల్స్‌కు కేవలం 30 శాతం వోట్లు వస్తాయని సర్వే చెప్పింది… (2025లో తదుపరి ఎన్నికలు జరగాల్సి ఉంది…)

సర్వేలో మరో ప్రముఖమైన అంశం ఏమిటంటే… గత యాభై ఏళ్లలో ట్రూడా వంటి అసమర్థ ప్రధాని రాలేదని కెనెడియన్లు తేల్చిపారేశారు… వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ అట… ట్రూడా తండ్రి పేరు పీర్ ట్రూడా… ఆయన కెనడాకు 1968 నుంచి 1979 వరకు, తరువాత 1980 నుంచి 1984 వరకు ప్రధానిగా చేశాడు… కెనడియన్లు బాగా ప్రేమించిన నాయకుడు… అలాంటి తండ్రికి ఇలాంటి కొడుకు పుట్టాడు… పండితపుత్రుడు…!!

మొన్న జీ20 మీటింగ్‌కు వచ్చి, మా గడ్డ మీద మీరు సాగించే హత్యలు ఏమిటి అంటూ మోడీని నిలదీయాలనుకున్నాడు… కానీ మీ గడ్డ మీద మాకు వ్యతిరేక కార్యకలాపాలు ఏమిటి, వాటికి మీ మద్దతు ఏమిటి అని మోడీ ఉల్టా ప్రశ్నించాడు… దాంతో ట్రూడా రచ్చ మొదలెట్టాడు… రచ్చ సాగుతూనే ఉంది, మరో ఉగ్రవాదిని కెనడాలోనే కాల్చిపారేశారు… సరిహద్దులు దాటేసి ఇండియా వ్యతిరేక టెర్రరిస్టుల పని పట్టడం బహుశా ఇదే మొదటిసారి… ఈ కోణంలో థాంక్యూ ట్రూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions