. ఉండవల్లి అరుణ్‌కుమార్… ఈ మాజీ ఎంపీ, నాటి సీఎం వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు… ఆయన కొడుకు జగన్‌తో పెద్ద సత్సంబంధాలు పెట్టుకోనివాడు… తెలంగాణ వ్యతిరేకి… రామోజీరావు బద్ధ విరోధి… అన్నింటికీ మించి బ్రహ్మాండమైన లా పాయింట్లు ఆలోచించగలిగే మేధావి… వ్యక్తిగత ఆరోపణలేవీ కనిపించవు… కానీ జనమంతా ఒకవైపు చూస్తుంటే, ఒకటి నమ్ముతుంటే, దానికి భిన్నంగా ఆలోచించగలడు… చూడగలడు… లోకం ఆశ్చర్యంగా చూసినా సరే… తెలంగాణ ఏర్పడి ఇన్నేళ్లయినా సరే… స్టిల్, ఈ ఏర్పాటు చట్టవిరుద్ధం అనీ, […]
రెండేళ్లలో డజను పెళ్లిళ్లు అట… ఆమె నిందితురాలా..? బాధితురాలా..?
. ఓ వార్త ఆంధ్రజ్యోతిలో చూశాను… ఒక మహిళ రెండేళ్లలో డజను పెళ్లిళ్లు చేసుకున్నదని… నిన్నటి వార్త అది… ఏపీలో అమలాపురం ప్రాంతంలో… ఆమె పేరు బేతి వీర దుర్గ నీలిమ… ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడి రెండేళ్లలో నిత్య పెళ్లికూతురుగా 12 పెళ్లిళ్లు చేసుకుందనేది వార్త సారాంశం… అంతేకాదు, పలువురు బాధితులు జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట ధర్నా చేసి, ఫిర్యాదు కూడా చేశారట… పెళ్లి కాని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ధనవంతులను టాార్గెట్ చేసుకుని… భార్యలకు […]
ఉన్నతాధికారుల పోస్టింగులపై రేవంత్ సర్కారు తెలివైన అడుగులు
. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల పోస్టింగుల విషయంలో జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరిస్తున్నాడు… ఎవరు ఏ పోస్టుకు ఫిట్టవుతారనేది, గత పాలకులతో సంబంధం లేకుండా, సొంతంగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు… అంటే..? గతంలో కేసీయార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు అనే కారణంతో, బీఆర్ఎస్ సన్నిహితులు అనే కారణంతో ఎవరినీ దూరం పెట్టడం లేదు… మరీ స్మితా సబర్వాల్ వంటి ఒకరిద్దరు కేంద్ర సర్వీసు అధికారులు మినహా… దానికీ రీజన్స్ ఉన్నాయి… కేసీయార్ పాలనలో కొన్ని రంగాల్లో కొందరు […]
నిజంగానే ఉత్తరాది రాష్ట్రాలు ఎడాపెడా పిల్లల్ని కనేస్తున్నాయా..?!
. ఈమధ్య చంద్రబాబు, స్టాలిన్ పదే పదే చెబుతున్నారు… పిల్లలను బాగా కనండి అంటూ… ఎందుకయ్యా అంటే… రాబోయే రోజుల్లో మానవ వనరులే అసలైన వనరులు అనే ప్రాధాన్యత గురించి కాదు… జనాభాను బట్టి లోకసభ సీట్ల పెంపు ఉంటుందనే పొలిటికల్ కోణంలో… మరీ చంద్రబాబు అయితే పిల్లల్లేకపోతే, ఇద్దరికన్నా తక్కువ పిల్లలుంటే స్థానిక ఎన్నికల్లో పోటీచేయనిచ్చేది లేదని కూడా అన్నట్టు ఎక్కడో చదివాను… సరే, దానికి చట్టబద్ధత విషయం పక్కన పెడితే… అసలు మనం పదే […]
జస్ప్రీత్ బుమ్రా..! ఎంతకాలంలే అన్నారు… పదేళ్లుగా అదే జోరు ప్రయాణం..!!
. ఎప్పుడూ ఓ మాట అంటూనే ఉంటారు బుమ్రా గురించి… ఎనిమిది నెలలే అన్నారు, కానీ నడుస్తూనే ఉంది కెరీర్ పదేళ్లుగా… ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు… ఎన్ని ప్రెజర్స్ ఉన్నా సరే… ప్రస్తుతం వరల్డ్ క్లాస్ బౌలర్, ఇండియా జట్టుకు కీలక సభ్యుడు తను… వర్తమాన టెస్టులో కూడా 5 వికెట్లు… ఎకానమీ కూడా జస్ట్ 3.36… నమ్మదగిన బౌలర్… సాధారణగా క్రికెట్ అంటేనే దంచుడు, అది కచ్చితంగా బ్యాటర్స్ గేమ్… మరీ ముఖ్యంగా […]
ఆశ్చర్యమే… 9 వేల కోట్ల ఓ పెద్ద టాస్క్ రేవంత్ రెడ్డి సాధించాడు…
. నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశ్చర్యపరిచింది, అభినందించేలా వ్యవహరించింది… ప్రతిపక్షాలను షాక్‌కు గురిచేసింది… విశేషమే… ఎందుకో చెప్పాలంటే..? రైతు భరోసా నిధుల్ని… పొలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా… అందరికీ… ఒకేసారి, అంటే తొమ్మిది రోజుల్లో ఏకంగా 9 వేల కోట్లను పంపిణీ చేసింది… అదీ ఎకరానికి 12 వేల చొప్పున… కేసీయార్ ప్రభుత్వంలాగా 10 వేలు కాదు… ఈ సర్కారు 12 వేలు ఎకరానికి… ఎందుకు విశేషమో చెప్పాలంటే..? బీఆర్ఎస్ హయాంలో దాదాపు నెలరోజుల పాటు, […]
బిన్ లాడెన్ – కొండ గుహ – బంకర్ బ్లస్టర్…! మళ్లీ చెప్పుకోవాలి కథ…!!
. పార్థసారథి పొట్లూరి… బిన్ లాడెన్ ఆఫ్ఘానిస్థాన్ లోని ఎడారి ప్రాంతంలో ఒక కొండ గుహలో ఉన్నాడని ఇంటెలిజెన్స్ సమాచారం రాగానే… అప్పటికప్పుడు ఆఫ్ఘానిస్తాన్ లో ఉన్న అమెరికన్ సైనిక వ్యూహకర్తలు, పెంటగాన్ లో ఉన్న వ్యూహకర్తలు లాడెన్ ని చంపెందుకు రకరకాల ప్లాన్స్ వేశారు… చివరికి అంత సమయం లేదని గ్రహించి, బంకర్ బస్టర్ బాంబుతో కొండని పేల్చేయాలని నిర్ణయించుకొని, వెంటనే అప్పటికే ఖతార్ లో ఉన్న B2 స్పిరిట్ బాంబర్ లో GBU-57 బాంబుని లోడ్ […]
పార్టీ అమానవీయత ఖచ్చితంగా తప్పే… కానీ జగన్ ప్రత్యక్ష బాధ్యుడా..?!
. ఎస్, నిజమే… ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు, పోలీసుల వివరణల ప్రకారం చూస్తే… జగన్ కారు ఢీకొని సింగయ్య అనే దళితుడు మరణిస్తే వైసీపీ శ్రేణులు నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా పక్కకు తోసిపడేసి కాన్వాయ్, అభివాదాలు, జేజేలతో వీరంగం వేయగం ఖచ్చితంగా తప్పే… వ్యక్తి పూజ అనేక దరిద్రాలకు కారణమయ్యే ధోరణి… హీరోలు, రాజకీయ నాయకులు కనిపిస్తే చాలు ఆవేశంతో ఊగిపోతారు అభిమానులు… మరీ ప్రత్యేకించి జగన్ కోసం వచ్చేవాళ్లను పట్టతరం కాదు… ఆ వీడియో చూశారు కదా… […]
పుడితే ఒక్కటి, చస్తే రెండు… అసలు ఆ మాటలో అర్థమేమిటో తెలుసా..?!
. Kandukuri Ramesh Babu ……… #కవి_సమయం #మరోసారి #వర్ధంతి … గూడ అంజన్న పాట “పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగ’ ‘పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగ… ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ ఓరి రాజిగ’… అంటూ మలిదశ ఉద్యమంలో పాటకు పౌరుషాన్ని అద్దిన గూడ అంజన్న తన పాట రహస్యాన్ని మరింత వివరంగా చెబుతున్నడు. *** ఎంత ఎదిగినా చెప్పులకు ‘గూడ’ ఎంత ముఖ్యమో అన్నట్టు గూడ అంజయ్య దగ్గరకు వెళ్లంగనే తెలంగాణకు […]
బనకచర్ల సినిమా కథలో మరో పెద్ద ట్విస్టు…! బస్తర్ టు బనకచర్ల..!!
. చంద్రబాబు బనకచర్ల ప్రణాళికలకు అడ్డంగా మరో ట్విస్టు… ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన పలు టెక్నికల్, లీగల్, పొలిటికల్ ప్రశ్నలకు, కొత్త ప్రతిపాదనలకు ఠారెత్తిపోయిన చంద్రబాబుకు ప్రస్తుతం చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి చక్రం అడ్డం వేస్తున్నాడు… ఈ ట్విస్టు పేరు మావోయిస్టులు… ఆశ్చర్యంగా ఉందా..? మోకాలికీ బట్టతలకూ లంకెలాగా ఉన్నట్టు అనిపిస్తోందా..? కానీ నిజమే… సింపుల్‌గా చెప్పాలంటే… చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 49 వేల కోట్ల ఖర్చుతో రెండు భారీ ప్రాజెక్టులను సంకల్పించింది… 1) బోధ్‌ఘాట్ ప్రాజెక్టు… 2) […]
జూన్ 20… నిజంగానే ఈ దినానికి ఇండియన్ క్రికెట్లో పవిత్రత ఉందా..?!
. దాదాపు ప్రతి మీడియా రాసింది… పవిత్రమైన జూన్ 20న సాయి సుదర్శన్ అరంగేట్రం అని… ఇక తిరుగు లేదు అని… అఫ్కోర్స్, ఈ దినానికి ఇండియన్ క్రికెట్ కోణంలో కొంత విశిష్టత ఉంది… కానీ ఏ దినానికీ ఏ పవిత్రతా ఉండదు… ఇది అందరికీ అనుకూలంగా ఉండాలనీ లేదు… ఎందుకు..? జూన్ 20… ఈ తేదీ ఇండియన్ టెస్ట్ క్రికెట్‌కు ప్రత్యేకం… 1996 జూన్ 20న లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లెజండరీ క్రికెటర్లు సౌరవ్ […]
మోడీ అనాలోచితంగా కాపాడితే తప్ప… ఫోన్ ట్యాపింగ్ కేసీయార్ మెడకు..!!
. Mohammed Rafee ……. ప్రకాశరావు చెప్పిందల్లా నిజమే అవుతుంది! – ఫోన్ వైర్ పెద్దాయనకు చుట్టుకుంటోందా? గోనె ప్రకాశరావు అంతే! భయపడటాలు లేవు! బెదిరిపోవడాలు లేనే లేవు! అంత ఖుల్లం ఖుల్లా! తెలిసింది తెలిసినట్లు, ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు! కొండొకచో అరటి పండు వలచినట్లు, బట్టలు ఉతికి తీగపై ఆరేసినట్లే! ఫోన్ ట్యాపింగ్ లో ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు! ఎన్నికల ముందు నుంచి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు! ఇది మహా […]
ఆ భీకరమైన శబ్దం విని, భయపడి, ఆ లింక్ నొక్కారో… అయిపోయారు..!!
. Alamuru Sowmya …… హెచ్చరిక: ఇవాళ ఫేస్బుక్ ఓపెన్ చెయ్యగానే… “You can’t open this page…your mobile is hacked” అని వచ్చింది. చూడగానే కంగారు పడిపోయాను. ఫేస్బుక్ యాప్ ఓపెన్ అవ్వలేదు. కేవలం ఒక తెల్ల పేజీ, మధ్యలో ఈ మాటలు. ఒక్క క్షణం అలా చూస్తు ఉండిపోయా. వెంటనే పేజ్ మారి, ఫోన్ నుంచి ఒక వింత శబ్దం రావడం మొదలైంది. మళ్లీ వైట్ పేజ్… పైన ఎర్ర అక్షరాలతో “alert…” […]
పెట్టుడు ముహూర్తాల్లో కృత్రిమ జననాలు జాతకాలను మారుస్తాయా..?!
. నిజమే, నిన్న సాక్షిలో ఏదో సెంటర్ నుంచి ఓ వార్త కనిపించింది… అదేమిటంటే..? సహజ ప్రసవం కోసం చూడకుండా గర్భిణులు మంచి ముహూర్తం చూయించుకుని, అన్ని గ్రహాలూ సరైన స్థితిలో ఉన్నప్పుడే, కడుపు కోయించుకుని మరీ పిల్లల్ని కంటున్నారు అనేది సారాంశం… ఇదొక పెద్ద దందా అయిపోయింది… ముహూర్తాలు పెట్టేవాళ్లకు డబ్బులు, సిజేరియన్లు సరిగ్గా అదే సమయంలో కానిచ్చేయడానికి డాక్టర్లకు, హాస్పిటల్స్‌కు డబ్బులు… ఈరోజుల్లో డబ్బులు కానిదేముంది..? ఆహా, మంచి నక్షత్రంలో, మంచి ఘడియాల్లో పిల్లల్ని […]
బనకచర్ల ప్లాన్ బద్దలు… చంద్రబాబు ప్రణాళికలపై రేవంత్ పాశుపతం..!!
. బనకచర్ల ప్రణాళిక బద్దలు కొట్టాడు రేవంత్‌రెడ్డి తన తాజా వ్యూహంతో… ఎందుకు? ఎలా? తెలియాలంటే కాస్త వివరంగా చదవాలి… అర్థం చేసుకోవాలి… బాబుకు కూడా ఈ కొత్త అస్త్రంతో చుక్కలు కనిపిస్తున్నాయి… ఇది ఊహించని హరీశ్ రావు మాటల్లో అంతులేని ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది… ఏవేవో మాట్లాడేస్తున్నాడు… ఏ తెలంగాణ ప్రయోజనాల సెంటిమెంటుతో ఇన్నేళ్లు రాజకీయం చేశారో, నిజానికి కేసీయారే తెలంగాణ ప్రయోజనాలకు పాతరేశాడనే నిజం బయటపడి, ఆ సెంటిమెంటే తమకు ఎదురుతిరుగుతున్న తీరు ఆ క్యాంపుకి […]
భారీ విలాసం… అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ పెళ్లి ఏర్పాట్లు అమేజింగ్…
. 500 మిలియన్ డాలర్ల విలాస నౌక.. అంగరంగ వైభవంగా జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్ పెళ్లి వేడుకలు! #రవివానరసి ప్రపంచ కుబేరులలో అగ్రగణ్యుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మరియు ఆయన ప్రియురాలు, మాజీ టీవీ యాంకర్ లారెన్ శాంచెజ్ (Lauren Sanchez) వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వివాహం కేవలం రెండు హృదయాల కలయిక మాత్రమే కాదు, అత్యంత విలాసవంతమైన, కళ్లు చెదిరే ఏర్పాట్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. […]
ఇంకొన్నాళ్లు పోతే… రూట్ – కోహ్లీ ట్రోఫీగా పేరు మారుస్తారా..?
. John Kora… పటౌడీ ట్రోఫీ పేరు మార్పు వివాదం… వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2025- 27 సైకిల్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌తో కొత్త సైకిల్ మొదలయ్యింది. ఇక భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనతో ఈ సైకిల్‌ను ప్రారంభిస్తుంది. శుక్రవారం (జూన్ 20) నుంచి లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో మొదలయ్యే తొలి టెస్టుతో భారత్, ఇంగ్లాండ్ జట్లు డబ్ల్యూటీసీ పాయింట్ల వేటను ప్రారంభించనున్నాయి. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. […]
‘‘బనకచర్ల ఏపీకి మరో కాళేశ్వరం అవుతుంది బహుపరాక్…’’
. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయాల్లో రుసరుసలు, వేడి పెరిగాయి… అది తెలంగాణకు నష్టం చేకూర్చే ప్రాజెక్టుగా తెలంగాణ సమాజం ఆందోళన వెలిబుచ్చుతుంటే… ఏపీకి కూడా ఆ ప్రాజెక్టు ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి… ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి చూస్తున్నాం కదా… కేవలం కమీషన్ల కోసం కట్టే భారీ ప్రాజెక్టులు రాష్ట్రాలకు గుదిబండలు కావడం తప్ప ఖర్చుకు తగిన ప్రయోజనం సున్నా అనే ఓ అభిప్రాయం ఏపీలోనూ వ్యాపిస్తోంది… ఈ నేపథ్యంలో ఒక ప్రకటన […]
అన్నదాతకు సంకెళ్లు… ఖచ్చితంగా ప్రభుత్వానికి మరక, మచ్చ..!!
. కొన్ని విషయాల్లో దిగువ స్థాయి అధికారులు, ప్రభుత్వ సిబ్బంది దాకా… పాలకుడి నుంచి స్పష్టమైన సందేశాలు, సంకేతాలు అందాలి… లేకపోతే ప్రభుత్వమే బదనాం అవుతుంది… ప్రత్యేకించి బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు… నో డౌట్, రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తోంది… కేసీయార్ బయటికి రాకపోయినా, ప్రజాజీవితంలో లేకపోయినా… కేటీయార్, హరీష్‌రావు ఇద్దరూ ఆ గ్యాప్ ఫిలప్ చేస్తున్నారు… కవిత పక్కకు జరిగిపోయింది… ఈ స్థితిలో రైతులకు సంకెళ్లు వేయడం అనేది ఖచ్చితంగా రేవంత్ […]
మచ్చ కడగబడలేదు సర్… ఈరోజుకూ సారీ కోరుతోంది తెలుగు మహిళ…
. “నా గురించి బాగా తెలిసిన మిత్రులు కూడా నేను జైలుకు వెళ్ళాక ఇష్టం వచ్చినట్లు రాసేసారు! ఇదేనా స్నేహం అంటే? ఆశ్చరం అనిపిస్తోంది! నా జీవిత చరమాంకం లో ఇలాంటి మచ్చ మిగిలిపోతుందేమో అనుకున్న! నాకు పునర్జన్మ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు! ఊపిరి పోయడం చాలా కష్టం. ఊపిరి తీయడం చాలా సులభం. నాకు ఊపిరి పోసి బయట పడేసిన వారిద్దరికీ కృతజ్ఞతలు. నాపై చాలామంది నమ్మకం ఉంచారు. […]
- « Previous Page
- 1
- …
- 27
- 28
- 29
- 30
- 31
- …
- 115
- Next Page »



















