వివిధ పార్టీల నుంచి కేసీయార్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లాగేసే క్రమంలో… ఎవరినిపడితే వారిని, చివరకు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన వారిని కూడా తీసేసుకుంటున్న క్రమంలో… ఒకే మాటతో తనను సమర్థించుకునేవాడు… రాజకీయ శక్తుల పునరేకీకరణ… ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, విధేయతలు, నైతికతలూ మన్నూమశానం జాన్తా నై… ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోవడమే… అఫ్కోర్స్, దేశమంతా అలాగే ఉంది… పైగా కొత్తదేమీ కాదు, ఆయారాం, గయారాం, ఇండియన్ పాలిటిక్సులో పెద్ద విశేషం కూడా ఏమీ కాదు… […]
చిన్నమ్మ కూతురు..! న్యూఢిల్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వారసురాలి ఎంట్రీ..!
ఎవరీమె… చిన్నమ్మ కూతురు ఏమిటీ అనుకుంటున్నారా..? ఈమె పేరు బన్సూరి స్వరాజ్… ఢిల్లీలో లాయర్… కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ చిన్నమ్మగా పిలవబడే సుష్మా స్వరాజ్ బిడ్డ ఈమె… అందుకే చిన్నమ్మ కూతురు… తండ్రి పేరు స్వరాజ్ కౌశల్… స్వరాజ్ పేరొందిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్, మిజోరం గవర్నర్‌గా కూడా చేశాడు… బరోడా బాంబు పేలుళ్ల కేసులో జార్జి ఫెర్నాండెజ్‌కు లాయర్ ఈయన… కేసు గెలిపించాడు… ఫస్ట్ నుంచీ పొలిటికల్ ఫ్యామిలీ… సుష్మా […]
నో కేసీయార్, నో బాబు, నో పవన్, నో రామోజీ… అబ్బే, ఇదేం టాప్100 జాబితా…
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెలువరించిన ఇండియా టాప్ పవర్ఫుల్ పర్సనాలిటీల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానం సంపాదించుకున్నాడు… ఊహించిందే… రీసెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ఏకంగా సీఎం సీటుపై కూర్చున్న తనకు పాపులారిటీ ఇండెక్సులో ప్రముఖ స్థానం లభిస్తుందని అనుకున్నదే… తనకు 39 వ ప్లేసు లభించింది… ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా ఈ లిస్టులో ఉన్నాడు… తను 56వ ప్లేసులో ఉన్నాడు… సరే, ఈ జాబితాలో దాదాపు ప్రతి ముఖ్యమంత్రీ, పాపులర్ బీజేపీ కేంద్ర […]
ఎంతటి శరద్ పవార్… ఎంపీగా బిడ్డ గెలుపు కోసం మనసు చంపుకుని…
83 ఏళ్లు… సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం… పలు దశల్లో ప్రధాని పదవికి పోటీదారు… మంచి వ్యూహకర్త… ఎన్నో ఎదురుదెబ్బలు, విజయాలు… కానీ ఈ జీవితపు తుది అంకంలో ఓ విచిత్రమైన దురవస్థను అనుభవిస్తున్నాడు… తన బిడ్డ కోసం తనను దెబ్బకొట్టిన తనవాళ్లనే దేబిరిస్తున్నాడా..? డెస్టినీ..? ఏ సోనియా గాంధీ నాయకత్వాన్ని ధిక్కరించి బయటికి వచ్చాడో అదే సోనియా కాంగ్రెస్‌తో దోస్తీ చేసి, ఏ శివసేన అయితే తనకు దీర్ఘకాలంగా ప్రత్యర్థో అదే శివసేనతో జతకట్టి, ఓ కూటమి […]
అన్నపూర్ణ వదిలేసింది… కానీ చిన్మయికి మరోరూపంలో కౌంటర్ పడింది…
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ ఫెమినిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ ఎట్సెట్రా చిన్మయి మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు… నోనో, ఆమె సీనియర్ నటి మీద ఏవేవో కించపరిచే కూతలు కూసినందుకు కాదు… దేశాన్ని తిట్టినందుకు..! అన్నపూర్ణ ఏదో రియాక్ట్ అవుతుందని అనుకున్నారు అందరూ, కానీ ఆమె లైట్ తీసుకుంది, కేసు మరో కోణం నుంచి వచ్చింది… అదీ తన కూతల్లో దేశాన్ని తిట్టిందని..! ఎక్స్పోజింగు మీద అన్నపూర్ణ చేసిన వ్యాఖ్యల మీద చిన్మయి ఓవర్ […]
జర్నలిస్టుల సమస్యలపై రేవంత్‌రెడ్డికి సంపూర్ణ అవగాహన..:: అకాడమీ చైర్మన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల అవసరాలు, వారికి అందాల్సిన సంక్షేమం గురించి పూర్తిగా అవగాహన ఉందని, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బు, సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ గా గురువారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని రెండు రోజుల క్రితం కలిసి ధన్యవాదాలు తెలిపి, రాష్ట్ర జర్నలిస్టుల సమస్యల గురించి క్షుణ్ణంగా చర్చించినట్లు […]
ఈ వార్త రాయాల్సి వచ్చినందుకు బాధ… ఓ స్టుపిడ్ రూల్ ఓ ప్రాణం మింగింది…
ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య.. అదిలాబాద్ జిల్లా: ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది. మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివ కుమార్ అనే విద్యార్థి గురువారం సాత్నాల ప్రాజెక్ట్ డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయలేక పోయాననే మనో వేదనతో చనిపోతున్నట్లు తన తండ్రికి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. […]
ఇదండీ కాళేశ్వరం రియల్ స్కానింగ్ రిపోర్ట్… తెలంగాణ గుండెలు అవిసిపోతయ్…
కాళేశ్వరం పండు మింగిండు… జనాలకు తొక్క మిగిల్చిండు…! ఇప్పుడు ఛలో మేడిగడ్డ అంటుండు…!! ************ హత్య చేసినోడికి చచ్చినోడి శవం ఎట్లుందో… అని మరుసటిరోజు చూసేదాకా నిద్రపట్టదట… అదే వాడిని పోలీసులకు పట్టిస్తదని చెబుతుంటరు… ఇప్పుడు “మనోళ్ళ” పరిస్తితి అచ్చం అట్లనే ఉన్నది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసి, మేడిగడ్డ పర్యటన అంటూ బయలు దేరిన్రు… జస్ట్ రెండు పిల్లర్లు పర్రెలిచ్చినయ్…దానికి ఇంత లొల్లి చేస్తుంరు…రిపైర్ చేయకుండా మొత్తం బ్యారేజీ కొట్టుకు పోయేలాగా కుట్ర చేస్తుంరు… […]
మనమేమైనా అంబానీకన్నా గ్రేటా..? మీ ఫంక్షన్లో ఇలా చేసి చూడండి..!
Nàgaràju Munnuru….. ముఖేశ్ అంబానీ కొడుకు వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అన్నసేవలో ముఖేశ్ అంబానీ, కాబోయే వధూవరులు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ స్వయంగా భోజనాలు వడ్డించారు. నాకు నచ్చిన విషయం ఏమిటంటే బిలియనీర్లు ఆయినా వీళ్ళు స్వయంగా అతిథులకు వడ్డించడం ఒక్కటే కాదు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం. మనం ఏం చేస్తున్నాం? సాధారణ దిగువ మధ్యతరగతి మొదలు కోటీశ్వరుల దాకా పెళ్లి రిచ్ గా, ఫంక్షన్ హాల్ గ్రాండ్ గా ఉండేలా చూసుకుంటూ, […]
ఇక వినోదరంగంలో అంబానీ గుత్తాధిపత్యం..! ఈ భారీ ఒప్పంద ఫలితం..!!
నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే… భారతీయ వినోదరంగంలో రెండు దిగ్గజాలు భీకరంగా ఢీకొనేవి… కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు, కౌరవుల పక్షంలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ప్రతి రాజ్యానికి ఏర్పడినట్టే… వినోదరంగంలోని ప్రతి ప్లేయర్ ఏదో ఒక పక్షాన్ని ఎంచుకుని విలీనం కావడమో, అనుబంధం అయిపోయవడమో జరిగి ఉండేది… రిలయెన్స్ ప్లస్ హాట్ స్టార్… సోనీ లివ్ ప్లస్ జీ5 కానీ ఏం జరిగింది..? జీ5, సోనీ లివ్ విలీనం కాస్తా అటకెక్కింది… దాదాపు రెండేళ్లుగా […]
మన ప్రతి తెలుగు జాఢ్యమూ అమెరికా దాకా పాకాల్సిందే… ఇలా…
అమెరికాలో ఉన్నాను కదా… అమెరికాలోని వార్తే ఒకటి కనిపించింది… మనవాళ్లదే.,. విషయం ఏమిటంటే..? ఉత్తర టెక్సాస్‌లో పోలీసులు కోడిపందేల రాకెట్ ఒకటి బ్రేక్ చేశారు… వేలాది డాలర్లను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశారు… ఇదీ వార్త… వివరాల్లోకి వెళ్లాలంటే… అక్కడ నవరో అనే ఓ కౌంటీ ఉంది… పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు… ఓచోట కోడిపందేలు సాగుతున్నయ్… అక్కడ ఫైటింగ్ రింగ్, బతికున్న కోళ్లు, చచ్చిపడున్న కోళ్లు, డాలర్లు, ఇతర ఆధారాలు కనిపించాయి… పోలీసులు ఏం […]
పిల్లల మీద ఏకంగా క్రిమినల్ కేసులు పెడుతుందట ఇంటర్ బోర్డు…
నిమిషం లేటయినా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదు అనే ఓ పిచ్చి నిబంధన వల్ల… అన్ని పరీక్షల్లోనూ బోలెడు మంది విద్యార్థులు, అభ్యర్థులు అవకాశాలు కోల్పోయారు… కొంత గ్రేస్ పీరియడ్ అనుమతించాలనే సోయి కూడా లేకుండా అప్పట్లో ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ, విద్యలకు సంబంధించిన ప్రతి పరీక్షలో అమలు చేస్తున్నారు… ఆ నిబంధనే వేలాది మందికి అనుకోని ఆశనిపాతంగా పరిణమిస్తుంటే… ఇప్పుడు ఇంటర్ బోర్డు అధికారులు మరో తొందరపాటు ప్రకటనకు దిగారు… అసలే విద్యార్థులపై […]
ఓ పత్రికపై పోక్సో కేసు..! బహుశా ఇదే తొలిసారి… వార్తే జుగుప్సాకరం..!
‘‘ఆరేళ్ల బాలిక మీద లైంగిక దాడి… ఫిలిం నగర్ pocso కేసు బాధితురాలి వివరాలు బయట పెట్టేలా వార్తా కథనాలు… సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘనలపై మహిళా సంఘాల ఆగ్రహం… దినపత్రిక విలేకరి, పత్రిక యాజమాన్యంతో పాటు బాధ్యులపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ పోక్సో చట్టం కింద కేసు… కేసు విచారణ చేపట్టిన ఫిలిం నగర్ పోలీసులు… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు… ఇలాంటి వారిపై పోలీసులు […]
ఎన్నికలకు ముందు సోరోస్ ఏదో పెద్ద ఎత్తుగడలోనే ఉన్నాడు..!!
(పార్థసారథి పోట్లూరి)…… ఏదో పెద్ద దానికే స్కెచ్ వేస్తున్నారు! మొదటి సారిగా భారత ప్రభుత్వం జార్జ్ సోరోస్ పేరుని బయట పెట్టింది! స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణలు చేసింది జార్జ్ సోరోస్ పేరుని ఉటంకిస్తూ! స్మృతి ఇరానీ మాటల్లో: “జార్జ్ సోరొస్ అనే వ్యక్తి ఒక ప్రకటన చేశాడు.. తన ప్రధాన టార్గెట్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అని! జార్జ్ సోరోస్ ఒక సిస్టంను సృష్టిస్తాడుట! అది మన దేశంలో మన దేశ ప్రయోజనాలను […]
కేసీయార్ ఓటమిపై కాలపురుషుడి అసంతృప్తి… తెలంగాణపై హఠాత్ పగ..!!
తెలంగాణ నాశనం అయిపోతోంది… ధ్వంసం అయిపోతోంది… ఎడారిలా మారిపోతోంది… ఇక ఎటుచూసినా నెర్రెల పొలాలు, నీళ్లింకిన ఒర్రెలు… జీవజాతులకు ముప్పు… జనం మనుగడే ప్రశ్నార్థకం… జనం వలసపోకతప్పదు… రేడియేషన్ ముప్పుతో నాగసాకి, హిరోషిమాల్లాగా మారిపోనున్న తెలంగాణ……. ఏమిటీ తిట్లు, శాపనార్థాలు అంటారా..? నమస్తే తెలంగాణ కొద్దిరోజులుగా అలాగే తిడుతోంది… ఫుల్లు ప్రస్ట్రేషన్… ఓనర్‌ను మించిన ఓటమి బాధ… పాత్రికేయం లేదు, తొక్కా లేదు… నోటికొచ్చింది రాయడమే… బహుశా కేసీయార్ కూడా వదిలేసి ఉంటాడు నిరాశలో పడిపోయి… అఫ్ […]
ఆదివాసీల మనోభావాలకు ఆంధ్రా మీడియా పాతర… సమ్మక్కపై వివక్ష…
ఆంధ్రా మీడియాకు తెలంగాణ భాష, సంస్కృతి, పండుగలు, చివరకు తిండి మీద కూడా చిన్నచూపే, వివక్షే… పదే పదే దాన్ని గురించి చెప్పుకునే పనిలేదు… కోట్లసార్లు చెప్పుకున్నదే, బాధపడిందే, తిరగబడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నదే… అలాంటి ఆంధ్రా మీడియాకు కోట్లాది ఆదివాసీ మూలవాసుల మీద ప్రేమ ఎందుకుంటుంది..? వాళ్ల మనోభావాల్ని ఎందుకు గౌరవిస్తుంది..? సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం దగ్గర నుంచీ సమ్మక్క తిరిగి వనప్రవేశం చేసేవరకు… వనం జనం అవుతుంది… అది మన కుంభమేళా… అధికారిక లెక్కల ప్రకారమే […]
నిజంగా అది ప్రమాదమేనా..? లాస్య నందిత మరణంపై రీజనబుల్ డౌట్స్..!
లాస్య నందిత… చిన్న వయస్సులోనే ఓ మహిళా ఎమ్మెల్యే ఓఆర్ఆర్ మీద జరిగిన కారు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరం… అందరినీ బాధపెట్టిన ప్రమాదం… తండ్రి సాయన్న మరణిస్తే అధికారిక అంత్యక్రియలు జరిపించలేదు కేసీయార్, కానీ ప్రస్తుత సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా సరే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం మెచ్చుకోదగిన నిర్ణయం… సరే, ఆ వివాదాన్ని కాసేపు పక్కన పెడితే… అసలు అది ప్రమాదమేనా..? నిజానికి ఆ కారు ప్రమాదానంతరం ఉన్న స్థితి చూశాక ప్రమాదమే […]
మోడీ ఫాసిస్ట్..! ఈ మాట అన్నది ఎవరో ఊహించగలరా..? కేంద్రం సీరియస్..!
‘‘బీజేపీ హిందూ జాతీయవాద భావజాలం, మతపరమైన మైనారిటీలపై హింసను ప్రయోగించడం, అసమ్మతిని అణచివేయడం వంటి కారణాల వల్ల కొందరు నిపుణులు ఫాసిస్టు విధానాలను మోదీ అమలు చేస్తున్నారని ఆరోపిస్తుంటారు…’’ …. ఈ మాట అన్నది ఎవరో తెలుసా..? సీతారాం ఏచూరి కాదు, అసదుద్దీన్ ఒవైసీ కాదు, సీపీఐ రాజా కాదు, అసలు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఆప్ కేజ్రీవాల్ కానే కాదు… ఓ యంత్రం… ఆర్టిఫిషియల్ మంత్రం నేర్చుకున్న యంత్రం… అదే గూగుల్ జెమిని… అదే […]
sammakka..! ఇదీ శక్తి ఆరాధనే… ఆదివాసీ సంస్కృతే అది… ప్రణమిల్లుదాం…
Gurram Seetaramulu…. నమ్మకం విశ్వాసం మీద నిలబడ్డ ఏ విలువ అయినా అది ఉన్నతమైనదే. మూలవాసుల విశ్వాసాల మీద నీ ఆధునిక హేతువుతో వేసే ప్రశ్నలు నిలబడవు. కోట్ల మంది తిరుగాడిన సమ్మక్క గద్దె వందల ఏళ్ళుగా ఏ హంగు ఆర్భాటం లేకుండా కనీసం గుడి, మండపం, తలుపు, తాళం లేని పరంపర అది. ఇన్నేళ్ళుగా తమ నిజదర్శనాన్ని దర్పాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ధూప దీప నైవేద్యాల గోల లేదు. పులిహోర వడ దద్దోజన చక్కర పొంగలి […]
Iam not a Malala… ఓ కశ్మీరీ లేడీ జర్నలిస్ట్ వ్యాఖ్యలు వైరల్…
‘‘నేను మలాలా యూసఫ్ జాయ్ ని కాదు. నేను నా దేశంలో స్వేచ్ఛగా మరియు సురక్షితంగా ఉన్నాను. భారత్ లో భాగమైన నా స్వస్థలం కాశ్మీర్. నేను నా మాతృభూమిని వదిలి పారిపోయి, ఆమెలాగా మీ దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదు. మలాలా యూసఫ్ జాయ్ అణచివేతకు గురైన నా దేశాన్ని, నా పురోగమిస్తున్న మాతృభూమిని కించపరచడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. టూల్ కిట్ ముఠాలు, విదేశీ మీడియా సభ్యులందరూ కశ్మీర్‌ను సందర్శించడానికి ఇష్టపడకుండా, అక్కడ అణచివేత […]
- « Previous Page
- 1
- …
- 37
- 38
- 39
- 40
- 41
- …
- 149
- Next Page »