.
విన్నావా గురూ… ఆంధ్రజ్యోతిలో మార్పులట…? గాసిప్స్ అంటావా..?
లేదే… హేమిటట…?
Ads
ఇంకా తెలియదా..? ఎడిటర్ నల్గొండ బ్రాహ్మణ శ్రీనివాస్‌ను తరిమేస్తున్నారట…! మొన్నీమధ్యే రాజీనామా ఇచ్చాడట… కాదు, అడిగారట… ఫస్ట్ నుంచి తను ఎడిటర్ కాదట…
పోనీలే ఫాఫం… ఏదో నామ్‌కేవాస్తే ఎడిటర్… వారానికో వ్యాసం తప్ప, ఆయనకూ పెద్ద పనేం ఉంది గనుక… ఆయన చెబితే ఎవరు విన్నారు గనుక… ఐనా ఆయన తెలుగు స్టార్ హీరో కమర్షియల్ మాస్ మసాలా సినిమాకు దర్శకుడు కాలేదు కదా…
అంటే..?
ఆయన ఆంధ్రజ్యోతి భావజాలానికి పనికిరాడు అని అర్థం…
అలాంటప్పుడు ఎందుకు ఆయన్ని ఎడిటర్‌గా తీసుకున్నట్టు..?
అప్పట్లో పత్రికను తను కొన్న మొదట్లో వాళ్లందరూ రాధాకృష్ణ అవసరం… ఒక గౌడ మురళి, ఒక పెరిక అల్లం నారాయణ, ఒక బ్రాహ్మణ శ్రీనివాస్… ఇలా అవసరమయ్యారు… ఐనా సరే, మళ్లీ నెట్‌వర్క్, స్టేట్ బ్యూరో అనేసరికి తన సామాజికవర్గాన్నే నమ్మాడు… ఒక కొమ్మినేని, ఒక శ్రీరాం…
పాత్రికేయంలో కులమా..?
పాత్రికేయంలో కులమే ప్రధానం… ఇప్పుడు ఒక బ్రాహ్మణుడిని తరిమేస్తున్నారు కదా… తమ కమ్మ బంధువు రాహుల్‌ను ఎడిటర్‌ను చేస్తాడట… ఇదే పోస్ట్ ఆశించిన ఒక వక్కలంక ఒక బ్రాహ్మణుడు… ఒక ఢిల్లీ కృష్ణారావు బ్రాహ్మణుడు… ఆ ఈనాడు రాహుల్‌ను తరిమేస్తే తమవాడు కాబట్టే రాహుల్‌ను తెచ్చి సెంట్రల్ డెస్క్ ఇన్‌చార్జిని చేశాడుట రాధాకృష్ణ… ఎలాగూ శ్రీనివాస్‌ను తరిమేస్తాను, నువ్వే కాబోయే ఎడిటర్ అనే ముందస్తు హామీతోనే వచ్చినట్టున్నాడు…
ఎహె, తప్పు… యాదృచ్ఛికం… మా రాధాకృష్ణ సెక్యులర్, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతం…
సర్లే… సర్లే… ఎన్నెన్నో అనుకుంటాం… ఏబీఎన్ చీఫ్ తన అల్లుడు… డిబేట్ ప్రజెంటర్ వెంకటకృష్ణ తమవాడు… ఇప్పుడిక ఎడిటరూ తమవాడే… జగన్ నీచ కులపాలన తరువాత కమ్మాభిమానం కొత్త ఎత్తులకు ఎదిగి, కేంద్రీకృతమైంది… అదే యెల్లో మీడియా ఈనాడు ఎడిటర్లూ అంతే కదా… కులమే తెలుగు పాత్రికేయాన్ని నడిపే చోదకశక్తి…
మళ్లీ తప్పు… జగన్‌కు ఆ పక్షపాతం లేదు తెలుసా..?
ఓహో, అవునా… ఒక్క గౌడ మురళి, తన కులానుచరగణం తప్ప… మిగతా కీలక స్థానాల్లో ఉన్నవాళ్లెవరు..? పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగితే లోెకానికి తెలియదా..? పనికొచ్చే ప్రతివాడినీ తరిమేశాడు కదా జగనుడు… అనుభవిస్తున్నాడు కదా…
నువ్వు మరీ నెగెటివ్‌గా ఆలోచిస్తున్నావు సుమా…
ఆత్మవంచన అవసరం లేదు… టీవీలు గానీ, పత్రికలు గానీ… కులపక్షపాతం, కులాభిమానం… సింపుల్‌గా కులగజ్జి లేని మీడియా సంస్థ లేదు… చాలామంది అనుకున్నారు… ఒక కృష్ణమూర్తి, ఒక వక్కలంక రమణ… ఒకరు తెలంగాణకు, ఒకరు ఏపీకి ఎడిటర్లు అవుతారని… కృష్ణమూర్తికి రాధాకృష్ణ తత్వం బోధపడింది… అందుకే ఓ వెలమ కేసీయార్ పంచన చేరాడు… వక్కలంక ఫాఫం, అక్కడే ఉండి, భంగపడ్డాడు… మరో తెలంగాణ బ్రాహ్మణుడు కృష్ణారావుకూ తత్వం బోధపడింది…
నో, నో, నీది మరీ నెగెటివ్ ధోరణి… టీవీ9 వెలమ… బాస్ వీర కమ్మ… ఇప్పుడేమంటావ్..?
పైపైన చూస్తూ అంతా వోకే… లోతుల్లోకి వెళ్తే… అంతా ఇంతే… ఒక బ్రాహ్మణ, ఒక వెలమ, ఒక కమ్మ, ఒక రెడ్డి, ఒక గౌడ… ఎవరి రాజ్యం వాళ్లదే… మరి టీవీ చానెళ్లు అంటావా..? వద్దులే… అది మరీ దరిద్రం…!! పార్టీలూ అంతే కదా… తెలంగాణ కాంగ్రెస్ అంటే రెడ్డి… ఏపీ టీడీపీ అంటే కమ్మ… ఏపీ వైసీపీ అంటే రెడ్డి… జనసేన అంటే కాపు… ఇంకా చెప్పమంటావా..?
వద్దులే గురూ… కళ్లు తెరుచుకున్నాయి…
Share this Article