ఎవ్వడేం రాస్తున్నాడో నాకు తెలియదు… ఏం కూస్తున్నాడో తెలియదు… ఏం సవాళ్లు విసురుతున్నారో తెలియదు… కానీ తిరుమల లడ్డూ కోసం ఉపయోగించే ఇంగ్రెడియెంట్స్ రాను రాను నాసిరకంగా మారుతున్నాయనీ, పెద్ద తలకాయలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ దాని నాణ్యతను, పవిత్రతను భ్రష్టుపట్టించారనేది నిజం… నాసిరకం కాదు, ఏకంగా జంతువుల కొవ్వును కలిపారని సాక్షాత్తూ చంద్రబాబు ఆరోపించాడు… ఏయ్, పిచ్చి రాజకీయాలు చేయకు అని భూమన, సుబ్బారెడ్డి సవాళ్లు విసిరారు… భూమన పిరియడ్ గతంలో, మొన్న తిరుమలను భ్రష్టుపట్టించిందనే […]
చెబితే నమ్మలేని పర్ఫెక్ట్ టెక్ వ్యూహం… అందుకే ఇజ్రాయిల్ అలా నిలబడగలిగింది…
హాలీవుడ్ సినిమాలు చూసి ఇవేవో సినిమాలలో మాత్రమే సాధ్యమవుతాయిలే అనుకోవడం సహజం! కానీ అవే నిజంగా జరిగి వాటిని నేను రిపోర్ట్ చేస్తూ విశ్లేషణ చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు! పుస్తకాలలో వ్రాసినట్లుగా నిజ జీవితంలో జరుగుతాయా? మన చుట్టూ నిత్యం జరిగే సంఘటనలని కొద్దిగా శ్రద్ధ పెట్టి గమనిస్తూ ఉంటే పుస్తకంలో రచయిత ఊహలు పూర్తిగా కాకపోయినా కొంతైనా వాస్తవం అనే అనిపిస్తాయి! కావాల్సిందల్లా కాస్తంత పరిశీలనాత్మక దృష్టి మరి కొంచెం సహనం! ******* ఇజ్రాయేల్ […]
కలం మరణిస్తే వార్త కాదు… ఓ గోల్డ్ మెడల్ జర్నలిస్టు అనాథ మరణం…
ఆమె యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ సాధించారు . ప్రభుత్వాలను శాసించే నంబర్ వన్ సంస్థలో జీవితాన్ని ప్రారంభించి .. దాదాపు నాలుగు దశాబ్దాలు అదే జీవితం . ఆమెది ఒంటరి జీవితం . హైదరాబాద్ మహానగరంలో ఒంటరిగా గదిలో ప్రాణాలు విడిచింది . తలుపు బద్దలు కొట్టి చూస్తే తప్ప ఆమె మరణం బయటి వారికి తెలియలేదు . అనాథ శవానికి పోలీసులు , మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు . …. ఈ వార్త […]
క్రిప్టో క్వీన్..! అంతటి FBI నే ముప్పుతిప్పలు పెడుతున్న డిజిటల్ కిలేడీ..!!
ఎఫ్‌బీఐని ముప్పుతిప్పలు పెడుతున్న మిస్సింగ్ క్రిప్టోక్వీన్! సినిమాను తలదన్నే స్టోరీ!! అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి.. ఓ మహిళ ఇప్పుడు నిద్ర లేని రాత్రులు మిగులుస్తోంది. ఎఫ్‌బీఐ అర్జంటుగా పట్టుకోవాల్సిన క్రిమినల్స్ జాబితాలో.. సుమారు 529 మంది కరడుగట్టిన నేరస్తులున్నారు. అందులో 11 మంది మహిాళా నేరస్తులుంటే… వారిలో ఎప్పుడెప్పుడు పట్టుకుంటామా అన్నట్టుగా ఓ కిలేడీ కోసం ముమ్మురమైన గాలింపు కొనసాగుతోంది. నంబర్ వన్ క్రిమినల్ గా ఇప్పుడు ప్రపంచమంతా మిస్సింగ్ క్రిప్టో క్వీన్ […]
తిరుమల లడ్డూకు జంతువుల కొవ్వు వాడారా..? వెంకన్నకు జగన్ ద్రోహమా ఇది…!!
ఈ మాట అనడానికి ఏమాత్రం సందేహించడం లేదు… తిరుమల శ్రీవారితో ఆడుకున్న వాళ్లు బాగుపడినట్టు చరిత్రలో లేదు… తెలుగు ప్రజలకు బాగా తెలుసు… ఎవరు ఎక్కడ కడతేరిపోయారో… ఎస్, జగన్ హయాంలో హిందూ గుళ్లపై దాడులు బోలెడు… బీజేపీ ఎందుకు సహించిందంటే… అదొక దిక్కుమాలిన పార్టీ కాబట్టి… జగన్‌కు సపోర్ట్ చేస్తూ వచ్చింది కాబట్టి… మతిస్థిమితం లేని చర్యలు అంటూ ఒక్కరిపైనా చర్య తీసుకోలేదు జగన్… ఒకవైపు పుష్కర స్నానాలు చేస్తాడు, రిషికేష్‌లో ఓ స్వార్థానంద స్వామితో […]
కార్లతోపాటు అమృతాంజన్ కూడా సప్లయ్ చేయండి… నితిన్ గడ్కరీ సెటైర్…
ఓ పబ్లిక్ ఈవెంట్ లో తన మనసులో మాట బయటపెట్టడంతో పాటు… కార్ల తయారీదారులపై చురకలంటించారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ. ఆయన ఆ మంత్రిత్వ బాధ్యతలు చేపట్టాక హైవేలపై సీరియస్ గా ఫోకస్ చేశారు. ఇవాళ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ల్లో హైవేల రూపకల్పనలో కూడా ఆయన చొరవ చెప్పుకోవాల్సిందే. నాటి వాజ్ పాయ్ హయాంలో స్వర్ణ చతుర్భుజిని తలపించే విధంగా.. ఇప్పుడు కొన్ని చోట్ల హైవేస్ ను విదేశాలను మరిపించేలా తీర్చిదిద్దారు. […]
ఉగ్రవాదుల జేబుల్లో పేజర్ బాంబులు పెట్టి మరీ పేల్చేసిన ఇజ్రాయిల్
అంతర్జాతీయంగా యుద్ధనిపుణులు, ఉగ్రవాద సంస్థలు, మిలిటరీ సర్వీసెస్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి… ఒకేసారి కొన్ని వందల పేజర్లు పేలిపోయి, లెబనాన్ కేంద్రంగా ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పోరాడే దాదాపు 3 వేల మంది హెజ్బొల్లా ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది… నో డౌట్… టెక్నికల్ డిఫెక్ట్స్ కారణం కాదు… పక్కా వ్యూహం అది… ఎవరు చేసింది..? ఇంకెవరు ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్… దాడులు, ప్రతిఘటన, రక్షణ, నిఘా విషయంలో టెక్నికల్‌గా ఇజ్రాయిల్ ఎంతో ముందంజలో […]
నో పెళ్లి, నో పిల్లలు, నో జంఝాటమ్స్… జస్ట్, నేను… మనిషి మరింత ఒంటరి…
రష్యా అధినేత పుతిన్ వార్త చదవగానే కాస్త నవ్వొచ్చినా… ఆలోచనాత్మకమే..! ‘ఎంతగా తీరిక లేని కొలువులు చేస్తున్నా సరే, లంచ్ బ్రేకుల్లో, టీ బ్రేకుల్లో శృంగారానికి కూడా కాస్త వీలు చూసుకొండి, పిల్లల్ని కనండి’ అని పిలుపునిచ్చాడు తను రీసెంటుగా… శృంగారానికి తీరిక లేకపోవడం కాదు, పిల్లల్ని కనడం మీద ఆసక్తి లేదు జనానికి… పెళ్లిళ్లు, సంసారం, బాధ్యతల జంఝాటం మీద వైరాగ్యం, అనాసక్తత… లక్షల మంది దేశం విడిచివెళ్లిపోతున్నారు, జననాల రేటు మరీ 1.5కు పడిపోయింది… […]
ఆ ఇద్దరికి సీఎం పీఠం దక్కింది కానీ 18 ఏళ్లుగా ఆ ఇంటి స్థలం పట్టా దక్కలేదు…
రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీలో ఇద్దరు సభ్యులకు ముఖ్యమంత్రి పదవి కూడా దక్కింది కానీ ఇప్పటి వరకు ఇంటి స్థలం పట్టా మాత్రం దక్కలేదు . అటు పార్టీ వాళ్ళు ఇటు మారారు . సీఎంలు అయ్యారు , మంత్రులు అయ్యారు కానీ ఓ ఇంటివారు కాలేదు . ఎన్నో రాజకీయ మార్పులు చూసిన శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీ కథ ఇది . ***** టీడీపీ శాసన సభ్యుల బృందం […]
పొద్దుగాల సిన్సియర్‌గా డ్యూటీకి వస్తే… ఇంత అవమానిస్తారా సార్..?
మునుగోడు ఎమ్మెల్యే శ్రీమాన్ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సాబ్… ఏమిటి మీరు చేస్తున్న పని..? సరే, ఓ మందు షాపుల వద్దకు వెళ్లారు… ఈ మందు షాపుల ఆకస్మిక తనిఖీలు ఏమిటి..? ఎవరైనా ఆఫీసులో, స్కూళ్లో, హాస్టళ్లో, ఇంకా ఏవైనా ప్రజావసరాల సంబంధిత వ్యవస్థలో తనిఖీలు చేస్తారు… మంచీచెడూ కనుక్కుంటారు… కానీ తమరేమిటి ఇలా మందు షాపులు బాగా నడుస్తున్నాయా లేదాని తనిఖీలు చేస్తున్నారు..? సరే, చేశారు… ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ముఖ్యం కాబట్టి, తమ పరిధుల్లోని మద్యం […]
తెలంగాణ తల్లిని అక్కడ ప్రతిష్ఠిస్తేనే… ఆత్మాభిమాన ప్రకటనా..? లేకపోతే అపచారమేనా..?!
ఓ దిక్కుమాలిన వివాదం ఇది… నగరంలోనే కాదు, తెలంగాణవ్యాప్తంగా… ఆ లెక్కన ప్రతి రాష్ట్రంలోనూ లక్షల విగ్రహాలు… వ్యక్తి ఆరాధన సంకేతాలు… అక్కడక్కడా విగ్రహాలకు అపచారాలు, క్షీరాభిషేకాలు, ప్రక్షాళనలు, కేసులు, పంచాయితీలు సరేసరి… తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం పెట్టడం మీద ఓ డిఫరెంట్ వివాదం… తెల్లారిలేస్తే ఏదో ఒకటి క్రియేట్ చేసైనా సరే, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి, బదనాం చేసి, ఓ అస్థిరతను రేపాలనేది బీఆర్ఎస్ క్యాంప్ స్ట్రాటజీ… ప్రజలు ఛీకొట్టిన తరువాత […]
కేసీయార్ ఎలాగూ కనిపించడు… కేటీయార్, హరీష్‌రావు… కిక్కుమనరేం జర్నలిస్టుల సైట్లపై..?
18 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత… సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ తరువాత… తేలికగా ఊపిరి పీల్చుకుని… రేవంత్ రెడ్డి, పొంగులేటి ఔదార్యంతో వెయ్యిమంది జర్నలిస్టులు పండుగ చేసుకుంటున్న వేళ… హఠాత్తుగా విషవర్షం కురుస్తోంది… ఎవరున్నారు దీనివెనుక..? అటు పాడి కౌశిక్ రెడ్డి ఆంద్రోళ్ల మీద విద్వేషాన్ని చిమ్ముతున్నాడు… కేటీయార్, హరీష్ పోయి మద్దతు పలుకుతున్నారు… ఇటు ఈ జర్నలిస్టుల హౌజింగ్ ససొైటీ మీద విషప్రసారం మొదలైంది… ఎవరున్నారు దీని వెనుక..? సుప్రీంకోర్టు తీర్పు తరువాత స్వాగతించిన కేటీయార్… మొన్నటి […]
రేవంత్ సార్… ఇదుగో కేసీయార్ సీదా సవాల్… జవాబ్ దో అంటున్నాడు…
ఏమైంది, ఏమీ కాలేదు… నిక్షేపంలా ఉంది, బంగారంలా ఉంది, అత్యద్భుతమైన అతి గొప్పాతిగొప్ప ప్రాజెక్టు… ప్రపంచ ఎనిమిదో వింత… జస్ట్, ఒక పిల్లర్ కుంగింది, మరో పిల్లర్ కాస్త ఫ్రాక్చరయింది, అంతే… ఈమాత్రం దానికి ఇంత ఏడవాలా రేవంత్ రెడ్డి..? అసలు కాళేశ్వరం లేకుండా యాసింగిలో నీళ్లిస్తవా, ఇచ్చి చూడు, మేమూ చూస్తాం… మాట్లాడితే లక్ష కోట్ల అవినీతి అంటవ్, కేసీయార్ తినేశాడు అంటవ్, మళ్లీ మళ్లీ అదే కూస్తే మర్యాద దక్కదు సుమా…….. దాదాపు ఇలాగే […]
అసలు ఆ బ్లెయిర్ ఎవరు..? పోర్ట్ బ్లెయిర్ పేరెందుకు మారింది ఇప్పుడు..?
పోర్ట్ బ్లెయిర్ టూ శ్రీ విజయపురం! పేర్లు, వాటి మార్పు.. వెనుక కథేంటి..? అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ ఇప్పుడు శ్రీ విజయ పురం. పేర్లు మార్చే ఆనవాయితీని ఓ అలవాటుగా మార్చుకున్న బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం.. బ్రిటీష్ కలోనియల్ శకం ఆనవాళ్లను ఇంకా దేశంలో ఉంచడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. ఇదే విషయాన్ని నిన్న శుక్రవారం హోం మంత్రి అమిత్ షా తన X ఖాతాలో షేర్ చేశారు. […]
కేసీయార్ ఎక్కడ..? వరదలొచ్చినా కదలడు..! కౌశికుడి వ్యాఖ్యలపైనా సైలెంట్..!!
ఐదారేళ్ల క్రితం… కేసీయార్ తన మేనల్లుడు హరీష్ రావును పూర్తిగా దూరం పెట్టేశాడు… ఒక దశలో హరీష్ ఇక పార్టీలో ఉంటాడా లేదా అనే చర్చ సాగింది… సీన్ కట్ చేస్తే… ఇప్పుడు అంతా హరీష్ రావే నడిపిస్తున్నాడు పార్టీని… తనే పార్టీ అధినేత అన్నట్టుగా మొత్తం కార్యక్రమాలన్నీ తన చేతుల్లోకి తెచ్చేసుకున్నాడు… బీఆర్ఎస్ భావి అధినేత, కేసీయార్ రాజకీయ వారసుడు, కాబోయే ముఖ్యమంత్రి అనిపించుకున్న కేటీయార్ రాష్ట్రంలోనే లేడు ఇప్పుడు… ఎక్కడో ఉండి ట్వీట్లు వదులుతున్నాడు… […]
కామ్రేడ్… మీరెళ్లిపోయారు… ఇక ఆ నష్టదాయక శక్తులదే ఆధిపత్యం…
ఆ రాజకీయాలు ఎంత పాప పంకిలం అయినా సరే… సీతారాం ఏచూరి అంటే నాకు అభిమానం… ఈ దేశానికి హిందుత్వ రాజకీయాలు ఫాసిస్టు రాజకీయాలు వేరు కాదు అని మూడు దశాబ్దాల కిందనే చెప్పిన మేధావి. తరువాత ఆ పార్టీ ఎంత దిగజారి పోవాలో అంత పోయింది . వాళ్ళు నందిగ్రాంలో జన సంఘ్ గా, ఆంధ్రాలో తెలుగు దేశంగా , తెలంగాణలో భారత రాష్ట్ర సమితిగా … మొత్తంగా యే పార్టీకీ దగ్గర కాదు అని […]
పార్టీలు వేర్వేరైనా సరే… నేతలందరికీ ఇష్టుడే మన తెలుగు సీతారాముడు…
సీతారాం ఏచూరి… భారతీయ మార్క్సిస్ట్ చరిత్రలో తనదొక అధ్యాయం… అఫ్ కోర్స్, భారతీయ రాజకీయాల్లో కూడా..! 72 ఏళ్ల వయస్సులో మరణం అంటే ప్రస్తుత ఆయుఃప్రమాణాల ప్రకారం తక్కువ వయస్సే… మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో పుట్టాడు… గతంలో ఉమ్మడి ఏపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా మేనల్లుడు తను… తరువాత ఢిల్లీలో చదువు… అక్కడే వామపక్ష రాజకీయాల్లోకి ఎస్ఎఫ్ఐ నుంచి ఎంట్రీ… అంచెలంచెలుగా ఎదిగి ఏడేళ్లుగా సీపీఎంకు ప్రధాన కార్యదర్శి తను… మొదటి భార్య […]
ఎవరు కాంగ్రెస్..? ఎవరు బీఆర్ఎస్..? ఎవరు తెలంగాణా..? ఎవరు ఆంధ్రా..? అంతా మిథ్య..!!
ఎవరు కాంగ్రెస్ ? ఎవరు BRS ? ఎవరు TDP ? ఎవరు BJP ? ఎవరు తెలంగాణ బిడ్డ ? ఎవరు ఆంధ్రా బిడ్డ ? అంతా మిధ్య నాయనా . మా ఖర్మ నాయనా మా ఖర్మ . చూడండి . కౌశిక్ రెడ్డి . 40 ఏళ్ల కుర్రాడు . క్రికెట్ ప్లేయర్ . 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా TRS అభ్యర్థి ఈటెల రాజేందర్ పై పోటీ చేసి ఓడిపోయాడు . […]
జస్ట్, గాంధీని కావాలనే ఇలా గోకారు… ఇంకేం, తను అలా రెచ్చిపోయాడు…
తప్పు తప్పే… గాంధీ స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం, అక్కడ రాళ్లతో ఇంటి అద్దాలపై దాడి, విధ్వంసం తప్పే… తప్పు అనడానికి కూడా సందేహం, తటపటాయింపు కూడా అక్కర్లేదు… సబితను అక్క అని సంబోధించినా సరే, అదేదో తెలంగాణ మహిళలందరినీ కించపరిచారు అని ఆందోళనలకు దిగిన బీఆర్ఎస్ ఇక గాంధీ చర్య మీద ఊరుకుంటుందా..? ఏకంగా ఎమ్మెల్యే మీద హత్యాప్రయత్నం అని చిత్రీకరించేసింది… అంతేనా..? దాడికి ప్రతిదాడి తప్పదు అని కూడా అల్టిమేటమ్ జారీ చేసింది… […]
చార్జి షీటు దాఖలు… హేమ మాటల్లాగే ఆ నెగెటివ్ డ్రగ్స్ రిపోర్టు కూడా ఫేకేనా..?
తాజా వార్త ఏమిటంటే..? నటి హేమ కథ మళ్లీ మొదటికొచ్చింది… అదేనండీ, బెంగుళూరులో ఓ రేవ్ పార్టీకి వెళ్లి డ్రగ్స్ తీసుకుందని పోలీసులు కేసు పెట్టారు కదా, ఆమెను అరెస్టు కూడా చేశారు కదా… బెయిల్ తెచ్చుకుంది… ఇప్పుడు ఆ రేవ్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు… అందులో హేమను నిందితురాలిగానే చూపించారని టైమ్స్ ఇండియా కథనం చెబుతోంది… మొత్తం 1086 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేయగా, అందులో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు… ఐతే వారిలో […]
- « Previous Page
- 1
- …
- 11
- 12
- 13
- 14
- 15
- …
- 146
- Next Page »