Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

న్యాయవ్యవస్థలో అవినీతి… ఆ కేసు అప్పట్లో ఓ సంచలనం, ఓ కుదుపు…

March 29, 2025 by M S R

justice cs karnan

. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశం… ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వర్మ ఇంట్లో కాలిన కరెన్సీ కట్టలు దొరికిన ఉదంతం అందరికీ తెలిసిందే కదా… న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు అన్నీ సుప్రీంకోర్టు కొలీజియం పరిధిలోనివే… చివరకు అవినీతి ఆరోపణలు వస్తే విచారణలు కూడా దాని వంతే… అంతేతప్ప కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు… సంపూర్ణ స్వయంప్రతిపత్తి… ఇదీ ఇప్పుడు చర్చనీయాంశం… తనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు… అక్కడి బార్ అసోసియేషన్ తీవ్రంగా […]

సర్కారు మాత్రమే కాదు… సమాజమూ దన్నుగా ఉంటేనే రైతు రక్షణ..!

March 28, 2025 by M S R

farmers

. Kondal Reddy …… చాలా సంతోషాన్ని , మనసుకు తృప్తి కలిగించే ఒక కార్యక్రమం , అత్యంత సమస్యలో ఉన్న 18 రైతు ఆత్మహత్య కుటుంబాలకు జీవనోపాధి సహకారం ….. ఒక్కో బాధిత కుటుంబం వారి భర్త రైతుగా ఎన్ని కష్టాలు పడ్డారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారి పరిస్థితి ఏమిటి అనే దాని గురించి వివరిస్తూ ఉంటే దాదాపు అందరి హృదయం బరువెక్కింది. పూర్తి వివరాలు…….. తెలంగాణలో రైతు ఆత్మహత్య బాధిత […]

గ్రహకూటములకూ భూకంపాలకూ లంకె… విస్తుపరిచే పరిశోధన…

March 28, 2025 by M S R

. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో 7.7 సీస్మిక్ తీవ్రతతో భూకంపం… విధ్వంసం, ప్రాణనష్టం వివరాలు వస్తున్నాయి… 7.7 అంటే పెద్ద భూకంపమే… ఐతే..? గ్రహకూటములు కొన్ని విశేషంగా ఏర్పడుతుంటాయి… వాటి ప్రభావం వ్యక్తిగత జాతకాలపై ఉండదనీ, సోషల్ మీడియాలో ప్రచారాల్ని నమ్మొద్దని నిన్న చెప్పుకున్నాం కదా… కానీ ప్రభావం అసలే ఉండదా..? ఉంటుంది,.. అనుకోని విపత్తులు సంభవిస్తాయి… మరి మయన్మార్, థాయ్‌లాండ్ భూకంపానికీ గ్రహకూటమికీ లింక్ ఉందా..? ఉన్నట్టే ఉంది… ఎందుకంటే..? రేపు సంభవించబోయే షడ్గ్రహ కూటమికి ఒక్కరోజు […]

టాప్ 100 పవర్ ‌ఫుల్..! రేవంత్, బాబు, పవన్, ఒవైసీ… నో జగన్, నో కేసీయార్…

March 28, 2025 by M S R

ie100

. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన టాప్ 100 ఇండియన్ ప్రభావశీలుర జాబితాలో 28వ ర్యాంకులో కనిపించాడు… గత ఏడాది తన ర్యాంకు 39… సో, ర్యాంకు మెరుగుపరుచుకున్నాడన్నమాట… వోకే గుడ్… ఈ మీడియా సంస్థ ఈ ర్యాంకులకు ఎంచుకున్న ప్రాతిపదికల మాటెలా ఉన్నా… అధికారంలో ఉన్న వాళ్లనే ప్రభావశీలురుగా గుర్తిస్తున్నాయి ఆ ప్రామాణికాలు… రేవంత్ రెడ్డి, 89వ ర్యాంకులోని ఒవైసీ మినహా తెలంగాణలో ఏ లీడర్ కూడా ఈ జాబితాలో లేడు… నేనెందుకు […]

వ్యవస్థకు ఇక మీ సేవలు చాలు… మూటాముల్లే సర్దుకొండిక…

March 28, 2025 by M S R

jobs

. ఒకే జీవో… ఒకేసారి 6,729 మందిని పీకిపారేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం… వాళ్లంతా సర్వీస్ నుంచి రిటైరయినా సరే… కీలక పోస్టులు సహా అలాగే కొనసాగుతున్నారు ఇన్నాళ్లూ… వాళ్లందరినీ ఈ జీవో ద్వారా ఇక చాలు మీ సేవలు అంటూ ఇంటికి పంపించేస్తున్నారు… ఒక కోణంలో చూస్తే మంచి నిర్ణయమే… అధికార పార్టీతో ఉన్న సాన్నిహిత్యం, ఆ పార్టీ నాయకుల పైరవీలే వీళ్ల కొనసాగింపు వెనుక ప్రధాన కారణం… ఇలా కొనసాగించడం వల్ల నష్టాలు… 1. […]

ఫాఫం కాంగ్రెస్..! ఒవైసీకి వీసమెత్తు కౌంటర్ కూడా చేతకాలేదు..!!

March 28, 2025 by M S R

owaisi

. మజ్లిస్ అక్బరుద్దీన్ ఒవైసీ అంటేనే నోటి దురుసు… గతంలో కూడా చూశాం కదా… ఇప్పుడు మరోసారి మంత్రి సీతక్క మీద నోరు పారేసుకున్నాడు… ఆ ఆరేడు నియోజకవర్గాలు వాళ్ల సొంత సామ్రాజ్యం… అక్కడ ప్రభుత్వం అంటే వాళ్లదే,., పన్నులకు అతీతులు… ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లతో దోస్తీ నటన… వాళ్లకు అధికార పార్టీలు దాసోహం… మొన్నమొన్నటిదాకా కేసీయార్ నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు… పాత బస్తీ రాజ్యం జోలికి పోలేదు… దానికి దాదాపు స్వయంప్రతిపత్తి ఇచ్చినట్టే […]

వాళ్లను దేవుడే శిక్షిస్తాడులే… అని వదిలేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..!

March 27, 2025 by M S R

revanth

. అసలు గవర్నర్ పర్మిషన్ కూడా ఇచ్చాడు… ఫార్ములా వన్ కేసులో కేటీయార్‌ను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు… కేటీయార్ కూడా మానసికంగా ప్రిపేరయిపోయాడు… రోజూ యోగా చేసుకుని ఫిట్‌, స్లిమ్ అవుతాననీ, జైలులో వేసుకుంటే వేసుకొండని, బయటికి రాగానే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నాడు… కానీ రేవంత్ రెడ్డి అరెస్టు జోలికి పోలేదు… భయం కాదట, సంకోచం కూడా కాదట… జస్ట్, కక్షసాధింపు వద్దులే అనుకున్నాడట… దేవుడే చూసుకుంటాడులే, ఎవరి పాపం వాళ్లదేలే అనుకున్నాడట… తనే […]

అఘోరీ… కాదు, మగ ఘోరీ వశీకరణ తంత్రం… ఓ యువతి తండ్రి గగ్గోలు…

March 25, 2025 by M S R

aghori

. కొంప ముంచిన దురాశ… డబ్బులు ఆశ చూపడంతో అఘోరీకి ఆశ్రయ మిచ్చిన మంగళగిరికి చెందిన ఓ కుటుంబం. యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ. లబోదిబోమంటున్న యువతి కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి… తన కూతురు శ్రీవర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడు అని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురిమెల్ల కోటయ్య నిన్న మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు… […]

రేవంత్‌రెడ్డి భయపడుతున్నాడా..? నిందితులు సాక్షులు అవుతున్నారా…?!

March 25, 2025 by M S R

betting apps

. ఏదో తెలుగు పత్రికలో… బహుశా మన తెలంగాణ కావచ్చు… ఫస్ట్ పేజీలోనే ఓ ఆశ్చర్యకరమైన వార్త కనిపించింది… ఇప్పటిదాకా 25 దాకా కేసులు పెట్టారు కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ బాపతు… ఐతే తెలంగాణ పోలీసులు తన రూట్ అర్జెంటుగా మార్చేసి, ప్రస్తుత నిందితులందరినీ సాక్షుల్ని చేసేసి, ఇక బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను వేటాడతారట… హవ్… బెట్టింగ్ నిర్వాహకుల పని పట్టాల్సిందే నిజమే… కానీ వాటిని ప్రమోట్ చేసేవాళ్ల నేరాలు ఒక్కసారిగా బారా ఖూన్ మాఫ్ […]

కేసీయార్ దొంగ నోట్లు పంచాడా..? సరే, మరి తమరేం చేస్తున్నట్టు సారూ..!!

March 25, 2025 by M S R

bandi

. నిన్న ఎక్కడో మాట్లాడుతూ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయుడు ఇట్లనియె… ‘‘కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు బాగా సన్నిహిత నేత ఒకాయనకు బీదర్‌లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ కలదు, అందు దొంగ నోట్లు ముద్రించెదరు… ఆ నోట్లనే తెచ్చి గత ఎన్నికల్లో వోటర్లకు బీఆర్ఎస్ నాయకులు పంచిరి… ఆ ప్రెస్సు మీద దాడి చేయడానికి వెళ్లే పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చినారు… సిద్దిపేటలో ఎస్పీగా పనిచేసిన ఒకాయన నాకు స్వయంగా ఈ నిజం వెల్లడించెను…’’ ఎస్, […]

మేల్ మమత, మరో ఖర్గే..! అక్షింతలపై KTR హిందూ గుడ్డి వ్యతిరేకత..!!

March 25, 2025 by M S R

ktr

. బీజేపీని తిడుతున్నాం అనే మూర్ఖ భ్రమల్లో పడి కోట్లాది మంది హిందువుల విశ్వాసాల్ని కించపరుస్తున్నవారి జాబితాలో కేటీయార్ కూడా చేరాడు… ఫాఫం, సెక్యులరిజం అంటే, బీజేపీని వ్యతిరేకించడం అంటే హిందువుల్ని, హిందూ దేవుళ్లను, విశ్వాసాల్ని అవమానిస్తున్నాడు కేటీయార్… ఈ మాట అనడానికి ఏమీ సందేహించడం లేదు… హిందూగాళ్లు బొందుగాళ్లు, శూర్ఫణఖ జన్మభూమి, రావణ జన్మభూమి అని కొక్కిరించిన కేసీయార్ కొడుకే కదా తను… కరీంనగర్ వెళ్లినప్పుడు మళ్లీ హిందువుల్ని వెక్కిరించే పనికి పూనుకున్నాడు… అయోధ్య తలంబ్రాల […]

థంబ్‌ ‘నెయిల్స్’… నటి గాయత్రి భార్గవికి ఐడ్రీమ్ సారీ… గుడ్ రెస్పాన్స్…

March 24, 2025 by M S R

gayatri

. గాయత్రి భార్గవ… ఓ తెలుగు నటి… భర్త ఆర్మీ ఆఫీసర్… ఇద్దరు కొడుకులు… ఆమధ్య, అంటే కొన్ని నెలల క్రితం ఇంటర్వ్యూయర్ స్వప్నతో ఓ చిట్‌చాట్… ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ అది… సరే, ఆమె ఏదో అడిగింది, ఈమె ఏదో చెప్పింది… అయిపోయింది… సహజంగానే మన యూట్యూబ్ చానెళ్ల పైత్యం తెలుసు కదా… తమకు అలవాటైన రీతిలో ఏదో పిచ్చి థంబ్ నెయిల్ పెట్టాడు ఓ ఉద్యోగి… ఏమనీ..? ‘మంచులో కూరుకుపోయి మరణించాడు, బాడీని […]

కాంగ్రెస్ దుందుడుకు చేష్టల్ని కేటీయార్ భలే వాడుకుంటున్నాడు..!!

March 23, 2025 by M S R

ktr

. తమ చర్యలు జనంలోకి ఎలా వెళ్తున్నాయనే స్పృహ రాజకీయ నాయకులకు ఎప్పుడూ ఉండాలి… సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో కాంగ్రెస నాయకులకు కొత్తగా వచ్చిన అధికారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవుతున్నట్టు లేదు… బీఆర్ఎస్ వంటి పార్టీని ఢీకొట్టి రాజకీయం చేయాలంటే ఓ పరిణతి, ఆచితూచి అడుగులు అవసరం… సిరిసిల్లలో ఓ టీ స్టాల్… కేటీయార్ ఫోటో ఉందనే కక్షతో మూసేయించారు… దీన్ని కేటీయార్ భలే అవకాశంగా వాడుకున్నాడు… అన్ని అనుమతులు తీసుకుని, సిరిసిల్ల నడిబొడ్డున, […]

ఇదేం ప్రజాజీవితం..? జనానికి మంచి శాస్తి జరిగిందనే కసి వ్యాఖ్యలేంటి..?

March 23, 2025 by M S R

kcr

. నిజంగానే కేసీయార్‌కు ఏదో అయ్యింది… ఏమంటున్నాడు తను..? కత్తి ఒకరికిచ్చి ఇంకెవరినో యుద్ధం చేయమంటే ఎట్లా..? అన్నా రావే రావే అని ఆయన్ని వేడుకుంటున్నారట.,. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన్రు కదా, ఏడికి రావాలె అనడుగుతున్నాడు… సంపూర్ణ బాధ్యతారాహిత్యపు వ్యాఖ్యలు… ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి రాకూడని, ఊహించని డొల్ల మాటలు అవి,., కేసీయార్‌కు ఏదో రాజకీయ పరిణతి ఉందని అనుకునేవాళ్లను కూడా షాక్‌కు గురిచేస్తుండు కేసీఆర్… అసలు తన కత్తి అనే వ్యాఖ్యలకు […]

అన్వేషి..! కొన్ని ట్రావెలాగ్ వీడియోలు చూస్తే పరమ రోత, వెగటు…!!

March 23, 2025 by M S R

anvesh

. ఒక డిజిటల్ పేపర్ అన్వేష్ గురించి ఒక పేజీ పూర్తిగా భజించి తరించిపోయింది… ఆ కథారచయిత ఎవరో గానీ ఒక్కసారి తన వీడియోలను కాస్త పరిశీలనగా చూసి ఉంటే బాగుండేది ఫాఫం… తనను బెదిరిస్తున్నారని ఏదో తాజా వీడియో రిలీజ్ చేశాడు… ఎందుకు..? తన కారణంగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి సెలబ్రిటీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి కాబట్టి… తనను టార్గెట్ చేశారట… నిజానికి సజ్జనార్ తీగ లాగితే డొంక కదులుతోంది… కానీ తను […]

జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు… ట్విస్ట్ ఇచ్చిన సుప్రీంకోర్టు… వీడియోల వెల్లడి…

March 23, 2025 by M S R

judge

. ఒక హైకోర్టు జడ్జిపై టైమ్స్ ఆఫ్ ఇండియా సాహసంతో వార్త పబ్లిష్ చేసింది… గ్రేట్… సోవాల్, హైకోర్టు జడ్జి అయితే అన్నింటికీ అతీతమా..? ఆయన నివాసంలో దొరికిన నోట్ల కట్టల సంగతిని దైర్యంగా ప్రచురించింది… హేట్సాఫ్… హైకోర్టు జడ్జిలు, సుప్రీం కోర్టు జడ్జిలు అన్నింటికీ అతీతమా..? ఈ ప్రశ్నపై తెలుగు మీడియాలో ఒక్కంటే ఒక్క ఆర్టికల్ కూడా సరైన రీతిలో రాలేదు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దమ్మున్న జర్నలిస్టుగా అనేక ప్రశ్నలు సంధించాడు… ఆ టెంపర్‌మెంట్ గ్రేట్… […]

ఆ పార్లమెంటే చెబుతోంది… చిరంజీవికి సన్మానంతో మాకు లింక్ లేదని..!!

March 23, 2025 by M S R

. ఒక చిన్న పేపర్ క్లిప్ ఆశ్చర్యాన్ని కలిగించింది… మన వాళ్లు భుజాలు చరుచుకోవడం, గొప్పలు చెప్పుకోవడం చివరకు బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ ,అంటే పార్లమెంటును కూడా ఎంబరాసింగుకు గురిచేసింది… అదీ పద్మవిభూషణ్ చిరంజీవి సన్మానానికి సంబంధించి… మొన్నామధ్య చిరంజీవిని సన్మానించి, లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చారు కదా లండన్‌లో… అదీ ఓ స్కోచ్ బాపతు అవార్డు… దాని మీద తెలుగు సైట్లు, చానెళ్లు, మీడియా ఇంగ్లిషులో, తెలుగులో పలు భాషల్లో చిరంజీవికి అద్భుత పురస్కారం, […]

వేల కోట్ల మాఫియా తరహా దందా ఇది… పెద్ద డొంక కదులుతోంది…

March 23, 2025 by M S R

betting apps

. అసలే బెట్టింగ్ యాప్స్ కేసులతో వేడివేడిగా ఉంది టాలీవుడ్ వాతావరణం… కేసులు, పోలీస్ విచారణలు… అప్పట్లో అకున్ సభర్వాల్ డ్రగ్స్ కేసుల మీద క్రియేట్ చేసిన వాతావరణాన్ని మించి ఉంది ఇప్పుడు… నడుమ వేణుస్వామి వివాదం ఒకటి జొరబడింది… వేణుస్వామి ఎవరో జర్నలిస్టుతో ఓ ప్రైవేటు సంభాషణలో ఏదో అన్నాడుట… అదెవడో చాటుగా రికార్డ్ చేశాడుట… అది టీవీల్లో, సైట్లలో, యూట్యూబ్ చానెళ్లలో ప్రసారం… నిజంగానే వేణుస్వామి ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంతలు సూసైడ్ చేసుకుంటారని […]

రేప్పొద్దున కేటీయార్, రేవంత్ చేతులు కలిపి బజార్లలో నినదిస్తారా..?!

March 22, 2025 by M S R

south india

. లోకసభ స్థానాల అశాస్త్రీయ, కుట్రపూరిత పునర్విభజన వ్యతిరేక మలి భేటీ హైదరాబాదులోనట… స్టాలినుడు చెప్పాడు… ఆ సమావేశంలో కూడా కేటీయార్, రేవంత్ పాల్గొని… మొహాలు మొహాలు చూసుకోకుండానే… ఒకరినొకరు తీవ్రంగా అసహ్యించకుంటూనే… ఉమ్మడిగా డౌన్ డౌన్ మోడీ అని నినదిస్తారు… అడ్డదిడ్డపు డీలిమిటేషన్ కేవలం బీజేపీ కుట్ర అని దక్షిణాది రాష్ట్రాల్లో ఓ భావనను బలంగా వ్యాప్తి చేస్తున్నారు కదా… జాతీయ స్థాయిలో మా విధానం ఇదీ అని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఎట్సెట్రా సోకాల్డ్ […]

… అంటే ఇక జర్నలిస్టులు అనే జీవులు కనిపించకుండా పోతారా..?!

March 22, 2025 by M S R

ai daily paper

. రిపోర్టర్లు లేరు… సబ్ ఎడిటర్లు లేరు… ప్రూఫ్ రీడర్లు లేరు… పేజీ మేకప్ ఆర్టిస్టుల్లేరు… ఫోటోగ్రాఫర్లు లేరు… ఐనా సరే, డెయిలీ పేపర్ పబ్లిషైంది… ప్రింట్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చేశాయి… నిజం… “ఇల్ ఫోగ్లియో” (Il Foglio) అనే ఇటాలియన్ పత్రిక తొలిసారిగా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఒక ఎడిషన్‌ను ప్రచురించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం 2025 మార్చి 18 నుంచి ప్రారంభమైంది, ఒక నెలపాటు కొనసాగుతుంది… […]

  • « Previous Page
  • 1
  • …
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • …
  • 116
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త ఉప రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్ మార్క్ శేషాద్రి రామానుజా చారి..?
  • ఈ గుడికి వెళ్లొచ్చిన కొన్నాళ్లకే ఇందిర హత్య… మరి మోడీ సందర్శన…?!
  • Run Away… విమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి..?
  • మైక్రోబరస్ట్..! కుండపోత కాదు, ఇది పైనుంచి కమ్మేసే ఓ సునామీ..!!
  • జీతెలుగు టీవీ సీరియల్ తీసేవాడికి చూసేవాడు పరమ లోకువ..!!
  • సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
  • 70 ఏళ్ల వయస్సులోనూ యంగ్‌గా, ఆరోగ్యంగా… భలే తల్లి..!!
  • ట్రంపు… డబ్బు కక్కుర్తి మాత్రమే… నో ఎమోషన్స్, నో మోరాలిటీ…!!
  • రీఎంట్రీ సరే గానీ… కుర్ర వేషాలకు సూటయ్యే సీన్ లేదయ్యా నవీనూ..!
  • ఈ తలనొప్పిని మీకు సమర్పించువారు…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions