‘‘తాజా సమాచారం ప్రకారం… వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థి కావచ్చు. అయితే, కడప ఎంపీ స్థానం నుంచి జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున షర్మిల […]
ఔటర్ టోల్ స్కాం… దోచేసుకుంటున్నారు… ఈ సీఎంకు గుర్తుందో లేదో…
సాఫీగా, సజావుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సాగిపోతున్న దశలో… టోల్ చార్జీలపై కూడా ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా వినిపించని దశలో… హఠాత్తుగా కేసీయార్ ఓఆర్ఆర్ మొత్తాన్ని 30 ఏళ్ల లీజుకు ఇచ్చిపారేశాడు… దాని ఖరీదు 7380 కోట్లు… అదేదో ఐఆర్భీ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థకు కట్టబెట్టేశారు… ఇక మొదలైంది దారుణమైన బాదుడు… నిజానికి ఓ ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇవ్వాలి..? హెచ్ఎండీఏకు చేతకాదా..? ఈ దుందుడుకు చర్యకు కేసీయార్ ప్రభుత్వం ఎందుకు […]
అయోధ్య రాముడు ప్రపంచ దేవుడు… ఏచూరీ, ఇది ఫరూక్ అబ్దుల్లా మాట…
‘‘అయోధ్యలో రామాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది… అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోరుకున్న ప్రజలకు, గుడి నిర్మాణానికి ప్రయత్నించిన వారికి నా అభినందనలు…. దేశంలో వర్గాల నడుమ సోదరభావం తగ్గిపోతోంది… అది పునరుద్ధరించాల్సిన అవసరం కనిపిస్తోంది… రాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరి దేవుడు… అదే నేను ఈ దేశ ప్రజలందరికీ చెప్పాలని అనుకుంటున్నది… అందరికీ దేవుడని పుస్తకాల్లో రాసి ఉన్నదే నేను చెబుతున్నాను… రాముడు ప్రజలందరి నడుమ సోదరభావమే కాదు, ఐక్యత, ప్రేమ, పరస్పర […]
ఆమె సీఎం రేవంత్‌రెడ్డిని ఏం కోరింది..? తన కోసం… ఆ శాఖ కోసం…
గుడ్… తెలంగాణ ఉద్యమ సమయంలో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉమ్మడి పాలనలో అనేక అవమానాలకు గురై, ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నళిని దోమకొండ గురించి ఈమధ్య అందరమూ చదువుతున్నాం, ఆమె వర్తమానం ఏమిటో కూడా తెలుసుకున్నాం… కేసీయార్ శకంలో ఆమె అడ్రస్ లేదు, ఆమెలో నెలకొన్న వైరాగ్యం ఆమెను ఆధ్యాత్మిక మార్గం పట్టించింది… ఆమెకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నాడు… కానీ ఆమె వద్దంది… మళ్లీ ఆ పోలీస్ లాఠీ […]
నిజంగా మనం ఓ సమాజంగా బతుకుతున్నామా..? ఈ విషాదం ఏం చెబుతోంది..?!
ముందుగా ఒక విభ్రాంతికర నేర వార్త చదవండి… ‘‘కర్నాటకలోని చిత్రదుర్గలో గురువారం రాత్రి పోలీసులు ఒక ఇంటి నుంచి అయిదు మృతదేహాలను కనుగొన్నారు… అవి దాదాపు అస్థిపంజరాల్లాగా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి… వాళ్లందరూ నాలుగేళ్ల క్రితమే మరణించి ఉంటారని భావిస్తున్నారు… మృతదేహాలు కనిపిస్తున్న స్థితిని బట్టి అది సామూహిక ఆత్మహత్య కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు… దాదాపు అయిదేళ్లుగా ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో కూడా ఇరుగుపొరుగు వారికి తెలియదు… అనుకోకుండా ఈమధ్య ఓ ఆగంతకుడు ఎవరో […]
అసలు ‘ఉదయం’ అనే ఆ కొత్త అగ్గి రాజేసిందే ఆ ఈనాడు రామోజీరావు…
Taadi Prakash……….. తెలుగు జర్నలిజంలో వికసించిన విద్యుత్తేజం.! ‘ఉదయం’ వచ్చి నేటికీ 40 ఏళ్లు ….. 1984 – డిసెంబర్ 29 … అదొక ప్రత్యేకమైన రోజు.. కొన్ని వందలమంది జర్నలిస్టులకు `రెడ్‌లెటర్‌డే! ‘ఉదయం’ అనే పేరుతో ఒక దినపత్రిక ప్రారంభం అయిన రోజు. నేటికి నలభై ఏళ్లు.! కొద్ది మందిని మినహాయిస్తే ఆ ఏడాది మొదటినించీ మేమంతా వేడి టీలు తాగి, సిగరెట్లు కాల్చీ, సాయంత్రాలు మందు తాగి, వేడివేడి చర్చలు జరపడం వల్లనేమో మరి, […]
అదుగో ద్వారక..! జలాంతర్భాగానికి వెళ్దాం సరే… ఇంతకీ అక్కడ ఏముంది..?
దేవీపుత్రుడు అనే పాత తెలుగు సినిమా గుర్తుందా..? వెంకటేశ్, సౌందర్య, అంజలా జవేరి నటించారు… అందులో ద్వారక ప్రస్తావన, దానికి లింకున్న కథ, కొన్ని సముద్ర అంతర్భాగ సీన్లు ఉంటాయి… సరే, ఆ కథ వేరు, కథనం వేరు… కానీ సినిమాలో ప్రధాన పాయింట్ ద్వారక… అదే ఆకర్షణ… ఇప్పుడే కాదు, ఏళ్లుగా మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రిక సాహిత్యాల్లో ద్వారక ఓ మిస్టరీ నగరం… నాడు శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం… మన పురాణాలు ఏం చెబుతున్నాయి..? […]
‘కంఠశోష’ల్ మీడియా… 2, 3 ఏళ్లలో సగం మంది దూరమవుతారట…
రీచ్ హఠాత్తుగా ఘోరంగా పడిపోతుంది… డబ్బులు కట్టు, రీచ్ పెంచుకో అంటాడు వాడు… పేరుకు 2 లక్షల ఫాలోయర్లు, కానీ ఎంత మంచి పోస్టు పెట్టినా నాలుగయిదు వేల రీచ్ ఉండదు… అంతేకాదు… ఒకప్పుడు ఉన్న వాళ్లలో మెజారిటీ ఇప్పుడు కనిపించడం లేదు… చాలామంది దూరమైపోయారు, లేదా నామ్కేవాస్తే ఖాతాలు మెయింటెయిన్ చేస్తున్నారు… వాళ్ల ప్లేసులో గలీజు గాళ్లు, ట్రోలర్లు, రాజకీయ పార్టీల వీర ఫ్యాన్స్, నాయకుల అనుచరులు, ఫేక్ ఖాతాలు… దీనికితోడు కంప్యూటరే లైకులు కొట్టి, […]
కేసీయార్‌కు భారీ షాక్… ఆ బొగ్గు గనుల్లో ‘పతార’ భగ్గున మండి బూడిదైంది…
అబ్బే, పోటీ చేయలేం, చేయబోం… నో, నో, బరిలో ఉంటాం… సింగరేణి (కాలేరు) కార్మికుల్లో బీఆర్ఎస్ నేత అంటే ఆమే… పోటీపై కవిత ఇదీ తడబాటు, తొట్రుపాటు… సింగరేణి కార్మికుల్లో తమ పార్టీ అనుబంధ సంఘం బొగ్గు గని కార్మికసంఘం దుస్థితి ఏమిటో ఆమెకు ముందే తెలుసు… పార్టీ మీద జనంలో విపరీతమైన వ్యతిరేకత కూడా తెలుసు… సో, ఫలితం కూడా తెలుసు… అందుకే పోటీలో ఉండటం లేదని ప్రకటన… విచిత్రంగా… ఇదేం ప్రజాస్వామిక స్పూర్తి..? తెల్లారిలేస్తే […]
యాడ్స్ ఆపేయడమే కాదు… ఇన్నేళ్ల వందల కోట్ల యాడ్స్ స్కాం తవ్వాలి…
నిన్న సోషల్ మీడియాలో ఒకటే చెణుకులు… ‘మంచిగైంది’ అన్నట్టు నవ్వులు… రేవంత్ ప్రెస్మీట్లో జర్నలిస్టులు స్వేచ్ఛగా ప్రశ్నలు అడిగారు, తను జవాబులు చెప్పాడు… గతంలో కేసీయార్ ప్రెస్మీట్లు తెలుసు కదా, పరోక్షంగా బెదిరింపులు, వెక్కిరింపులు, ఎకసక్కేలు… ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని కూడా మరిచిపోయి వ్యవహరించేవాడు… సీఎం బీట్ చూసే రిపోర్టర్లు స్వేచ్ఛ లభించినట్టు ఫీలవుతున్నారు… సచివాలయంలోకి ప్రవేశమే లేని దురవస్థలో ఏకంగా సీఎం మీడియా మీట్ ఏ ఆంక్షలు లేని వాతావరణంలో… గుడ్… రేవంత్ రెడ్డి ఈ […]
ఓ పాజిటివ్ మర్యాదపూర్వక భేటికి కూడా వక్రబాష్యాలు, శోకగీతాలు…
కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు… తోడుగా ఉపముఖ్యమంత్రి… కొలువు దీరిన కొత్త మంత్రివర్గం… ఇక్కడ ఏ పార్టీ అనేది పక్కన బెడితే… కేంద్రం- రాష్ట్రం అనే కోణంలో చూడాలి కొన్ని భేటీలను..! తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనిదే… తెలంగాణ ప్రజలకు కూడా మోడీ ప్రధానమంత్రే… ఈ సోయి లోపించింది నమస్తే తెలంగాణకు… ఇదుగో ఇలాంటి రాసీ రాసీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను పెంచింది… ఇంకా మారడం లేదు… ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి భేటీకి వక్రబాష్యాలు దేనికి..? ఏదో […]
కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలు… నిజస్పూర్తికి విరుద్ధంగా ప్రస్తుత కార్యాచరణ…
ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డుతో లంకె…. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తీసుకురాకపోగా, అపఖ్యాతినీ, ప్రజల్లో ఆగ్రహాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నయ్… ఎప్పుడెప్పుడు మీద పడదామా అని మొదటి రోజు నుంచే కాచుక్కూర్చున్న బీఆర్ఎస్కు చేజేతులా అవకాశాల్ని ఇస్తాయ్… ఆ సిక్స్ గ్యారంటీల ట్రూస్పిరిట్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది… నాలుగు రోజులు ఆలస్యమైనా సరే పకడ్బందీ ఆచరణకు పూనుకుంటేనే బీఆర్ఎస్కు మళ్లీ ఏ స్కోపూ లేకుండా ఉంటుంది… నిజానికి రేషన్ కార్డు ప్రస్తుతం చౌక బియ్యానికి మాత్రమే […]
సీటుకు నాలుగు శాంపిళ్లు… 90 కోట్ల మంది అభిప్రాయాన్ని చెప్పాయా..?!
సరే, ఏబీపీ-సీవోటర్ సర్వే చేసింది… ఎగ్జిట్ పోల్సే ఫ్లాపవుతున్నయ్, ఒక ఒపీనియన్ పోల్స్ నమ్మేదెలా అంటారా..? నిజమే… జస్ట్, ఒక మూడ్ చెప్పగలవేమో గానీ, అది సరైన శాస్త్రీయ ఫలితాన్ని సూచిస్తుందని ఎవరూ చెప్పలేరు… మరీ ప్రత్యేకంగా ఈ సంస్థ సాగించిన సర్వే పూర్తిగా నమ్మబుల్ కాదు… బీజేపీ కూటమికి 295 నుంచి 335 సీట్లు… అంటే మినిమమ్ మ్యాగ్జిమమ్ నడుమ ఏకంగా 40 సీట్ల తేడా… ఇండి కూటమికి 165 నుంచి 205… సేమ్ లివరేజ్… […]
బిగ్‌బాస్‌పై నజర్… బట్, పోలీసులు తప్పులో కాలేశారా..? ఎందుకంటే..?
ఎస్… పల్లవి ప్రశాంత్ అనబడే ఓ కేరక్టర్ మూర్ఖత్వం, ఓవరాక్షన్ ప్లస్ తనకు మద్దతుగా నిలిచిన శివాజీ, యావర్, భోలే వంటి సపోర్టింగ్ కేరక్టర్ల వల్ల బిగ్‌బాస్ ఓ శాంతిభద్రతల అంశంగా కనిపిస్తోంది ఇప్పుడు… ఇప్పటికే అనేక విమర్శలు వినిపించే ఈ టీవీషో మీద ఇప్పుడు మరింత నెగెటివిటీ పెరిగింది… ఎవరెవరినో తీసుకొచ్చి కృత్రిమ కోరలు, కొమ్ములు తొడిగి సమాజం మీదకు వదులుతున్నారనేది తాజా విమర్శ… నిజానికి ఇది ఒక టీవీ షో… అనేకానేక టీవీషోల్లాగే ఇదీ […]
ఆ ముగ్గురూ ఇక్కడి నుంచే పోటీ చేస్తే..? మరో కామారెడ్డి, మరో గజ్వెల్…!!
మొన్న కామారెడ్డిలో ఏం జరిగింది..? ఇద్దరు సీఎం అభ్యర్థులు తలపడ్డారు… గజ్వెల్లో ఏం జరిగింది..? ఇద్దరు సీఎం అభ్యర్థులు తలపడ్డారు… ఒక సీఎం అభ్యర్థి కేసీయార్ ఒకచోట మాత్రమే గెలిచాడు, కానీ సీఎం కాలేకపోయాడు… ఒక సీఎం అభ్యర్థి గెలవకపోయినా సరే సీఎం అయిపోయాడు… కానీ భలే పోటీ జరిగింది… పెద్ద నాయకులు కదా, చాలా చాలా ప్రాధాన్యాంశాలు చర్చకు వచ్చాయి, గుడ్… ఇక లోకసభ పోటీలకు వద్దాం… మొదట సోనియాను తెలంగాణలో పోటీచేయాలని కోరుతూ ఓ […]
అసెంబ్లీకి వోటర్లు వద్దన్నారు… ఏమో, పార్లమెంటుకు పంపిస్తారేమో…
ఓసోస్… మమ్మల్ని అసెంబ్లీకి వద్దన్నారు… పార్లమెంటుకే వెళ్లమంటారు… గత ఎన్నికల్లో చూడలేదా అంటున్నారుట కొందరు నాయకులు… నిజమే, అంబర్‌పేటలో ఓడిపోతే ఒక కిషనుడు సికింద్రాబాదులో గెలిచి ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయాడు… కరీంనగర్లో ఓడిపోతేనేం, అక్కడే ఎంపీగా గెలిచాడు బండి సంజయుడు… అంతెందుకు..? మన ముఖ్యమంత్రి కొడంగల్‌లో ఓడిపోతేనేం, మల్కాజిగిరి నాదే అన్నాడు, గెలిచాడు… సో, అసెంబ్లీ ఎన్నికల్లో వద్దు అన్నారంటే వోటర్లు పార్లమెంటుకు పంపించవచ్చు… ఇప్పుడిక బీజేపీలో నలుగురైదుగురు ఎంపీ సీట్లలో పోటీకి రెడీ అట… […]
బీజేపీ ‘‘మిషన్ 400 ప్లస్’’ సాధ్యమేనా..? మోడీ ఒంటి చేత్తో ఆ రికార్డు ఛేదిస్తాడా..?!
బీజేపీ ‘మిషన్ 400 ప్లస్’ అనే శీర్షికతో ఓ న్యూస్ స్టోరీ కనిపించింది… తెలంగాణలో 10 ఎంపీ సీట్లపై బీజేపీ కాన్సంట్రేషన్ అని మరో వార్త… 400 సీట్లు… అదొక అబ్బురమైన సంఖ్య… నిజంగా ఆ సంఖ్యను సాధించగలదా..? పదేళ్ల క్రితం వరకు బీజేపీకి సొంత మెజారిటీ వస్తుందని అనుకోవడమే, నమ్మడమే ఓ గగనం… ఈ సంకీర్ణ, ప్రాంతీయ పార్టీల శకంలో ఒక జాతీయ పార్టీ సొంత మెజారటీ సాధించడం అసాధ్యమని తలలుపండిన ఢిల్లీ పాత్రికేయ, రాజకీయ […]
ఇది సింగరేణి కార్మికుల స్వేదపత్రం… పదేళ్ల పాలనలో ‘కాలేరు’ కథ…
విను తెలంగాణ – తెల్లబోయిన సింగరేణి’ : పదేళ్ళ పరిపాలనలో ‘కాలేరు’ కథ పెద్దదే! ఇంకా మూడు రోజుల్లో ఎన్నికలు. ఏ శ్వేత పత్రామూ అక్కరలేదు. అక్కడ క్షేత్ర పర్యటనలో వెలుగు చూసిన ఈ చీకటి కోణాలను చదివితే రాష్ట్ర ఏర్పాటు వల్ల లబ్దిపొందింది ఎవరో తేట తెల్లం అవుతుంది. ఎవరిది స్వేదమో, మరెవరిదీ దోపిడో విస్పష్టంగా బోధపడుతుంది. పదేళ్ళలో మరింత నల్లబారి అవిసిపోయిన కార్మికుల స్థితీ గతీ సారాంశంలో ఇక్కడ చదవండి. నిన్నటిదాకా అబద్దాలు వినడానికి అలవాటు […]
పీకేకు ఇప్పుడంత సీన్ లేదు… మరి చంద్రబాబు పీకే తోక ఎందుకు పట్టుకున్నట్టు..?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశాడు… తను టీడీపీ కోసం పనిచేస్తాడు… ఇవీ నేటి వార్తల సారాంశం… నిజానికి చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ నడుమ ఏ చర్చలు జరిగాయో ఎవరికీ తెలియదు… ఫలానా అంశం చర్చించి ఉంటారని ఊహించడమే… నిజానికి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అంత పాపులర్ వ్యూహకర్త ఏమీ కాదు… ఆశ్చర్యంగా ఉందా.,,? ఇదే నిజం… ప్రస్తుతం సక్సెస్ఫుల్ వ్యూహకర్త సునీల్ కనుగోలు… కర్నాటకలో తను అనుసరించిన స్ట్రాటజీలు సక్సెసయ్యాక తెలంగాణ బాధ్యతలు కూడా […]
పూరి ఆలయ మహాప్రసాదం..! ఈ యూట్యూబర్‌పై బీజేపీ రుసరుసలు…
అధికారంలో ఉన్న పార్టీ ఎక్కడ దొరుకుతుందా అని ప్రతిపక్ష పార్టీ చూస్తూ ఉంటుంది… సీరియస్ విషయం ఏదీ దొరక్కపోతే ఏదో ఓ చిన్న విషయాన్నే భూతద్దంలో పెట్టి విమర్శలకు దిగుతుంది… మరి ఏదో ఓ పని ఉండాలి కదా… ప్రత్యేకించి బీజేపీ అయితే మత సంబంధ అంశం ఏం దొరుకుతుందా అని చూస్తుంటుంది… ఒడిశాలో కూడా అంతే… నవీన్ పట్నాయక్ మీద ఆరోపణలు, విమర్శలకు పెద్దగా పాయింట్లు దొరకవు… ఎంత ప్రయత్నించినా తనను బీట్ చేయలేకపోతోంది ఆ […]
- « Previous Page
- 1
- …
- 45
- 46
- 47
- 48
- 49
- …
- 149
- Next Page »