ఎర్ర పార్టీలు, ఎర్ర నాయకులు సొక్కమేమీ కాదు… బయటికి మస్తు నీతులు చెబుతారు… వినకపోతే నాలుగు కొట్టి మరీ బోధిస్తారు… చూడండి, మా చొక్కాలు ఏ మరకలూ లేని ఎరుపు తెలుసా అంటారు..? కానీ బోలెడంత బురద… కక్కుర్తి యవ్వారాలు, అసలు మెరిట్‌ను తొక్కేయడాలు, కొలువులు చక్కబెట్టుకోవడాలు గట్రా గుట్టుచప్పుడు గాకుండా కానిచ్చేస్తుంటారు… అదేమంటే, ఆధారాలు చూపిస్తే మళ్లీ నోట కూత పెగలదు… కేరళలో ఓ కేసు గుర్తుంది కదా… స్వప్నా సురేష్ అనే ఓ ఔట్ […]
ఇస్రో నంబి కేసు… ఓ పోలీసాయన లండన్ చెక్కేయబోతూ దొరికిపోయాడు…
ఇస్రో గూఢచర్యం కేసు గుర్తుంది కదా… ఈమధ్య హీరో మాధవన్ సదరు బాధిత సైంటిస్టు నంబి నారాయణన్ బయోపిక్ సినిమా కూడా తీశాడు… దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది… మళ్లీ ఆ కథలోకి ఇప్పుడు వెళ్లాల్సిన పనేమీ లేదు… కానీ ఆయన ఇంకా పోరాడుతూనే ఉన్నాడు… తనకు పరిహారం, పౌరపురస్కారం, నిర్దోషిగా ప్రకటన దక్కాయి… కానీ తన వెనుక కుట్ర పన్నిందెవరు..? ఎందుకోసం ..? వీటిని తేల్చాలని కోరుతున్నాడు… నిజమే, తేలాలి కదా… ఆ కుట్రకు బాధ్యులు ఎవరు..? […]
ఘోరంట్లపై రాధాకృష్ణ కేసు సరే… ఓ సుదీర్ఘ పరువునష్టం దావా కథ తెలుసా..?!
జగన్ కీర్తిపతాకను గగనమెత్తున ఎగరేసిన ఘోరంట్ల ఏదో అన్నాడట కదా… వస్తున్నా, ఒక్కొక్కడికీ నా ఒరిజినల్ చూపిస్తాను అని..!! తను తిట్టిపోస్తున్నది నేరుగా కమ్మ సామాజికవర్గాన్ని, పచ్చ జర్నలిస్టులను కాబట్టి జగన్, రోజా, సజ్జల, నాని, వనిత ఎట్సెట్రా వైసీపీ నాయకగణం భలే సంబరపడిపోయి ఉంటారు… మావాడు బంగారుతొండ అని ఆనందపడుతున్నది వాళ్లే కదా… అది ఒరిజినలా, ఫేకా, ఆ మూమెంట్ సరైనదేనా అనే కోణంలో టీవీ డిబేట్ల ప్రజెంటర్లు వాళ్లకు తెలిసిన చెత్తా భాషలో కొన్నాళ్లు […]
వావ్… పాలిటిక్స్‌లో మనీ, మీడియా ప్రభావాలపై టీఆర్ఎస్ పోరాడుతుందట…
నిజంగా మోడీ పాలన విధానాలపై ఉద్యమించాలని అనుకుంటే… నిజమైన ఇష్యూస్ లేవా..? సామాన్యుడు అవస్థలు పడుతున్న ధరలు సహా బోలెడు అంశాలున్నయ్… బీజేపీ కొత్తగా ప్రవేశపెట్టాలని అనుకుంటున్న బిల్లులున్నయ్… కానీ వాటిపై రాజకీయ పోరాటం చేతకాదు… ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇదుగో, ఇలా ఎప్పుడూ ఈవీఎంలు దొరుకుతయ్… మళ్లీ వీటిపై ఉమ్మడిపోరు చేస్తాయట విపక్షాలు… టీఆర్ఎస్ సహా 11 విపక్షాలు నిర్ణయించాయట… ఈనాడు మొదటి పేజీలో వచ్చిన వార్త ఇది… కాస్త ఆలోచనజ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా సరే, ఇలా […]
కొలువులు పీకేయడమే..!! ఆర్టికల్ 370 ఎత్తిపారేశారు సరే… ఈ ఆర్టికల్ 311 ఏంటి..?!
హిజ్బుల్ ముజాహిదీన్… పేరు ఎప్పుడైనా విన్నారా..? ది రోగ్ కంట్రీ పాకిస్థాన్‌కు పుట్టిన ఉగ్రవాద బిడ్డే ఇది కూడా…!! దీన్ని ప్రపంచం గ్లోబల్ టెర్రరిస్టు సంస్థగా గుర్తించింది… దీని చీఫ్ పేరు సయ్యద్ సలాహుద్దీన్… ఈయనకు ఏడుగురు పిల్లలు… కొందరు ఎంచక్కా కశ్మీర్ ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు… తమకు చేతనైనకాడికి ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడం, డబ్బు సమకూర్చడం, లోకల్ గ్యాంగుల మద్దతును సమీకరించడం వంటి పనులు చేస్తూ ఉంటారన్నమాట… వాళ్లకు ఆల్ఇండియా టాక్స్ పేయర్స్ డబ్బును జీతాలుగా […]
ఔనా… నిజమేనా… మహాత్మా గాంధీ త్రివర్ణ పతాకాన్నే ఎగురవేయలేదా..?!
హర్ ఘర్ తిరంగా… ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది… 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆజాదీ అమృత మహోత్సవ్ ఘనంగా, సంబరంగా నిర్వహించుకుంటున్నాం… సోషల్ మీడియాలో డీపీలు మార్చుకుంటున్నాం… ఓ మూమెంట్ కనిపిస్తోంది… కానీ మనం ఇన్ని దశాబ్దాలుగా జాతిపితగా గౌరవిస్తున్న గాంధీ అసలు ఈ త్రివర్ణ పతాకాన్నే ఇష్టపడలేదా..? ఎగురవేయడానికి కూడా సమ్మతించలేదా..? దివైర్ అనే వెబ్సైట్లో కనిపించిన ఓ ఆర్టికల్ ఆసక్తిని, ఆలోచనల్ని రేపింది… జర్మనీలో గొట్టింగెన్ […]
కరెంటు కట్టుబాట్ల కోసమే కొత్త బిల్లు…! అసలు ఆ బిల్లులో ఏముందో తెలుసా..?!
Article by పార్ధసారధి పోట్లూరి ………. విద్యుత్ సంస్కరణల [అమెండ్మెంట్ ] సవరణ చట్టం- 2022 సమీక్ష! Electricity (Amendment) Bill 2022… ఆగస్ట్ 8 న లోకసభలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి RK సింగ్ విద్యుత్ సంస్కరణల సవరణ చట్టం- 2022 ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లు మీద విపక్షాలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీ దళ్ తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ […]
డిబేట్లో మిలిటరీని ఎవరో ఏదో అన్నారు… ఇంకేం..? ఆ చానెలే మూతపడింది..!!
అన్నీ బాగుండి, అనుకున్నవన్నీ చెలాయించుకుంటుంటే… స్వేచ్ఛ విలువ తెలియదు…! ఈ వాక్యాన్ని ఎవరు దేనికి వర్తింపజేసుకుని, మథనపడినా పర్లేదు… కానీ పాకిస్థానీ అధికారులు ఓ పాపులర్ టీవీ చానెల్‌ను మూసిపారేశారనే వార్త చదివాక ఆ వాక్యమే గుర్తొచ్చింది… మనకు తెలుసు కదా… పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం అనేది ఓ మేడిపండు… అది మిలిటరీ స్వామ్యం… మిలిటరీ కోసం, మిలిటరీ చేత, మిలిటరీ యొక్క అధికార చట్రం అది… మంగళవారం అరై న్యూస్ చానెల్లో ప్రతిపక్ష నేత ఎవరో మిలిటరీ […]
దిక్కుమాలిన రాత..! నిజంగా మోడీ ఆస్తులు భారీగా పెరిగాయా..?!
ప్రతి అంశంలోనూ ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా ఉండే పార్టీ వైెఎస్సార్సీపీ… ఆ పార్టీ అధికార పత్రిక, పార్టీ అధినేత సొంత పత్రిక సాక్షి… దానికి అనుబంధంగా ఓ న్యూస్ వెబ్సైట్… కానీ అందులో ఏం రాస్తున్నారో, ఏం కంటెంట్ వస్తున్నదో చూసుకునేవాళ్లు లేకుండా పోయారు… ఫాఫం జగన్… విషయం ఏమిటంటే… ఓ వార్త వేశారు… ‘‘ఏడాదిలో భారీగా పెరిగిన ప్రధాని మోడీ ఆస్తులు’’ దాని హెడింగ్ ఇదే… వీటినే దిక్కుమాలిన వార్తలు అంటుంటారు… మోడీ కార్పొరేట్ ప్రియుడు, […]
సిద్ధాంతాలు రాద్ధాంతాలు జాన్తానై… సార్ హ్యాండ్ ఎప్పుడూ ఫుల్ రైజింగులోనే…
నితిశ్ ఓ పాము… పాము తరచూ కుబుసం విడిచినట్టే, ప్రతి రెండేళ్లకు నితిశ్ కొత్త కుబుసం ధరిస్తాడు… ఈమాట ఎవరో అన్నది కాదు… 2017లో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ట్వీట్ ఇది… బీహార్ సీఎం నితిశ్ రాజకీయాల గురించి ఇంతకుమించి ఎవరూ చెప్పలేరు… పైగా ఇప్పుడు అదే నితిశ్ అదే లాలూ కొడుకు తేజస్వి యాదవ్ అనే కొత్త చర్మాన్ని ధరించి, కొత్త కిరీటం పెట్టుకుంటున్నాడు… ఏళ్లుగా బీహార్ పాలకుడు తను… కానీ రాష్ట్రం మాత్రం […]
ఏక్ నిరంజన్..! విడిపోయే దోస్తులే తప్ప కొత్త స్నేహితుల జాడలేదు..!!
అయిపోయింది… ఎన్డీఏ క్యాంప్ నుంచి మరో మిత్ర పార్టీ జంప్… నిజానికి స్థూలంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎన్డీఏ అంటే బీజేపీ మాత్రమే అన్నట్టుగా మారిపోయింది… ఎస్… ఏక్‌నిరంజన్…! అవసరం కోసమో, అధికారం కోసమో, భయమో, నిర్బంధమో, ఇంకా ఏ కారణమైనా కావచ్చుగాక… కొన్ని పార్టీలు బీజేపీకి పలు అంశాల్లో మద్దతునిస్తున్నాయి… కానీ నమ్మకమైన మిత్రుడు ఎవరున్నారు ఇప్పుడు..? ఎవరు మిగిలారు ఇప్పుడు..? బలమైన పార్టీలు ఎవరూ లేరు… అటువైపు యూపీఏలో కనీసం స్టాలిన్ వంటి బలమైన మిత్రపక్షం […]
లక్ష కోట్ల సాయం చేసినా సరే… శ్రీలంక మారదు, ఇండియాకు తల్నొప్పే…
పార్ధసారధి పోట్లూరి ……….. శ్రీలంక రిటర్న్ గిఫ్ట్ to భారత్ ! 5.4 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి ఆపదలో ఆదుకున్నందుకు ప్రతిగా శ్రీలంక భారత్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ! మొదటి బహుమతి చైనాకి చెందిన నిఘా నౌక [Spy Ship Yuvan Wang 5] యువాన్ వాంగ్ ని శ్రీలంకలోని చైనా అధీనంలో ఉన్న హంబన్ తోట పోర్ట్ లో లంగర్ వేయడానికి శ్రీలంక ప్రభుత్వం అనుమతినిచ్చింది… అయితే ఈ […]
తప్పు జరిగింది… క్షమాపణలు కోరుతున్నాం… లెంపలేసుకున్న ‘‘ది వీక్’’
ది వీక్… ఈ మ్యాగజైన్ ఇప్పుడు ప్రొఫెషనల్‌గా కాస్త వీక్ అయిపోయింది… కానీ ఇంతకుముందు కాస్త పేరున్న మీడియా సంస్థే… పాపులరే… మనం మొన్నామధ్య ‘ముచ్చట’లో చెప్పుకున్నాం… ఓ కాలమిస్ట్ ఇకపై ఆ మ్యాగజైన్‌కు ఏమీ రాయబోవడం లేదనీ, ఒక కాలమ్‌కు వీక్ ఎడిటోరియల్ టీం ఉపయోగించిన ‘కాళి’ బొమ్మ తనను నిర్ఘాంతపరిచిందని ప్రకటించాడు… సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు… ఏ కాలమ్‌కు ఏ ఇల్లస్ట్రేషన్ అవసరమో కూడా గుర్తించలేని మ్యాగజైన్ ప్రస్తుత ధోరణి, ఇంకా ఎటు […]
సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
మహారాజా… ఖజానా వట్టిపోయినది, నాలుగు తన్ని వసూలు చేద్దామనిన ప్రజలు సైతం దివాలా తీశారు, మా జీతములూ ఆలస్యమవుతున్నవి, ఏం చేయమంటారు ప్రభూ……? అవును, మంత్రివర్యా, కర్తవ్యం బోధపడకుండా ఉన్నది… రాత్రి పొద్దుబోయాక గమనించాను, కోటలో ఎక్కడా దీపాల్లేవు, అడిగితే చమురు కొండెక్కినది ప్రభూ అని సమాధానం వచ్చినది… ముందయితే నా పట్టపుటేనుగుల్ని, స్వారీ గుర్రాల్ని అమ్మేయండి, వేటకుక్కల్ని కూడా…… అలాగే ప్రభూ….. నవ్వొచ్చిందా..? అంతేమరి… ఖజానాలో చమురు ఆదా చేసుకోవాలి, అసలే కష్టకాలం… పొదుపు చేయకపోతే […]
నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
పార్ధసారధి పోట్లూరి ……. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేషనల్ హెరాల్డ్ స్కామ్ మీద మొత్తం 12 చోట్ల దాడులు నిర్వహించింది బుధ, గురు వారాలలో [ఆగస్ట్ 3, 4 తేదీలలో]… ఆగస్ట్ 3 వ తేదీన 11 చోట్ల దాడి చేసి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ! ఆగస్ట్ 4 వ తేదీన, అంటే గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గేకి సమన్లు పంపింది తమ ఎదుట హాజరు కమ్మని ! […]
మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
నిజంగా ఓ ఆసక్తికరమైన కథ… సాంతం చదివాక కొంతసేపు ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు చుట్టుముట్టేస్తాయి… సరే, ముందుగా కథ చెప్పుకుందాం… అది ముంబై… 2013… అంటే తొమ్మిదేళ్ల క్రితం… అంథేరిలో బడికి వెళ్లిన ఓ అమ్మాయి మళ్లీ ఇంటికి రాలేదు… డిసౌజా అనేవాడు ఆమెను కిడ్నాప్ చేశాడు… ఎందుకంటే..? వాడికి పిల్లల్లేరు… భార్య పేరు సోనీ… అమ్మాయి పేరు పూజ… కిడ్నాప్ అయితే చేశాడు గానీ తెల్లవారే వాడికి గుబులు పట్టుకుంది… మీడియాలో పూజ కిడ్నాప్ వార్త […]
పుట్టించేది అదే… పట్టించేదీ అదే…! పర్ఫెక్ట్ రోగ్ కంట్రీ పాకిస్థాన్…!!
పార్ధసారధి పోట్లూరి ………….. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి గురించి సమాచారం ఎవరు ఇచ్చారు ? CIA చాలా కాలంగా వెతుకుతున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి గురించి ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరు ఇచ్చారు ? వెల్ ! హాక్కాని నెట్ వర్క్ సిఐఏ కి సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్ లోని అట్టోబబాద్ లోని మిలటరీ కంటోన్మెంట్ ఏరియాకి దగ్గరలోనే ఒక భవంతిలో ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లుగా అమెరికన్ సిఐఏ తెలుసుకోవడానికి 11 […]
ఆమె వచ్చింది… సేఫ్‌గా దిగింది… రోజంతా గడిపింది… వాపస్ వెళ్లిపోయింది…
పార్ధసారధి పోట్లూరి ………. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పేలోసీ [Nancy Pelosi ] ఆగస్ట్ 2 వ తేదీ మంగళవారం రాత్రి 10.45 నిముషాలకి తైవాన్ రాజధాని తైపే విమానాశ్రయంలో సురక్షితంగా లాండ్ అయ్యింది. 24 గంటలు కూడా గడవక ముందే ఈ రోజు సాయంత్రం 5.45 నిముషాలకి తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది! గత రెండు వారాల నుండి అంతర్జాతీయ మీడియా తెగ హడావిడి చేస్తూ వచ్చింది. అదిగో చైనా నాన్సీ […]
హోమియో డాక్టర్ డోలో-650 రాసిచ్చినా కేసు పెట్టి లోపలేస్తారట…!!
మనకు తెలిసిందే కదా…. యునాని, ఆయుర్వేద, హోమియో, నేచురో డాక్టర్లు కూడా తమ ప్రాక్టీసులో భాగంగా అల్లోపతి, అనగా ఇంగ్లిష్ మందులు, అనగా మోడరన్ మెడిసన్ కాగితాలపై రాసేస్తుంటారు… ప్రాథమిక వైద్యం వరకూ వోకే, కానీ ఎడాపెడా రెండు చేతులతో అసలు సిసలు ఆల్లోపతి డాక్టర్లకన్నా ఎక్కువగా ప్రిస్క్రిప్షన్లు గీకేస్తుంటారు… దీనికి సంబంధించిన వార్త ఇది… విషయం ఏమిటంటే..? సెంథిల్ కుమార్ అని తమిళనాడు, సేలంలోని ఓ హోమియోపతి ప్రాక్టీషనర్ పనమరత్తుపట్టిలో ఓ క్లినిక్ నడిపిస్తుంటాడు… బ్లాక్ […]
కేసీయార్‌కు బీజేపీ మునుగోడు ట్రాప్..! రణమా, మౌనమా…!!
రెండు మూడు నెలల్లో తేల్చిపారేయాలి… మునుగోడు ఉపఎన్నిక ద్వారా మళ్లీ కేసీయార్‌ను పరుగులు పెట్టించాలి… అని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట… అందుకే రాజగోపాలరెడ్డిపై ఒత్తిడి తెచ్చి అర్జెంటుగా రాజీనామా చేయించిందట… పలు వార్తావిశ్లేషణల్లో కనిపిస్తున్న అంశమిది… మరోవైపు అంతే అర్జెంటుగా కాంగ్రెస్ ఈ ఉపఎన్నిక కోసం ఓ కమిటీని వేసింది… పోరుకు రెడీ అయిపోతోంది… ఆల్రెడీ కొన్ని పెండింగ్ ఇష్యూస్ క్లియర్ చేయడం ద్వారా టీఆర్ఎస్ కూడా రెడీ అయిపోతున్నట్టుంది… అయితే… హుజూరాబాద్‌లో బలహీన అభ్యర్థిని పెట్టడం […]
- « Previous Page
- 1
- …
- 84
- 85
- 86
- 87
- 88
- …
- 139
- Next Page »