పార్ధసారధి పోట్లూరి…….. ఉక్రెయిన్ లో వైద్య విద్యని అభ్యసిస్తూ యుద్ధం వలన తిరిగి భారత దేశానికి వచ్చిన 18,000 వేల మంది విద్యార్ధులు దాక ఉన్నారు! వీళ్ళలో కొత్తగా చేరిన వాళ్ళతో పాటు రెండవ సంవత్సరం విద్యార్ధులు, మూడవ సంవత్సర విద్యార్ధులు, ఇక ఫైనల్ పరీక్షలు, ప్రాక్టికల్స్ చేయాల్సిన వారూ ఉన్నారు. రష్యా కేవలం భారత విద్యార్ధుల కోసం మంచి ఆఫర్ ఇస్తున్నది! ఉక్రెయిన్ లో వైద్య విద్యని అభ్యసిస్తూ మధ్యలో భారత దేశానికి తిరిగి వచ్చిన […]
ఇది కాంగ్రెస్-టీడీపీ పునఃకలయిక సంకేతమా..? ఉత్త కర్టెసీ భేటీయేనా..?
మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ నిర్మాణాత్మక చర్చ జరుగుతుంది అనుకున్నాను గానీ… పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు… లైట్ తీసుకున్నారు… ఈ ఫోటో ఏమిటంటే… స్టాలిన్ డీఎంకే పార్లమెంటరీ పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాడు, సోనియా ముఖ్య అతిథిగా వచ్చింది… చాలామంది ఎంపీలను పిలిచినట్టున్నారు… కానీ కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్న ఎంపీలే పలువురు వచ్చారు… వచ్చినవారిలో గల్లా జయదేవ్ సహా ఇద్దరు టీడీపీ ఎంపీలున్నారు… అదీ ఆసక్తికరంగా ఉన్నది… ఎందుకంటే..? మళ్లీ చంద్రబాబు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నాడా..? […]
‘‘ఇదేం కక్కుర్తి..? మీడియా హౌజుల వివక్ష తీరు సిగ్గుపడేలా ఉంది…’’
ఒక మంచి హెడింగ్ పెడితే 50 రూపాయలు… ఒక మంచి వార్తను పట్టుకోగలిగితే 100 రూపాయలు… ఇంటర్నల్ మీడియా మ్యాగజైన్ ‘ఈనాడు సమీక్ష’లో పేర్లు, అభినందనలు… ఛైర్మన్ పేరిట అభినందనలు… ఇవన్నీ ఈనాడులో వర్క్ కల్చర్‌ను డెవలప్ చేశాయి గతంలో… మిగతా పత్రికలు ఈనాడును చూసి చాలా వాతలు పెట్టుకున్నా సరే, ఇలాంటి మంచి లక్షణాల్ని అలవరుచుకోలేకపోయాయి… ఒక చిన్న ప్రశంస, ఒక చిన్న మెచ్చుకోలు, ఒక చిన్న అభినందన, ఓ చిన్న కానుక, ఓ చిన్న […]
ఆదానీ అనగానే ముందు తిట్టేద్దాం… తప్పో ఒప్పో తరువాత సంగతి…
నిన్నటి నుంచీ చాలామంది వెక్కిరిస్తున్నారు ఒక వార్తను… ఫేస్‌బుక్‌లో ఫస్ట్ చాడ శాస్త్రి వాల్ మీద కనిపించినట్టుంది… ఈ వార్తను ఈమధ్యే చదివినట్టు గుర్తుంది, కానీ అది ఏ పత్రికో గుర్తురావడం లేదు… సరే, పత్రిక ఏదయితేనేం… పత్రికల్లో బేసిక్స్ కూడా తెలియనివాళ్లు అన్ని రంగాల మీద తోచినట్టు రాసిపారేస్తూ, అభాసుపాలవుతున్నారు… పాత్రికేయ ప్రమాణాలు రోజురోజుకూ పడిపోతున్నయ్ అనేది తాజా చర్చనీయాంశం… టెక్నికల్, బిజినెస్ వంటి అంశాలపై ఏమైనా రాసేటప్పుడు వాటి మీద కనీసావగాహన ఉండాలనేది ఓ అన్ […]
పబ్బు వార్తలకు ఇది మరో కోణం… నిజాలు నిష్ఠురంగానే ఉంటయ్…
‘‘తెలుగు సినిమాలు, సీరియళ్లలాగే రొటీన్ ఫార్ములా కథనాలు… అదుగో పబ్బు, డ్రగ్స్ గబ్బు, మత్తు హబ్బు, కల్చర్ నాశనం, భ్రష్టుపట్టిపోయింది, పెద్ద తలకాయలు, డబ్బు గబ్బు, మైకంలో సెలబ్రిటీలు…. వార్తల కోణం ఇదే, హెడింగులు ఇవే, పోలీసుల వెర్షన్‌తో మాత్రమే ఎడాపెడా దున్నేయబడుతున్నయ్… చాలామంది జర్నలిస్టులకు అసలు పబ్బుల్లోకి ఒక్కసారి అడుగుపెట్టిన అనుభవం కూడా ఉండదు… వాళ్ల జీతభత్యాలు పర్మిట్ చేయవు… రాడిసన్ బ్లూ పబ్బుపై పోలీసుల దాడి, సెలబ్రిటీలు, రేవ్ పార్టీ, భగ్నం గట్రా వార్తల […]
కవరింగ్ విశ్లేషణలు వద్దు… శ్రీలంక ఏడుపుకి అసలు కారణాలు ఇవీ…!!
పార్ధసారధి పోట్లూరి ……… శ్రీలంక దుస్థితి! వారసత్వ రాజకీయాలు! శ్రీలంకలో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులకి కారణం ఎవరు ? ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు అని చెప్పవచ్చు.ప్రజలు తమ విజ్ఞతని ప్రదర్శించకపోతే అది దేశం కావచ్చు లేదా దేశంలో ఒక భాగంగా ఉండే ప్రానిస్స్ లేదా రాష్ట్రాలు కావచ్చు, ఎలాంటి దుష్ఫలితాలని అనుభవిస్తాయో మన దేశంలో కొన్ని రాష్ట్రాలని ఉదాహరణగా చూపవచ్చు… అలాగే ఒక దేశంగా మన భారతదేశం ఎలాంటి స్థితిలోకి నెట్టబడిందో మనకి అనుభవమే! తాము […]
యోగి బాటలోనే అస్సాం సీఎం… బుల్‌డోజర్ పాలన, తూటా న్యాయం…
ఎన్‌కౌంటర్లు… యూపీలో యోగి జరిపిన ఎన్‌కౌంటర్లు అన్నీఇన్నీ కావు… వందలు కాదు, వేలల్లో… లీగల్ ప్రాసెస్‌ను విస్మరించి, న్యాయసమీక్ష అధికారాన్ని కూడా పోలీసులకే అప్పగించడం రాను రాను ఎలా దుష్ఫలితాలకు దారితీస్తుంది..? డైనమిక్ న్యాయవ్యవస్థ వైపు, చట్టాల వైపు ఆలోచించకుండా ఎన్‌కౌంటర్ల మార్గం పట్టడం శ్రేయోదాయకమేనా..? మొన్నటి ఎన్నికల్లో యోగి గెలుపు స్థూలంగా జనామోదంగా భావించాలా..? ఇవన్నీ చిక్కు ప్రశ్నలు… అయితే యోగిని చూసి, అస్సాం సీఎం కూడా అదే బాటపట్టడం గురించి కూడా చెప్పుకోవాలి… ఓ […]
కశ్మీర్ న్యూ ఫైల్స్..! ఇదీ ఆ కశ్మీరీ పండిట్ల వార్తే… శారదా కారిడార్..!!
కశ్మీర్ ఫైల్స్..! అంటే చరిత్రపుటల్లో దాగి ఉన్న నరమేధాలు, పైశాచిక ఊచకోతలు, మతోన్మాదాలే కాదు… వర్తమాన పరిణామాలు కూడా..! ఇండియాను మతం పేరిట రెండు ముక్కల్ని చేయాలని అనుకున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎవడో ఓ అర్ధ నిపుణుడికి (సగం) బాధ్యత ఇచ్చింది… మ్యాప్ మందు పెట్టుకుని అడ్డంగా తోచిన గీతలు గీసి, ఇది పాకిస్థాన్, ఇది ఇండియా అన్నాడు… శాస్త్రీయ విభజన అయితే కదా… ఈలోపు ఇటువాళ్లుఅటు, అటువాళ్లుఇటు… లక్షలాదిగా వలస… లక్షల మంది మరణించారు… మతం […]
ఈ ప్రపంచస్థాయి డాక్టర్ మీద శ్రీదేవికి ఎనలేని అభిమానం… ఎందుకలా..?!
నోరి దత్తాత్రేయుడు… తెలుగు జాతి గర్వించదగిన డాక్టర్… ప్రత్యేకించి కేన్సర్ రోగులెందరికో దేవుడు… ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆయన గురించి మళ్లీ పరిచయం చేయడం ఓ సాహసమే… లెజెండరీ స్టేటస్‌కన్నా చాలా ఎక్కువ… ఈమధ్య హైదరాబాద్ వచ్చాడు… విస్మయకరం అనిపించింది ఏమిటంటే… ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ముప్పావుగంట ఇంటర్వ్యూ ఇవ్వడం… చాలా అంశాల్ని ఏ శషభిషలూ లేకుండా పంచుకోవడం..! మేం తోపులం, మేం దైవాంశ సంభూతులం అని ఫీలయ్యే పిచ్చి సెలబ్రిటీలందరూ ఆయన్ని చూసి నేర్చుకోవాలి… […]