విశేషంగా కనిపించింది ఓ బ్యానర్ స్టోరీ… ఆంధ్రప్రభలో… విడ్డూరమనో, వింత ప్రతిపాదననో అలా కొట్టిపారేయనక్కర్లేదు… మానవీయ దృక్పథంతో, జర్నలిస్టిక్ కోణంలోనే ఒక సానుకూల ఆలోచనను డిబేట్‌కు పెట్టినట్టుగా పరిగణిద్దాం… అయితే ఆ సానుకూలత ఉందా..? ఆ ఆచరణసాధ్యత ఉందా..? అదీ అసలు ప్రశ్న… ఈ కథనం ఏమంటున్నదంటే..? ‘‘మావోయిస్టులు కూడా మనవాళ్లే కదా, విదేశీయులు కాదు, మావోయిజం సామాజిక సమస్య, వాళ్లు కూడా మన సమాజంలో భాగమే, కాపాడుకుందాం, గతంలో వైఎస్ ప్రభుత్వం చర్చలకు పిలిచి, భద్రంగా […]
వందలాది అనాథ ఆత్మలు..! కావేరి ఒడిలో ‘‘సామూహిక అస్థికా నిమజ్జనం..!!
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం… చెప్పుకుంటూనే ఉన్నాం… చెప్పుకుంటాం కూడా… కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ శవాలను కూడా తీసుకుపోవడానికి కుటుంబసభ్యులు, బంధువులు రావడం లేదు… ఒక హైదరాబాదో, ఒక బెంగుళూరో కాదు… దేశమంతటా దాదాపు ఇదే పరిస్థితి… అనేక కారణాలుంటయ్… కరోనా మనకూ అంటుకుంటుందనే భయం… లేదా అప్పటికే అప్పుల పాలై ఇంకా దహనసంస్కారాల కర్చులు కూడా పెట్టుకునే స్థితి లేకపోవడం… (కొన్ని కులాల్లో చావు కూడా పెళ్లిలాంటిదే…) కొన్ని కుటుంబాల్లో బాధ్యత మీద వేసుకునేవారు మిగలకపోవడం… […]
హవ్వ… ఖర్చెంతో ముందే చెప్పేస్తారా..? కార్పొరేట్ వైద్యానికే అవమానం…
ఇది నిజమేనా..? హవ్వ… ఎంత అప్రదిష్ట… హైదరాబాదు కార్పొరేట్ వైద్యప్రపంచానికే అవమానం… నామర్దా… వీలయితే మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కలిపి, కేటీయార్‌కు చెప్పి, ఈ సెంచరీ హాస్పిటల్ వాడి లైసెన్స్ రద్దు చేయించాలి… కాదంటే మోడీనే రంగంలోకి దింపేయాలి… హమ్మా… అసలు వైద్యానికి ఇంత ఖర్చవుతుందని ఉజ్జాయింపు అంచనా వేసివ్వడం ఏమిటి అసలు..? మన కల్చర్ ఏమిటసలు… ఏమీ చెప్పకుండా, ఏ బిల్లులూ ఇవ్వకుండా… వీలైనంత నగదు గుంజేస్తూ… కార్డులు, బీమా పథకాలు గట్రా దగ్గరకు […]
జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్ భాషను పీవీ పరపరా నమిలేశాడు..!
అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం…. అంటే ఎయిటీస్‌లో మాట… రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నాడు… ఆయన మంత్రివర్గంలో పీవీ నరసింహారావు మంత్రి… కీలకమైన శాఖలే… తరువాత కాలంలో అదే రాజీవ్ భార్య సోనియాకు నచ్చలేదు, అమానవీయంగా తొక్కేసింది, చివరకు ఆయన శవం మీద కూడా కక్ష కనబర్చింది… అది వేరే కథ… తిట్టకండి, ఆమె తెలంగాణ ప్రదాత… అయితే రాజీవ్ గాంధీ టెక్నాలజీకి గేట్లు తెరిచాడు, దేశాన్ని కొత్త సాంకేతిక జ్ఞానం వైపు తీసుకుపోయాడు,.. ఓరోజు ఓ […]
మోడీ టీకాల తీరు పట్నాయకుడికీ నచ్చలేదు… ఏ ఒక్కరూ మెచ్చని పాలసీ…
సుప్రీంకోర్టు కేంద్ర వేక్సిన్ పాలసీని మళ్లీ తీవ్రంగా తప్పుపట్టింది… సగటు మనిషికి కూడా అర్థమైపోతోంది మోడీ వేక్సిన్ పాలసీ ఓ హిస్టారిక్ బ్లండర్ అని… అది జాతికే తీవ్ర నష్టదాయకంగా మారిపోయిందని…! సరే, ఒక సీపీఎం సీఎం పినరై విజయన్ బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ లేఖ రాశాడు… ఇలాంటి విషయాల్లో మోడీ మీద స్వారీ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు కాబట్టి కాసేపు పక్కన పెడదాం… జార్ఖండ్ హేమంత్ సోరెన్ కాంగ్రెస్ క్యాంపు మనిషి కాబట్టి విమర్శ చేస్తున్నాడూ […]
ప్రైవేటు కంపెనీలూ… ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సొసైటీకి ‘‘తిరిగి ఇచ్చేది’’….
మెచ్చుకోదగిన ఔదార్యం ఇది… చాలామంది చాలారకాలుగా కరోనా పోరాటంలో సాయం చేస్తున్నారు కదా అంటారా..? కాస్త వివరంగా చెప్పుకుందాం… సమాజం నుంచి తీసుకోవడమే కాదు, సమాజానికి అవసరమున్నప్పుడు తను నష్టపోతున్నా సరే, తిరిగి ఇవ్వాలి… ఈ నీతిని పాటించే కార్పొరేటు కంపెనీలు కొన్ని మాత్రమే… ఆ కొన్నింట్లో ఆర్జాస్ స్టీల్… దీనికి ప్రమోటర్లు ఏడీవీ పార్టనర్స్… తాడిపత్రిలో స్టీల్ ప్లాంట్ ఉంది… (గతంలో Gerdau Steel) ఈ కరోనా కష్టకాలంలో మన చుట్టూ ఉన్న వాళ్లకు ఏం చేయగలం..? ఏం […]
అంతటి సుబ్బన్నే చెప్పేశాడుగా… అది ఉత్త దండుగ మందేనట…
నో, నో, ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదట, కరోనాకు పనిచేయదట, అందుకని మేం తయారు చేయబోం, ఒకవేళ కేంద్రం అనుమతిస్తే అప్పుడు సీఎంతో మాట్లాడి ఆలోచిస్తాం…….. ఇదీ టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి పత్రిక ప్రకటన… ఇది చదివాక ఆశ్చర్యం, ఆనందం, ఆందోళన, అనుమానం గట్రా చాలా ఫీలింగ్స్…. జగన్ ఈయన్ని కేవలం టీటీడీకి పరిమితం చేయడం పట్ల ఒకింత ఆనందం, ఇప్పటికీ ఆయన అదేతరహాలో మాట్లాడుతున్న తీరు పట్ల ఆశ్చర్యం… టీటీడీ పరిస్థితి పట్ల ఆందోళన… ఇలాగన్నమాట…. […]
‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
ముందుగా ఈ ప్రేమకథను సంక్షిప్తంగా, సూటిగా చదవండి… విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ 2010 ఇంజనీర్ కోర్స్ పాసవుట్… 2015లో బెంగుళూరులోని హూవాయ్ టెక్నాలజీస్‌లో కొలువు… తనతో పాటు పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో పరిచయం… కొద్దిరోజుల్లోనే ఆమెకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది… అప్పటికే ఆమెపై మనసు పారేసుకున్నాడు ప్రశాంత్… ఉద్యోగం పక్కన బెట్టి, ఆ యువతి జాడ కోసం, మనసులోని మాట చెప్పడం కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఆశ్రమాల్లో అక్కడక్కడా ఉంటూ ఆ యువతి […]
సరైన చర్య…! తప్పనిసరైన చర్య…! మోడీకి చేతనైతే ఈ దొరకు జైలే గతి..!!
బెంగాల్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ మీద కఠిన చర్యలకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం నోటీసుల్ని జారీ చేసింది… అది సరైన అడుగేనా..? అని చాలామంది మిత్రుల ప్రశ్న… సరైనదే కాదు, తప్పనిసరైనది కూడా..! ప్రభుత్వాలు వస్తుంటయ్, పోతుంటయ్… మమత వంటి ముఖ్యమంత్రులు, మోడీ వంటి ప్రధాన మంత్రులు కూడా వస్తుంటారు, పోతుంటారు… కానీ సిస్టం ఓ క్రమపద్ధతిలో నడుస్తూ ఉండాలి… కీలకమైన కేంద్ర సర్వీసు అధికారులు దానికి తోడ్పడాలి… రాజకీయాల ప్రభావం, ఒత్తిళ్లు […]
ఇద్దరు కాదు, ముగ్గురు పిల్లలు… చైనా కొత్త పాలసీ వెనుక అసలు లెక్క ఇదీ…
చైనా అంటేనే అంత..! అబ్బే, జీవాయుధాలుగా వైరసులను ప్రపంచం మీదకు వదలడం గురించి కాదు… ఏ విషయంలోనైనా అంతే… ప్రతి పాలసీలోనూ బోలెడంత కాంట్రడిక్షన్, కంట్రాస్టు ఎట్సెట్రా… ఉదాహరణకు… పర్లేదు, ఇకపై ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కన్నా సరే అని సంతాన ఆంక్షల్ని సడలించింది కదా… కానీ ఒక్క జింజియాంగ్ ప్రావిన్సులో మాత్రం పూర్తి విరుద్ధంగా వెళ్తుంది… ఎక్కువ పిల్లలుంటే జరిమానాలు, నిర్బంధ అబార్షన్లు వగైరా ప్రయోగిస్తూ ఉంటుంది… ఎందుకంటే అక్కడ ముస్లింల జనాభా పెరగకూడదని..! […]
పోనీ… మీరు చెప్పండి… ఆ స్థితిలో ఎవరిని బతికించాలి, ఎవరి ప్రాణం విలువైంది..!?
భారీ వర్షాలు, వరదలు, ప్రవాహాలు ఉధృతం… ఓ కుటుంబం ఒక తెప్ప మీద కొట్టుకుపోతోంది…. ఒకరిద్దరు పిల్లలు కొట్టుకుపోయారు, పోతేపోయారు, మళ్లీ కనొచ్చు అనుకున్నారు,,. ప్రాణాలకు మించిన స్వార్థం ఏముంటుంది..? అసలు సగటు జీవలక్షణమే అది కదా… ఓ క్షణం, ఓ సందర్భం వచ్చింది… భార్య, ఒక కొడుకు, తను మిగిలారు… తాము ఏ తెప్ప మీద ఉన్నారో అది ఒకరికే ఆశ్రయం ఇవ్వగలదు, లేకపోతే ముగ్గురూ మునిగిపోతారు… భార్యను తోసేశాడు… బతికి బట్టకడితే మరో భార్య, […]
ఆనందయ్య మందుకు ఆ చట్టమే శ్రీరామరక్ష… లేకపోతే లోపలేసేవారేమో…
నానారకాల నిందలతో, వెటకారాలతో, ఉద్దేశపూర్వక దుష్ప్రచారాలతో, ‘అతి జ్ఞాన’ మీడియా ప్రసారాలతో, వక్రీకరణలతో ఆనందయ్య మందుకు అడ్డం పడటానికి సాగిన ప్రయత్నాలను కాసేపు పక్కన పెడదాం… పోనీ, అది పనిచేస్తుందా, ప్రభుత్వం అనుమతించడం కరెక్టేనా అనే డిబేట్‌ను ఇక పక్కన పెట్టేయొచ్చు… ఎందుకంటే.., హైకోర్టు చెప్పింది, ప్రభుత్వం అనుమతించింది… దీన్ని ఆనందయ్య ఎలా సద్వినియోగం చేస్తాడో వేచి చూడాల్సిందే… సోకాల్డ్ టీవీ మేధావులు, అకస్మాత్తుగా తెరమీదకు వచ్చిన మేధావులు, సంప్రదాయ వైద్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే సైన్స్ మేధావులు […]
భళా స్టాలినూ..! మళ్లీ ఓ మంచి పనిచేశావు… మెచ్యూరిటీ కనిపిస్తోంది…!
ఓ నాస్తికుడు… దేవుడిని నమ్మనివాడు… పైగా హిందూ మతద్వేషి… ఆ డీఎంకే బాస్, ఆ డీఎంకే ప్రభుత్వ ముఖ్యమంత్రి స్టాలిన్ వచ్చాడు కదా… ఇంకేముంది..? గుళ్లకు, హిందూ ఉత్సవాలకు ఇబ్బందులే అనే అపోహ కొంత ఏర్పడింది… అపోహ అనే పదమే కరెక్టు… ఎందుకంటే..? స్టాలిన్ సీఎం అయ్యాక ఈరోజు వరకూ తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ మెచ్యూరిటీ కనిపిస్తోంది… ప్రత్యర్థి పార్టీలపై కక్షసాధింపులు గానీ, పాత పథకాల రద్దు గానీ, విచక్షణారహితంగా కొత్త పథకాల ప్రకటనలు గానీ ఏమీ […]