అప్పట్లో నేనే రాసిన ఓ పోస్టు యాదికొచ్చింది… చట్టం అంటే ఏమిటి..? ధర్మం అంటే ఏమిటి..? న్యాయం అంటే ఏమిటి..? వ్యాపారంలో నష్టపోయి దిక్కుతోచకుండా ఉన్నప్పుడు నీ స్నేహితుడు ఎలాంటి ప్రామిసరీ నోటు కానీ గ్యారెంటీ కానీ లేకుండా నీకు ఎంతో కొంత అప్పు ఇచ్చాడు… దాంతో నువ్వు మళ్ళీ వ్యాపారం చేసి బాగా వృద్ధిలోకి వచ్చావు… ఈలోపు నీ స్నేహితుడు ఏదో ప్రమాదంలో మరణించాడు… సంపాదన మార్గం లేక అతడి కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డునపడింది. […]
ఒకేరోజు ఐదు లక్షలు దాటిన మొక్కులు… గుడి నిర్వహణ భేష్…
ఒక వార్త బాగా ఆకర్షించింది… కొత్త సంవత్సరం ఆగమనవేళ… పూరి జగన్నాథుడిని 5 లక్షలకు మించి భక్తులు దర్శించారు… అవును, అక్షరాలా 5 లక్షల మంది… ఏదో సోషల్ మీడియాలో వచ్చిన పిచ్చి లెక్క కాదు ఇది… అక్కడి అధికారులు, పోలీసులను కోట్ చేస్తూ టైమ్స్ వంటి పత్రికలు రాసిన అంకె అది… అబ్బురం… ఎందుకంటే..? తిరుమలను తీసుకొండి… ఎప్పుడూ వీవీఐపీల గొడవ, బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు, మరీ వీవీఐపీ వస్తే క్యూ ఆపేయడం… చూశాం […]
బీజేపీ ఆపరేషన్ ఫలిస్తుందా..? ఈమె ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తుందా..?
బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కొన్ని ఇంట్రస్టింగు వ్యాఖ్యలు చేశాడు ఈరోజు… జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేస్తాడనీ, తన భార్యకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తాడనీ వాటి సారాంశం… సర్పరాజ్ అహ్మద్ అనే జేఎంఎం ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయగానే స్పీకర్ ఆమోదించాడు… ఈ సందర్భంగా నిశికాంత్ మాట్లాడుతూ ‘‘హేమంత్ సోరెన్ రాజీనామా కూడా తథ్యం’’ అన్నాడు… అసలు ఏమిటీ కథ..? ఆయన భార్య ఎవరు..? ఆమె జార్ఖండ్ రబ్రీదేవి కాబోతున్నదా..? నిజానికి 2022 […]
ఈ వార్తలే నిజమైతే… భారత జాతికి ఖచ్చితంగా ఓ నూతన సంవత్సరం కానుకే…
ఈమధ్య కొన్నాళ్లుగా చదువుతూనే ఉన్నాం కదా… గుర్తుతెలియని వ్యక్తులు ప్రపంచానికి, ఇండియాకు శత్రువులుగా పరిణమించినవారిని ఒక్కొక్కరినే లేపేస్తున్నారు… ప్రపంచాన్ని వణికించిన పేరుమోసిన ఉగ్రవాదులు సైతం ప్రాణభయంతో వణికి చస్తున్నారు… సరే, భారత గూఢచార సంస్థ ఏజెంట్లు ఈ హత్యలు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది గానీ, అంతటి బందోబస్తు మీద తిరిగే కఠోర ఉగ్రవాదులను అంత తేలికగా, అదీ వరుసగా దొరుకుతున్నారా..? బెలూచిస్థాన్ సమరయోధులు కూడా కాదు… వాళ్లయితే గర్వంగా చెప్పుకునేవాళ్లు… అఫ్ఘనిస్తాన్‌లోని ఐఎస్ఐ వ్యతిరేక శక్తులా..? సరే, […]
బండరాయికి గాలి కోత… వార్తకు గుండె కోత… ఫెన్సింగ్‌తో అడ్డుకుంటారట…
ఈనాడులో ఒక చిన్న వార్త కనిపించింది… పెద్ద పత్రికల్లో పెద్ద పెద్ద వార్తల్లో ఏమీ ఉండదు, చాటంత కథనాలేమో బయాస్డ్… పత్రిక ఉద్దేశాలు, విధేయతలు, అవసరాలకు అనుగుణంగా వండబడుతూ ఉంటాయి… కానీ చిన్న చిన్న వార్తల్లో కొన్ని ఆసక్తికరంగా కనిపిస్తయ్, కనెక్టవుతయ్… మెయిన్ పేజీల్లో వచ్చే క్రైం స్టోరీస్, ఇతర ప్రాంతాల న్యూస్, హ్యూమన్ ఇంట్రస్టింగ్ ఎట్సెట్రా… కాకపోతే సింగిల్ కాలమ్‌లో కొట్టేస్తుంటారు… ఇస్తినమ్మ వాయినం తరహాలో… ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ కూడా చాలా చిన్నది… […]
తగ్గేదేలా..! తాటతీస్తామన్నా సరే… తాగుడు ఆపేది లేదు… బండి ఆగేదీ లేదు…
ప్రతిచోటా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేస్తాం… ఫ్లైఓవర్లు బంద్, ఓఆర్ఆర్ బంద్… పట్టుబడితే అక్కడికక్కడే యూరిన్ టెస్టు కూడా… వెహికిల్ సీజ్… 10 వేల జరిమానా… 6 నెలల జైలుశిక్ష… డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో శిక్షలు పడితే వీసాలకు ప్రాబ్లం… పాస్‌పోర్టులకు ప్రాబ్లం… జాబ్స్‌కు ప్రాబ్లం… మళ్లీ మళ్లీ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సు రద్దు……. ఇదుగో ఇలా ఎంతగా ఆంక్షలు పెట్టినా… ఎన్ని బెదిరింపులు చేసినా… అడుగడుగునా గొట్టాలు పట్టుకుని పోలీసులు ఊదించి ఊదించినా… ఏమీ ఆగలేదు… […]
అన్నా, రేవంతన్నా… నాడు నాకు ఓ హామీ ఇచ్చినవ్… యాదికి ఉందా..?
ఆమధ్య ఓ సంఘటన… తుంటి చికిత్సకు హాస్పిటల్లో చేరిన కేసీయార్‌ను పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాడు కదా… ఆ ప్లేసులో రేవంత్ ఉండి ఉంటే కేసీయార్ వెళ్లి ఉండేవాడా అనేది వేరే ప్రశ్న… కానీ తను లోపలకు వెళ్తున్న క్రమంలో ఎవరో ఓ పేషెంట్ అటెండెంట్ ‘‘అన్నా రేవంతన్నా’’ అని పిలిచింది… తను వెంటనే వెనక్కి తిరిగి, ఆమె వద్దకు వెళ్లి, ఆమె బాధ ఏమిటో కనుక్కుని, ఉపశమనం చర్యలకు ఆదేశించి వెనుతిరిగాడు… ఆ వీడియో […]
నాడు పతంజలిని ఎందుకు అరెస్టు చేశారు..? అసలేం జరిగింది…?
అసలేం జరిగింది ? పతంజలిని ఎందుకు అరెస్టు చేశారు? ‘ఉదయం’ స్టోరీ …. ఇది మరో పార్టు… సారధి : దాసరి నారాయణ రావు సంపాదకుడు : ఏబీకే ప్రసాద్.. ‘యా దట్స్ ఫైన్..’ అనుకున్నాక ఏబీకే ఉదయంలో చేరారు 1983 మధ్యలో.! అంతకు ముందు ఆంధ్రప్రభ ఎడిటర్‌గా ఏబీకే ఉన్నపుడు కవి దేవిప్రియా, కార్టూనిస్ట్ మోహన్ ఆయనతో కలిసి పని చేశారు. వీళ్లిద్దరు మహా ఘటికులని ఏబీకే నమ్మకం. వాళ్లని ఉదయంలోకి లాక్కొచ్చారు. ఏబీకే కుడి […]
ఏబీసీ పాతాళానికి తొక్కితే… కేబీసీ గగనంలో నిలిపింది… ఇంటింటి బంధువు…
టీవీ షో అంటే మనకు తెలిసింది వెగటు బూతుల జబర్దస్త్‌లు, సర్కస్ ఫీట్ల ఢీ షోలు, వెగటు పంచుల డ్రామా కంపెనీలు, కిట్టీ పార్టీల్లాంటి రియాలిటీ షోలు, సంగీత సరస్వతిని అవమానించే సింగింగ్ కంపిటీషన్లు… కాదంటే డిఫెక్ట్ పీసులను జనం మీదకు రుద్దే బిగ్‌బాస్‌లు… దీనికి పూర్తి కంట్రాస్టు కౌన్ బనేగా కరోడ్‌పతి… 23 ఏళ్లు… మరోసారి చదవండి, 23 ఏళ్లుగా అప్రతిహతంగా నడుస్తోంది ఈ షో… మధ్యమధ్య కొన్ని అవాంతరాలు ఉన్నా సరే… 15వ సీజన్ […]
చాలా అయోధ్య వార్తలొస్తున్నాయి కదా… ఓ చిన్న వార్త ఇట్టే ఆకట్టుకుంది…
ఇక వచ్చే 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగేదాకా బోలెడన్ని వార్తలు కనిపిస్తూనే ఉంటాయి… కుహనా సెక్యులరిస్టులు నెత్తీనోరూ బాదుకుంటూనే ఉంటారు… లౌకికత్వం అంటే హిందువులను వ్యతిరేకించాలనీ, ఇతర మతస్తులను అక్కున చేర్చుకోవాలనే భ్రమాత్ముల విశ్లేషణలు కూడా బోలెడు చదువుతూ ఉంటాం… కొన్ని వైపరీత్యాలు, విశేషాలు కూడా కనిపిస్తయ్… రాముడి జన్మభూమి అట, శూర్పణఖ జన్మభూమి కాదా, రావణుడి జన్మభూమి కాదా… అని ప్రేలాపనలకు దిగిన పెద్దమనిషి అయిపూజాడా లేకుండా పోయాడు… ఆయన కూతురేమో హఠాత్తుగా అయోధ్య సానుకూల […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు భలే కలలు వస్తుంటయ్… ఆంధ్రా పాలిటిక్స్‌పై కూడా…
‘‘తాజా సమాచారం ప్రకారం… వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థి కావచ్చు. అయితే, కడప ఎంపీ స్థానం నుంచి జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున షర్మిల […]
ఔటర్ టోల్ స్కాం… దోచేసుకుంటున్నారు… ఈ సీఎంకు గుర్తుందో లేదో…
సాఫీగా, సజావుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సాగిపోతున్న దశలో… టోల్ చార్జీలపై కూడా ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా వినిపించని దశలో… హఠాత్తుగా కేసీయార్ ఓఆర్ఆర్ మొత్తాన్ని 30 ఏళ్ల లీజుకు ఇచ్చిపారేశాడు… దాని ఖరీదు 7380 కోట్లు… అదేదో ఐఆర్భీ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థకు కట్టబెట్టేశారు… ఇక మొదలైంది దారుణమైన బాదుడు… నిజానికి ఓ ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇవ్వాలి..? హెచ్ఎండీఏకు చేతకాదా..? ఈ దుందుడుకు చర్యకు కేసీయార్ ప్రభుత్వం ఎందుకు […]
అయోధ్య రాముడు ప్రపంచ దేవుడు… ఏచూరీ, ఇది ఫరూక్ అబ్దుల్లా మాట…
‘‘అయోధ్యలో రామాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది… అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోరుకున్న ప్రజలకు, గుడి నిర్మాణానికి ప్రయత్నించిన వారికి నా అభినందనలు…. దేశంలో వర్గాల నడుమ సోదరభావం తగ్గిపోతోంది… అది పునరుద్ధరించాల్సిన అవసరం కనిపిస్తోంది… రాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరి దేవుడు… అదే నేను ఈ దేశ ప్రజలందరికీ చెప్పాలని అనుకుంటున్నది… అందరికీ దేవుడని పుస్తకాల్లో రాసి ఉన్నదే నేను చెబుతున్నాను… రాముడు ప్రజలందరి నడుమ సోదరభావమే కాదు, ఐక్యత, ప్రేమ, పరస్పర […]
ఆమె సీఎం రేవంత్‌రెడ్డిని ఏం కోరింది..? తన కోసం… ఆ శాఖ కోసం…
గుడ్… తెలంగాణ ఉద్యమ సమయంలో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉమ్మడి పాలనలో అనేక అవమానాలకు గురై, ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నళిని దోమకొండ గురించి ఈమధ్య అందరమూ చదువుతున్నాం, ఆమె వర్తమానం ఏమిటో కూడా తెలుసుకున్నాం… కేసీయార్ శకంలో ఆమె అడ్రస్ లేదు, ఆమెలో నెలకొన్న వైరాగ్యం ఆమెను ఆధ్యాత్మిక మార్గం పట్టించింది… ఆమెకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నాడు… కానీ ఆమె వద్దంది… మళ్లీ ఆ పోలీస్ లాఠీ […]
నిజంగా మనం ఓ సమాజంగా బతుకుతున్నామా..? ఈ విషాదం ఏం చెబుతోంది..?!
ముందుగా ఒక విభ్రాంతికర నేర వార్త చదవండి… ‘‘కర్నాటకలోని చిత్రదుర్గలో గురువారం రాత్రి పోలీసులు ఒక ఇంటి నుంచి అయిదు మృతదేహాలను కనుగొన్నారు… అవి దాదాపు అస్థిపంజరాల్లాగా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి… వాళ్లందరూ నాలుగేళ్ల క్రితమే మరణించి ఉంటారని భావిస్తున్నారు… మృతదేహాలు కనిపిస్తున్న స్థితిని బట్టి అది సామూహిక ఆత్మహత్య కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు… దాదాపు అయిదేళ్లుగా ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో కూడా ఇరుగుపొరుగు వారికి తెలియదు… అనుకోకుండా ఈమధ్య ఓ ఆగంతకుడు ఎవరో […]
అసలు ‘ఉదయం’ అనే ఆ కొత్త అగ్గి రాజేసిందే ఆ ఈనాడు రామోజీరావు…
Taadi Prakash……….. తెలుగు జర్నలిజంలో వికసించిన విద్యుత్తేజం.! ‘ఉదయం’ వచ్చి నేటికీ 40 ఏళ్లు ….. 1984 – డిసెంబర్ 29 … అదొక ప్రత్యేకమైన రోజు.. కొన్ని వందలమంది జర్నలిస్టులకు `రెడ్‌లెటర్‌డే! ‘ఉదయం’ అనే పేరుతో ఒక దినపత్రిక ప్రారంభం అయిన రోజు. నేటికి నలభై ఏళ్లు.! కొద్ది మందిని మినహాయిస్తే ఆ ఏడాది మొదటినించీ మేమంతా వేడి టీలు తాగి, సిగరెట్లు కాల్చీ, సాయంత్రాలు మందు తాగి, వేడివేడి చర్చలు జరపడం వల్లనేమో మరి, […]
అదుగో ద్వారక..! జలాంతర్భాగానికి వెళ్దాం సరే… ఇంతకీ అక్కడ ఏముంది..?
దేవీపుత్రుడు అనే పాత తెలుగు సినిమా గుర్తుందా..? వెంకటేశ్, సౌందర్య, అంజలా జవేరి నటించారు… అందులో ద్వారక ప్రస్తావన, దానికి లింకున్న కథ, కొన్ని సముద్ర అంతర్భాగ సీన్లు ఉంటాయి… సరే, ఆ కథ వేరు, కథనం వేరు… కానీ సినిమాలో ప్రధాన పాయింట్ ద్వారక… అదే ఆకర్షణ… ఇప్పుడే కాదు, ఏళ్లుగా మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రిక సాహిత్యాల్లో ద్వారక ఓ మిస్టరీ నగరం… నాడు శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం… మన పురాణాలు ఏం చెబుతున్నాయి..? […]
‘కంఠశోష’ల్ మీడియా… 2, 3 ఏళ్లలో సగం మంది దూరమవుతారట…
రీచ్ హఠాత్తుగా ఘోరంగా పడిపోతుంది… డబ్బులు కట్టు, రీచ్ పెంచుకో అంటాడు వాడు… పేరుకు 2 లక్షల ఫాలోయర్లు, కానీ ఎంత మంచి పోస్టు పెట్టినా నాలుగయిదు వేల రీచ్ ఉండదు… అంతేకాదు… ఒకప్పుడు ఉన్న వాళ్లలో మెజారిటీ ఇప్పుడు కనిపించడం లేదు… చాలామంది దూరమైపోయారు, లేదా నామ్కేవాస్తే ఖాతాలు మెయింటెయిన్ చేస్తున్నారు… వాళ్ల ప్లేసులో గలీజు గాళ్లు, ట్రోలర్లు, రాజకీయ పార్టీల వీర ఫ్యాన్స్, నాయకుల అనుచరులు, ఫేక్ ఖాతాలు… దీనికితోడు కంప్యూటరే లైకులు కొట్టి, […]
కేసీయార్‌కు భారీ షాక్… ఆ బొగ్గు గనుల్లో ‘పతార’ భగ్గున మండి బూడిదైంది…
అబ్బే, పోటీ చేయలేం, చేయబోం… నో, నో, బరిలో ఉంటాం… సింగరేణి (కాలేరు) కార్మికుల్లో బీఆర్ఎస్ నేత అంటే ఆమే… పోటీపై కవిత ఇదీ తడబాటు, తొట్రుపాటు… సింగరేణి కార్మికుల్లో తమ పార్టీ అనుబంధ సంఘం బొగ్గు గని కార్మికసంఘం దుస్థితి ఏమిటో ఆమెకు ముందే తెలుసు… పార్టీ మీద జనంలో విపరీతమైన వ్యతిరేకత కూడా తెలుసు… సో, ఫలితం కూడా తెలుసు… అందుకే పోటీలో ఉండటం లేదని ప్రకటన… విచిత్రంగా… ఇదేం ప్రజాస్వామిక స్పూర్తి..? తెల్లారిలేస్తే […]
యాడ్స్ ఆపేయడమే కాదు… ఇన్నేళ్ల వందల కోట్ల యాడ్స్ స్కాం తవ్వాలి…
నిన్న సోషల్ మీడియాలో ఒకటే చెణుకులు… ‘మంచిగైంది’ అన్నట్టు నవ్వులు… రేవంత్ ప్రెస్మీట్లో జర్నలిస్టులు స్వేచ్ఛగా ప్రశ్నలు అడిగారు, తను జవాబులు చెప్పాడు… గతంలో కేసీయార్ ప్రెస్మీట్లు తెలుసు కదా, పరోక్షంగా బెదిరింపులు, వెక్కిరింపులు, ఎకసక్కేలు… ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని కూడా మరిచిపోయి వ్యవహరించేవాడు… సీఎం బీట్ చూసే రిపోర్టర్లు స్వేచ్ఛ లభించినట్టు ఫీలవుతున్నారు… సచివాలయంలోకి ప్రవేశమే లేని దురవస్థలో ఏకంగా సీఎం మీడియా మీట్ ఏ ఆంక్షలు లేని వాతావరణంలో… గుడ్… రేవంత్ రెడ్డి ఈ […]
- « Previous Page
- 1
- …
- 41
- 42
- 43
- 44
- 45
- …
- 146
- Next Page »