నిన్న మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ లోక్ అదాలత్‌ల ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ, ఎక్కడో మాట్లాడుతూ ప్రజలు కోర్టు వ్యవహారాలతో విసిగిపోయి, సెటిల్మెంట్ కోరుకుంటున్నారని అన్నారు… కరెక్ట్… నిజం, మన న్యాయవ్యవస్థలోని అపెక్స్ కోర్టు దీన్నే సరిదిద్దాల్సి ఉంది… మన న్యాయవ్యవస్థ పనితీరులో లోపాల వెల్లడికి మచ్చుకు ఓ కేసు… నిఖార్సయిన ఉదాహరణ… తెలంగాణ… పాత మెదక్ జిల్లా… దుబ్బాక మండలం, పెద్దగుండవెల్లి గ్రామం… 2013,ఫిబ్రవరిలో గుండెల పోచయ్యను పోలీసులు అరెస్టు చేశారు… నేరారోపణ ఏమిటంటే… కన్నతల్లిని పోచయ్య […]
రష్యా, ఇరాన్ కలిసి ఏదో ప్లాన్‌లోనే ఉన్నాయి… ప్రమాదంలో ఇజ్రాయిల్…
ఏదో పెద్దదే జరగబోతున్నది! రష్యాకు చెందిన IL – 76 రవాణా విమానం మాస్కో నుండి టెహ్రాన్ చేరుకుంది! రష్యన్ IL – 76 ట్రాన్స్పోర్ట్ విమానం హెవీ మెషిన్స్ లేదా ఎక్కువ బరువు కల ఎక్విప్మెంట్ ను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు! తక్కువ పరిథిలో విధ్వంసం సృష్టించగల అణు బాంబు ఉన్న వార్ హెడ్ ను తీసుకొచ్చి ఉండవచ్చు! దానిని ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ తో అనుసంధానం చేయడానికి కావొచ్చు! లేదా MIRV […]
మోస్సాద్ మిషన్ ఇంపాజిబుల్… Bird in Cage… ఆపరేషన్ ఖతం…
“ THY SHALL MAKE WAR BY DECEPTION” యూదుల బైబిల్ లోని వాక్యం! మోస్సాద్ ఇరాన్ లో తన ఏజెంట్ల ను రహస్యంగా రిక్రూట్ చేసుకుంటూ వస్తున్నది దశాబ్ద కాలంగా! హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనీయా హత్యకు గురయ్యాడు! మోస్సాద్ నిర్వహించిన ఆపరేషన్స్ అన్నింటిలో ఇదే అత్యుత్తమ ఆపరేషన్! జులై 31,2024 తెల్లవారుఝామున 2 గంటలకి ఇస్మాయిల్ హనీయ హత్యకు గురయ్యాడు! ******** హత్య ఎలా జరిగింది? ఇస్మాయిల్ హానీయ (Ismail Haniyeh) ఇరాన్ […]
క్రికెట్ గ్లోరీ షాట్స్.. మ్యాచ్ తీరును, ఫలితాన్నే మార్చేస్తాయి!
శ్రీలంక-ఇండియా మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. 14 బంతుల్లో సింగిల్ రన్ తీయాల్సిన సమయంలో శివమ్ దూబే సరైన ఫుట్ వర్క్ లేక.. గ్లోరీ షాట్‌కు ప్రయత్నించి ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక ఆఖరి వికెట్ మిగిలింది. బ్యాటింగ్‌కు వచ్చే ముందు అర్షదీప్ సింగ్‌కు కెప్టెన్ రోహితో, కోచ్ గంభీరో.. మరొకరో.. క్రీజులోనే ఉండి సింగిల్ తీసుకో అని చెప్పే ఉంటారు. కానీ ఆఖరి రన్ గ్లోరీ షాట్ కొట్టి హీరో అవ్వాలని […]
భంగ్ క రంగ్ జమాహో చకాచక్… గంజాయికి మన గతంలో ఘన ప్రాధాన్యమే…
భంగ్ క రంగ్ జమాహొ చకాచక్!…. గంజాయిరాక్షసీకరణ ఇవ్వాళ్టి పరిస్థితుల్లో గంజాయి [Cannabis] ఘనతను చెప్పడం అంటే కొరివితో తల గోక్కున్నట్లే! నేను టేకప్ చేసి రాసిన అంశాల్లో అత్యంత వివాదాస్పదమైంది బహుశా ఇదే అవ్వొచ్చు! ఫర్వాలేదు, ఇది నచ్చని వాళ్లెవరైనా తిట్టినా కూడా సహిస్తాను, కానీ గంజాయి గత వైభవాన్ని మాత్రం చెప్పి తీరుతాను! మీలో ఎవరైనా అమితాబ్ బచ్చన్ Don సినిమాలోని ఒ కైకే పాన్ బనారస్ వాలా.. ఖులిజాయ్ బంద్ అకల్ కా […]
ఎస్సీల వర్గీకరణ సరే… కానీ ఎస్టీల్లోనూ ఆ ఇష్యూ ఉంది తెలంగాణలో…
కొన్ని రాజకీయ, విధాన వ్యాఖ్యలు చేసే ముందు సంయమనం, వాటి ప్రభావాల మీద ఓ అంచనా, ఓ చూపు ఉండాలి… ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఓ చరిత్రాత్మక తీర్పు చెప్పింది… వర్గీకరణ సబబే అని కుండబద్ధలు కొట్టేసింది… ఇది ఎందుకు చరిత్రాత్మకం అంటున్నామంటే… చాలాచోట్ల ఈ వర్గీకరణ (Sub Classifications) పంచాయితీలు ఉన్నాయి… ఎన్ని తేనెతుట్టెల్ని కదుపుతోంది ఈ తీర్పు..? సరే, మంద కృష్ణ అవిశ్రాంత పోరాటం ఓ చరిత్ర… ఎన్నో ఒడిదొడుకులు, […]
అప్పుడు ఉత్తరాఖండ్… ఇప్పుడు వయనాడ్… రేపు..? ఎవరిది తప్పు..?
ఉత్తరాఖండ్ జోషీమఠ్ కుంగినప్పుడు హిందీ, ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరిగింది. జరగాలి కూడా. కొండా కోనల మధ్య ఒక కొండ మీది ఊరు ఎందుకు కుంగిపోతోందో కారణం తెలియడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమాయకత్వం నటించింది. భూ భౌతిక శాస్త్రవేత్తలు, భూ కంపాలను అధ్యయనం చేసే నిపుణులు, నీటిపారుదల నిపుణులు, అటవీ పర్యావరణ శాస్త్రవేత్తలు మూడు, నాలుగు దశాబ్దాలుగా చేసిన హెచ్చరికలన్నీ జోషీమఠ్ ఇళ్ల పగుళ్లలో, నెర్రెలు చీలిన వీధుల్లో, కూలిన- కూలుతున్న పైకప్పుల్లో […]
రాజ్‌తరుణ్- లావణ్య కథతో మీడియా పండుగ చేసుకుంటోంది…
రాజ్ తరుణ్… లావణ్య కథ చిత్ర విచిత్రంగా ఎటెటో సాగిపోతూ… ఇక చూసే ప్రేక్షకులకు కూడా వెగటు కలిగిస్తోంది… భలే కథ దొరికింది అన్నట్టుగా మీడియా మరింత ఆడుకుంటోంది… పెట్రోల్ పోస్తోంది… పండుగ చేసుకుంటోంది… నిజానికి మొదటి నుంచీ ఈ కథలో లావణ్య మీద బాధితురాలు అనే సానుభూతి ఏమాత్రం కలగడం లేదు… పైగా ఆమె వయెలెంట్ బిహేవియర్ చాలా అనుమానాల్ని కూడా కలగజేస్తోంది… ఇలాంటి మహిళలో అసలు ఇన్నాళ్లూ సహజీవనం చేసిన రాజ్ తరుణ్ మీదే […]
అమెరికా వెళ్తున్నావా పాలకా…? అసలే దేశముదుర్లు… కాస్త జాగ్రత్త..!!
ఒకరు… పేరు వద్దు… అమెరికాలో ఓ కొలువు… తెలంగాణ వ్యక్తి… యువరాజు కనెక్షన్ ఏదో దొరికింది… ఓ సంఘం పెట్టాడు… అమెరికాలో తెలుగు వాళ్ల పేరిట కులాలవారీ, ప్రాంతాలవారీ బోలెడు సంఘాలు… ఏం చేస్తారు అనడక్కండి, అదో భ్రమపదార్థం… టాటా అనే పేరు వస్తుందని ఆ సంస్థ అభ్యంతరం చెబితే పేరు మార్చాడుట… అంతా, తను ఏది చెబితే అదే… యువరాజే అండగా నిలబడ్డాక ఎదురేముంది..? ఆటా, టాటా, బాటా, నోటా, పాటా, వేటా, తూటా, కాటా… […]
ఐదో పదో జేబులో నోట్లుండాలి… ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పనిపడుతుంది…
ఒక నగరంలో బాగా రద్దీగా ఉండే కూడలి. ఉదయం 9 గంటలవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ చూపించింది. ఒక వైపు వాహనాలు బారులు తీరాయి. హెల్మెట్, చేతులకు తొడుగులు వెనుక బ్యాగ్ తగిలించుకున్నవారు కొందరైతే, మెడలు పూర్తిగా పక్కకు వాల్చేసి ఫోన్లో మాట్లాడే వారు ఇంకొందరు. మిన్ను మీద విరిగి మీద పడినా మనకేం సంబంధం లేనట్లు నిరంతరం రెండు చెవుల్లో పెట్టుకుని మాట్లాడేవారు మరికొందరు. కుటుంబ కధా చిత్రంలా దంపతులు, ముగ్గురు పిల్లలు, బట్టల […]
ప్రతి ఇండియన్ క్రికెట్ ప్రేమికుడూ తలుచుకోవాల్సిన పేరు… గైక్వాడ్..!!
రక్తాలు కార్చుకుంటూ.. బ్యాటర్‌గా అయినా, కోచ్‌గా అయినా.. అదే పంతం వెస్టిండీస్ క్రికెట్ టీమ్ అంటే ఇప్పుడు ఎవరూ భయపడటం లేదు. ఒకప్పటి వెస్టిండీస్ టీమ్‌తో పోలిస్తే.. అసలు ఇప్పుడున్న జట్టు క్రికెట్ ఓనమాలు అయినా తెలుసా అన్నట్లు కనపడుతుంది. అదే 70వ దశకంలో వెస్టిండీస్ జట్టును చూస్తే.. ప్రపంచంలోని మిగతా జట్లు గడగడలాడిపోయేవి. ఆ జట్టుతో సొంత గడ్డపై ఆడినా.. భయం మాత్రం పోయేది కాదు. వెసిండీస్ జట్టు ఏ దేశం వెళ్లినా.. ఏ జట్టు […]
బీజేపీలో ‘సంఘ్’ సంస్కరణ… మొన్నటి దెబ్బతో మళ్లీ మూలాల్లోకి పయనం…
– బీజేపీ దారి మార్చనున్న ఆరెస్సెస్? – ఆ ఇద్దరికే పరిమితమన్న భావనకు తెర – పార్టీలో వ్యక్తి ప్రాధాన్యతకు స్వస్ధి – తగ్గనున్న మోదీ-అమిత్‌షా ప్రాధాన్యం – మళ్లీ ‘సంఘ’ వికాసం – ఇక కమలానికి ‘సంఘ’ సొబగులు – మళ్లీ సైద్ధాంతికమూలాల దిశగా బీజేపీ – ఇటీవల ఎన్నికల ఫలితాలే కారణం – కొత్తగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి? – పరిశీలనలో సునీల్‌బన్సల్, కేశవ్‌ప్రసాద్ మౌర్య, వినోద్ తారడే? – 3 రాష్ట్రాల […]
వాడు దొరికితే, నేరం రుజువైతే… ఈ నరకయాతనకు జస్ట్, మరణశిక్ష సబబేనా..?!
ఒక అమెరికన్ లేడీ… ఆ తమిళుడి వలలో ఎలా పడిందో తెలియదు… వచ్చింది, పెళ్లి చేసుకుంది, పదేళ్లు సంసారం చేసింది… తరువాత ఏమైందో ఏమో మరి… వాడు ఆమెను తీసుకుపోయి, ఓ దట్టమైన అడవిలో, జనసంచారమూ కరువైనచోట ఆమెను ఓ చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టేశాడు… వెళ్లిపోయాడు… ఇదీ వార్త… వాడెంత క్రూరుడు..? ఎవడైనా ఎవరినైనా హత్య చేస్తే ఆ కాసేపే బాధ..? కానీ ఇది..? తమిళనాడు పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారట… నిజంగా ఆ సెక్షన్ […]
హవ్వ… ఆ కేసీయార్ నెత్తిన పెట్టుకున్నది ఈ బీహారీ సోమేషుడినే కదా…
మొన్న హరీష్ రావు ఏదో మీడియా చిట్‌చాట్‌లో చాలా బాధపడిపోయాడు… మన తెలుగువాళ్లు లేరా..? ఓ పంజాబీకి డీజీపి ఏమిటి అని…? మరి తమరు చేసిందేమిటి మాస్టారూ… ఓ బీహారీ సోమేశుడికి పట్టం కట్టి, మీకు కావల్సినవన్నీ అడ్డదిడ్డంగా చేయించుకుని… ఇప్పుడు మనవాళ్లు లేరా అంటావా..? ఒక శివధర్‌రెడ్డి, ఒక ఆనంద్‌రెడ్డిలను మీరు కాదా దూరం చేసుకున్నది..? ఐనా ఆల్ ఇండియా సర్వీసుల్లో మనవాళ్లు, పరాయివాళ్లు అనే వెతుకులాట ఏమిటి..? ఏం, ఓ పంజాబీ వైశ్య డీజీపీ […]
ఓహ్, జగన్ చేతులు పిసుక్కోవడం వెనుక అంత మర్మముందా సార్..?!
‘‘జగన్ రాజకీయాలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. కేంద్రంతో సఖ్యత సాధ్యం కాని పక్షంలో రాజ్యసభలోని తన సభ్యులను బీజేపీలోకి పంపడానికి కూడా మొహమాటపడరు…’’ అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు తన ఎడిట్ ఫీచర్లో రాసుకొచ్చాడు… గుడ్… స్పైడర్ సినిమాలో శవాల్ని చూస్తూ అలౌకిక ఆనందం పొందే ఎస్‌జేసూర్య కేరక్టర్ నుంచి కొలంబియా ది మోస్ట్ నొటోరియస్ డ్రగ్ స్మగ్లర్ ఎస్కో బార్ దాకా జగన్‌ను పోలుస్తూ… తిట్టేస్తూ… ఆక్షేపిస్తూ… శవరాజకీయాలని నిందిస్తూ… ఎప్పటిలాగే జగన్ మీద […]
మరో వివాదంలో సింగర్ మంగ్లీ..! నిజంగా ఆమె దేవుళ్లను కించపరిచిందా..?!
టీవీ చానెల్ పేరెందుకు గానీ… సింగర్ మంగ్లీ (సత్యవతి రాథోడ్) ఏదో దైవద్రోహానికి పాల్పడింది, ఆమెకు నిష్కృతి లేదు, నాశనమై పోతుంది అన్నట్టుగా సాగింది ఓ కథనం… గతంలో పలు సందర్భాల్లో మంగ్లీ వివాదాల పాలై ఉండవచ్చు గాక… కానీ ఈ విషయంలో మాత్రం మంగ్లీ తప్పేమీ లేదనిపిస్తోంది… ఏదో ఓ వివాదంలోకి నెట్టే ప్రయత్నం తప్ప… వివాదం ఏమిటంటే..? ఈమధ్య మంగ్లీ హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవానికి హాజరైంది… ఎవరో జోగిని కూడా తోడున్నట్టుంది… […]
‘Digital Arrest’తో జాగ్రత్త… ఉన్నచోటే లక్షలు దోచేస్తారు…
NOTE: IT’S AN IMPORTANT TOPIC. READ THE POST AND SHARE IT. తెలియని నెంబర్ నుంచి మనకు ఫోన్ వస్తుంది. ‘మేం పోలీసులం మాట్లాడుతున్నాం. ఇది చాలా సీక్రెట్ సమాచారం. మీ పేరిట డ్రగ్స్ పార్సిల్ వెళ్లింది. మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని అరెస్టు చేయడం గ్యారంటీ’ అంటారు. ఉన్నట్టుండి ఈ ఫోన్ ఏంటో, ఆ బెదిరింపు ఏంటో మనకు అర్థం కాదు. మనల్నే కాకుండా […]
లోకేష్ రెడ్ బుక్లాగే… రేవంత్ ఏ కలర్ బుక్కూ మెయింటైన్ చేయలేదా..?
నారా లోకేష్ రెడ్ బుక్ తరహాలో ఎనుముల రేవంత్‌రెడ్డి ఏ కలర్ బుక్ కూడా మెయింటెయిన్ చేసినట్టు లేదు… (ఎక్సెప్ట్ పింక్)… యంత్రాంగంలో ఎవరు మనవాళ్లు, ఎవరు పరాయివాళ్లు అని బుర్రలోనే రాసుకుంటూ పోయినట్టున్నాడు… అఫ్కోర్స్, అసలు నేను రెడ్ బుక్ ఇంకా ఓపెనే చేయలేదు, అప్పుడే జగన్ గగ్గోలు అంటున్నాడు లోకేషుడు… అంటే, రెడ్ బుక్ ఓపెనయ్యాక ఉంటుంది అసలు కథ అని బెదిరిస్తున్నాడేమో.., ఏపీ అసెంబ్లీలో ఓ చర్చ… అంకెల జోలికి వెళ్లడం లేదు […]
టీం ప్రతిభ కాదు… మైహోం రామేశ్వరుడికి లక్కీ సుడి ఉన్నట్టుంది…
అపార్థం చేసుకోకండి… టీవీ9 చానెల్లో తిష్ట వేసిన ప్రముఖుల మీద ఎవరికీ పెద్ద సదభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పటికే వాట్సప్ గ్రూపుల్లో బోలెడు కథనాలు వచ్చాయి… వాటి గురించి కాసేపు పక్కన పెట్టేయండి… ప్రస్తుతం తెలుగు న్యూస్ చానెళ్లలో టీవీ9 నంబర్ వన్… కాదు, దాన్ని కన్నెత్తి చూసే ప్రతిభ మిగతా ఏ చానెళ్లకూ లేకుండా పోయింది… అంటే, అది సూపర్ చానెల్ అనీ, మస్తు నాణ్యమైన వార్తా కథనాలు వస్తాయని భ్రమపడకండి… అదొక దిక్కుమాలిన […]
ధర్మవ్యాప్తి..! అమెరికాలో వేలాది మందితో ‘సామూహిక గీతాపఠనం…!
కొందరు పీఠాధిపతుల తీరు చూశాం కదా… ఎంతసేపూ రాజకీయ బురద ఒంటికి దట్టంగా పూసుకుంటూ, తమ ధార్మికవ్యాప్తి విధిని ఏమాత్రం పట్టించుకోకుండా గడిపే తీరును… కొంతమందికి సంపాదనే పరమావధి… ఇంకా..? ఇంకా..? ఓ మిత్రుడు పంపించిన వార్త బాగనిపించింది… అదేమిటంటే..? ‘‘అమెరికాలోని చికాగో నగరంలో నౌ ఎరినా స్టేడియం వేదికగా పది వేల మందికి పైగా భగవద్గీతను కంఠస్థం చేసిన భక్తులు ఒకే కంఠంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు… భక్తులతో పాటు ఇల్లునాయిస్ గవర్నర్ జూలియానా […]
- « Previous Page
- 1
- …
- 16
- 17
- 18
- 19
- 20
- …
- 146
- Next Page »