నిజంగా పవన్ కల్యాణ్ ఉత్థానపతనాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది… అప్పుడెప్పుడో ఖుషీ, తరువాత బోలెడన్ని షాకులు… తరువాత పదేళ్లకు గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో మళ్లీ తన ఇమేజీ, పాపులారిటీ, డిమాండ్ రివ్వున ఎగిసింది… తరువాత రాజకీయాలు, గాడితప్పిన సినిమా కెరీర్… నాలుగేళ్లుగా కాటమరాయుడు, అజ్ఞాతవాసి, సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాపులు… రాజకీయాలతోపాటు ఇక సినిమా కెరీర్ కూడా సంక్షోభంలో పడినట్టేనా అనే సందేహాలు… మొన్నటి ఎన్నికల్లో జనసేన అనూహ్య పరాజయం తరువాత పవన్ మళ్లీ వెండితెరే సేఫ్ […]
నాలుగో వంతు ముఖ్యమంత్రులు మాజీల కొడుకులే..! పాత కథలు బోలెడు..!!
బొమ్మైను కర్నాటక సీఎంగా బీజేపీ ఎంపిక చేశాక మళ్లీ చర్చ మొదలైంది… వారసత్వ రాజకీయాలపై..! పాలకుల కొడుకులే వారస పాలకులై జనాన్ని ఉద్దరించాలా..? ఇప్పటికీ మనం ఆ పాత రాచరికాల్లోనే ఉండిపోయామా..? ఈ వారసత్వాలు ఆమోదనీయమేనా..? ఈ చర్చ బాగానే జరుగుతున్నది కానీ… ముఖ్యమంత్రులే కాదు… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు… ఒకటేమిటి..? ఇది ప్రతి దశలోనూ కనిపిస్తున్నదే… అంతెందుకు..? నెహ్రూ, ఇందిర, రాజీవ్… ఒకరి తరువాత మరొకరు అన్నట్టుగా ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించింది ఆ కుటుంబమే […]
ఆశ్చర్య నిర్ణయం..! తను సొంతంగానే ఓ బలమైన పార్టీని నిర్మించలేడా..?!
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్… అంటే రఫ్ అర్థం ఏనుగుల గుంపు వెళ్లి దోమ కుత్తుకలో జొచ్చాయని…! రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, గురుకులాల మాజీ కార్యదర్శి, స్వేరో ఉద్యమ నిర్మాత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ బహుజనసమాజ్ పార్టీలో చేరుతున్నాడనే వార్త చూశాక ఠక్కున గుర్తొచ్చిన పద్యపాదం ఇది..! నిర్ణయం ఆశ్చర్యపరిచింది కూడా..! పైగా పార్టీ కండువాను మాయావతి కప్పబోవడం లేదట… (RSP in BSP)… ఎందుకంటే… ప్రవీణ్‌కుమార్‌కు తన బలం ఏమిటో తనకు తెలియడం లేదు ఎందుకు… తను […]
బొమ్మై..! ఈ పేరు వినగానే ఓ హిస్టారిక్ కేసు గుర్తొస్తుంది… ఆ కథేమిటంటే..?!
యడ్యూరప్పను ఎందుకు బీజేపీ ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసింది..? మీడియాలో బోలెడు విశ్లేషణలు వస్తున్నయ్…! అచ్చం నెహ్రూ కుటుంబంలాగే… సొంత ఇమేజీ ఉన్న నాయకుల్ని మోడీ సహించడం లేదనీ, అందుకే యెడ్డీ, చౌహాన్, వసుంధర, యోగి వంటి నేతలకు కావాలనే చిక్కులు క్రియేట్ చేస్తూ, పార్టీపై తన అధికారాన్ని మరింత కేంద్రీకృతం చేస్తున్నాడనే దాకా ఆ విశ్లేషణలు వెళ్లాయి… సరే, అవి అలా వదిలేద్దాం కాసేపు… యెడ్డీ తలూపక తప్పలేదు, కుర్చీ దిగకతప్పలేదు… మరి తన వారసుడు […]
అద్దెకు ఇస్తే, అప్పగించేసినట్టేనా..? ఇదెక్కడి యాంటీ-మోడీ సిండ్రోమ్ బాబూ…!!
కొన్ని వార్తలు చూడగానే నవ్వు పుట్టిస్తయ్… నిజానికి సీరియస్ విషయాలే… కానీ ఓ ప్రిజుడిస్ మైండ్ సెట్‌తో, ఓ అకారణ ద్వేషంతో వార్త విలువను తీసేస్తారు… ఇదీ అలాంటిదే… మోడీ చేసే ప్రతి పనీ సరైనది కాకపోవచ్చు… అది నిజం… కానీ అలాగని మోడీ చేసే ప్రతి పనీ తప్పే అనే మైండ్ సెట్ ఏమాత్రం సరైనది కాదు… (తేడా అర్థమైంది కదా…) ఇదొక యాంటీ-మోడీ సిండ్రోమ్ అనాలా… మోడీ పేరు తలుచుకోగానే నెగెటివ్ వైబ్రేషన్స్ వచ్చేసి, […]
ఆ యెల్లో మీడియాయే నయం… ‘రామప్ప’ మీద సాక్షికి సోయి లేదు, శరం లేదు…
ఫస్ట్ పేజీలో (ఆంధ్ర ఎడిషన్) కనిపించలేదు… నా కళ్లేమైనా మోసం చేస్తున్నాయేమోనని అనిపించింది… మన రామప్ప గుడిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తిస్తే, తెలుగు ప్రజానీకమే కాదు, భారత ప్రజానీకం మొత్తం ఆ వార్తలను ఆనందంగా చదివి, సంబరపడిపోతుంటే… ప్రత్యేకించి తెలుగు ప్రజలు పులకించిపోతుంటే… అది ఫస్ట్ పేజీ వార్త కాదా..? కాకుండా పోయిందా..? సాక్షి వేగంగా భ్రష్టుపడుతోంది అని అందరికీ తెలుసు జగన్‌కు తప్ప… కానీ మరీ ఇంతగా భ్రష్టుపట్టిపోవాలా..? అది తెలంగాణ వార్త […]
పెగసస్ ఓ కత్తి..! ఓ రియాలిటీ..! ఓ అవసరం..! కత్తి తయారీయే వద్దనడం అబ్సర్డ్..!!
పెగసస్ మీద విరుచుకుపడుతున్నారు… తెలుసు కదా.., మోడీ ప్రభుత్వం విపక్షనేతలు, స్వపక్షనేతలు, జర్నలిస్టులు, హక్కులవాదులు, ఉద్యమకారులు, తీవ్రవాదులు ఎట్సెట్రా అందరివీ… దాదాపు 50 వేల మంది ఫోన్లను హ్యాక్ చేసిపారేసి, ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో తొక్కేసిందనీ, మోడీ మరోసారి తన నియంతగుణాన్ని ప్రదర్శించాడనీ, ఇంతటి అరాచకం ప్రపంచంలో ఎక్కడా లేదని రచ్చరచ్చ చేస్తున్నారు… అలా గొంతులు పెంచి అడుగుతున్నవాళ్లలో చాలామంది చైనాకు దాస్యం చేసేవాళ్లే… ఇలాంటి విషయాల్లో చైనా ఏం చేస్తుందో మాత్రం ఎవరూ మాట్లాడొద్దు… వోకే, పెగసస్‌ను […]
రైతుల్లో గుబులు రేపే వార్త..! కానీ బోలెడు ప్రశ్నలకు జవాబులే కరువు..!!
అక్కరకు రాని అంశాలెన్నింటి మీదో మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ సాగుతూ ఉంటుంది… ప్రత్యేకించి రాజకీయ అంశాలపై డిబేట్లు, వార్తలు, కథలు, కథనాలు, విశ్లేషణలు, మన బొంద, మన బోకె… అదొక క్షుద్రపూజ… ఇదుగో ఈ స్టోరీ ఓసారి చూడండి… ప్రజాశక్తి బ్యానర్ స్టోరీ… ఒక రోజంతా ఎదురు చూసినా, ఒక్కటంటే ఒక్కచోట దీని ప్రస్తావనో, చర్చో, విమర్శో, పోనీ, కనీసం అభినందనో కనిపించలేదు, వినిపించలేదు… నిజానికి మంచి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ, సంబంధిత జర్నలిస్టులకు అభినందనలు… హైదరాబాద్ […]
హమ్మయ్య… ఈనాడోడు చెప్పేశాడు… మన చాను గెలుపులో పాత్ర ఎవరిదో…!!
సిగ్గూశరం లేని మెయన్ స్ట్రీమ్ పాత్రికేయం… ప్రజానీకానికి నయాపైసా ఉపయోగం లేదు, నిజాలు చెప్పదు, నిక్కచ్చిగా ఉండదు, పాదపూజలకు ఫేమస్, జోకుడుకు పాపులర్, కరపత్రాలకు తక్కువ, తుక్కు కాగితాలకు ఎక్కువ… టీవీలయితే మరీ దరిద్రం… అంతా ఆటోస్పై పరిజ్ఞానమే… చివరకు ఈ దరిద్రం ఎక్కడిదాకా తగలడిందీ అంటే…. టోక్యో ఒలింపిక్సులో మన మీరాబాయి చాను రజతం గెలుచుకోవడంలో… ఇదుగో, ఈ తెలుగోడి పాత్ర కూడా ఉందట… ఇదుగో, వీడెవడో రాస్తున్నాడు చూడండి… ఈ మహత్తర విజయంలో చాను […]
కౌశికుడా..? కశ్యపుడా..? పురుషోత్తముడా..? పెద్దిరెడ్డా..? లేక… మాలతీరెడ్డా..?!
ఆ ఉపఎన్నికలో అభ్యర్థిత్వం ఖరారు నిజంగా బయట ప్రచారం జరుగుతున్నంత క్లిష్టంగా ఉందా కేసీయార్‌కు..? అసలు ఉపఎన్నికలంటేనే ఉఫ్ అని ఊదిపారేస్తుంటాడు కదా… జస్ట్, ఎవరో అభ్యర్థి అంటాడు, తరువాత హరీష్ చూసుకుంటాడు… ఎవరిని కొనాలో, ఎవరిని కేసులతో కొట్టాలో, ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో ఓ లెక్కప్రకారం జరిగిపోతూ ఉంటుంది… బహుశా మొదటిసారి ఈ వ్యూహం తల్లకిందులై హరీష్ తెల్లమొహం వేసింది దుబ్బాకలోనే కావచ్చు… ఇప్పుడు హుజూరాబాద్ కూడా టఫేనా..? లేక చిన్న ఈటలను పెద్ద […]
జయజయహో కల్వకుంట్ల తారకా… అందుకో మా రామోజీరావుడి స్తుతిలేఖ….
తప్పు లేదు… తప్పలేదు… తప్పేలా లేదు… తప్పడం లేదు… తప్పనిపించడం లేదు… సో వాట్… రామోజీరావు అయితేనేం..? అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వందల మెట్లు దిగాలి… తప్పదు… దిగకపోతే కల్వకుంట్ల తారకరాముడికి ఏమీ కోపం రాదు, తను తప్పని ఏమీ అనుకోడు, అసలు రామోజీరావు నుంచి ఈ లేఖ వస్తుందని తనూ అనుకోలేదు… కానీ వచ్చింది… వస్తుంది, రావాలి… గతంలో అయితే ఆశ్చర్యపడేవాళ్లం… కానీ ఇప్పుడు ఈనాడు స్థితి, తారకరాముడి సూపర్ స్థితిని పరిశీలిస్తే… రామోజీరావుడు […]
తూచ్… బీసీ ఈటల మీదకు బీసీ అస్త్రమే ప్రయోగిస్తాడట కేసీయార్…!!
తెలంగాణ దళిత బంధు పథకం… వోట్ల కోసమే హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు అని కేసీయార్ ప్రకటన, ఎన్నడూ లేనిది కేసీయార్ నోటివెంట దళిత పథకాలు… టీఆర్ఎస్ క్యాంపులో దళితగానం హోరెత్తిపోతోంది కదా… ఈటలపై కేసీయార్ దళితాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు అని అందరూ ఊహిస్తున్నదే కదా… చివరకు మోత్కుపల్లిని కూడా బీజేపీ నుంచి లాగేసి, ఈటలపై నిందలు వేయిస్తున్నారు… ఎస్సీ కార్పొరేషన్ ఖాళీని కూడా హుజూరాబాద్‌కే చెందిన బండ శ్రీనివాస్‌తో భర్తీ చేశారు… అంతా హుజూరాబాదులో ఉన్న దాదాపు 45 […]
ఈగ వాలితే చాలు… మీడియా మీద దాడేనా..? చట్టాలకు మనం అతీతులమా..?
దేశంలోకెల్లా నంబర్ ఫోర్ స్థానంలో ఉండే పత్రిక దైనిక్ భాస్కర్… 12 రాష్ట్రాలు, 65 ఎడిషన్లు… హిందీ, మరాఠీ, గుజరాతీ భాషలు… దాదాపు 45 లక్షల సర్క్యులేషన్… ఆ సంస్థపై ఐటీ దాడులు జరిగాయి… ఇదీ వార్త… దాంతోపాటు యూపీ బేస్డ్ భారత్ సమాచార్ అనే మరో చానెల్‌పై కూడా..! దైనిక్ భాస్కర్ మీడియా గ్రూపు కరోనా మీద నిజాలు రాస్తున్నది కాబట్టి, యోగి ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై నిశితదాడి కొనసాగిస్తున్నది కాబట్టి, ఆ […]
వరవరరావు బిడ్డ, హరగోపాల్, సాయిబాబా భార్య… వీళ్లే ‘మోడీకి’ ప్రమాదకారులు…
ఇప్పుడు ఢిల్లీలో రచ్చ అంతా పెగసస్ మీదే కదా… అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఓ ఇజ్రాయిలీ తయారీ స్పైవేర్ ద్వారా తమకు పడని జర్నలిస్టులు, యాక్టివిస్టులు, విపక్షనేతలు, ఇతర ప్రముఖ టార్గెట్ల ఫోన్లను హ్యాక్ చేయిస్తుందనేది ఆరోపణ… నిజానికి ఏ ప్రభుత్వం ఉన్నా చేసే పనే, చేయకపోతేనే ఆశ్చర్యపడాలి, అది వేరే చర్చ… అయితే కేంద్ర ప్రభుత్వం ‘డేంజర్’ అని భావిస్తున్న వాళ్లలో తెలుగు వాళ్లు ఎవరైనా ఉన్నారా అని చూస్తే… కేవలం మూడే పేర్లు […]
కేసీయార్‌కు లేని దురద ఈ పిచ్చి పత్రికలకు దేనికో… చేతులు అరిగేలా గోక్కుంటున్నయ్…
మనం పదే పదే చెప్పుకుంటున్నదే… మీడియా పాలకుల కాళ్లపై పడి ఎలా పాకుతున్నదో… అప్పుడెప్పుడో ఎవరో అన్నారు కదా, నేన కేవలం వంగమనే చెప్పాను, వాళ్లే పాకుతున్నారు అని… తెలుగు ప్రముఖ మీడియా గతి… అవును, మీరు చదివింది నిజమే… మీడియా గతి అలాగే ఉంది… సోషల్ మీడియాలో మిడిమిడిజ్ఙానం పోస్టులు అని నిందిస్తారు గానీ… మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా వేల రెట్లు నయం అనిపించేది ఇలాంటప్పుడే… అంతెందుకు, వోట్ల భయంతో కిక్కుమనని పార్టీల ప్రముఖ […]
ఈ షర్మిల ఎన్నికల వ్యూహకర్తకూ మోహన్బాబుకూ చుట్టరికం ఏమిటబ్బా..?!
ఈమధ్య మీడియాలో ఎన్నికల వ్యూహకర్తల వార్తలు కనిపిస్తున్నయ్… ప్రశాంత్ కిషోర్ (పీకే) కూడా గతంలో ఈ ఎన్నికల పనుల్ని తెరవెనుకే పనిచేసేవాడు… పెద్దగా మీడియా తెర మీద కనిపించేవాడు కాదు… కానీ తనను జగన్ ఏదో సందర్భంలో బహిరంగవేదిక మీదే అందరికీ పరిచయం చేశాడు… తరువాత పీకే చంద్రబాబు మీద కూడా ఏవో కామెంట్స్ చేసినట్టున్నాడు… ఆ తరువాత వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు… ఈమధ్య తను ఎటు అడుగువేసినా వార్త అయిపోతోంది… చంద్రబాబుకు పనిచేసే రాబిన్ శర్మ […]
హుజూరాబాద్ ఉపఎన్నికా..? అబ్బే, ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు..!!
అదుగో, ఆయన పార్టీ జంప్…. ఇదుగో ఈయన అభ్యర్థి అట… కాదు, కాదు, కేసీయార్ ఈ అస్త్రం సంధించబోతున్నాడు… అబ్బో, ఈటల భలే ప్లాన్ చేశాడు… రేవంత్ రెడ్డి ప్రణాళిక ఏమిటి..? ఇలా రోజూ బోలెడు వార్తలు వస్తూనే ఉన్నయ్ హుజూరాబాద్ ఉపఎన్నిక మీద…! ఏదో ఒకటి రాయాలి కదా అనుకుంటూ ఏదేదో రాసేస్తున్నారు… దీనికితోడు కేసీయార్ హుజూరాబాద్ ఉపఎన్నికలను మరీ అసాధారణ రీతిలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు… తెలంగాణ దళితబంధు వంటి అత్యంత ఖరీదైన ప్రణాళికలూ వేస్తున్నాడు… […]
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన టూర్ టికెట్… జస్ట్, 208 కోట్లు మాత్రమే…!!
నిజానికి ఆ ఇద్దరు వ్యాపారులను తిట్టాలో మెచ్చుకోవాలో అర్థం కాదు… అదే… స్పేస్ ట్రావెల్ అని కొత్త దుకాణాలు స్టార్ట్ చేశారు కదా… వారం కింద వర్జిన్ గ్రూపు ఓనర్ బ్రాన్సన్ స్పేస్‌లోకి తన టూరిస్ట్ క్యాప్సూల్‌లో వెళ్లొచ్చాడు… ఇప్పుడు అమెజాన్ బాస్, బ్లూ ఆరిజన్ ఓనర్ జెఫ్ బెజోస్ కూడా తన న్యూషెపర్డ్ క్యాప్సూల్‌లో స్పేస్‌లోకి వెళ్లొచ్చాడు… 1) వాళ్లే సొంతంగా, భయపడకుండా వెళ్లొచ్చారు కాబట్టి, రాబోయే పర్యాటకులకు ధైర్యం, సో, మార్కెటింగ్ కోణంలో వాళ్లు […]
మత్తడి దూకుతున్న దళితప్రేమ..! హుజూరాబాద్ భయపెడుతోందా సారూ..?!
పెద్ద సారు ఎన్నడూ లేనిది, ప్రగతి భవన్ తలుపులు తెరిచి, అఖిలపక్షాల్ని, దళిత ప్రజాప్రతినిధుల్ని పిలిచి భేటీ వేసినప్పుడే అర్థమైపోయింది… ఏదో కొత్త కథకు శ్రీకారం చుడుతున్నాడని…! కేసీయార్ ప్రతి అడుగు వెనుక ఓ రాజకీయ ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది… లేకపోతే ఇటు పుల్ల అటు పెట్టేదే లేదు… అయితే తను సీఎం అయ్యాక ఎన్నెన్నో ఉపఎన్నికల్ని ఉఫ్ అని ఊదేసిన ఆయన హుజూరాబాద్ ఉపఎన్నిక అనేసరికి ఎందుకంత బెంగపడుతున్నడో ఎవరికీ అర్థం కావడం లేదు… నిజంగా […]
మోడీ సర్కారు *స్పైవార్*… ప్రైవసీకి సమాధి… ఐతే రియాలిటీ ఏమిటి..?!
ఏదేని రాష్ట్రంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగినా సరే, నేషనల్ మీడియాకు సరిగ్గా ఆనదు… అదే ఢిల్లీలో గానీ, ముంబైలో గానీ చిన్న ఇష్యూను కూడా పది భూతద్దాలు పెట్టి మరీ చూపిస్తుంది… పెగసాస్ గురించి దివైర్ న్యూస్ సైట్, ఇతర మీడియా ఉమ్మడిగా చేస్తున్న హంగామా అలాగే అనిపిస్తోంది… పెగసాస్ కథేమిటీ అంటారా..? అది ఇజ్రాయిల్‌లో NSO అనే సంస్థ రూపొందించిన ఒక టూల్… లేదా స్పైవేర్… దాని ఆధారంగా ఎంత సెక్యూర్డ్ ఫోన్ అయినా […]
- « Previous Page
- 1
- …
- 115
- 116
- 117
- 118
- 119
- …
- 141
- Next Page »