….. By…. పార్ధసారధి పోట్లూరి………….. సుప్రీం కోర్టు రెండు కీలకమయిన తీర్పులు ఇచ్చింది ! 1. ప్రధాని మోడీ భటిండా పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా లోపం మీద అటు పంజాబ్ ప్రభుత్వం హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశించింది, ఇటు కేంద్ర హోమ్ శాఖ మరో కమిటీని వేసింది సమగ్ర దర్యాప్తు కోసం. అయితే ఈ రెండు విచారణలని నిలిపివేసి, ప్రధాని పర్యటన షెడ్యూల్ వివరాలు ఉన్న రికార్డులని స్వాధీనం చేసుకోమని పంజాబ్ & హర్యానా హై కోర్టు […]
యాంటీ మోడీ వేరు… యాంటీ నేషన్ వేరు… ఎప్పుడు తెలుసుకుంటార్రా…
‘‘ఈ దేశ ప్రధానమంత్రి పదవి అనేది ఓ వ్యవస్థ… ఆ హోదా గౌరవాన్ని రక్షించడం, లోపరహిత రక్షణ కల్పించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత… దానికి భిన్నమైనదేమీ మన ప్రజాస్వామిక వాతావరణానికి ఆమోదయోగ్యం కాదు…’’… ఇదీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్…. వావ్…! పాకిస్థాన్ సరిహద్దుల్లో, ఖలిస్థానీ ప్రేరేపిత ఆందోళనకారుల వల్ల, పంజాబ్ ప్రభుత్వ నిర్లక్ష్యమే సహకారంగా… అత్యంత సెక్యూరిటీ థ్రెట్ ఉన్న మోడీ దాదాపు 20 నిమిషాలపాటు ఓ ఫ్లై ఓవర్ మీద చిక్కుపడిపోవడం, దగ్గరిదాకా […]
జనమా… ఇది వనమా..?! తెలంగాణలోని ప్రతి గుండె కలుక్కుమంది..!!
తెలంగాణలోని ప్రతి గుండె కలుక్కుమంది… ఇద్దరు ముద్దులొలికే కవలపిల్లలు, అమాయకత్వం మూర్తీభవించిన ఆ ఇల్లాలు, నిస్సహాయుడిగా కుటుంబం మొత్తాన్ని బలిపెట్టిన ఆ భర్త… ! కారకుడు వనమా రాఘవ… ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు… ఆ భర్త తమ ఆత్మహత్యకు కారకులెవరో, కారణాలేమిటో వివరిస్తూ పెట్టిన సెల్ఫీ వీడియో నిన్నంతా వైరల్… చెమర్చని కన్ను లేదు… తిట్టని నోరు లేదు… అవును, మనం జనంలో బతుకుతున్నామా..? వనంలో బతుకుతున్నామా..? ఏమో, వనమే నయమేమో… వనంలోని క్రూరమృగాలు సైతం […]
మోడీజీ… ఈ మాత్ర సేఫేనా..? ఈమాత్రం ఆలోచించలేదా..? ఏం జరుగుతోంది..?!
ఈ కోవిడ్ సంక్షోభంలో అత్యంత జాగ్రత్తగా, జనప్రయోజనకరంగా ఉండేలా వ్యవహరించాల్సిన మోడీ ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి ఓ దశ లేదు, ఓ దిశ లేదు… అంతా గుడ్డెద్దు చేలో పడ్డట్టే…. వేక్సిన్ ధరల దగ్గర్నుంచి మొదలుపెట్టి, చికిత్స ప్రోటోకాల్, డ్రగ్స్‌కు అనుమతి, అడ్డగోలుగా ధరల పెంపు, బ్లాక్ మార్కెట్, వేక్సిన్ల షెల్ఫ్ లైఫ్ పెంపు, సైడ్ ఎఫెక్ట్స్‌పై నిర్లక్ష్యం, జనాన్ని ఆదుకునే చర్యల వరకు బోలెడు అంశాల్లో బొచ్చెడు లోపాలు… అసలు ప్రభుత్వం ఉందా […]
ప్రధాని రక్షణలో ఇంత డొల్లతనమా..? గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదు మనం..!
ఎప్పుడైనా ఓ ముఖ్యమంత్రి ఎటైనా వెళ్తున్నప్పుడు గమనించారా..? ఓ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుంది… ముందుగా రూట్ క్లియరెన్స్… తరువాత పోలీస్ వెహికిల్స్ వెళ్లి, మార్గమధ్యంలో రోడ్లు, కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఆపేస్తాయి… బ్రిడ్జిలు, ఫ్లయ్ ఓవర్లు ఉంటే వాటి మీదకు కాన్వాయ్ దాటిపోయేదాకా వాటిపైకి జనాన్ని రానివ్వరు… కాన్వాయ్ ఒక్కసారి బయల్దేరిందంటే ఇక ఎక్కడా ఆగేది ఉండదు, అంత పక్కగా ఉంటయ్ ఏర్పాట్లు, ప్లానింగ్… మరి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు రక్షణతోపాటు దేశంలోకెల్లా అత్యంత పటిష్ఠ భద్రత […]
జ్యోతే అనుకుంటే ఈనాడు దాని తాత… నమస్తే ఈనాడుకే దగ్గులు నేర్పే ముత్తాత…
రాజకీయ పార్టీలు అంటేనే నోటికొచ్చినట్టు ఏదో కూస్తాయి… ఆ పార్టీల కొమ్ముకాసే పత్రికలు అవే రెచ్చిపోయి రాస్తాయి… మన దేశమే కాదు, మొత్తం ప్రపంచమంగా మీడియా అంటేనే అంత..! ఆఫ్టరాల్ తెలుగు పత్రికలదేముంది..? ఎలాగూ ప్రతి పత్రిక పాలకుడు లేదా తమ పోషకుడి పాదతీర్థ సేవనమే కదా… మళ్లీ అందులో కులగజ్జి గట్రా అదనం… కానీ కనీసం ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఒకటికి నాలుగుసార్లు చూసుకోవడం అవసరం కదా… జనం దేనితోపడితే దానితో నవ్వుతారనే సోయి కూడా […]
అదుగో థర్డ్ వేవ్ వచ్చె వచ్చె… గుచ్చేయండి టీకాలు చకచకా… ఇంకా ఇంకా..?!
మొన్న రెండుమూడురోజులపాటు సోషల్ మీడియాలో, ఆన్లైన్ న్యూస్సైట్లలో ఓ పోస్ట్ బాగా సర్క్యులేటైంది… ఇండియాలో తయారైన వేక్సిన్ల పాత నిల్వల షెల్ఫ్ లైఫ్ పెంచేశారని, వాటిని పిల్లలకు వేస్తున్నారనీ ఆ పోస్ట్ సారాంశం… నో, నో, ఇదంతా మిస్లీడింగ్, ఫాల్స్ అని కేంద్ర ప్రభుత్వం అర్జెంటుగా ఖండించింది… నిజానికి షెల్ఫ్ లైఫ్ పెంచిన మాట నిజం… కాకపోతే రెండు నెలల క్రితమే పెంచేశారు… అలా ఎందుకు పెంచారయ్యా అంటే, పెంచవచ్చు, ప్రమాదం ఏమీలేదు అని ఆయా కంపెనీలే […]
హవ్వ… జగన్‌రెడ్డితో ఆమ్రపాలి భేటీయా..? ఏం జరుగుతోంది అసలు..?!
ప్చ్.., ఆంధ్రజ్యోతి స్పై కెమెరాలు, సీక్రెట్ ఇయర్ బగ్స్ కూడా పనిచేస్తున్నట్టు లేవు… ప్రధాని మోడీ కార్యాలయం (బహుశా ఆమ్రపాలి..?) జగన్ వస్తున్నాడనగానే ఆంధ్రజ్యోతి గూఢచారదళం యాక్టివేట్ అయిపోతుందని తెలిసి, మొత్తం కొత్త జామర్లను ఫిక్స్ చేసినట్టుంది… అందుకే మోడీ జగన్‌తో ఏం మాట్లాడాడు, మడమ బెణుకు సాకుతో చాలారోజులుగా రానందుకు సారీ చెప్పాడా, ఈసారికి మీరే రక్షించండి మహాప్రభో అని వేడుకున్నాడా, సరే, ఇది నీకు చివరి చాన్స్, రక్షిస్తానుపో అని మోడీ అత్యంత ఔదార్యంతో […]
హైబ్రీడ్ వైరస్ల సృష్టి ఎంత వీజీయో… జస్ట్, పేర్లు పెట్టేసి రాసిపారేయడమే…
ఎవడి ఇష్టం వాడిదే… మరీ మీడియాకు కరోనాను మించిన స్వేచ్ఛ… అరాచకం… వాడెవడో ఒకడు మొదలుపెడతాడు… ఇంకేం..? మరీ ప్రత్యేకించి తెలుగు మీడియా చెవుల్లో ఎడ్డిపూలు పెట్టుకుని చకచకా రాసేసి, అచ్చేసి, ఆ పూలను పాఠకులకు బదిలీ చేస్తుంది… అవును మరి, అంతిమంగా ప్రజలు అంటే అందరికీ లోకువే కదా… ఇప్పుడు ప్రపంచమంతా ఒమిక్రాన్ పేరు… వ్యాప్తి మహావేగం… కానీ దానికి మరీ ప్రాణాలు తీసేంత సీన్ లేదని దక్షిణాఫ్రికా వైద్యులు తేల్చేశారు… నిజంగానే కేసుల సంఖ్య […]
సారీ, తప్పయింది, మన్నించండి ప్లీజ్… సీజేకు జగన్ వేడికోలు… ఆర్కే ఉవాచ…
‘‘తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం కీలక అధికారిగా ఉన్న ఒకరితోపాటు, గతంలో అదే పదవిలో ఉండిన మరో అధికారి కీలక పాత్ర పోషించారు. ఈ ఇరువురు అధికారులు ముఖ్యమంత్రి తరఫున రాయబారం నడిపారు. దీంతో జగన్‌రెడ్డి దంపతులను ప్రత్యేకంగా కలుసుకోవడానికి జస్టిస్ రమణ అంగీకరించారని తెలిసింది. ఈ సందర్భంగా గతంలో జరిగినదానికి తనను క్షమించవలసిందిగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆయనను వేడుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘‘నిజానికి సారీ అని చెప్పడం చాలా చిన్న పదం. నేను చేసిన తప్పుకు […]
2022… ఒమిక్రాన్ నామ సంవత్సరం… ఎనలేని శుభాన్ని తీసుకొస్తోంది…
ఇప్పటికే ఓమిక్రాన్ విస్తరించింది అనిపించినా, గణాంకాల ప్రకారం చూస్తే … 1 . ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది . 2 . తెలంగాణలో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది . ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు రెట్టింపు అవుతూ , జనవరి చివరికల్లా లక్షల్లోకి చేరవచ్చు . ఓమిక్రాన్ ఎవరినీ వదలదు . అందరికీ సోకుతుంది . ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే […]
‘చీప్’ వ్యాఖ్యలు సరే… కానీ ‘సమర్థన’లోనూ ఆ ‘చీప్’తనమేనా రాజూ…
ఒక్క మాట… అనాలోచితమైన ఒకే ఒక్కమాట… నోరు దాటితే చాలు… ‘పెదవి దాటితే పృథివి దాటినట్టే’ అంటాం కదా… అలా ప్రపంచమంతా చక్కర్లు కొట్టీ కొట్టీ, బదనాం చేసి, ఇక దిద్దుకోలేనంత నష్టాన్ని మూటగట్టేస్తుంది… సోము వీర్రాజు అనాలోచిత వ్యాఖ్యలు తన బట్టలిప్పి తననే బజారున పెట్టేశాయి… రోజూ రాజకీయ నాయకుల పిచ్చి వ్యాఖ్యలు ఎన్నో పత్రికల్లో చదువుతుంటాం, టీవీల్లో చూస్తుంటాం, జాతి ఖర్మ అని బాధపడుతూ ఉంటాం… ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోని బోసిడికే, రండ […]
ఔనా… ఇదినిజమేనా..? కేసీయార్ ప్రెజర్ దెబ్బకు మోడీ దిగివచ్చాడా..?
ఎవరి పొలిటికల్ బాధ వాళ్లది… ఎవరి అబద్ధాలు వాళ్లవి… ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ నడుమ సాగుతున్న ధాన్యసమరంలో సత్యాలు ఎవరికీ పట్టవు… పట్టనివ్వరు… అంతా రాజకీయం… రైతులే సమిధలు…! తాజాగా కేంద్రం దిగివచ్చిందనీ, కేసీయార్- మంత్రులు- ఎంపీల పోరాటం ఫలించి కేంద్రం మరో 6 లక్షల బియ్యం సేకరించడానికి అంగీకరించి లేఖ రాసిందనీ వార్త… అదొక విజయంగా చిత్రీకరణ… నిజమేనా..? అది నిజంగా పరిగణించాలా..? అసలు సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నమా..? నిజానికి సమస్య ఏమిటి..? […]
జారిపడిన కాంగ్రెస్ జెండాకు కనిపించే వారస ఆశాకిరణం… రేహాన్..!
…… By…. Nancharaiah Merugumala………….. ఎగరలేక సోనియా చేతుల్లో పడిన కాంగ్రెస్ రాట్నం జెండా! ప్రియాంక కొడుకు రేహాన్ చేతికి వస్తుందా మరో పదీపాతికేళ్లకు? –––––––––––––––––––––––––––––––––––– భారత జాతీయ కాంగ్రెస్ 136వ వార్షికోత్సవం (137వ స్థాపక దినం) సందర్భంగా మంగళవారం దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ‘తాత్కాలిక’ అధ్యక్షురాలు సోనియాగాంధీ పతాకావిష్కరణకు వచ్చారు. పార్టీ రాట్నం జెండాను ఎగరేసే ప్రయత్నంలో ఇనప స్తంభంపైకి తెల్లతాడుతో పంపారు. పోల్ చివరికి చేరగానే తాడు నుంచి జెండా ఊడి, కిందికి […]
ఒమైక్రాన్… ఇది ఆటలమ్మ తరహా… చూస్తూ ఉండండి, ఇదే కరోనాకు ఎండ్…
…. Amarnath Vasireddy…. మసూచి ! స్మాల్ పాక్స్ ! ఈ పేరు విన్నారు కదా ! ఇది వైరల్ వ్యాధి. దీని చరిత్ర ఎవరైనా చెప్పారా ? చదవండి. ఆ రోజుల్లో ప్రజలు వాటి గురించి అవగాహన ఏర్పరచుకున్నారు. మసూచిని అమ్మ వారు లేదా అమ్మోరు అనేవారు . మూడు రకాల అమ్మోరులు 1 . ఇసుక అమ్మోరు : వొళ్ళంతా చిన్నపాటి బుడిపెలు. ఇసుక రేణువులు సైజు లో. ఎనిమిది తొమ్మిది రోజుల్లో నయం […]
ఓమైక్రాన్… రానివ్వండర్రా… అదొక్కటే కరోనా బాధలకు విరుగుడు…
…… By… Amarnath Vasireddy….. ఓమిక్రాన్ సోకితే తొంబై శాతం మందికి అసలు లక్షణాలు వుండవు. మిగతా వారికి స్వల్ప లక్షణాలు. పోస్ట్ ఓమిక్రాన్ – అంటే సోకిన తరువాత ఎలాంటి సమస్యలు వుండవు. దీనికి తోడు ఓమిక్రాన్ సోకితే వచ్చే వ్యాధినిరోధకత డెల్టా లాంటి బలమైన కోవిద్ varient రాకుండా కాపాడుతుంది. ఆ విధంగా కొన్ని రోజులకు డెల్టా లాంటి సమస్యాత్మక varient లు తుడిచిపెట్టుకొని పోతాయి. పెద్దగా సమస్య లేని ఓమిక్రాన్ అలాగే […]
‘‘మదర్ మమత’’ అంటే అంతే… ముందు మోడీని తిట్టేయాలి, తర్వాతే నిజానిజాలు…
Srini Journalist……….. సందు దొరికితే చాలు ఒకటే రాళ్లు విసరడం, తరువాత బోర్లా పడటం.. పశ్చిమ బెంగాల్ దీదీకి ఎవడో చెవిలో ఊదాడట… మదర్ థెరిసా ట్రస్ట్ కి చెందిన బ్యాంక్ అకౌంట్స్ ని మోదీ ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది అని. ఇక మన మేడం ఆగదు కదా.. ‘ క్రిస్మస్ రోజున ట్రస్ట్ కు చెందిన అన్ని బ్యాంక్ అకౌంట్స్ ని కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసింది, దీనితో 22 వేల మంది పిల్లలు ఉద్యోగులు […]
ఆనాటి యువరాణి ప్రయాణ స్పూర్తితో… అయోధ్యకు జలమార్గం..!!
అద్భుత హిందూ ఆధ్యాత్మిక కట్టడంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య గుడిని చేరుకోవడానికి రైలు, విమానం, రోడ్డు మార్గాల్ని అభివృద్ధి పరిచే ప్రణాళికల గురించి యోగీ ఆదిత్యనాథ్ అప్పుడప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాడు… ఇప్పుడు తాజాగా ఓ ప్రణాళిక వేస్తున్నాడు… జలమార్గాన్ని కూడా అయోధ్యకు అనుసంధానించాలనేది దాని సారాంశం… రఫ్‌గా చెప్పాలంటే… యూపీ చుట్టుపక్కల నదుల నుంచి అయోధ్యకు లింక్ ఏర్పాటు చేయడమే కాదు, అంతిమంగా సముద్రానికి కలిపి, ఇతర దేశాలకూ సముద్రమార్గాన్ని డెవలప్ చేయాలి… స్థూలంగా చూస్తే బాగానే అనిపించినా, […]
నాసా నాన్సెన్స్… ఆలులేదు, చూలులేదు, అదుగో ఏలియెన్స్ అన్నాడట..!!
‘‘వేరే గ్రహాలపై జీవం ఉనికికి అవకాశం తక్కువ… ఒకవేళ భూమ్మీద జీవం పుట్టిన పరిస్థితుల్లోనే ఏదైనా గ్రహం మీద కూడా పుట్టి ఉంటే, ఆ జీవం మన భూగ్రహం మీద ఉన్న జీవంతో పోలి ఉండే అవకాశాలు తక్కువ… ఏ వైరస్ వంటి ప్రొటీన్ పోగుగానో మొదలైన జీవం ఏకకణజీవి నుంచి మనిషిగా పరిణామం చెందడానికి లక్షల ఏళ్లు పట్టింది… భూవాతావరణం, సవాళ్లు, విపత్తులు, సంతానవ్యాప్తి, చలనం, ఆహారం, పోషణ, రక్షణ అంశాలే గాకుండా అనేకానేక ఉత్పరివర్తనాలకు […]
బాడీ షేమింగ్..! మన రాజకీయాల్లో ఈ వెగటు అవలక్షణం కొత్తేమీ కాదు..!!
……. By……. Nancharaiah Merugumala……. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారి మనవడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐదు కీలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారి ఒక్కగానొక్క కొడుకు హిమాంశు శరీరాకృతిని ఎగతాళి చేసే రీతిలో జర్నలిస్టు, బీజేపీ సభ్యుడు చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. రాజకీయాలతో సంబంధం లేని ఈ టీనేజి బాలుడిని ఆయన తాతదండ్రులపై ఉన్న కోపంతో ‘బాడీ షేమింగ్ ’ చేయడం దుర్మార్గం అంటూ […]
- « Previous Page
- 1
- …
- 103
- 104
- 105
- 106
- 107
- …
- 141
- Next Page »