సరే, ఆంధ్రజ్యోతి అంటేనే అది ఆంధ్రాజ్యోతి, తెలుగుజ్యోతి, బాబుజ్యోతి అని ఎవరైనా ఏమైనా సెటైర్లు వేయండి… కానీ కొన్నిసార్లు ఆలోచనాత్మకమైన స్టోరీలు వేస్తుంటుంది… అది జగన్ మీద లేదా తనకు పడనోళ్ల మీద కావచ్చుగాక… కానీ నిజమే రాస్తుంది… అన్నిసార్లూ కాదు, కొన్నిసార్లు… ఆ కొన్నిసార్ల వార్తల్లో ఈరోజు వచ్చిన ‘రికార్డ్ బ్రేక్’ అనే వార్త కూడా ఒకటి… ప్రజలు ఏమీ పట్టించుకోరు, వాళ్లకు ఏదో ఉచితంగా పడేస్తే చాలు, ఇక మనం ఎంత అరాచకంగా వ్యవహరించినా […]
ఎక్కడి త్రిష..? ఎక్కడి జయలలిత..? సుచిత్ర ఎక్కడికో వెళ్లిపోయింది..!!
ఈ సుచీ లీక్స్ కొంచెం తిక్క యవ్వారంలాగే ఉంది… సింగర్ సుచిత్ర తమిళ సినిమా ఇండస్ట్రీలోని అక్రమ సంబంధాలు, లోపాయికారీ వ్యవహారాల మీద గతంలో విపరీతంగా సోషల్ పోస్టులు పెట్టి గెలికేది కదా… ఈమధ్య మళ్లీ యాక్టివ్ అయిపోయింది కదా… ఇలాంటివాళ్లలో కస్తూరి, చిన్మయి, సుచిత్ర పేర్లు బాగా వినిపిస్తుంటాయి… కాకపోతే చిన్మయి కొంత బెటర్, సోషల్ ఇష్యూస్ మీద కాస్త మెచ్యూర్డ్‌గా స్పందిస్తుంది… కస్తూరి సగం వెర్రి… సుచిత్రకు పూర్తిగా సెన్సేషనల్ కంట్రవర్సీ కోరుకునే ఏదో […]
తెలుగు మ్యాగజైన్లే లేవు… ఇక ఈ రేంజ్ ప్రజెంటేషన్ ఏం ఆశించాలి..?!
టైమ్… అమెరికన్ ఫేమస్ మ్యాగజైన్… అఫ్ కోర్స్, ఇండియా మీద విపరీత ద్వేషంతో వ్యవహరిస్తుంటాయి అమెరికన్ మీడియా… సేమ్, బీబీసీలాగే..! సరే, బీబీసీ అయితే మరీ భారత వ్యతిరేకతతో చెలరేగిపోతుంటుంది… మన తెలుగు పత్రికల్లాగే ఉచ్చం నీచం ఏమీ ఉండవు… తన పొలిటికల్ లైన్‌ను బట్టి రెచ్చిపోవడమే… తాజాగా వార్తాంశం ఏమిటంటే..? అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ మీద ఓ కవర్ పేజీ వేసింది… తను ఫ్రేమ్ నుంచి బయటికి వెళ్లిపోతున్నట్టు… సింపుల్ ఫోటో… కానీ ఎన్ని […]
రాధాకృష్ణ సరిగ్గా రాశాడు… ఖజానా డబ్బుతో రామోజీ సంస్మరణ ఏమిటి..?!
‘‘ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి విమర్శ ఎదుర్కొంటున్నారు. రామోజీరావుకు అర్హత ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ ఇంట్లో వాళ్లు సంబరాలు చేసుకుంటారు. ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్ను మూసినప్పుడు ఆయన వల్ల ప్రయోజనం పొందినవాళ్లు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి […]
కేసీయార్ మంచి కథకుడు… కల్కి రేంజులో ఓ సినిమా కథ చెప్పాడు…
అందరికీ తెలిసిందే కదా… కేసీయార్ మంచి కథకుడు అని..! తను రాజకీయాల్లోకి వచ్చాడు గానీ సినిమాలకు గనుక కంట్రిబ్యూట్ చేసే పక్షంలో కల్కి రేంజ్ కథలు అందించగలడు… రాజమౌళి తండ్రి వీరకథకుడు విజయేంద్రప్రసాద్ కూడా ఎందుకూ కొరగాడు… ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకున్న కొత్తపలుకులోని అంశాలు చదువుతుంటే అలాగే అనిపిస్తుంది… ఈమధ్య ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టుకుని, కాంగ్రెస్‌లోకి వెళ్లకండి, వెళ్లకండి అని కేసీయార్ చెబుతున్న వార్తలు చదువుతున్నాం కదా… మస్తు సీక్రెట్స్ మాట్లాడుకున్నం అని మల్లారెడ్డి కూడా అన్నాడు […]
ఆలీ తెలివైనోడు… అక్కడే ఉంటే తన పరిస్థితేమిటో తెలుసుకున్నోడు…
సరైన నిర్ణయం తీసుకున్న అలీ … అలీ రాజీనామాతో ysr కాంగ్రెస్ కు ఒక ఓటు పెరిగేది లేదు … తగ్గేది లేదు … పార్టీపై ప్రభావం ఉండదు . కానీ అలీ జీవితంపై చాలా ప్రభావం ఉంటుంది … రాజీనామా చేయకపోతే తన సినిమా జీవితానికి వీలునామా రాసుకోవలసి వచ్చేది … కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నటులు, సినిమా వాళ్ళు తమకు ఇష్టం ఉన్న పార్టీలో ఉండేవారు . అంటే దాదాపు మొత్తం టీడీపీలోనే … […]
Information Obesity …అతి సమాచారం సర్వత్రా వర్జయేత్…
ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఒబేసిటీతో ఉన్నారు. దానికన్నా అతి పెద్ద సమస్య “ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ”. ప్రపంచం లో ప్రతి ఇద్దరు లో ఒకరు ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ తో బాధ పడుతున్నారు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుత ప్రపంచాన్ని పీడించే సమస్యల్లో ఇది ఒకటి. రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి అనే సింపుల్ టాపిక్ తీసుకుంటే – ఒకతను […]
నీట్ మీద దుమార ప్రచారంలో స్పీకర్ బిర్లా బిడ్డనూ లాగుతున్నారు..!!
సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది… అదేమిటంటే..? లోకసభ స్పీకర్ బీఎం బిర్లా చిన్న బిడ్డ అంజలి బిర్లా గురించి… ఆమె ఒక మోడల్ అట… హఠాత్తుగా యూపీఎస్సీ (సివిల్స్)కు హాజరైందట, దేశంలోకెల్లా అత్యంత క్లిష్టమైన, కష్టమైన ఆ పరీక్షలో ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాసైపోయి ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖలో కొలువు చేస్తోందట… ‘ఇదంతా చదివితే ఆమె ఇంటలిజెంట్ అనిపిస్తోంది కదా’… అని ముగించి… అబ్బే, ఇది నీట్ స్కామ్, పేపర్ లీకతో సంబంధం లేని […]
Madhuri Dixit … డబ్బు కోసం ఇదేం పని శ్రీమతి మాధురీ దీక్షిత్..?
సినిమా తారలు… కాస్త హార్ష్‌గా ధ్వనించినా ఒక మాట… డబ్బు కోసం ఏదైనా చేస్తారు… ఎంత దిగజారమన్నా సరే… అందరూ కాదు, కాకపోతే మెజారిటీ..! వయస్సు మీద పడినా సరే, ఇంకా ఇంకా డబ్బు కావాలి… దాని కోసం ఏదైనా చేసేయాలి… ఒకప్పటి అందాల తార మాధురీ దీక్షిత్ దీనికి మినహాయింపు ఏమీ కాదు… ఏక్ దో తీన్ చార్ పాంచ్ అంటూ గంతులేసి జనాన్ని వెర్రెక్కించిన మాధురీ దీక్షిత్ గిరాకీ తగ్గిపోయాక నేనే అనే ఓ […]
నిజంగానే ఆదానీకి ‘పవర్’ ఇచ్చేస్తారా..? ఉచిత విద్యుత్తు గల్లంతేనా..?
ఇంకేముంది..? తెలంగాణ రాష్ట్ర విద్యుత్తును ఆదానీ పరం చేయబోతున్నారు… అని నిన్నటి నుంచీ ఒకటే రచ్చ… బీఆర్ఎస్ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ ఓ ఫస్ట్ పేజీ స్టోరీ పబ్లిష్ చేసేసి అయ్యో, అమ్మో, ఇంకేమైనా ఉందా..? పంపుసెట్లకు మీటర్లు పెడతారు, ఉచిత విద్యుత్తు ఉండదు, ఇక వేల కోట్ల వ్యవస్థలపై ఆదానీ గుత్తాధిపత్యం, కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకునే ప్రమాదం, సేవలపై అదనపు భారమూ పడొచ్చు అని మొత్తుకుంది… నిజంగా ఆ ప్రమాదం ముంచుకొస్తున్నదా..? […]
వాళ్లెవరు..? ఆ అరాచక శక్తులపై రేవంత్‌రెడ్డి యాక్షన్ ఎందుకు వద్దు..?!
నిన్న రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ కొన్ని వివరాలు చెప్పాడు కదా… ఈరోజు ఆంధ్రజ్యోతిలో తప్ప వేరే పత్రికల్లో రిపోర్ట్ అయినట్టు కనిపించని కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి… సరే, రాజకీయంగా బీఆర్ఎస్ నుంచి తమ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను సమర్థించుకున్నాడు… తప్పదు… అలాంటోళ్ల మీద వెంటనే అనర్హత వేటు వేయాల్సిందేనని బీఆర్ఎస్ ఎంత గాయిగత్తర చేస్తున్నా ఆ ప్రయాసకు, ఆ డిమాండ్లకు అసలు విలువ లేదు… ఎందుకంటే..? నిజంగానే తెలంగాణలో మునుపెన్నడూ లేని […]
ఏం..? తమన్నా జీవితం సింధీ సిలబస్‌లో ఎందుకు ఉండొద్దు…?
ఒక వార్త… కర్నాటకలోని హెబ్బాళలో ఓ హైస్కూల్ ఉంది… అది సింధీల స్కూల్… ఇప్పుడది వివాదంలో ఇరుక్కుంది… ఎందుకంటే..? అది తమ విద్యార్థుల సిలబస్‌లో ఏడవ తరగతి పాఠ్యాంశాల్లో ప్రముఖ సింధీ వ్యక్తుల పేరిట రణవీర్‌సింగ్, తమన్నా భాటియా పేర్లను, వారి వివరాలను చేర్చింది… ఇదీ వివాదం… వెంటనే ఆ స్కూల్లో చదివే విద్యార్థులు ఏకంగా బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు… (అందులో సింధీలే గాకుండా ఇతర పిల్లలూ చదువుతారు)… ఏమనీ అంటే… పలు […]
రెడ్డి ఎమ్మెల్యేలతో కేసీయార్ భేటీ..! నమ్మడం లేదా..? చివరి ప్రయత్నమా..!!
కేసీయార్ తన ఫామ్ హౌజులో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో భేటీలు వేస్తున్నాడు… అరె, భయ్, జెర పార్టీని విడిచిపెట్టి పోకున్రి భయ్… మళ్లీ మనమే అధికారంలోకి వస్తం, మనం మళ్లీ ఉజ్వలంగా వెలిగిపోతం, మీ తోడు, నన్ను నమ్మున్రి అని చెబుతున్నాడు… సరే, కష్టకాలంలో పార్టీని, కేడర్‌ను కాపాడుకోవడానికి తప్పదు, తప్పులేదు… ఐతే… రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఇంకా తొక్కేకొద్దీ… ఏమవుతుంది..? బీఆర్ఎస్ నిజంగానే బలహీనపడుతుంది… దానికి ప్రధాన బలమైన […]
మేఘా కృష్ణారెడ్డి..! ఏకంగా అంబానీలు, ఆదానీలు, వేదాంతలకు పోటీగా..!!
కొన్ని సక్సెస్ స్టోరీలు అనూహ్యంగా ఉంటయ్… అసలు నమ్మలేని రీతిలో… మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రస్థానం కూడా అదే… ఏదో చిన్నా చితకా సబ్ కంట్రాక్టులు చేసుకునే సంస్థ ఈరోజు ఆదానీ, అంబానీ, వేదాంత, టాటాలతో కూడా పోటీపడుతోంది… మేఘా ఓనర్లు ఆల్రెడీ టాప్10 ధనికుల్లో చేరిపోయారు… ఉజ్వలంగా వెలిగిపోతోంది కథ… తాజాగా ఈ సంస్థ ఏకంగా ఓ అణు విద్యుత్తు ప్లాంటు నిర్మాణం కంట్రాక్టు చేజిక్కించుకుంది… న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్నాటకలోని కైగా […]
సాక్షిలో సంస్థాగత భారీ మార్పులు… మారక తప్పని పరిస్థితి ఏర్పడింది..!
సాక్షిలో ఈమధ్య కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి… హైదరాబాద్ సిటీ పాఠకుల్ని టార్గెట్ చేసుకుంది పత్రిక… అటు ఏపీలో గడ్డుకాలం తప్పదు, తెలంగాణలోనూ యాంటీ రేవంత్ లైన్- ప్రొ కేసీయార్ లైన్ ఇంకా పాఠకుల్ని మెప్పించదు… సో, మెట్రో కల్చర్, అన్ని ప్రాంతాల ప్రజలూ ఉన్న మార్కెట్ కీలకమైన హైదరాబాద్‌ను టార్గెట్ చేసుకుంది యాజమాన్యం… గుడ్, దానికి తగ్గట్టే, ఫస్ట్ నిలువు చీలిక పేజీ సిటీ ఆఫ్ బీట్, నాన్ రొటీన్ వార్తల్ని బాగా ప్లాన్ చేస్తున్నారు… అభినందనీయమైన […]
‘వార్త దగ్గరికి నేను వెళ్లినా… నా దగ్గరకే వార్త వచ్చినా… నాకే డబ్బు’
పతంజలి గోపాత్రుడు …. చాలా ఏళ్ళ క్రితం పోస్ట్ ఆఫీస్ లో మిత్రుడి కోసం ఎదురు చూస్తూ ఇండియా టుడే సాహిత్య సంచికలో పతంజలి గోపాత్రుడు చదువుతూ గట్టిగా నవ్వకుండా ఉండలేక పోయాను . భూమి బల్లపరుపుగా ఉంది, నా నమ్మకం నా ఇష్టం అని గోపాత్రుడు వాదిస్తాడు … గుండ్రంగా ఉంది అని ఇతరుల వాదన .. వివాదం కోర్టుకు వెళుతుంది .. గోపాత్రుడిపై గ్రామ పెద్ద విజయం సాధిస్తాడు .. విజయం సాధించిన గ్రామపెద్ద […]
జై పాలస్తీనా..! ఒవైసీ నినాదంతో కొత్త రగడ… తప్పొప్పులపై చర్చ..!!
ఈసారే ఈ విపరీత ధోరణి విపరీతంగా కనిపించింది… లోకసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రకరకాల నినాదాలు చేశారు సభ్యులు… రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగ ప్రతిని అందరికీ చూపిస్తూ ప్రమాణం చేసి, చివరలో జై సంవిధాన్ అన్నాడు… దాన్ని అభ్యంతరపెట్టాల్సిన అవసరం లేదు… కానీ..? ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని అక్కడ ప్రదర్శించాల్సిన అవసరమేముంది..? బీజేపీ నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ (50 ఏళ్లయిన సందర్భంగా) ని తిట్టిపోస్తోంది… స్పీకర్ కూడా తన ప్రసంగంలో నాటి ఎమర్జెన్సీ రోజుల్ని […]
ప్రొటెం స్పీకర్, స్పీకర్ ఎంపికలో… ఇరుపక్షాలదీ సంకుచిత వైఖరే…
లోకసభలో రెండు పక్షాల నుంచి నిరాశాపూర్వక ప్రవర్తనే కనిపించింది… ప్రొటెం స్పీకర్‌గా సురేష్‌ను నియమించాలని విపక్షం కోరింది… తను దళిత్, సీనియర్… కానీ మోడీ ప్రభుత్వం నో అనేసింది… ఇదేమిటయ్యా, అత్యంత సీనియర్‌ను కదా ప్రొటెం స్పీకర్‌గా నియమించాల్సింది అనడిగింది… నో, నో, సురేష్ ఎక్కువసార్లు గెలిచాడు, కానీ మధ్యలోబ్రేక్ ఉంది, వరుసగా ఏడుసార్లు గెలిచిన భర్తృహరి మహతాబ్ ఉన్నాడు అని చెప్పి హడావుడిగా రాష్ట్రపతి దగ్గర ప్రమాణం చేయించి ప్రొటెం స్పీకర్ చేసేసింది… నిజానికి ఇక్కడ […]
అసలే చిక్కుముడి… కేసీయార్ మరింత బిగుసుకునేలా చేసుకుంటున్నాడా..?
తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేసిన కేసీఆర్ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న కేసీఆర్ నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందన్న కేసీఆర్ జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కేసీఆర్ ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం …… ఇదీ తాజా వార్త… చిక్కుముడి మరింత […]
నయం… ఆంధ్రా మహిళా రెడ్డికి ఐదు పగ్గాలు అని రాయలేదు… గుడ్…
నమస్తే తెలంగాణలో ఓ ప్రధాన వార్త… అందులోనే ఓ బాక్స్ ఐటమ్… వార్త ఎలా ఉందనేది పక్కన పెడితే… ఆ ఐఏఎస్ అధికారిణి పేరును ప్రత్యేకంగా రాస్తేనే నవ్వొచ్చింది… అందులోనే ఆ పత్రిక మార్మికంగా ఏదో చెప్పాలని ప్రయత్నించింది ఫాఫం… ఇదంతా ప్రయాస దేనికి..? నేరుగానే రాయొచ్చు కదా అనిపించింది… ఆమె పేరు ఆమ్రపాలి కాట… విశాఖపట్నం జననం… (ఒంగోలు శివారులోని నరసాపురం అగ్రహారం వాళ్ల సొంతూరు)… తండ్రి ఆంధ్ర యూనివర్శిటీలో అధ్యాపకుడు… ఆయన పేరు వెంకటరెడ్డి… […]
- « Previous Page
- 1
- …
- 20
- 21
- 22
- 23
- 24
- …
- 146
- Next Page »