హమాస్ కి చివరి చీఫ్ యాహ్య సిన్వార్ మరణించాడు! బిన్ లాడెన్ ని మట్టు పెట్టడానికి అమెరికా దాని మిత్ర దేశాలకి ఒక దశాబ్దం పట్టింది! హమాస్ ని తుదికంటా మట్టు పెట్టడానికి ఇజ్రాయేల్ కి ఒక సంవత్సరం పట్టింది! అక్టోబర్ 7,2023 న ఇజ్రాయేల్ మీద దాడి చేసి సాధారణ పౌరులు 1258 మందిని క్రూరంగా హింసించి చంపి, మరో 250 మందిని బందీలుగా పట్టుకెళ్లిన సంఘటనకి కారకుడు మరియు మాస్టర్ మైండ్ హమాస్ ముఖ్య నాయకుడు యాహ్య […]
ఏం..? జర్నలిస్టులు అంత లోకువా..? నాయకులు, అధికారులకన్నా తక్కువా..?
ఓ టీం… అందులో బ్యూరోక్రాట్లు, పొలిటికల్ లీడర్లు, జర్నలిస్టులు ఉన్నారు… సియోల్ వెళ్లింది ఆ టీం… ఎందుకు..? ఆ నగరంలో ఒక ప్రవాహాన్ని ఆ ప్రభుత్వం పునరుజ్జీవింపచేసిన తీరు చూడటానికి..! ఎస్, అధ్యయనం చేయడానికి..! ఆ టీంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, మేయర్ కూడా ఉన్నారు… మీడియా టీమ్‌లో ఉన్న జర్నలిస్టులు కూడా సీనియర్లు… చాలామంది […]
సర్కారు సరిగ్గా వ్యవహరిస్తేనే… హైదరాబాద్ ప్రపంచ భవిష్యత్ నగరం…
. ప్రపంచ భవిష్యత్ నగరం – హైదరాబాద్ హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఉంది. గ్లోబల్ సర్వేలను పరిశీలించినపుడు, ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ 5వ స్థానంలో ఉండగా, మరో సర్వే ప్రకారం 4వ స్థానంలో ఉంది. (developing cities)… బ్రిటీష్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో కూడా, హైదరాబాద్ టాప్-10 అభివృద్ధి చెందుతున్న నగరాల్లో స్థానం సంపాదించింది. ఈ అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలను పరిశీలించి రూపొందించబడ్డాయి. […]
వైరం ముగిసి… ఇక అన్నాచెల్లెళ్ల అనురాగ గీతాలు సరే… కానీ, వాట్ నెక్స్ట్..?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నేరుగా షర్మిలతోనే మాట్లాడి, పనిలోపనిగా వీలైతే నాలుగు సలహాలు కూడా ఇచ్చేసి, సమాచారాన్ని నిర్ధారించుకుని మరీ ప్రచురిస్తాడు కాబట్టి… ఈ వార్త కూడా నిజమే అనుకుందాం… ఎక్స్‌క్లూజివ్ స్టోరీ కాబట్టి అభినందిద్దాం… సాక్షి ఎలాగూ రాయదు, ఈనాడుకు చేతకాదు… సరే, వార్త ఏమిటంటే..? ‘‘మొన్నటి ఎన్నికల్లో దారుణమైన ఓటమితో జగన్ నేల మీదకు దిగొచ్చాడు… బీజేపీ దూరమైపోయింది… కర్నాటక, తెలంగాణల్లో తన వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి… కేంద్రంలో, రాష్ట్రంలోనూ తన వ్యతిరేక కూటమి ప్రభుత్వాలే […]
నవ్య హరిదాస్..! ఇప్పుడు హఠాత్తుగా అందరి దృష్టీ ఈమె మీదే… దేనికంటే..?
1999 ఎన్నికల్లో దేశంలో అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం బళ్ళారి…. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ మీద బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ పోటీ చేయడం… పోటీ నువ్వా నేనా అనే విధంగా సాగింది… బళ్ళారి ప్రజల త్రాసు కొద్దిగా సోనియా వైపే మొగ్గింది ( నాకు గుర్తున్నంతవరకూ 60 /70 వేల మెజారిటీ )… కొసమెరుపు…… కేవలం 15 రోజుల్లో కన్నడ భాష నేర్చుకొని సుష్మా స్వరాజ్ కన్నడంలో మాట్లాడి అక్కడ ప్రజల గుండెల్లో […]
హరీశ్‌రావుపై విమర్శ కాదు… ఆ నిజాలేమిటో చెప్పాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిదే..!!
నా కారు ముందు డాన్స్ చేసినవ్, నీ స్థాయి మరిచిపోయినవా అని ఎద్దేవా చేస్తున్నాడు హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి..! అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ మాటల్ని కూడా అదుపు తప్పిస్తుందనేది నిజమే గానీ… నిజంగానే నీ కారు ముందు డాన్స్ చేసిన ఓ సాదాసీదా నీ శిష్యుడు, నీ కార్యకర్త ఏకంగా సీఎం అయ్యాడు… సో, ఆ సక్సెస్ స్టోరీలో నీకూ సంతోషం ఉండాలి కదా… ఆడిపోసుకుంటావు దేనికి..? పోనీ, అదే బీఆర్ఎస్లో ఉండి […]
అన్‌స్టాపబుల్..! మళ్లీ ఆ బావాఅల్లుళ్లతో స్టార్ట్… తోడుగా పొలిటికల్ జతగాడు..!
ఆహాలో అన్‌స్టాపబుల్ రియాలిటీ షో మొదట్లో సూపర్ హిట్… నో డౌట్… బాలకృష్ణ వంటి స్టార్, వెటరన్ హీరో హోస్ట్ చేయడంతో ఆ క్రేజ్ వచ్చింది… ఆ చాట్ షో మొదట్లో సరదాగా సినిమా సెలబ్రిటీలతో సాగింది… ఎప్పుడూ ఫ్యాన్స్‌ను కొడుతూ, తిడుతూ… బ్లడ్డు, బ్రీడు కామెంట్లతో… ఓ తరహాలో కనిపించే బాలకృష్ణను మరో కోణంలో ఆవిష్కరించింది ఆ షో… మొదటి రెండు సీజన్లూ పర్లేదు… ఒకటీరెండు సినిమా ప్రమోషన్ల కోసం ఒక్కో ఎపిసోడ్ కూడా ప్రసారం […]
ఎంతకు తెగించార్రా… చివరకు నైవేద్యపు బెల్లం కూడా కల్తీయేనా..?!
తిరుమల లడ్డూలో జంతుకొవ్వు నూనెల కల్తీ నెయ్యి ఆనవాళ్లు బయటపడటంతో దేశవ్యాప్తంగా గుళ్లల్లో ప్రసాదాలపై భక్తుల్లో సందేహాలు మొదలయ్యాయి… భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆయా రాష్ట్రాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి కూడా… పలు రాష్ట్రాలు తమ గుళ్లలో ప్రసాదం తయారీకి రాష్ట్ర సహకార సంస్థల బ్రాండ్లనే వాడాలని ఆదేశించాయి… తెలంగాణలో కూడా విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఆదేశించారు… ఎందుకైనా మంచిదని కల్తీ పరీక్షలు కూడా చేయించారు… ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం […]
అక్షరాలా ఆమె మహాతల్లి..! ప్రపంచ మానవ చరిత్రలో ఇదే తొలిసారి…
. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పోస్టు ఒకటి కనిపించింది… 16 సంవత్సరాల క్రితం సెన్సేషన్ జననం అని… ఏమిటీ అంటే… ఏడుగురు ఒకేసారి పుట్టారు… వాళ్లంతా బతికే ఉన్నారు… ఇదుగో తల్లిదండ్రులతో వాళ్లందరూ ఒకే ఫోటోలో… ఇదీ ఆ పోస్టు సారాంశం… కానీ, నాకు తెలిసి… వాళ్లు పుట్టింది 16 ఏళ్ల క్రితం కాదు… McCaughey septuples గా ఈ ప్రసిద్ధులు పుట్టింది 1997లో… అంటే దాదాపు 27 ఏళ్ల క్రితం… ప్రపంచంలో పుట్టిన ఏడుగురు […]
లారెన్స్ బిష్ణోయ్..! ఓహ్… లా చదివిన గ్యాంగ్‌స్టర్ వెనుక ఇంత కథ ఉందా..?
. బాగా తెల్లగా, ఎర్రగా బుర్రగా ఉన్నాడని బిష్ణోయీ కుర్రాడికి బ్రిటిష్ ఉన్నతాధికారి హెన్రీ లారెన్స్ పేరు! ……………………………………………………………………… బాలీవుడ్ ‘కండలవీరుడు’, ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన అత్యంత లౌకిక పౌరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు ముంబై నగరం బాంద్రాలో నివసించే డీలక్స్ అపార్ట్మెంట్ వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. విజిటర్లు ఎవరినీ ‘టైగర్ జిందా హై’ హీరో తన నివాసంలోకి అనుమతించడం లేదు. ఇవి ఇప్పుడు ఇంగ్లిష్ న్యూజ్ చానల్స్‌లో పదే పదే […]
సార్… పేపర్ వేయించుకొండి… చౌకగా ఏడాది ప్యాకేజీ, పైగా ఈ ప్రెషర్ కుక్కర్ ఫ్రీ…
సేటూ… కొన్ని కిరాణా ఐటమ్స్ చెప్పుతా, జెర జల్దీ ఇచ్చెయ్ అని పురమాయించి, అక్కడే నిలబడ్డాను… మధ్యాహ్నం, చిన్న షాపు… వేరే ఎవరూ గిరాకీ లేరు… షాపు గుమస్తా సరుకులు ఒక్కొక్కటీ ప్యాక్ చేస్తున్నాడు… ఒకాయన వచ్చాడు… మెడలో సాక్షి ఐడీ కార్డు వేలాడుతోంది… డిజిగ్నేషన్ అని ఏదో కనిపిస్తోంది, కానీ అర్థం కాలేదు… సేటూ… మళ్లీ ఇటువంటి ఆఫర్ రాదు, పేపర్ వేయించుకో… ఇవిగో ఈ కుక్కర్లు ఫ్రీ ఇస్తున్నాం… రెండు కుక్కర్లు వెంట తెచ్చాడు… […]
నాగార్జున కళ్లల్లో నీళ్లు… ఎన్ని ఎమోషన్స్ సుడితిరిగి తన్నుకొచ్చాయో…
నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నాడు… ఎంత ప్రాక్టికల్ మనిషికైనా సరే కొన్నిసార్లు ఎమోషన్స్ తన్నుకొస్తాయి… కన్నీళ్లు బయటికొస్తాయి… సహజం… ఐతే తను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం వేరు… అది స్టార్ మా పరివార్ అవార్డుల వేదిక… అంటే ఏమీలేదు… వివిధ మాటీవీ సీరియళ్లలో నటించిన నటీనటులకు అవార్డులు… దాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు… ముఖ్య అతిథుల్లో ఒకడిగా నాగార్జున వచ్చాడు… అదే వేదికగా అక్కినేని వందేళ్ల వేడుక (సెంటినరీ)ను కూడా ప్రదర్శించారు… అక్కినేని పాత పాటల్ని నెమరేసుకోవడం… అమల, సుశీల […]
న్యాయదేవత కళ్లకు గంతలు విప్పేశారు… ఆ ఖడ్గాన్ని తీసేశారు… కానీ..?!
. ఒక వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన వార్త ఇది… ఓసారి చదవండి… . న్యాయదేవత కళ్లకు గంతలు తొలిగాయి. అవును, మీరు చదువుతుంది నిజమే. ఇన్నాళ్లూ భారతదేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండేవి. ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండకూడదని దేశ అత్యున్నత ధర్మాసనమైన సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా… సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీం కోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. […]
మోడీ వాషింగ్ పౌడర్… మురికినీ బురదనూ ఇట్టే కడిగేస్తుంది…
పార్టీలకు అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియా, మీడియా గ్రూపులు ఇప్పుడు ఓ పెద్ద దందా… వందలు… కాదు, వేల కోట్ల టర్నోవర్… బాగా జీతాలు లభిస్తుండటంతో చాలామంది డిజిటల్, క్రియేటివ్ పర్సన్స్ ఎంటరవుతున్నారు… సెటైర్లు, మీమ్స్, పోస్టులు, రీల్స్, షార్ట్స్, వీడియోలు, వార్తలు… వాట్ నాట్..? ఇదొక పెద్ద ఉపాధి రంగం అయిపోయింది… అఫ్కోర్స్, దూషణలు, వెక్కిరింతలు, బూతులు, మార్ఫింగులు, ఫేక్ వార్తలు సరేసరి… నాణేనికి రెండు మొహాలు కదా… తాజాగా కేరళ కాంగ్రెస్ విభాగం పోస్ట్ […]
బాబు గారూ… తమరు మహా మద్యం చతురులు… పిండుకుంటున్నారు…
చంద్రబాబు అద్భుత సమర్థ పాలనను విశ్లేషించేంత జ్ఞానం మనకు లేకపోవచ్చుగాక… కానీ చెప్పేవి వేరు, చేసేవి వేరు… మద్యం విషయమే తీసుకుందాం… జగన్ మీద విమర్శ ఏమిటి..? తనకు డబ్బు సంపాదించి పెట్టే అడ్డమైన రంగు సారా బ్రాండ్లకు మాత్రమే పర్మిషన్లు ఇచ్చి, పాపులర్ బ్రాండ్లను రానివ్వకుండా చేసి, ప్రజల కాలేయాలతో ఆడుకున్నాడు, ఆ రంగు సారాకు కూడా అడ్డగోలు రేట్లు పెట్టి, అడ్డగోలుగా సంపాదించాడు…ఇదే కదా విమర్శ… పలు సభల్లో చంద్రబాబు కూడా విమర్శలు చేశాడు […]
ఇరాన్ మీద దాడికి ఇజ్రాయిల్ సమాయత్తం… భారీగా మిసైళ్ల దాడికి రెడీ…
పశ్చిమాసియా గగనతలంలో ప్రస్తుతం అతి తక్కువగా పౌర విమానాలు ఎగురుతున్నాయి. కొన్ని కథనాల ప్రకారం ఇప్పటికే ఇజ్రాయిల్ ఇరాన్ మీద భారీ ఎత్తున మిస్సైల్ దాడులకు రంగం సిద్ధం చేసింది. బహుశా ఈరోజు రాత్రే ఈ దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయిల్ ఇరాన్ అణు స్థావరాల మీద దాడులకు దిగితే అత్యంత తీవ్రంగా స్పందిస్తామని ఇప్పటికే హెచ్చరించింది. బహుశా ఇరాన్ వద్ద ఇప్పటికే అణుబాంబు ఉండవచ్చునని యుద్దరంగ నిపుణులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు ఇరాన్ […]
#Isupportnavyradar …. బీఆర్ఎస్ విజ్ఞత లేని గాయిగత్తర రాజకీయం…!!
#Isupportdamagundem #Isupportnavyradar ….. ఇదే డిస్క్లయిమర్… ఈ దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు, ఆలోచనలను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను… ఈ మాట చెప్పడానికి సందేహం అక్కర్లేదు, తడబాటు అక్కర్లేదు… స్ట్రెయిట్ స్టేట్మెంట్… ఎందుకు..? ఎందుకంటే..? దేశరక్షణ అత్యంత ప్రాధాన్యాంశం కాబట్టి… అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి మరీ కేంద్రం రక్షణ అంశాల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి కాబట్టి… రేవంత్ రెడ్డి సర్కారు అనివార్యంగా తన కర్తవ్యాన్ని తను […]
సీపీఐ నారాయణా… ఆ జాతీయ హోదాకు ఎదిగినా… ఓ వ్యక్తిగా నువ్వు ఎదగలేదు..!!
నో డౌట్… దురుసు వ్యాఖ్యలు, అనాలోచిత విమర్శలు, గందరగోళం ఆలోచనలతో అప్పుడప్పుడూ వార్తల తెర మీదకు వస్తుంటాడు గానీ… సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పార్టీ నిబద్ధత మీద గానీ, ప్రజాకోణం మీద గానీ నాకెలాంటి వ్యతిరేకత లేదు… లెఫ్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎదిగాడే తప్ప, తెలంగాణలోనే ఉంటాడు తప్ప, చాలామంది సంకుచిత ఆంధ్రా నాయకుల్లాగే తనకూ తెలంగాణ సంస్కృతి మీద అవగాహన లేదు, అభిమానమూ లేదు… తాజాగా అర్థమవుతున్నది అదే… ఈ మాట అనడానికి […]
విశ్వంభర..! సబ్జెక్టు విశ్వమంత విశాలం… హీరో మాత్రం అదే తెలుగు ‘చిరంజీవి’…
అందరూ గ్రాఫిక్స్ నాణ్యతను తిట్టిపోస్తున్నారు… అంతేకాదు, పలు ఇంగ్లిష్ సినిమాల క్రియేటివ్ అంశాల్ని ఎత్తుకొచ్చేశారంటూ, కాపీ సీన్లను కిచిడీ కొట్టారనీ విమర్శిస్తున్నారు… చిరంజీవి హీరోగా వచ్చే ఫాంటసీ చిత్రం విశ్వంభర టీజర్ మీద మొత్తానికి దుమ్మురేగుతోంది… నో, నో, మా మెగాస్టార్ సినిమా మీద కావాలనే యాంటీ ఫ్యాన్స్ దుష్ప్రచారం చేస్తున్నారని కొందరు బాధపడుతున్నారు… (యాంటీ ఫ్యాన్స్ అంటే ద్వేషులు అట… అభిమానులకు వ్యతిరేక పదం…) సాహో, బాహుబలి వంటి సినిమాల మీద ఇలాంటి విమర్శలు వచ్చాయా, […]
ఇది తెలంగాణ దసరా కానేకాదు… అసలు ఏమిటి తెలంగాణ దసరా అంటే..!!
ఇది నాకు తెలిసిన దసరా కాదు… ఇదీ నగరంలో బతికే ఓ మిత్రుడి వ్యాఖ్య… నిజమే… సరిగ్గా విశ్లేషించలేమేమో గానీ… తెలిసినవాళ్లెవరైనా చెప్పాలేమో గానీ… నిజంగానే ఇది మాకు తెలిసిన దసరా కాదు… కుప్పలుతెప్పలుగా సోషల్ సందేశాలు… ప్రతి దాంట్లోనూ దుర్గ బొమ్మతో కూడిన శుభాకాంక్షలు… నిజానికి తెలంగాణ సంస్కృతిని చిన్నప్పటి నుంచి ఎరిగినవాళ్లకు ఇదంతా కొత్త, భిన్నం… కాస్త చిరాకు కూడా… ఒక జమ్మి చెట్టు, ఒక పాలపిట్టతో వచ్చే సందేశాలు ఒకటీరెండు శాతం కూడా […]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9
- 10
- 11
- …
- 146
- Next Page »