కశ్మీర్ ఫైల్స్..! అంటే చరిత్రపుటల్లో దాగి ఉన్న నరమేధాలు, పైశాచిక ఊచకోతలు, మతోన్మాదాలే కాదు… వర్తమాన పరిణామాలు కూడా..! ఇండియాను మతం పేరిట రెండు ముక్కల్ని చేయాలని అనుకున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎవడో ఓ అర్ధ నిపుణుడికి (సగం) బాధ్యత ఇచ్చింది… మ్యాప్ మందు పెట్టుకుని అడ్డంగా తోచిన గీతలు గీసి, ఇది పాకిస్థాన్, ఇది ఇండియా అన్నాడు… శాస్త్రీయ విభజన అయితే కదా… ఈలోపు ఇటువాళ్లుఅటు, అటువాళ్లుఇటు… లక్షలాదిగా వలస… లక్షల మంది మరణించారు… మతం […]
ఈ ప్రపంచస్థాయి డాక్టర్ మీద శ్రీదేవికి ఎనలేని అభిమానం… ఎందుకలా..?!
నోరి దత్తాత్రేయుడు… తెలుగు జాతి గర్వించదగిన డాక్టర్… ప్రత్యేకించి కేన్సర్ రోగులెందరికో దేవుడు… ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆయన గురించి మళ్లీ పరిచయం చేయడం ఓ సాహసమే… లెజెండరీ స్టేటస్‌కన్నా చాలా ఎక్కువ… ఈమధ్య హైదరాబాద్ వచ్చాడు… విస్మయకరం అనిపించింది ఏమిటంటే… ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ముప్పావుగంట ఇంటర్వ్యూ ఇవ్వడం… చాలా అంశాల్ని ఏ శషభిషలూ లేకుండా పంచుకోవడం..! మేం తోపులం, మేం దైవాంశ సంభూతులం అని ఫీలయ్యే పిచ్చి సెలబ్రిటీలందరూ ఆయన్ని చూసి నేర్చుకోవాలి… […]
వాయగొట్టి, చావగొట్టి, చెవులు మూసి… పెద్ద నష్టమేమీ లేదోయ్ అంటారా..?!
ఇంత ఆశ్చర్యం ఎప్పుడూ కలగలేదు… క్వాసీ జుడిషియల్ అధికారాలు, బాధ్యతలున్న ఓ అధికారి కరెంటు చార్జీల పెంపును రాజకీయ కోణంలో విశ్లేషించి సమర్థించుకున్న తీరు…! ఏపీలో కరెంటు ఛార్జీలు అడ్డగోలుగా పెంచారు… సరే, జగన్ ఇంతకుముందు ఏమన్నాడు..? ఇప్పుడు ఎందుకు వాయగొడుతున్నాడు అనేది వదిలేయండి కాసేపు… ప్రతిపక్షాల విమర్శలూ వదిలేద్దాం కాసేపు… కానీ ఓ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సమర్థించుకునే తీరు విస్మయకరంగా ఉంది… కరెంటు ఛార్జీలను పెంచడం మీద… మెయిన్ స్ట్రీమ్ పత్రికల స్పందన […]
కశ్మీర్లో మళ్లీ ఏదో కదలిక..! అమిత్ షా రహస్య ప్రణాళికలు… ఏం జరగనుంది..?!
……… By…. పార్ధసారధి పోట్లూరి……… ఏదో జరగబోతోంది… కేంద్రప్రభుత్వం ఏదో పెద్ద ప్లాన్‌లోనే ఉంది… పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పునఃస్వాధీనం చేసుకునే ప్రణాళిక ఏమైనా రచించబడుతోందా..? త్వరలో ఎన్నికలు ప్రకటించబోతున్నారా..? రకరకాల ఊహాగానాలు సాగుతున్నయ్ కాశ్మీర్ విషయంలో… కానీ అదేమీ లేదు, పీవోకే విముక్తి వంటి పెద్ద ప్రణాళికలేమీ లేవు ఇప్పట్లో… కానీ ఏమీ లేకుండా ఎలా ఉంటుంది..? అమిత్ షా ఏదో పనిలో ఉన్నాడు, వారం రోజులుగా ఒకదాని తరువాత మరొకటి పరిణామాల్ని గమనిస్తే ఏదో […]
వ్యాఖ్యాతకు చెంపదెబ్బ సరైందే… కానీ ఇంతకూ ఆమె గుండు జబ్బు కథేమిటి..?!
వేలాది మంది పాల్గొనే ఒక ప్రోగ్రాంను సరదా జోకులు వేస్తూ, ఎవరినీ నొప్పించకుండా హోస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు… కోట్లాది మంది టీవీల ముందు కూర్చుని చూస్తుంటారు… చిన్న పొరపాటు దొర్లినా అభాసుపాలవుతుంది… అందుకే ఏ ప్రోగ్రాంకైనా మంచి వ్యాఖ్యాత కావాలని వెతుకుతుంటారు ముందుగా… మన యాంకర్ సుమ తెలుసు కదా… కొన్ని వేల షోలకు వ్యాఖ్యాత ఆమె… ఇప్పటివరకూ ఎవరినీ నొప్పించిన దాఖలాలు లేవు… పర్ఫెక్ట్… అలాగే సభికులు, గెస్టుల మీదే జోకులు […]
స్టిక్కర్లపై పోలీసుల యుద్ధప్రకటన..! కానీ నాణేనికి మరోవైపు ఏంటంటే..?!
జంటనగరాల్లో పోలీసులు ‘ప్రెస్’ మీద ఒక్కసారిగా ఫైరయిపోతున్నారు… బండి మీద ప్రెస్ అని స్టిక్కర్ కనిపిస్తే చాలు, జరిమానాలు వడ్డించేస్తున్నారు… ఇక రేపట్నుంచి జిల్లాల్లో మొదలుపెడతారు… మనల్ని పాలించేవాళ్లకు పెద్దగా ప్రజల ఆక్రందనలు కనిపించవు, వినిపించవు కాబట్టి ఈ స్టిక్కర్ల మహోద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుందేమో… హైదరాబాదులోనే కాదు, దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ స్టార్ట్ చేశారు… విషయం ఏమిటంటే..? వాహనాలపై ఎలాంటి స్టిక్కర్లు ఉండకూడదు, మోటారు వాహనాల చట్టం అదే చెబుతోంది… అందుకని ఏ స్టిక్కర్ […]
విష్ణుపూజ పూర్తయింది… శివపూజకు వేళయింది… ఇక ఎములాడ ఉద్ధరణ…!!
నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త కాబట్టి… దొరవారి అభీష్టమే అనుకుందాం… అఫ్కోర్స్, రాసుకోగానే అది జరుగుతుందని కాదు… ఎట్లీస్ట్, మాటవరుసకైనా అన్నాడు కాబట్టి చెప్పుకోవడం…! పత్రికలో బొచ్చెడు ఫోటోలొచ్చినయ్… యాదగిరిగుట్ట పునఃప్రారంభోత్సవం అచ్చంగా ఓ పార్టీ కార్యక్రమంలాగా… మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు… వేరే పార్టీలవాళ్లు లేరు, లోకల్ ఎంపీకి పిలుపు లేదు, గవర్నర్‌కు ఆహ్వానం లేదు, ఓ ధార్మిక కార్యక్రమంలాగా గాకుండా స్వరాజకీయ ధర్మకార్యక్రమంలా గోచరించింది… వస్తారా, రారా జానేదేవ్… పిలిస్తే ఏం పోయింది..? నెవ్వర్, కేసీయార్ […]
నువ్వు డాలర్‌తో ఒకటిస్తే నేను రూబుల్తో పది తగిలిస్తా… ప్రపంచ ఆర్థికయుద్ధం..!!
…… By…. పార్ధసారధి పోట్లూరి……….. రష్యా నుండి ఎవరయినా క్రూడ్ ఆయిల్ కానీ నాచురల్ గ్యాస్ కానీ కొనాలి అంటే రూబుల్స్ లో డబ్బు చెల్లించాల్సిందే .. పుతిన్! ఫిబ్రవరి 24 న పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ కోసం ఆదేశించిన తరువాత అమెరికా, యూరోపియన్ యూనియన్ తో పాటు జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్యాతో ఎలాంటి వాణిజ్య లావాదేవీలు జరపడానికి వీలులేకుండా కఠిన ఆంక్షలు విధించాయి. రష్యా సెంట్రల్ బాంక్ లో ఉన్న […]
బుల్డోజర్ మళ్లీ డ్యూటీకెక్కింది..! బాబ్బాబా… ప్రాణభిక్ష పాహిమాం పాహిమాం…!!
బీజేపీ ఎన్నికల గుర్తు కమలం… కానీ మొన్నటి యూపీ ఎన్నికల్లో ప్రచార గుర్తు బుల్ డోజర్… నిజం… దాన్ని అధికారిక చిహ్నం చేసేశారు… యోగీ మార్క్ మస్కట్… నాలుగు రోజులు ఆగండి, మళ్లీ బుల్ డోజర్లు కదులుతాయ్ అని యోగి తలెగరేసి మరీ చెప్పాడు… తను నమ్మింది బుల్ డోజర్నే… కాదంటే బుల్లెట్‌ను..! బీజేపీ వాళ్లు బుల్ డోజర్ల ర్యాలీలు తీశారు, బుల్ డోజర్లకు బ్యానర్లు కట్టారు, యోగికి బుల్ డోజర్ బాబా అని పేరు పెట్టారు… […]
యాంటీ-జియ్యర్ ఎఫెక్ట్..! యాదగిరిగుట్టలో ఆ రెండు నామాలపై నిషేధం..!!
చిన జియ్యర్తో మైహోం రామేశ్వరరావుకు ఎక్కడ చెడింది..? రామేశ్వరరావుకూ కేసీయార్‌కూ ఎక్కడ చెడింది..? అసలు చిన జియ్యర్‌కు కేసీయార్‌కు ఎక్కడ చెడింది..? ఈ త్రికోణ భుజాలు వేర్వేరు సరళ రేఖలు ఎలా అయ్యాయి..? లోకంలో ప్రధానంగా మనుషుల్ని కలిపి ఉంచేది, విడదీసేది ఆర్థికమే కాబట్టి, అదేదో డిస్టర్బ్ అయ్యిందీ అనుకుందాం, దాన్ని కాసేపు వదిలేద్దాం… అసలు లోగుట్టు బయటికి రావడం కష్టం… కానీ ఈ కథనం చదివే ముందు చిన జియ్యర్ పేరు ఓసారి చదవండి, కాసేపు […]
పీకే… కాంగ్రెస్ వర్క్ చేస్తే వోకే… కానీ కేసీయార్, జగన్‌లకు చికాకే…
అదేమిటో కాంగ్రెస్ క్యాంపులో చేరనున్న ప్రశాంత్ కిశోర్ అంటూ ఓ వార్త వచ్చింది… ఎవ్వడూ పట్టించుకోలేదు పెద్దగా… సోషల్ మీడియాలో చర్చ కూడా లేదు… ఆమధ్య అన్ని రాష్ట్రాల్లోనూ తన టీంలోకి వందలాది మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా వార్త వచ్చింది… అదీ ఎవ్వడూ పట్టించుకోలేదు… నిజానికి ఇది నిజమే అయితే కాస్త ఇంట్రస్టింగ్ డిబేట్ జరిగి ఉండాల్సింది… ఎందుకంటే, తన చేతిలో మంత్రదండం ఉంది, ఎవరినైనా గెలిపించగలడు అనే ఓ ఫేక్ హైప్ తన చుట్టూ క్రియేటై […]
ఫాఫం జగనన్న..! రాధాకృష్ణ కవ్విస్తున్నా సరే, కర్తవ్యం తోచడం లేదు..!!
ఫాఫం… జగన్‌కు చేతకావడం లేదు… మాటిమాటికీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గుర్తుచేస్తూనే ఉన్నాడు… దమ్ముంటే కేసులు పెట్టి, ఏం చేసుకుంటారో చేసుకొండి అని కూడా సవాళ్లు విసురుతున్నాడు… ‘‘మీరెంత తపస్సు చేసినా సరే నన్ను, నా చంద్రబాబును, నా లోకేష్‌ను ఏమీ చేయలేరుపో’’ అన్నట్టుగా రాస్తున్నాడు… ‘‘చంద్రబాబు నథింగ్, ఆంధ్రజ్యోతితోనే వార్’’ అంటున్నావు కదా, కమాన్, నేను ఏ యుద్ధానికైనా రెడీ’’ అన్నట్టుగా కలంపొగరు చూపిస్తున్నాడు… (మీరు చదివింది కరెక్టే… అది కలంపొగరు… అంతేతప్ప కులంపొగరు అని చదవకూడదని […]
మోడీ సర్కారు వారి మరో భారీ ఔదార్యం… మెడికల్ బిల్లు వాచిపోబోతోంది…!!
నోట్ల రద్దు నుంచి ఆత్మనిర్భర్ దాకా… అనేకాంశాల్లో మోడీకి పాలన తెలియదనే విమర్శలు కోకొల్లలు… ప్రత్యేకించి నిత్యావసరాల ధరల మీద ఏమాత్రం అదుపు లేదు… గ్యాస్, పెట్రోల్ మాత్రమే కాదు, మార్కెట్లో కరోనా అనంతరం ధర పెరగని సరుకు లేదు… అసలు నిజంగానే కొందరు మంత్రులకు వాళ్ల శాఖల గురించి ఏమైనా తెలుసా..? పూర్తిగా బ్యూరోక్రాట్లకు వదిలేశారా అనిపిస్తుంది కొన్నిసార్లు… ప్రత్యేకించి కరోనా దుర్దినాల్లో వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖలు కీలకం… అవి రెండూ అట్టర్ […]
ఇండియా కదా… హిందూ దేవుడే కదా… పెకిలించి విచారణకు పట్టుకొచ్చారు…
ఇలాంటివి బహుశా కేవలం ఈ దేశంలోనే జరుగుతాయేమో…. బహుశా ప్రపంచంలో కేవలం హిందూ దేవుళ్లంటే మాత్రమే అలుసేమో… ఇక్కడ అధికారి అంటే అంతే… మూలవిరాట్టులనూ పెకిలించి మరీ కోర్టుకు లాక్కురాగలరు… విచారించగలరు… ఏమో, తిక్క లేస్తే జైలులో, అదీ సాలిటరీ సెల్లోె పారేయగలరు… వార్త చదువుతుంటే నవ్వాలో, ఏడవాలో, జాలిపడాలో, కోపగించుకోవాలో, అబ్బురపడాలో అర్థం కాదు… నిజానికి ఇలాంటివి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఎందుకు పట్టవు… ఇండియన్ మార్క్ మేధావులు లోలోపల సంబరపడిపోతూ ఉండవచ్చుగాక… ఇలాంటి విషయాలు […]
ఆర్ఆర్ఆర్… ఎవ్వడూ నెగెటివ్ కూత కూయొద్దట, కుత్తుకలు కోసేయాలట…
ఒక మెట్రో ప్రాజెక్టు… పూర్తయ్యింది… కానీ సరిగ్గా సర్వీస్ లేదు, సాంకేతిక సమస్యలు… విసిగిపోయిన ఒకాయన థూ, ఇదేం మెట్రో, అస్సలు బాగోలేదు, బాగా మెరుగుపడాలి అని తిట్టాడనుకొండి… పక్కనే ఉన్న పే-ద్ద మనిషి ఒకాయన ‘‘నువ్వు ఓ పిల్లర్ వేసింది లేదు, తట్ట మోసింది లేదు, పట్టాలకు వెల్డింగ్ చేసింది లేదు, నీ బతుక్కి ఒక్క బోగీ తయారు చేసింది లేదు, నీకు తిట్టే హక్కు లేదు, నోరు ముయ్యి’’ అంటే ఎలా ఉంటుంది..? మన […]
ఆ కూత నిజమైతే… అధికారమదంతో తెలంగాణను వెక్కిరించడమే… కానీ…?
‘‘మీ ప్రజలతో నూకలు తినిపించండి, సమస్య అదే పరిష్కారమవుతుంది’’…. ఒక కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో వెటకారంగా మాట్లాడిన మాట ఇది…! ఇది నిజమే అయి ఉంటే… ఒకవేళ ఆయన అలాగే అని ఉంటే మాత్రం దాన్ని అధికార బలుపుగా వర్ణించడానికి, ఖండించడానికి వెనుకాడాల్సిన పనిలేదు… ఒక రాష్ట్ర ప్రజల పట్ల అది చులకనభావమే, పరాభవించడమే అవుతుంది… అది నీచ వాచాలత్వం అనిపించుకుంటుంది… కానీ..? నిజంగా అన్నాడా..? అలా […]
ఇక కాషాయ జెండాల పక్కనే ఎర్ర జెండాలు… గుళ్ల ఉత్సవాల్లో ‘‘మేము సైతం’’…
పర్ సపోజ్… హిందూ మత, ఆధ్యాత్మిక ద్వేషంతో కసిగా శబరిమల గుళ్లోకి రుతుస్త్రీలను ప్రవేశపెట్టిన కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ గట్టిగా చెంపలేసుకుని, హరివరాసనం పాడుకుంటూ, ఇరుముడి సర్దుకుంటూ గుడికి వెళ్లి సాగిలబడితే ఎలా ఉంటుంది..? పోనీ, తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలకు బృందా కారత్ హాజరై బతుకమ్మ ఆడితే..? కనీసం బోనం ఎత్తితే..? సీతారాం ఏచూరి వైష్ణో, అమరనాథ్ నుంచి దిగువన రామేశ్వరం దాకా ఆదిశంకరాచార్యుల తరహాలో తీర్థయాత్ర చేపడితే..? ఆశ్చర్యపోకండి… ఎహె, ఆ పార్టీ ప్యూర్ […]
ఈ దేవుళ్లకు గరుడ పురాణంలో ప్రత్యేక శిక్షలుంటే ఎంత బాగుండు..?!
డప్పు పత్రికలు నమస్తే, సాక్షి… ఇతర చిన్న పత్రికల్ని వదిలేస్తే…… ఈరోజుకూ కాస్త ప్రొఫెషనల్ టెంపర్మెంట్ చూపిస్తున్నది ఆంధ్రజ్యోతి మాత్రమే… సరే, అది పచ్చ అంగీ తొడుక్కున్న టీడీపీ పత్రిక అని అందులోని పొలిటికల్ చెత్తను కాసేపు వదిలేద్దాం… కానీ మిగతా అంశాల్లో మాత్రం బాగుంటుంది… కొన్ని ఇంట్రస్టింగు వార్తల్ని ఎక్కడో ఓచోట అకామిడేట్ చేస్తోంది… మిగతా పత్రికలు సిగ్గుపడాలా లేదానేది వాటికే వదిలేస్తే… మన తాజా వార్తాంశం… గుళ్లల్లో వీవీఐపీల చెత్తదనం… నిలువెల్లా వైసీపీదనం ఒంటపట్టించుకున్న […]
మన పత్రికాఫీసుల మీద రష్యన్ మిస్సయిళ్లు… ఇది మరింత గడ్డుకాలం…
అసలే నక్క రకరకాల నొప్పులతో మూలుగుతోంది… దానిమీద తాటిపండు పడింది… ఎండిన ఓ తాటికొమ్మ దభీమని నెత్తిమీద పడింది… తలదాచుకునే చోటు లేదు ఎక్కడా, ఈలోపు పెద్ద పెద్ద వడగళ్లు పడసాగాయి… ఎలా ఉంటుంది..? అచ్చం మన పత్రికల ప్రస్తుత దురవస్థలా ఉంటుంది… మొన్నమొన్నటిదాకా మీడియా హౌజులు శోకాలు పెట్టాయి… ఇప్పుడు ఏడిచే ఓపిక కూడా లేదు వాటికి… బ్యాడ్ నుంచి వర్స్ స్టేజీకి చేరిపోయాయి వాటి కష్టాలు… ప్రత్యేకించి ఉక్రెయిన్ మీద రష్యా వేస్తున్న బాంబులు, […]
ఆ రెండు చేజిక్కితే చాలు… రష్యా ఇక వెనక్కి..! పని పూర్తయినట్టే…!!
…. By….. పార్ధసారధి పోట్లూరి ….. రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టి ఇప్పటికి నెల రోజులు అవుతున్నది! పశ్చిమ దేశాల యుద్ధ వ్యూహకర్తలు మరియు యుద్ధ వ్యూహ నిపుణుల అంచనా ప్రకారం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనపడట్లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ [Kyive] ని రష్యన్ దళాలు చుట్టుముట్టి ఇప్పటికే రెండు వారాలు దాటింది, కానీ రష్యన్ దళాలు కీవ్ కి బయట 15 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. మరోవైపు ఉక్రెయిన్ […]
- « Previous Page
- 1
- …
- 104
- 105
- 106
- 107
- 108
- …
- 149
- Next Page »