దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఈ విదేశీ టూర్లు ఏమిటీ ప్రధాని గారూ అని కాంగ్రెస్ ప్రశ్నించింది ఓ ట్వీట్లో… ఇంకేం..? బీజేపీ క్యాంపుకు కోపమొచ్చింది… మరి ఇదేమిటో చెప్పండి అన్నట్టుగా… ఓ నైట్ క్లబ్బులో రాహుల్ కనిపిస్తున్న వీడియోను వదిలింది… ఈయన ఎవరో తెలుసా అంటూ కపిల్ మిశ్రా ఓ ట్వీట్ వదిలాడు… సోషల్ మీడియా మొత్తం రాహుల్ గాంధీ అనుకూల, వ్యతిరేక పోస్టులతో ఊగిపోతోంది… రాహుల్ వీడియో సారాంశం ఏమిటయ్యా అంటే… నేపాల్, ఖట్మాండులోని […]
దేవి నాగవల్లి..! న్యూస్ రీడర్ కాదు ఇక్కడ… తనే ఓ న్యూస్… ఓ వైరల్ నేమ్..!!
బిగ్‌బాస్ షో… 2020… ఏదో పిచ్చి టాస్క్… హౌజులో ఎవరినైతే జీరో అనుకుంటున్నారో వాళ్లను మెడపట్టుకుని, గేటు నుంచి తోసేయాలి… టీవీ9 దేవి కూడా ఆ షోలో కంటెస్టెంట్… తన భాషతో, తన చేష్టలతో కంటెస్టెంట్లను, ప్రేక్షకులను హింసించిన అమ్మ రాజశేఖర్ అనే కంటెస్టెంట్‌ను దేవి నెట్టుకెళ్లి, మెడ పట్టుకుని, గేటు బయటికి నెట్టేసింది… అది ఆట… ఆట అంటే అంతే… సదరు రాజశేఖరుడు అక్కడే పొర్లిపొర్లి ఏడ్చాడు… దేవి సైలెంటుగా, నిర్వికారంగా చూస్తూ నిలబడింది… విష్వక్సేన్ […]
మరి ఈ తప్పుకు ఎవరిని శిక్షించాలి..? హోం మంత్రి చెబితేనే బెటర్…!!
గత సంవత్సరం జూలై వార్త… అత్యాచార బాధితుల పేర్లు, వివరాలు బయటపడకుండా జాగ్రత్తవహించాలని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది… దిగువ కోర్టులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని హెచ్చరించింది… నేరుగా గానీ, పరోక్షంగా గానీ లైంగిక దాడి బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని ఐపీసీ 228ఏ చెబుతోందనీ, దాన్ని పాటించాలని సూచించింది… 228A. Disclosure of identity of the victim of certain offences etc.. Whoever prints or publishes the name […]
ప్లీజ్, ప్లీజ్… అఘాయిత్యాల కేసుల్లో తల్లుల్ని నిందితులుగా చేర్చకండి సార్…
హమ్మయ్య… క్లారిటీ వచ్చింది… ఇన్నేళ్లూ పెద్ద పెద్ద క్రైమ్ ఇన్విస్టిగేటర్లకు, జడ్జిలకు, లాయర్లకు, సోషియాలజిస్టులకు, సైకాలజిస్టులకు, జర్నలిస్టులకు, ఎట్సెట్రా అందరికీ ఓ పెద్ద ప్రశ్న… ఆడవాళ్లపై అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో ఓపట్టాన బోధపడకపోయేది… కొందరు చిల్లరగాళ్లు ఆడవాళ్ల వస్త్రధారణే సమస్య అన్నారు, మరి చిన్నపిల్లల మీద, ముసలోళ్లు మీద అత్యాచారాల మాటేమిట్రా అనడిగితే నోళ్లు మూతపడ్డాయి… సాహిత్యం, సినిమాలు, టీవీలు గట్రా కారణమని బల్లలు గుద్ది మరీ చెప్పారు కొందరు… నో, నో, చట్టాలు కఠినంగా లేకపోవడమే […]
ఆచార్యా… ఏమిటీ అరాచకం..? అపచారం..? ఇదేనా ధర్మస్థలి పరిరక్షణ..?!
demigods are more powerful than original gods… నిజమే… వ్యక్తిపూజ నరనరాన ఇంకిన మన దేశంలో దేవుళ్లు కోట్లాదిమంది ఉండవచ్చుగాక… కానీ వాళ్లకు మించిన దేవుళ్లు సినిమా హీరోలు, వాళ్ల కొడుకులు, బిడ్డలు, నాయకులు ఎట్సెట్రా… సైకోఫ్యాన్స్… ఈ ఫ్యాన్స్ భజనలతో వీళ్లు కూడా తాము నిజంగానే దైవాంశ సంభూతులమేమో అనే సందేహంలో పడి, అది ముదిరి, చివరకు అవే భ్రమల్లో కూరుకుపోతారు… అంతెందుకు..? అసలు దేవుళ్ల దగ్గరకు పూజకు వెళ్లడానికి కూడా పౌండ్రక వాసుదేవుళ్ల రేంజులో […]
వాళ్ల సినిమా పంచాయితీలోకి… కన్నడ పార్టీలు దూరడం దేనికి..?!
ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ సినిమాలు దేశవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లను రాబట్టడంతో… హిందీ ఇండస్ట్రీ నెగెటివ్‌గా స్పందిస్తుందని, పైకి ఎంత సంయమనం పాటిస్తున్నట్టు కనిపిస్తున్నా సరే, ఎప్పుడో ఓచోట ఆ అసహనం బట్టబయలు అవుతుందని అనుకుంటున్నదే… బాలీవుడ్ కోటలు కూలిపోతున్నట్టు ఫీలయిపోతున్నారు… ఇప్పుడు అజయ్ దేవగణ్ బయటపడ్డాడు… లోలోపల చాలామంది హిందీ హీరోలు, ఇండస్ట్రీ ముఖ్యులకు రగులుతూనే ఉంది… కన్నడ నటుడు సుదీప్కూ, అజయ్ దేవగణ్కూ నడుమ జరుగుతున్న పంచాయితీ కేవలం సినిమాలు, వాటి భాష గురించి […]
గాయిగత్తర లేదు, అగ్గి లేదు… తన పరిమితులేమిటో కేసీయారే చెప్పేశాడు…
ఓ డిజిటల్ పత్రికయితే నేరుగా రాసేసింది… కేసీయార్ జాతీయ పార్టీ పేరు బీఆర్ఎస్ అని… అంటే భారతీయ రాష్ట్ర సమితి అట… అబద్ధం… తను ఆ మాట చెప్పలేదు… చెప్పాలనే ఉద్దేశం కూడా తనకు లేదు… పార్టీ ఎమ్మెల్యే నుంచి వచ్చిన ప్రతిపాదన మాత్రమే అని స్పష్టంగానే చెప్పాడు… నిజానికి పరోక్షంగా తన జాతీయ రాజకీయ ప్రవేశానికి ఉన్న పరిమితులేమిటో కూడా కేసీయార్ తన ప్లీనరీ ప్రసంగంలో చెప్పాడు… ఎస్, ఒక రాజకీయ పార్టీకి జాతీయ రాజకీయాల […]
ఈరోజు భలే నచ్చిన వార్త… ఓ మండలంలో దీపావళి… సరైన ప్రజాభిప్రాయ ప్రకటన…
ఈరోజు నచ్చిన వార్త ఇది… గొప్ప వార్త కాదు.,. ప్రజలు తిరగబడి కొట్టలేదు… తెలంగాణలో ఓ లేడీ ఎమ్మార్వోను తగులబెట్టినట్టు కూడా కాదు… రెవిన్యూ వ్యవస్థ అంటేనే ప్రజల్లో విపరీతమైన ద్వేషం… భూమికి సంబంధించిన పెత్తనాలు కాబట్టి అధికారం కేంద్రీకృతమైన వ్యవస్థ అది… పైగా మెజిస్టీరియల్ పవర్స్… ఒక్క ముక్కలో చెప్పాలంటే పాలనకు కేంద్ర బిందువులు… ప్రభుత్వ ఉద్యోగి అంటేనే… తన రూపస్వభావాలు ఏమిటో ప్రజలకు క్లారిటీ ఉంది… ఆ క్లారిటీని ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తుంటారు కూడా… […]
అంగసాన్ సూకీ రాజకీయ చరిత్ర ఇక ముగింపుకు వచ్చినట్టే..?
మన మీడియాకు పెద్దగా ఆనలేదు గానీ… మన పొరుగున ఉన్న బర్మాలో వార్తలు మనకు కూడా ఇంపార్టెంటే… జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక అంగసాన్ సూకీ కెరీర్ సమాప్తం అయినట్టే కనిపిస్తోంది… తాజాగా ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు… ఆరు లక్షల డాలర్ల నగదు, 11 కిలోల బంగారు కడ్డీలను మాజీ ముఖ్యమంత్రి థస్ నుంచి ముడుపులు తీసుకున్నారనేది ఆమెపై సైనిక జుంటా ప్రభుత్వం పెట్టిన ఆరోపణ… అసలు ఇదే కాదు… ఇంతకుముందే 2022 […]
ఆ రాచజంటకు ట్రంపు దిష్టి… ఇక్కడా తనకు వర్ణవివక్షే… ఆ నోరసలే బ్యాడు…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంపు కొన్ని పిచ్చి వ్యాఖ్యలు చేశాడు… అఫ్కోర్స్, తనకు అలవాటైన పనే కదా… మేఘన్, హ్యారీ విడిపోతారట… ఎవరీ మేఘన్… ఎవరీ హ్యారీ…? బ్రిటిష్ రాజకుమారుడు హ్యారీ=… ఆయన భార్య మేఘన్… ఒకప్పుడు ప్రపంచమంతా ఆరాధించిన లేడీ డయానా కొడుకే ఈ హ్యారీ… మన మీడియాకు ఇలాంటి కథనాలు పెద్దగా పట్టవు… కానీ ఇంట్రస్టింగే… ఎందుకంటే..? ఈ మేఘన్ ఆ రాజరికాన్ని, ఆ వారసత్వాన్ని, ఆ సంపదను, ఆ కృత్రిమత్వాన్ని ఎడమకాలితో తన్నేసి, […]
కాంగ్రెస్ పీకేను ఎందుకు వద్దనుకుంది..? పీకే వ్యాపార ప్రణాళిక తల్లకిందులు..!!
ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున అయోమయానికి, గందరగోళానికి కారకుడైన ప్రశాంత్ కిషోర్…. ఒకేసారి అనేకానేక పడవుల మీద ప్రయాణించాలని అనుకున్నాడు… జాతీయ స్థాయిలో ఒక పార్టీకి వ్యూహకర్తగా వర్క్ చేయాలంటే చాలా కమిట్మెంట్ కావాలి, ప్రేమ కావాలి, కానీ పీకే వంటి వ్యాపారి ఒక చట్రంలో ఇమడాలని ఎందుకు అనుకుంటాడు… దీనికితోడు మాకు పనిచేయాలనుకుంటే ఇతర పార్టీలతో కటీఫ్ అయిపో అని కాంగ్రెస్ నిర్మొహమాటంగా చెప్పింది… పీకే వ్యవహార ధోరణి ఎలా ఉంటుందో […]
కామ్రేడ్స్… సారీ… మీరు పూర్తిగా దారితప్పారు… నిష్ఠురమైనా నిజమిదే…
అప్పట్లో…. చాలా ఏళ్ల క్రితం… కాకతీయ రైలు బోగీ విషాదం గుర్తుందా..? కొందరు పీపుల్స్‌వార్ నక్సలైట్ల అత్యుత్సాహం ప్లస్ అజ్ఞానం కారణంగా… ఎస్, అజ్ఞానం అనే పదాన్నే వాడుతున్నాను… అనేకమంది ఆ మంటల్లో ఎటూ పోలేక, తప్పించుకోలేక ఏమైందనేది ఓ చరిత్ర… పీపుల్స్‌వార్ క్షమాపణ చెప్పవచ్చుగాక… పోయిన అమాయకుల ప్రాణాల్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు… వాళ్లకు ఉద్యమంలో సంబంధం లేదు… రాజ్యహింసతో సంబంధం లేదు… ఐనా ప్రాణాలు కోల్పోయారు, అంతకుముందు ఓసారి ఇలాగే ఓ బస్సును పేల్చేస్తే […]
నీకు దక్కాల్సిన న్యాయం ఓ జీవితకాలం లేటు… రియల్ ట్రాజెడీ కేసు…
నిజానికి ఇది కదా సీరియస్ వార్త… ఇలాంటివి కదా హైలైట్ కావల్సింది… మన సిస్టంలో ఓ మనిషికి జరిగిన తీవ్ర అన్యాయానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు..? ఎక్కడుంది లోపం..? అపెక్స్ కోర్టు గానీ, ప్రభుత్వాలు గానీ ఎందుకు పట్టించుకోవు..? వార్త ఏమిటంటే..? బిహార్, గోపాలగంజ్ జిల్లా, భోర్ ఠాణా పరిధిలో ఉండే సూర్యనారాయణ భగత్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్, దేవరియాకు చెందిన బీర్బల్ భగత్‌తో కలిసి పని కోసం ముజఫర్‌పూర్‌కు వెళ్లాడు… సూర్యనారాయణ్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు… […]
ఇంతకీ ఈ ‘‘కాన్వాయ్ కథలో’’ సదరు హోంగార్డు చేసిన తప్పేమిటబ్బా..!!
సీఎం జగన్‌కు ప్రభుత్వ వాహనాల కాన్వాయ్ ఉంటుంది… సెక్యూరిటీ వెహికిల్స్ విడిగా ఉంటాయ్… ఇంకా కావాలంటే తన సొంత వాహనాలు ఎన్నంటే అన్ని వెంట పరుగులు తీస్తాయ్… వెంట పోలోమంటూ అనుసరించి వచ్చే నాయకులకు కూడా వాహనాలు ఉంటయ్… మరి ఎప్పుడూ సీఎం పర్యటన అనగానే కాన్వాయ్ పేరిట ప్రైవేటు వాహనాలను స్వాధీనం చేసుకుని ఏం చేస్తారు..? అసలు కాన్వాయ్‌కు ప్రజలు వాహనాలను సమకూర్చడం ఏమిటి..? పోనీ, ఏదైనా సభ ఉందంటే ప్రైవేటు బస్సుల్ని, లారీల్ని, జీపులను, […]
ఓహో… అలా జీఎస్టీ నోటీసులు జారీ… ఇలా రాజా వారి భజన షురూ…
ఆయన మోడీ మీద రెండు ప్రశంసాపుష్పాలు విసిరాడు… అంతే, అప్పటిదాకా తనను వీరాభిమానించేవాళ్లు సైతం చాలామంది హఠాత్తుగా మనువాదిని చేశారు… మతోన్మాది అన్నారు… సంఘీ అని తిట్టారు… ఇన్నేళ్ల తమ అభిమానానికి నిలువెత్తు పాతరేసి, యమర్జెంటుగా రెండు మూడు పుష్పాల్ని నివాళిగా అర్పించారు… ఖతం… ఇళయరాజా… గొప్ప సంగీతకారుడే… డౌట్ లేదు… అదేసమయంలో పలు వివాదాల్లోనూ ఆయన పేరు తరచూ వినిపిస్తుంటుంది… ప్రత్యేకించి సినిమా పాటల రాయల్టీ గట్రా… ఆ కెరీర్, ఆ ప్రపంచం వేరు… ఆయన […]
సారీ… సారీ… లెంపలేసుకున్న అక్షయ్… మహేశ్, షారూక్, అజయ్ మాటేమిటో…
మన హీరో మహేశ్ బాబు మంచోడు… అందగాడు, వివాదాల్లో వేలుపెట్టడు… బోలెడు మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించాడు… ఇలా చాలా చాలా చెప్పుకుంటాం… కానీ నాణేనికి మరోవైపు… నీకు ఈ గుట్కాల సరోగేట్ యాడ్స్ డబ్బు, ఆ పెంట మీద డబ్బు అవసరమా నీకు అనీ తిట్టుకుంటాం… దేనిది దానికే… దూద్కాదూద్ పానీకాపానీ… ఆమధ్య అమితాబ్ బచ్చన్ టపటపా చెంపలేసుకుని, తాను ఇక గుట్కా యాడ్స్‌లో యాక్ట్ చేయను, ఇప్పటికే తీసుకున్న డబ్బు వాపస్ పంపించేస్తున్నాను […]
రాష్ట్రపతి కుర్చీలో ఇప్పటికైనా ఓ గిరిజన మహిళ… Why not Draupadi Murmu…!
తన సీనియారిటీని అగౌరవపరిచి, తనను పక్కకు తోసేసిన గురుద్రోహాన్ని కడుక్కోవడం కోసం మోడీ అద్వానీని రాష్ట్రపతిని చేయడం బెటర్ అంటాడు ఒకాయన… అబ్బే, వెంకయ్య నాయుడికే ప్రమోషన్ ఇవ్వడం మేలు అంటారు ఇంకొకాయన… నో, నో, విపక్ష వోట్లు లేకుండా రాష్ట్రపతిని గెలిపించుకోలేదు బీజేపీ, అందుకే శరద్ పవార్‌ను పెడితే సరి, ఈజీ అని సూచిస్తున్నాడు మరొకాయన… ఇవన్నీ కాదు, గులాం నబీ ఆజాద్‌ను రాష్ట్రపతిని చేస్తే గాయపడిన కశ్మీరీయులకు కొంతైనా స్వాంతన దక్కుతుంది అని తేల్చేశాడు […]
ప్రశాంత్ కిషోర్ చూపే బాట ఎటువైపో మరి..?! జవాబుల్లేని ప్రశ్నలెన్నో..!!
అవును సరే గానీ… 4 రోజుల్లో సోనియమ్మను ప్రశాంత్ కిషోర్ మూడుసార్లు కలిశాడు… మిషన్ 2024 గురించి చర్చించాడు… ఈ ఔట్ సోర్సింగ్ దేనికోయ్, పార్టీలోకి వచ్చెయరాదూ, జనరల్ సెక్రెటరీ ఐపో అంటారు వాళ్లు… తనేమో వ్యాపారి… సరుకు అమ్ముతాడు తప్ప, పుణ్యానికి ఇస్తే ఏం ఫలం..? పైగా వందల కోట్ల దందా తనది… సో, చివరకు బేరం ఎంతకు కుదురుతుందో చెప్పలేం… గుజరాత్ సహా ఏడెనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకేనా..? వచ్చే జనరల్ ఎన్నికలకు […]
నన్ను తప్పించండి ప్లీజ్ అని అడిగిందట… మోడీ, షా బదిలీ చేసేస్తున్నారట…
వివిధ సమాచార మార్గాల్లో తమకు అందే లీకులు లేదా కాన్ఫిడెన్షియల్ సమాచారం ఆధారంగా మీడియా సంస్థలు పలు ఊహాగానాలు చేయడం సాధారణమే… కొన్నిసార్లు నిజంగానే అనుకోకుండా అవి నిజం అవుతుంటాయి… ఈ వార్త ఒకటి విస్మయకరంగా అనిపించింది… తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న విలేకరులతో చిట్‌చాట్ చేస్తూ… ప్రధాని, రాష్ట్రపతి, హోంమంత్రి తనకు బలమైన మద్దతుగా నిలుస్తున్నారని, చాలా అంశాల్లో ఒక గవర్నర్‌గా కేంద్రానికి నివేదికలు పంపిస్తున్నాననీ చెప్పుకొచ్చింది… అదేసమయంలో ఆవేదనను షేర్ చేసుకుంది… పాత ఫోటోలతో […]
కేసీయార్ ఎదుట ఓ జాతీయ శూన్యచిత్రం… ఫ్రంట్ టెంట్ నిలబడతలేదు…
మళ్లీ మొదటికొచ్చింది కేసీయార్ తృతీయ కూటమి కథ… దానికి ఏ ఫ్రంట్ పేరు పెడతాడనే సంగతి తరువాత… బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి అనే తన ఆలోచనల్ని మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ తిరస్కరిస్తున్నాయి… అంతేకాదు, తనకే యాక్సెప్టెన్సీ దొరకడం లేదు… అసలు కాంగ్రెస్ లేకుండా బీజేపీ మీద పోరాటం ఏమిటని మమత, స్టాలిన్, శరద్ పవార్ తదితరులు కొట్టిపారేస్తున్నారు… నిజంగానే కేసీయార్ది ఇప్పుడు ఎటూ వెళ్లలేని సంధిదశ… ఎందుకంటే..? మిగతా అందరినీ కూడగట్టి, ఆపరేట్ చేయాలని తన ఆశ… […]
- « Previous Page
- 1
- …
- 102
- 103
- 104
- 105
- 106
- …
- 149
- Next Page »