ఒక సినిమా విడుదలైంది… ఓటీటీలో వచ్చేసింది… టీవీల్లోనూ ప్రసారమైంది… ఇంకేముంది అనుకోవడానికి వీల్లేదు… పాత పంచాయితీలు వెంటాడుతూనే ఉండే చాన్సుంది… జైభీమ్ మూవీ మీద తాజా వార్తలు చెబుతున్నది ఇదే… 2021లో వచ్చిన ఈ సినిమా చాలా ప్రశంసలకు నోచుకుంది… నటీనటుల నటన, సోషల్ కాజ్ మాత్రమే కాదు… తరతరాలుగా అణగారిన ఓ కులానికి సంబంధించి ఓ మహిళకు వ్యవస్థలో జరిగిన అన్యాయం, దానిపై ఓ లాయర్ మద్దతుగా నిలిచిన తీరుతో కూడిన కథ విమర్శకుల అభినందనలకు కారణమైంది…
ఈ సినిమా మీద రుద్ర వన్నియార్ సేన అనే సంస్థ గత నవంబరులోనే సైదాపేట కోర్టును ఆశ్రయించింది… ఈ సినిమాలోని కొన్ని సీన్లు వన్నియార్ కులాన్ని కించపరిచే రీతిలో ఉన్నాయనీ, ప్రత్యేకించి సినిమాలో విలన్ పాత్రను వన్నియార్ కులస్థుడిగా, ఇరులార్ కులానికి వ్యతిరేకిగా చూపించారనీ వాళ్ల పిటిషన్ సారాంశం…
Ads
ఈ సినిమాను సూర్య దంపతులు స్వయంగా నిర్మించారు… తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేశారు… హీరో సూర్య కాగా, ప్రధాన పాత్రలో జోస్ నటించింది… మణికందన్, ప్రకాష్ రాజ్ నటనలకూ అభినందనలు వచ్చాయి… వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా నిర్మించామని ప్రచారం చేశారు, కానీ బోలెడంత ఫిక్షన్ కలిపారనీ, కావాలనే కొన్ని కేరక్టర్ల కులాల పేర్లను మార్చారనీ అప్పట్లోనే విమర్శలు వచ్చాయి… కానీ నెటిజనం నుంచి సూర్యకు మస్తు మద్దతు దొరికింది…
అప్పట్లో సూర్యకు నెటిజనం మద్దతుగా నిలబడటానికి కారణం…
- ఓ కమర్షియల్, పాపులర్ హీరో దాదాపు ఓ పారలల్ సినిమాలో హీరోగా నటించడం… సగటు సౌతిండియన్ హీరో ప్రదర్శించే ఏ అవలక్షణాలూ కనిపించలేదు సినిమాలో…
- ఇలాంటి సినిమాలు సక్సెస్ కావడం అరుదు… ఐనా సరే, తనే సొంతంగా నిర్మించాడు… జ్యోతిక-సూర్య జంట కొన్ని ఆసక్తికరమైన కథల్ని ఎంపిక చేసుకుని, సొంతంగానే సినిమాలు నిర్మించడం సాహసం ప్లస్ మంచి అభిరుచి…
- థియేటర్ల సిండికేట్ బెదిరించినా సరే… ఓటీటీల్లో సినిమాలు విడుదల చేసే విషయంలో స్థిరంగా నిలబడ్డాడు… లొంగిపోలేదు, వొంగిపోలేదు…
- తన సొంత పైత్యాన్ని ఎక్కడా సినిమా మీద రుద్దలేదు, దర్శకుడికి మంచి స్వేచ్ఛనిచ్చాడు… కథ, ట్రీట్‌మెంట్ విషయంలో…
- ఇరులార్ కుల సంక్షేమం కోసం కోటి రూపాయల్ని సీఎం స్టాలిన్ సమక్షంలో చంద్రు ట్రస్టుకు ఇచ్చాడు, సూర్య సినిమా ప్రధాన పాత్ర కథానాయకి పార్వతమ్మ దుర్భర పరిస్థితుల్లో ఉంటే, ఆమెకు కూడా 10 లక్షలు ఇచ్చాడు…
Share this Article