మొన్నొక వార్త బాగా చక్కర్లు కొట్టింది… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్టుగా మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్ రానున్నాడు అనేది ఆ వార్త సారాంశం… త్వరలోనే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడనీ, 40 మందితో ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నాడట… ఆయన ఎవరు..? పుట్టుక రీత్యా తమిళుడు… కానీ కర్నాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి… అతని తండ్రి పి. షణ్ముగం రిటైర్డ్ జిల్లా జడ్జి, […]
ఫాఫం నమస్తే తెలంగాణ… చివరకు ఇలా దిగజారి… ఎక్కడో పాతాళ పాత్రికేయం…
కాసేపు ఈనాడును పక్కన పెడదాం… కేసీయార్ కోసం నమస్తే తెలంగాణ పత్రిక (పాఠకులు క్షమించాలి, దాన్ని పత్రిక అని సంబోధించినందుకు…), జగన్ కోసం సాక్షి, చంద్రబాబు కోసం ఆంధ్రజ్యోతి అవిశ్రాంతంగా పోతరాజుల్లాగా కొరడాలతో చెళ్లుచెళ్లుమని బజారులో నిలబడి, ఆయా పార్టీల రంగులు రుద్దుకుని, మరీ కొట్టుకుంటాయి కదా… 26 పార్టీలతో ఓ బలమైన బీజేపీ వ్యతిరేక కూటమి ఒకటి తయారైంది… మీటింగులు పెడుతోంది… INDIA అని పేరు కూడా పెట్టుకున్నారు… కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి రచిస్తున్నారు… […]
మరణంలోని అక్షరాల్ని పేరుగా పెట్టుకున్నవాడు… తనకు మరణమా..?
Prasen Bellamkonda…… మరణంలోని అక్షరాలను పేరులోనే పెట్టుకుని దర్జాగా బతికిన మనిషి ఆయనకు మరణమా…. నమ్మకం కుదరక పోవచ్చు కానీ నేను కొన్ని వందల సార్లు చదివిన పుస్తకం శ్రీ రమణ పేరడీలు. నిజం… కొన్ని వందల సార్లు. 80 వ దశకం మొదట్లో అప్పుడప్పుడే తెలుగులో సీరియస్ రచయితలు, కవులనందరినీ చదివిన హాంగోవర్లో ఉండడం వల్ల వాళ్లందరినీ శ్రీ రమణ అనుకరించిన పద్ధతి నాకు అతి పెద్ద ఆశ్చర్యం. ఒక వింత. ఒక మేజిక్. ముఖ్యంగా […]
ఆస్తి యావత్తూ ధారబోసి… 90 ఏళ్ల వయస్సులో ఓ వృద్దురాలి ఒంటరి న్యాయపోరాటం…
(వీవీ రమణమూర్తి… ఎండీ, లీడర్ పత్రిక) నిరుపేదల కళ్ళల్లో వెలుగును చూడాలని తమ యావదాస్తినీ భర్తతో పాటు ధారపోసి రోడ్డున పడ్డ వృద్ధురాలి కథ ఇది. 90 ఏళ్ళ వయసులోనూ ఒంటరి పోరాటం చేస్తూ న్యాయం కోసం కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్న త్యాగమూర్తి కన్నీటి గాథ ఇది. కొంత మంది కుట్రలకు, కుతంత్రాలకు, బలయి పోయిన ఓ మానవతావాది యదార్ధ వ్యధ ఇది. విశాఖ నగరంలోనే కాదు తెలుగు ప్రజలందరికీ చిరకాలంగా కంటికి రెప్ప లాంటి […]
అర శతాబ్దంపాటు అదే చోట, అదే పార్టీ నుంచి… వరుసగా 12 సార్లు ఎన్నిక…
Siva Racharla….. Mass Contact… ప్రజలతో సన్నిహితంగా ఉంటే అనేక సమస్యలను సులభముగా పరిష్కరించవచ్చు అంటారు ఆయన. ప్రజాస్వామ్యానికి కావలసింది సైన్యం, ఆయుధాలు కాదు ప్రజల విశ్వాసం అని నమ్మిన, ఆచరించిన నాయకుడు ఊమెన్ చాందీ . వర్తమాన రాజకీయాల్లో విశ్లేషణకు సరిపడా సరుకు ఉండటం లేదు. సిద్ధాంతం వదిలేసినా తలలు తీసుకుంటాం అన్న మూడు నెలలకే మరో పార్టీలో చేరి పాత పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. జీవితం మొత్తం ఒకే పార్టీలో ఉంటే రాబోయే రోజుల్లో […]
ఇలాంటి ఫేక్ మెసేజులు, కొత్తతరహా మోసాలతో జాగ్రత్త సుమా…
Sai Vamshi ………. ఇలాంటి ‘మోసాలు’ ఉంటాయి.. జాగ్రత్త … PLEASE READ IT.. … నిన్న సాయంత్రం వాట్సాప్‌కి ఓ మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైం పని కావాలా అంటూ! జర్నలిజంలోకి రాక ముందు నా బయోడేటా నౌకరీ, లింక్డ్ లాంటి వెబ్సైట్లలో పెట్టాను. ఇప్పటికీ నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఇదీ అలాగే వచ్చింది అనుకున్నా! Truecallerలో అదేదో ఇంగ్లీషు పేరు ంంది ‘మీరు సరే అంటే మీ వివరాలు రిజిస్ట్రేషన్ చేస్తాను’ అని మెసేజ్ […]
ఈ కూటముల్లోని 35 పార్టీలకు అసలు పార్లమెంటు ప్రాతినిధ్యమే లేదు…
దుర్మార్గ బీజేపీని గద్దె దింపాలనే సంకల్పం, ప్రయత్నం విపక్షాల కోణంలో అవసరమే, రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే… అయితే ప్రస్తుతం ఓ నంబర్లాట నడుస్తోంది అధికార, విపక్షాల నడుమ… 26 పార్టీలు కలిసి మోడీపై యుద్ధభేరీ మోగిస్తాయని కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న దండు… ఎహె, మేం 38 పార్టీలతో మీటింగ్ పెడుతున్నాం అంటున్నాడు బీజేపీ నడ్డా… అసలు కూటమి అని పిలిచే దగ్గరే వస్తోంది చిక్కు… ఉదాహరణకు, విపక్ష కూటమినే తీసుకుందాం… పేరుకు 26 పార్టీలు… వీటిలో టీఎంసీ, […]
సోషల్ బురద తొక్కనేల..? ఆనక పాఠకులకు క్షమాపణలు చెప్పనేల..?
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది… వర్తమాన జర్నలిజం గురించి ఏం రాసినా అంతే… ఎవరో పెద్దగా సాధనసంపత్తి లేని, అనుభవశూన్యులైన, శిక్షణ లేని జర్నలిస్టులు ఏదో రాస్తే, యూట్యూబ్‌లో ఏదో చూపిస్తే… వాళ్ల స్థాయి అదేనని జాలి చూపించవచ్చు… కానీ డెక్కన్ క్రానికల్ వంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పత్రిక కూడా తప్పు చేస్తే..? దాన్నేమనాలా..? జాలిపడటం కాదు, కోపగించాలి… ఈ కథనం అదే… సోషల్ మీడియా కథ వేరు… ఎవడో ఏదో రాస్తాడు, ఏదో […]
నాసిరకం సర్వీసుకు ఇండిగో… నాణ్యమైన ‘పద్ధతికి’ టాటా… ఇవే బలమైన ఎయిర్ గ్రూప్స్…
Costly Tour: ఆ మధ్య ఎయిరిండియాను టాటా వారు కొన్న తరువాత దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల విలువ చేసే కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇండిగో కూడా పోటీలో వెనుకపడకూడదని నాలుగు లక్షల కోట్ల విలువ చేసే కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. 1903లో రైట్ సోదరులు విమానాన్ని కలగని…తయారు చేయించి… తొలిసారి గాలిలో ఎగిరినప్పటినుండి ఇప్పటివరకు ప్రపంచ విమానయాన చరిత్రలో ఇవే అత్యంత భారీ ఆర్డర్లు అని అంతర్జాతీయ వ్యాపార మీడియా పొంగిపోయి కథలు కథలుగా రాస్తోంది. ఈ […]
సల్లగ బతుకు పాలకా… సిగ్గు కాపాడుతున్నయ్ నీ బతుకమ్మ చీరెలు…
Gurram Seetaramulu……. బంగారు తెలంగాణలో సిగ్గు బిళ్ళలు అయిన చీరెలు… ఈమధ్య ఊరిలో ఒక సర్వే చేశా, ప్రతి దసరాకి ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు ఎంతమంది కట్టుకుంటున్నారు అని… ఏదో సందర్భంగా మా మేనకోడళ్లు ఇంటికి వస్తే… అమ్మా, ఇంట్లో బతుకమ్మ చీరలు ఉన్నాయి తీసుకుపోవే అని అడిగా… వద్దు అనకపోగా, నన్ను తిట్టినంత పనిచేసింది. అమ్మను అడిగితే ఏవో పెట్టుడు చీరెలు తేరా అని చెప్పింది. వాస్తవానికి రేట్ లో నాణ్యతలో నేను తెచ్చిన […]
కుడిఎడమల పలు తుపాకుల కాపలా… ఇది సాయుధ రాజశ్యామలం…
Deeksha – Darpam: “రథ-గజ తురగ-పదాతి సమావృత…పరిజన మండిత లోకనుతే… శాంతి సమావృత హాస్య ముఖే…” అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం (నేల మీద నడిచే సాయుధ దళాలు) వెంట రాగా రాజ వీధుల్లో ఊరేగే అమ్మవారిని చూస్తే చాలట- మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన భయాలన్నీ పటాపంచలవుతాయి. ఇన్ని బలగాలు వెంట ఉన్నాయి కాబట్టి ఆమె “శాంతి సమావృత” అయ్యిందని పొరబడ్డవారు కూడా లేకపోలేదు. ఆ బలగాలతో లోకాలకు రక్షణ ఇవ్వడంలో ఆమె శాంతి పొందుతూ […]
ఐనవాడే అందరికీ… చందమామ మీద నాలుగో వెన్నెల సంతకం…
Moon Light: భూమికి చంద్రుడు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా…చాలా దగ్గరివాడు. భూలోకవాసులందరికీ చంద్రుడు మామ- చందమామ. దేవదానవులు అమృతం కోసం వాసుకి మహా సర్పాన్ని తాడుగా చుట్టి…మంథర పర్వతాన్ని చిలికినప్పుడు…అమృతం కంటే ముందు లక్ష్మీ దేవి…ఆమెతో పాటు చంద్రుడు వచ్చారు. అమ్మ సోదరుడు కాబట్టి అలా మనకు చంద్రుడు మేనమామ అయి…జగతికి చందమామ అయ్యాడు. “పల్లవి:- చందమామను చూచి వద్దామా? సదానందా! చరణం-1 తల్లడించే తామసులను వెళ్ళవేసి […]
రాజమనమడు హిమాంశు… తన వ్యాఖ్యలు పరోక్షంగా తాత పాలననే నిందిస్తున్నయ్…
గుడ్… ఈ పిల్లగాడికి మంచి కెరీర్ ఉంది… రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయేతర రంగాల్లోకి ప్రవేశించినా… మొన్నమొన్నటిదాకా కాస్త బరువుగా, అక్కడిక్కడికీ వెళ్తూ ‘రాజకుమారుడి’ స్టేటస్‌తో నమస్కారాలు, దండాలు అందుకుంటూ, దండలు కూడా అందుకుంటూ… చివరాఖరికి సచివాలయం వెళ్లి, భద్రాచలం వెళ్లి పలుమార్లు వార్తల్లో వ్యక్తి అయ్యాడు… ఇప్పుడు ఆ బచ్పన్ క్యాలీ కనిపించడం లేదు… కొంత మెచ్యూరిటీ కనిపిస్తోంది… బరువు తగ్గాడు… హైట్ సాధారణ తెలంగాణ వ్యక్తులకన్నా ఎక్కువే… సిటీలోని ఓ స్కూల్‌ను దత్తత తీసుకుని, విరాళాల […]
పత్రికలు కోలుకుంటున్నాయట… క్రిసిల్ సంస్థ దిక్కుమాలిన విశ్లేషణ…
దేశంలో వార్తాపత్రికలు ఈ సంవత్సరం చివరికల్లా ఇంకా కోలుకుంటాయని, కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటాయని క్రిసిల్ రేటింగ్ సంస్థ అంచనా వేసిందని ఓ వార్త… ఈ సంవత్సరం కనీసం 15 శాతం ఆదాయం పెరుగుతుందట… ఎందుకంటే… ఈ సంవత్సరం ఎన్నికలు కాబట్టి పిచ్చపిచ్చగా యాడ్స్ వస్తాయని, ఈ దెబ్బకు నష్టాలన్నీ పూడుకుపోతాయని ఆ సంస్థ జోస్యం చెప్పింది… అంతేకాదు, సోషల్ మీడియా, టీవీ మీడియాకన్నా ప్రజలు పత్రికల్లో వార్తల్నే నమ్ముతున్నారనీ, పత్రికలు తమ విశ్వసనీయత కాపాడుకున్నాయనీ ఓ […]
రచ్చకు చాన్స్ ఇచ్చింది రేవంతే… కేసీయార్ అందిపుచ్చుకున్నాడు బలంగా…
రాజకీయాలు అంటే అంతే… ఏమీ లేకపోయినా సరే బట్ట కాల్చి మీదేస్తారు… కడుక్కునే ఖర్మ ఎదుటోడిది.,. మరీ తెలుగు రాజకీయాల్లో ఇది ఎక్కువ… ఏమీ లేకపోతేనే రెచ్చిపోయే బీఆర్ఎస్ కాస్త సందు దొరికితే ఊరుకుంటుందా..? అసలే బీజేపీని వదిలేసింది కదా, ఇక కాంగ్రెస్ మీద పడుతోంది… తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తోంది కదా, బీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీ వేగంగా దెబ్బతినిపోతోంది కదా… ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది బలంగా… పోవాల్సిన నెగెటివ్ మెసేజ్‌ను జనంలోకి […]
TV9 స్పీడ్‌గా చేయలేదు… BigTV వెంటనే చేసి ‘ఆమెను’ చూపెట్టింది…
ఎవరెంత తిట్టుకున్నా సరే… టీవీ9 అంటే ప్రయోగం… అది పలుసార్లు వికటించి నవ్వులపాలు కావచ్చుగాక… కానీ ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నిస్తుంది… ఈమధ్య ఇంగ్లిషు, ఒడిశా భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందించిన డిజిటల్ యాంకర్‌ను తెరపైకి తీసుకువస్తే సూట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ టీవీలు సైతం ఆ వార్తను ఊదరగొట్టాయి… సేమ్, దాన్ని టీవీ9 కూడా తెలుగులో తీసుకువద్దామని అనుకుంది… కానీ..? బిగ్‌టీవీ అనే ఓ చిన్న చానెల్ వాళ్లకన్నా ముందే ఏఐ యాంకర్‌ను తీసుకొచ్చేసింది… […]
సీఎం సీతక్క… ఈ మాట రాహుల్ గాంధీతో ముందుగానే ప్రకటింపజేస్తే..?
‘‘అవసరమైతే’’…. ఈ పదం రాజకీయాల్లో దుర్మార్గమైనది… ఆ అవసరాన్ని ఎవరు నిర్దేశించాలి..? తప్పించుకోవడానికి అత్యంత అనువైన పదం ఇది… ఎటంటే అటు మార్చుకోగల ఫ్లెక్సిబులిటీ ఉన్న పదం… అమెరికా దాకా వెళ్లిన రేవంతుడు ఏమన్నాడు..? ‘అవసరమైతే’ సీతక్కను సీఎం చేస్తాం అన్నాడు… అంటే సీఎం అభ్యర్థిగా సీతక్కను చెప్పడం లేదు తను… (సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ, సీతక్క అనేది నక్సల్స్ దళంలో ఉన్నప్పుడు పెట్టిన విప్లవనామం… ఉనికి బయటపడకుండా ఉండేందుకు నక్సలైట్లు అసలు పేర్లకన్నా […]
బ్రాహ్మణులపై సాక్షికీ చులకనే… ఎడిట్ పేజీలో ఏదేదో రాసిపడేశారు…
ఈరోజు ఎక్కడో తెలంగాణ బ్రాహ్మణ సంఘం సమావేశం జరుగుతున్నట్టు వాట్సప్‌లో వార్త కనిపించింది… వీళ్ల మీటింగులో ఇలాంటి ప్రస్తావనలు వస్తాయో రావో తెలియదు గానీ… మరోవైపు బ్రాహ్మణుల మీద విద్వేషాన్ని చిమ్ముతూ సాక్షి దినపత్రికలో ఓ వ్యాసం కనిపించింది… ఇది రాసింది డా.దేవరాజు మహారాజు… ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్లస్ జీవశాస్త్రవేత్త అని సదరు వ్యాస రచయితకు పరిచయం రాశారు వ్యాసం చివరలో… ఈమధ్య ఎవరో కాపీ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ […]
సిపిఆర్ తో పర్యాటకునికి ప్రాణం పోసిన డాక్టర్ యనమదల
పాండిచేరి, 9 జూలై 2023 :: గుండె మరణాలు పెరగడం, హఠాత్తుగా గుండె ఆగిపోవడం ఈ మధ్య తరచుగా జరుగుతున్నది. పశ్చిమబెంగాల్ భవానిపూర్ కి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అనిరుధ్ దాస్ (71) తన కుటుంబ సభ్యులతో పాండిచ్చేరిలోని ఆరోవెల్లిలో ప్రఖ్యాత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో, వాహనం ముందు సీట్లో కూర్చుని ముందుకు వాలిపోయారు. కుటుంబ సభ్యులు బాధ, ఆందోళనతో సహాయం చేయాల్సిందిగా కేకలు వేశారు. కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల […]
బిగ్ బి… ఏమిటీ పని..? ఇదెక్కడి తెలుగు..? జనం నవ్వుకోరా చెప్పండి..?
అమితాబ్… దేశం గర్వించతగిన నటుడు… కోట్ల మంది తనను అభిమానిస్తారు… వెరీ ఇంపార్టెంట్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా… తన మాట, తన అడుగు, తన భాష, తన ఆలోచనలకు ప్రాధాన్యం ఉంటుంది… లక్షల మంది అనుసరిస్తారు… ఇలాంటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి, జనం నవ్వుకునే విధంగా ఉండకూడదు… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… తను ప్రభాస్ నటిస్తున్న అత్యంత భారీ చిత్రం ప్రాజెక్టు కె లో నటిస్తున్నాడు… కమల్ హాసన్ కూడా దీనిలో భాగస్వామి (నటనపరంగా) అవుతున్నాడు… ఇప్పటివరకూ […]
- « Previous Page
- 1
- …
- 57
- 58
- 59
- 60
- 61
- …
- 146
- Next Page »