Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!

February 27, 2021 by M S R

hima das

జులై 2018… ఫిన్‌లాండ్… పరుగుకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయి పోటీ… అనూహ్యంగా ఓ ఇండియన్ అథ్లెట్… పేరు హిమాదాస్… ఒక విభాగంలో గోల్డ్ మెడల్ కొట్టింది… బహుమతి ప్రదానం వేళ, జనగణమన గీతం వినిపిస్తుంటే, గెలిచిన ఆనందాన్ని, ఎమోషన్‌ను ఆపుకోలేక కన్నీరు కార్చేసింది… అది నటన కాదు… గుండెల్లో నుంచి తన్నుకొచ్చిన ఉద్వేగం… ఒక విశ్వవేదిక మీద స్వర్ణం గెలిచిన హిమదాస్‌‌ను, ఆమె కన్నీళ్లను చూసి జాతితోపాటు జాతి కూడా కదిలిపోయింది, గర్వించింది… మనసారా చప్పట్లు కొట్టి […]

లెఫ్ట్, రైట్ కలిసి… రైట్ రైట్..! బెంగాల్‌లో బద్ధవైరుల నయా దోస్తానా..!!

February 25, 2021 by M S R

bengal

సాధారణంగా లెఫ్ట్, బీజేపీ అంటేనే ఉప్పూనిప్పూ టైపు కదా… సహజంగానే ఒకటి కుడి, ఒకటి ఎడమ… అనేకానేక రాజకీయ అంశాల్లో ఒకటి తూర్పు, ఒకటి పడమర… ఎరుపుకూ కాషాయానికీ ఎప్పుడూ పడదు… ఇలా చెప్పుకుంటూ పోతే ఒడవదు, తెగదు… అంత వైరుధ్యం… రాజకీయ ప్రత్యర్థి అనే స్థాయిని కూడా దాటేసిన వైరం… కేరళలో కసకసా నరుక్కోవడమే… బెంగాల్‌లో కూడా గతంలో అలాగే ఉండేది … కానీ ఇప్పుడు విశేషం ఏమిటంటే..? ఆ రెండూ కలిసి పనిచేస్తున్నాయి… లెఫ్ట్, […]

ఫ్యామిలీనే నరికేసింది..! ఆమెకు ఉరిశిక్ష వర్ణవివక్షేనట సాక్షి కలాలకు..!!

February 24, 2021 by M S R

shabnam

ఫాఫం సాక్షి..! రోజురోజుకూ దానికి ఓ దశ, ఓ దిశ లేకుండా సాగిపోతున్నది… నిన్న ఫ్యామిలీ పేజీలో షబ్నమ్ ఉరిశిక్ష మీద వచ్చిన ఓ పెద్ద స్టోరీ నిజానికి విభ్రమ కలిగించింది… అందులో కొన్ని వాక్యాలు చదవండి ముందుగా… ‘‘భారతదేశంలో ఉరికి ఎదురుచూస్తున్న 12 మంది స్త్రీలు వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడం నేరానికీ-శిక్షకూ-వెనకబాటుతనానికీ ఉన్న లంకె చర్చకు వస్తోంది… ‘ఉరిశిక్ష’ అని ఈ దేశంలో చర్చ జరిగినప్పుడల్లా ఆ ఉరిశిక్ష ‘ఎవరికి’ పడింది అనేది […]

ఫ్లోరైడ్ రక్కసి..! తెలంగాణను వదల్లేదట… మరి విముక్తి ప్రకటనల కథేంటి..?!

February 24, 2021 by M S R

flouride

‘‘విషం పీడ విరగడ’’ అంటూ… తెలంగాణ ఫ్లోరైడ్ విముక్తప్రాంతంగా మారిపోయింది అంటూ… ఐదేళ్లలో దాదాపు వేయి గ్రామాలను ఈ భూతం నుంచి రక్షించినట్టే అంటూ… తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చాటుకున్న ఘనత నిజం కాదా..? సాక్షిలో పబ్లిషైన ఓ స్టోరీ కొత్త ప్రశ్నలను, సందేహాలను జనం ముందుంచింది… నిజానికి సాక్షి పత్రికేనా ఇది రాసింది అనే డౌటొస్తుంది ఈ కథనం చూడగానే…! బహుశా వెలుగు పత్రిక అయి ఉంటుందేమోలే అనే భ్రమనూ కల్పిస్తుంది… కానీ నిజమే… సాక్షిలోనే […]

ఎంపిక వరకూ సరైన ఎత్తుగడ… కానీ రాంగ్ స్ట్రాటజీలో క్యాంపెయిన్…

February 24, 2021 by M S R

mlc

కేసీయార్ తమ పార్టీ తరపున హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ కూతురు వాణీదేవి పేరు ప్రకటించాడు… ఆయన కోణంలో ఆమె ఎంపిక సరైన ఎత్తుగడ… పార్టీ బరిలో దిగకుండా ఇంకెవరికో మద్దతు ప్రకటించడంకన్నా, తను గతంలో హామీ ఇచ్చిన మేరకు పీవీ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఒక పొలిటికల్ చాన్స్ కల్పించడం వరకూ వోకే… అయితే తన క్యాంపు ఆమెను ఫోకస్ చేయడంలో రాంగ్ స్ట్రాటజీలో వెళ్తోంది… ఆమె అభ్యర్థిత్వం పట్ల బ్రాహ్మణ సంఘాలన్నీ ఆనందాన్ని, […]

పురోహితురాలు..! అమంగళమేమీ కాదు… అనివార్యంగా ఆహ్వానిద్దాం…!

February 23, 2021 by M S R

lady purohit

తల్లీ! మమ్ము తలంచి, చెయ్ పౌరోహిత్యం! ——————– ముందుగా ఒక డిస్ క్లైమర్. ఇది వేద ధర్మం, సనాతన ఆచార వ్యవహారాల మీద శాస్త్ర చర్చ కాదు. ఆధునిక యుగ ధర్మంలో స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించిన ఒక కోణం. దేశ కాల పరిస్థితులను బట్టి ఆచారాలు మారుతుంటాయి. దక్షిణాది చిదంబరంలో తడి పంచె మాత్రమే కట్టుకుని పైన ఉత్తరీయం కూడా లేకుండా ప్రదక్షిణ చేస్తే చల్లగా కరుణించే శివుడు- అదే సమయానికి ఉత్తరాదిలో గడ్డకట్టిన మంచులో కేదార్ […]

మల్కాజ్‌గిరికన్నా చిన్నది… అది ఓ రాష్ట్రం, ఓ సీఎం, ఫాయిదా లేని పాలిటిక్స్…

February 23, 2021 by M S R

puducherry

పుదుచ్చేరిలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ మర్డర్ చేసింది అని ఓ లెఫ్ట్ పత్రిక ఒకేరోజు నాలుగు వ్యాసాలు, ఓ సంపాదకీయం, ఫస్ట్ పేజీ బ్యానర్ రాసింది… పత్రికల నిండా వార్తలు… చర్చలు, విశ్లేషణలు గట్రా… అప్పటికిప్పుడు మోడీ ప్రభుత్వం అక్కడ ఇన్నేళ్లుగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పీకిపారేసి, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు పగ్గాలు ఇచ్చింది… ఎమ్మెల్యేలను తనవైపు లాగిపారేసింది… ఆ ముఖ్యమంత్రి వేరే దిక్కులేక, బలనిరూపణ చేసుకోలేక, రాజీనామా చేశాడు… హహహ… అసలు రెండు […]

పీవీని మించిన చాణక్యం… పీవీ కుటుంబంపైనే… తెలివైన ఎత్తుగడ…

February 22, 2021 by M S R

mlc

గెలిచే చాన్స్ కనిపించక కేసీయార్ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి పెట్టకపోవచ్చుననీ, సీపీఎం నాయకుడు నాగేశ్వర్‌కు మద్దతు ప్రకటిస్తాడని ఆమధ్య బాగా ప్రచారం జరిగింది… ఆ సందర్భంగా… అది జరగకపోవచ్చుననీ, అదే చేస్తే కేసీయార్‌కు వచ్చే ఫాయిదా ఏమీ ఉండదనీ, పైగా నష్టం జరుగుతుందనీ ‘ముచ్చట’ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది… అదే జరిగింది… టీఆర్ఎస్ పోటీలో ఉండబోతోంది.., కేసీయార్ మాజీ ప్రధాని పీవీని మించిన చాణక్యాన్ని ఆయన కుటుంబం మీదే ప్రయోగించాడు… పీవీ కుమార్తె సురభి […]

సిటీ బ్యాంక్ కొట్టిన సున్నాలు! చివరికి మిగిలిన సున్నాలు!

February 21, 2021 by M S R

citibank

సంస్కృతంలో విశాఖదత్తుడి “ముద్రా రాక్షసం” బాగా పేరు ప్రఖ్యాతులు పొందిన కావ్యం. దాదాపు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నాటి రచన. అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యింది. కొన్ని వాస్తవిక ఘటనలు, కొంత కల్పనతో అల్లిన కావ్యమది. తెలుగు పలచపడి, సంస్కృతం అంటరానిది అయ్యింది కాబట్టి ఆ కావ్యంలో గొప్పదనం మనకనవసరం. ముద్రా రాక్షసం అంటే అచ్చు తప్పులు, పొరపాట్లు ఎంత అనర్థమో అన్న విషయానికే పరిమితమవుదాం. పుస్తకాలు ముద్రిస్తే, జనం వేలకు వేల ప్రతులు […]

పుట్టుకతోనే జైలుశిక్ష ఆ పిల్లాడికి… ఇప్పుడు అమ్మకు ఉరిశిక్ష… తరువాత..?!

February 19, 2021 by M S R

shabnam

ఆమె జైలుకు వెళ్లినప్పుడు ఏడు నెలల గర్భిణి… అక్కడే కాన్పు జరిగింది… కొడుకు పుట్టాడు… పేరు తాజ్… ఆరేళ్లు వచ్చేవరకూ అక్కడే ఉన్నాడు… తల్లి చేసిన నేరానికి, ఆ తల్లి కడుపులో పడిన పాపానికి ఆ అబ్బాయి అనుభవించిన తొలి కారాగార శిక్ష అది… తరువాత ఓ కేర్‌టేకర్‌కు అప్పగించారు… బాధ్యత తీసుకోవడానికి కూడా ఎవరూ లేరు… ఉన్నవాళ్లందరినీ ఆ తల్లే నరికి చంపేసింది… సో, కేర్ టేకర్… తన పర్యవేక్షణలో ఆ పిల్లాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు, […]

మంథని మాఫియా..! ఆ డొంక తవ్వకపోతే ‘దర్యాప్తు’లకు అర్థమే లేదు..!

February 18, 2021 by M S R

murdered lawyers

‘‘ఆ నిందితులు ఎంతటి వారైనా సరే, ఎంత ఒత్తిడి వచ్చినా సరే… ఒక్క లాయర్ కూడా వాళ్ల బెయిల్ కోసం గానీ, వాళ్ల తరఫున గానీ వాదించకూడదు… ఒకవేళ వాదిస్తే ఆయా బార్ అసోసియేషన్లు వారిని బహిష్కరించాలి… ఈ సవాల్‌కు లాయర్ల సంఘాలు సిద్ధమేనా..?’’ ఈ వాక్యం ఎక్కడో కనిపించింది… సూటి ప్రశ్న… అది సరైన డిమాండేనా, కాదా అనే చర్చను వదిలేస్తే…! అసలు లాయర్ల వృత్తి ఏమిటి..? నిందితుడైనా సరే, నిర్దోషులైనా సరే వాళ్ల తరఫున […]

ఆ అరుదైన వ్యాధి హైదరాబాదులో కూడా..! ఈ పిల్లాడికి ఆయుష్షు ఎలా..?!

February 18, 2021 by M S R

sma

మొన్నామధ్య మనం దాదాపు ప్రతి పత్రికలోనూ, ప్రతి టీవీలోనూ ఓ వార్త చదివాం, చూశాం… మహారాష్ట్రలో తీరా కామత్ అనే ఓ అయిదేళ్ల బాలిక అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతోందనీ, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చొరవ తీసుకోవడంతో… ప్రధాని మోడీ స్పందించి, ఆ వ్యాధి నివారణకు విదేశాల నుంచి తెప్పించే 16 కోట్ల విలువైన మందులపై 6 కోట్ల జీఎస్టీ, ఇంపోర్ట్ డ్యూటీ రద్దు చేశాడనేది ఆ వార్త సారాంశం… ఆ వ్యాధి పేరు Spinal […]

యండమూరిపై సోషల్ మీడియా కుతకుత..! బుక్కయిపోయాడు..!!

February 18, 2021 by M S R

yandamuri

ప్రఖ్యాత రచయిత యండమూరి ఓ సోషల్ వివాదంలో చిక్కుకున్నాడు..! ఇటు ఆయన్ని ఖండించేవాళ్లు, అటు సపోర్ట్ చేసేవాళ్లతో తెలుగు సోషల్ మీడియా కాస్తా ఉడికిపోతోంది… నిజానికి ఢిల్లీలో ఆందోళనలు, వాటి వెనుక వ్యూహాలు, ప్రతివ్యూహాలు, రైతు బిల్లులు, టూల్ కిట్స్, గ్రెటా థన్‌బర్గ్, దిశ రవి అరెస్టు, దేశద్రోహం కేసుల మీద దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది… సోషల్ మీడియా కూడా రెండుగా చీలిపోయింది… రైట్ వింగ్ సోషల్ యాక్టివిస్టులు, ఆ ఆందోళనల సమర్థకుల నడుమ హాట్ హాట్ […]

…. మునుపు బోలెడన్ని సర్కారీ బ్యాంకులు కూడా ఉండేవట తెలుసా..?

February 18, 2021 by M S R

banks

బ్యాంకుల విజాతీయం! ——————– బ్యాంక్ అనే ఇంగ్లీషు మాటకు సమానమయిన తెలుగు పదం లేనే లేదు. కొన్ని అంతే. ఇప్పుడు దిగులు పడి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. అందుకే ఆ మాటను యథాతథంగా డు ము వు లు ప్రథమావిభక్తి సూత్రం కలిపి బ్యాంకు అంటున్నాం. చివర ఉ కలిసి బ్యాంకు, కారు, సోపు, పెన్ను అనడం సిగ్గుచేటు కాబట్టి- ఆ ఉన్న ఉ కు కూడా మంగళం పాడి- అసలు సిసలు ఇంగ్లీషు […]

అయ్యారే…! మా కుప్పం ప్రజలూ మా మొహం చూడనొల్లడం లేదా..?!

February 18, 2021 by M S R

kuppam

ఎన్నికలన్నాక ఓసారి గెలవొచ్చు, మరోసారి ఓడిపోనూ వచ్చు… వరుసగా గెలుస్తూ వస్తున్న సీటులో కూడా ఒక్కోసారి పల్టీ కొట్టొచ్చు… చాలా కామన్… అయితే అనుకోని విజయాలు ఎలా వార్తల్లోకి ప్రధానంగా వచ్చేస్తాయో… కొన్ని అపజయాలు కూడా అలాగే చర్చకు వస్తాయి… ఎస్, పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ఓడిపోతే అది పెద్ద వార్తే… ఒక సిద్దిపేటలో హరీష్‌రావు ఓడిపోతే అది పెద్ద వార్తే… హైదరాబాదు ఓల్డ్ సిటీలో ఒవైసీ ఓడిపోతే కూడా పెద్ద వార్తే అవుతుంది… అలాగే కుప్పంలో […]

స్పేస్‌లోకి నేమ్స్…! ఉత్త స్పేస్ వేస్ట్ టాస్క్..! ప్యూర్ ఫాయిదా లెస్ పని..!!

February 17, 2021 by M S R

nano satellite

నానో శాటిలైట్… అంటే మరీ సూక్ష్మ ఉపగ్రహం… వచ్చే 28న ఇస్రో ప్రయోగించబోయే ఓ రాకెట్‌‌ ద్వారా పలు ఉపగ్రహాలతోపాటు అది కూడా కక్ష్యలోకి వెళ్లబోతోంది… సో వాట్ అంటారా..? ఉంది..! దీని పేరు సతీష్ ధావన్ నానో శాటిలైట్… గుడ్, భారతీయ స్పేస్ రీసెర్చ్ విషయంలో గొప్ప పేరు, ఆ పేరు పెట్టుకోవడంలో తప్పులేదు… ఇది స్పేస్ కిడ్స్ అనే సంస్థ ప్రయోగించబోయే రెండో ఉపగ్రహం… గతంలో కూడా కలాంశాట్ పేరిట ఓ నానో శాటిలైట్‌ను […]

సోకాల్డ్ ది గ్రేట్ కన్నయ్యలనూ కాపాడుకోలేని కమ్యూనిస్టుల దురవస్థ…!!

February 16, 2021 by M S R

kanhiah

బహుశా ఒకటీరెండేళ్ల క్రితం… ఢిల్లీ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అంటే ఓ సంచలనం… అసలు ఆ యూనివర్శిటీయే పెద్ద యాంటీ నేషనల్ పోకడలకు కేంద్రం అనేది బీజేపీ ఆరోపణ… ఆ యూనివర్శిటీలోని పెడ పోకడల్ని చెప్పాలంటే ఇక్కడ స్పేస్ సరిపోదు గానీ… వాళ్లకు హీరో ఈ సారు… ఈ సారు బీహార్‌లో అప్పటికే పీజీ చేశాడు, కానీ పార్టీ అవసరాల కోసం జేఎన్‌యూలో చేరాడు… ఏదో పనికిమాలిన సబ్జెక్టు మీద పీహెచ్‌డీ… […]

‘ముడి’ చమురు ఘాటెక్కువ కదా..! జస్ట్, కాసిన్ని నీళ్లు కలుపుతున్నారు…!!

February 16, 2021 by M S R

petrol

పెట్రోల్ గంగా జలం! ——————– అరవై ఏళ్ల కిందటి తెలుపు నలుపు చిత్రం గుండమ్మ కథ. తెలుగు సినిమాకు శాశ్వత పరిమళ గంధాన్ని అద్దిన చిత్రం. విలువల వలువలు కట్టిన చిత్రం. ప్రతి పాటలో సంగీత సాహిత్యాలు తెలుగు తేనెలు చిలికిన చిత్రం. అందులో హాస్య నటుడు రమణా రెడ్డి చేత మాటల రచయిత డి వి నరసరాజు చెప్పించిన మాట- “పాలల్లో నీళ్లు కాక, పెట్రోల్ కలుపుతారా? చిక్కటి పాలు తాగితే అరగక కడుపు మందంతో […]

ఐశ్వర్యమస్తు..! ఈ పెళ్లికి ఈ దీవెనే కరెక్టు… ఎందుకో చదవండి…!!

February 14, 2021 by M S R

ccd2

ఒక ఫోటో నచ్చింది ఈరోజు… వార్తల్లోకెక్కిన ఫోటోయే… కర్నాటకలో జరిగిన ఓ పెళ్లి ఫోటో… వరుడు ఎవరంటే..? 2019 జూలైలో సూసైడ్ చేసుకున్న కాఫీ కేఫ్ డే సిద్ధార్థ హెగ్గే కొడుకు అమర్త్య హెగ్డే… తను మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ బిడ్డ కొడుకు… వధువు ఎవరంటే..? కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏమాత్రం అదృష్టం వరించినా సిద్ధరామయ్య స్థానంలో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు… ఇప్పటికీ కర్నాటకలో పవర్ ఫుల్ లీడర్ డీకే […]

ఏబీఎన్ రాధాకృష్ణకు వీజీగా నాలుగైదు పులిట్జర్లు ఒకేసారి ఇచ్చేయొచ్చు..!!

February 14, 2021 by M S R

sharmila11

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రధాని, రాష్ట్రపతి… అవసరమైతే పుతిన్, జిన్‌పింగ్, జో బైడెన్ ఇళ్లల్లోనూ తన సొంత స్పై ఇయర్ బగ్స్, కెమెరాలు పెట్టేయగలడు… తను చెప్పినట్టు కంటికి కనిపించనివీ, చెవికి వినిపించనివీ బోలెడు వార్తలు పట్టుకోగలడు… అవసరమైతే క్రియేట్ చేయగలడు… అదే జర్నలిజం అనీ మైకు గుద్ది వాదించగలడు… కానీ తనకు తెలియకుండానే జర్నలిజాన్ని అంతకుమించి ముందుకు తీసుకెళ్లి, కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్న తీరు మాత్రం అద్భుతం… ఈ ప్రక్రియ, ఈ ప్రయోగాలకు నాలుగైదు పులిట్జర్లు ఈజీగా […]

  • 1
  • 2
  • 3
  • …
  • 9
  • Next Page »

Search On Site

Advertisement

Latest Articles

  • హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!
  • సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
  • చెక్ నితిన్..! ఎంత ఏలేటి అయితేనేం… కమర్షియల్ లెక్కల్లో బోల్తా…!!
  • వజ్రాన్ని నేను…! నీరవ్ మోడీ అంతరాత్మ బహిరంగ లేఖ..!
  • ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!
  • డంకీ బిర్యానీ… డంకీ కబాబ్స్… డంకీ బర్గర్స్… లొట్టలేస్తున్నారట ఏపీజనం..!!
  • లెఫ్ట్, రైట్ కలిసి… రైట్ రైట్..! బెంగాల్‌లో బద్ధవైరుల నయా దోస్తానా..!!
  • బాబోయ్… ఇదేం వార్తారచన తండ్రీ… ఈనాడును ఏదో పాము కాటేసింది…
  • రైల్వే ప్రయాణాలు తగ్గించండి… లేకపోతే చార్జీలు ఇంకా పెంచేస్తాం…
  • దక్షిణ కుంభకోణం..! పూజారుల భారీ మోసాల్ని పట్టేసిన కేరళ సర్కారు..!!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now