ఎస్… సల్మాన్‌ఖాన్‌ను ఖతం చేయడానికి బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నం చేసింది… ప్లాన్ ఏ వర్కవుట్ కాకపోతే ప్లాన్ బీ అమలు చేయాలని అనుకుంది… సల్మాన్‌ను తన పన్వెల్ ఫామ్హౌజుకు వెళ్తుండగా చంపేయాలనేది ప్లాన్… 3 నెలలుగా రెక్కీ నిర్వహించింది… తను వచ్చే దారిలో ఏ గుంత లోతు ఎంత..? ఎక్కడ కారు స్లో అవుతుందో కూడా లెక్కలు వేసి పెట్టుకున్నారు… కారు స్లో అయినప్పుడే టార్గెట్ కొట్టేయాలని అనుకున్నారు… ఫామ్‌హౌజ్ సెక్యూరిటీ గార్డులను ఫ్యాన్స్ పేరిట మచ్చిక […]
అన్ని భాషల్లోకీ విస్తరణ… రెండేళ్లు టార్గెట్… ఆర్నబ్ గోస్వామి తాజా శపథం…
ఎన్డీటీవీలో ఆల్రెడీ అడుగుపెట్టిన ఆదానీ… క్రమేపీ దాన్ని కబళించడం ఖాయం..! దానితోనే ఆగిపోతాడా..? నెవ్వర్… అలా ఆగిపోవడానికి కాదుకదా ఎన్డీటీవీని మింగేస్తున్నది… ఇంకా చాలా విస్తరణ ప్రణాళికలు ఉంటయ్… అవి మెల్లిమెల్లిగా ఆచరణలోకి వచ్చేస్తయ్… వయాకామ్, నెట్వర్క్18 ద్వారా అంబానీ ఎక్కడికో వెళ్లిపోతున్నాడు… అనేక భాషల్లో డిజిటల్ న్యూస్, టీవీ న్యూస్, ఎంటర్టెయిన్మెంట్, బ్రాడ్‌కాస్టింగ్… ఇంకా విస్తరిస్తాడు… ఆదానీ ఎందుకు ఊరుకుంటాడు..? ఊరుకోడు… సరే, ఆదానీ మీడియా విస్తరణ ఖచ్చితంగా బీజేపీ ప్రయోజనాల కోసమే అని ఆరో […]
ఫాఫం సాక్షి… ఆమె ఇప్పుడు వైసీపీ కాదు, బీజేపీ మనిషి జగనన్నా…
ఎక్కడో ఓ చిన్న ఆశ… ఇంకా ఈ దేశంలో న్యాయవ్యవస్థ పనిచేస్తోందనీ… అక్రమార్కులకు శిక్షలు పడతాయనీ… ప్రత్యేకించి రాజకీయ నాయకులు ఈ దేశంలో శిక్షింపబడతారనీ… కొద్దిగా వెలుతురును ప్రసరింపజేసింది ఆ తీర్పు… రకరకాల విచారణలు, అప్పీళ్ల దశలు దాటి, ఇంకా ఎన్నాళ్లో సాగీ సాగీ చివరకు ఏం అవుతుందో తెలియదు గానీ… ఈరోజుకైతే అది ప్రధాన వార్తే… కానీ..? మన టీవీలు, మన పత్రికలు, మన సైట్లు, మన యూట్యూబర్లు, మన సోషల్ మీడియా… దాన్నసలు పట్టించుకోలేదు… […]
జైళ్లు కిటకిట… కానీ ఎందుకలా లక్షల్లో కుక్కేస్తున్నారు… ఏవీ సంస్కరణలు..?
అస్సోం సీఎం హిమంత విశ్వశర్మను ఈ విషయంలో మెచ్చుకోవాలి… నిజానికి యూపీ సీఎం యోగీ చేయాల్సిన పని ఇది… తన బుర్రలోకి ఈ ఆలోచన ఎందుకు రావడం లేదో తెలియదు… అస్సోంలో 4 లక్షల పెండింగ్ కేసులున్నయ్… జైళ్లు నిండిపోయినయ్… ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నయ్… తీసుకొచ్చి జైళ్లలో కుక్కుతున్నారు… నేరాలు పెరిగిపోతున్నాయనేది కాదు ఇక్కడ ఇష్యూ… చిన్నాచితకా కేసుల్లో కూడా వేలాది మందిని జైళ్లలోకి తోసేస్తున్నారు… తద్వారా… జైళ్లపై భారం, కిటకిట, అనారోగ్యాలు, వాళ్లను ప్రజల […]
ఈనాడు, జ్యోతి భారీ ఫాల్… హైదరాబాద్‌లో ఈనాడును కొట్టేసిన సాక్షి…
కరోనా సమయంలో ప్రతి పత్రిక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంది… పేపర్ బాయ్స్‌ను అసలు చాలా లొకాలిటీల్లోకి ప్రజలు రానివ్వలేదు… చాలా పత్రికలు అనివార్యంగా తమ సర్క్యులేషన్‌ను తగ్గించుకున్నాయి… అనగా తాము ప్రింట్ చేసే కాపీల్ని కట్ చేసుకున్నాయి… కొన్ని పత్రికలు ప్రింటింగ్ మానేసి, నామ్కేవాస్తే ప్రభుత్వ ప్రకటనల కోసం కొన్ని కాపీలు ప్రింట్ కొడుతూ, వాట్సప్ ఎడిషన్లు పెట్టేసుకున్నాయి… పెద్ద పెద్ద మీడియా సంస్థలే అన్నీ మూసుకుని, డిజిటల్ ఎడిషన్ల వైపు మళ్లిపోయాయి… మరి అప్పుడెప్పుడో 2019లో […]
‘‘తెలంగాణ తల్లి అంటే గడీల్లో దొరసాని కాదు… రూపాన్ని కూడా మార్చేస్తాం…’’
తెలంగాణ తల్లి అంటే… తెలంగాణ ప్రభుత్వం ప్రతిచోటా ప్రతిష్టించిన విగ్రహాల్లో… ఒక చేతిలో బతుకమ్మ… మరో చేతిలో మక్క కంకి, జొన్న కంకి… తలపై కిరీటం… పట్టు చీరె… బంగారు హారాలు, వడ్డాణం, గాజులు… సర్వాలంకార శోభిత స్వర్ణ తెలంగాణ ఆమె… ఇన్నేళ్లూ ఆమెకే ప్రణమిల్లుతున్నాం కదా… నిజానికి తెలుగు తల్లికీ తెలంగాణ తల్లికీ పెద్ద తేడా ఏమీ ఉండదు… తెలుగు తల్లి అయితే ఒక చేతిలో కలశం, మరో చేతిలో వరికంకులు ఉంటయ్… అంతే తేడా… […]
తప్పుడు వార్తలకు అది చిరునామా… కొన్ని నిజాలు రాయకతప్పడం లేదు…
పార్ధసారధి పోట్లూరి ……. ఎవ్వరు ఏమనుకున్నా సిగ్గేమిటి నాకు ? ఆ పత్రిక ధోరణి అదే… భారత దేశ ఆర్ధికాభివృద్ధి మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు వ్రాసే న్యూయార్క్ టైమ్స్ ఆ మాటకొస్తే డబ్బులు తీసుకొని ఎవరు ఎలా చెపితే అలా వ్రాస్తుంది న్యూయార్క్ టైమ్స్. చివరకి భారత దేశ ఆర్ధికాభివృద్ధి ఈ సంవత్సరం 7% ఉండబోతున్నది అంటూ బాధతో వాపోయింది గతి లేక… ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్ధికంగా దిగజారుతున్న సమయంలో ఒక్క భారత దేశమే […]
సింపుల్ స్టోరీయే… అంబానీ వదిలేశాడు… అదానీ గుప్పిట పట్టాడు…
హరి క్రిష్ణ ఎం. బి……. NDTV – Adani కథ.. టూకీగా… NDTV అంటే New Delhi TeleVision .. ఇది 1994-95 ప్రాంతంలో పెట్టారు… ప్రణయ్ రాయ్ (PR) రాధికా రాయ్ (RR) కలిసి పెట్టారు… తర్వాత పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయ్యింది… NDTV లో ఇద్దరూ తమ సొంత పేర్ల మీద తలా 12% అలాగే ఇంకో holding company (RRPR holding ltd) పేరు మీద ఒక 26% ఉంచుకున్నారు.. మిగతాది వేరే […]
రష్యా ఎక్కడ తప్పు చేసింది..? ఉక్రెయిన్ యుద్ధం ఓ గుణపాఠం… (పార్ట్-2)
రష్యన్ వ్యూహకర్తల వెన్నుపోటు ? ముందుగా చరిత్రలోకి వెనక్కి వెళ్ళి, ఒక సంఘటనని ప్రస్తావిస్తే కానీ ఇప్పటి రష్యా వెనకబాటుకి కారణం అర్ధం అవదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అడాల్ఫ్ హిట్లర్‌తో యుద్ధ వ్యూహాలని చర్చించే ఒక జనరల్ ఫెడోర్ వాన్ బాక్ [Fedor von Bock] హిట్లర్‌తో గొడవపడ్డాడు. అది ఆపరేషన్ బ్లూ కేస్ [Operation Blue Case (Stalingrad and the Caucasus) కి సంబంధించి వ్యూహ రచన సందర్భంగా… ఈ ఆపరేషన్ రష్యాలోని […]
ఉక్రెయిన్ను మింగలేక రష్యా సైన్యం వెనక్కి…! పుతిన్‌కు తలబొప్పి… (పార్ట్-1)
పార్ధసారధి పోట్లూరి ………. ఉక్రెయిన్‌లోని ఖారఖీవ్ నుండి తన సైన్యాన్ని వెనక్కి తీసుకున్న రష్యా ! దాదాపుగా 6 నెలలకి పైగా కొనసాగుతున్న రష్యన్ స్పెషల్ ఆపరేషన్ ఇన్ ఉక్రెయిన్ తుది దశకి చేరుకుంటున్నది! చేయాల్సిన యుద్ధం ఆయుధాలతో కాదని ఆర్ధికంతో అని పుతిన్‌కి తెలిసి వచ్చినట్లుంది ! *************** 8 ఏళ్ల క్రితం క్రిమియాని ఎలాంటి ప్రతిఘటన లేకుండా స్వాధీనం చేసుకున్న పుతిన్ గత ఫిబ్రవరిలో కూడా అదే రీతిలో డోన్బాస్ [Donetsk and Luhansk] […]
‘కృష్ణంరాజు మరణ వార్తల’ కవరేజీకి తెలుగు మీడియా సొంత లెక్కలు..!!
మహావృక్షం నేలకొరిగింది… వంటి పదాల్ని నేను వాడదల్చుకోలేదు… కానీ కృష్ణంరాజు మరణం తప్పకుండా మీడియాకు ప్రయారిటీ వార్తే… తన మరణం తాలూకు కవరేజీని తక్కువ చేయడానికి నిన్న అంత పెద్ద కొంపలు మునిగే అధిక ప్రయారిటీ వార్తలు ఏమీలేవు కూడా… పైగా నిన్నంతా టీవీలు, సైట్లు, ట్యూబ్ చానెళ్లు రకరకాల వార్తలతో హోరెత్తించాయి… పాత సంగతులన్నీ పూసగుచ్చాయి… మరి తెల్లవారి పత్రికల్లో ఏముండాలి..? కొత్తగా ఇంకేం చెప్పాలి..? ఎప్పటిలాగే ఈ ప్రశ్న తెలుగు మీడియాను వేధించింది, ఎప్పటిలాగే […]
కుమారస్వామీ… నీ జేడీఎస్‌ను మా కేసీయార్ పార్టీలో విలీనం చేస్తవా..?!
పారడాక్స్… అంటే ఒక వాక్యంలో రెండు వేర్వేరు అర్థాలు పరస్పరం వ్యతిరేకించుకుంటాయి… నిన్న కుమారస్వామి వచ్చి కేసీయార్‌తో సుదీర్ఘంగా చర్చించాడు… కమాన్, జాతీయ పార్టీ పెట్టెయ్, దేశమంతా తెలంగాణ మోడల్ కోరుకుంటోంది, నేను సంపూర్ణంగా మద్దతునిస్తా, ప్రాంతీయ పార్టీల సమాఖ్యే ఇప్పుడు దేశానికి అవసరం అని కేసీయార్‌ను ప్రోత్సహించాడు… దేశ్‌కీనేతా కేసీయార్ అని నినదించినట్టే… మీడియా సహజంగానే ఫుల్ కవరేజీ ఇచ్చింది… ఐతే, ఇక్కడ చాలా విషయాలు, వాళ్ల మాటలు పారడాాక్స్… కేసీయార్ అడుగులు అంత త్వరగా […]
దొంగ సొత్తును వాపస్ ఎవరిస్తారు..? కోహినూర్‌ను బ్రిటిషర్లు ఎందుకిస్తారు..?!
‘‘మన కోహినూర్ వజ్రాన్ని మనం మళ్లీ తెచ్చుకోవాలి…’’ ఇదీ దేశప్రజల నుంచి చాన్నాళ్లుగా వినిపించే డిమాండే… ఇప్పుడు ఆ బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణించాక ఈ డిమాండ్ మరింత పెద్దగా వినిపిస్తోంది… విదేశీయులు ఎక్కడెక్కడి నుంచో దొంగిలించుకుపోయిన, పురాతన విలువ కలిగిన బోలెడు కళాఖండాల ఆచూకీ కనిపెట్టి మరీ, పట్టుకొస్తున్నాం కదా… కోహినూర్ తీసుకురాలేమా..? అనే ప్రశ్న పదే పదే వినిపిస్తోంది… నిజమేనా..? అది సాధ్యమేనా..? దాన్ని దొంగిలించబడిన వస్తువుల జాబితాలో చేర్చగలమా..? ముందుగా ఓ కీలక […]
చైనా తత్వమే మోసం… అది బంగ్లాదేశ్‌ను కూడా ముంచేస్తోంది ఇలా…
పార్ధసారధి పోట్లూరి ……… చైనా భస్మాసుర హస్తం బంగ్లాదేశ్ మీద కూడా పెట్టింది ! బంగ్లాదేశ్ లో చైనా కంపనీలు పన్ను ఎగవేసినట్లు తాజాగా చేసిన ఆకస్మిక దాడులలో బయటపడ్డది! ఇప్పటికే మన దేశంలో చైనా మొబైల్ సంస్థలు అయిన వివో, అప్పో, షియోమీ, హువావే లు పన్ను ఎగవేత కేసులని ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. మన దేశంలో చేసినట్లే బాంగ్లాదేశ్ లో కూడా చైనా సంస్థలు పన్ను ఎగవేతకి పాల్పడ్డాయి. బంగ్లాదేశ్ కి చెందిన లైవ్ […]
రాహుల్ వెంబడి ఓ కంటైనర్ దండు… కొన్ని ఇంట్రస్టింగ్ విశేషాలు…
రాజకీయ నాయకుల పాదయాత్రలు ఇప్పుడు కామన్… చిన్న చిన్న లీడర్లు కూడా పాదయాత్రలు ప్లాన్ చేసి, నడిచేస్తున్నారు… రాహుల్ గాంధీ కూడా ఓ సుదీర్ఘ యాత్ర ప్రారంభించేశాడు… భారత్ జోడో యాత్ర దాని పేరు… నిజానికి ఎప్పుడో జరగాల్సిన యాత్ర ఇది… 3570 కిలోమీటర్లు… కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా… 5 నెలలు… 12 రాష్ట్రాలు… ఓ పెద్ద ప్రశ్న… తనకు ఎఐసీసీ అధ్యక్ష పదవి వద్దంటాడు… కానీ కాంగ్రెస్ నిర్ణయాలన్నీ తనవే… హైకమాండ్ అంటే తనే… […]
మోడీ నిజంగానే అంబానీ 5జీ పల్లకీని మోశాడా..? పార్ట్- 2
పార్ధసారధి పోట్లూరి …….. కొన్ని పార్టీల ప్రచారం ఎలా ఉందో చూడండి… ప్రభుత్వం రాకెట్ల ద్వారా ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపి, వేల కోట్లు ఖర్చు పెడితే అంబానీ దానిని ఉచితంగా వాడుకుంటున్నాడు అట… ముఖేష్ అంబానీ వేలంలో పాల్గొని కొన్న స్పెక్ట్రమ్ విలువ Rs 88,078 వేల కోట్లు… ఈ డబ్బు దేనికి ఇస్తున్నాడు ప్రభుత్వానికి ? స్పెక్ట్రమ్ ని వాడుకుంటున్నందుకు కాదా ? స్పెక్ట్రమ్ ఏమైనా గాలిలో నుండి పుడుతుందా ? అంబానీ కట్టే 88 […]
మోడీ 5G స్కామ్‌కు పాల్పడ్డాడా…? అసలు నిజాలేంటి..? పార్ట్- 1
పార్ధసారధి పోట్లూరి ……. 5G స్పెక్ట్రమ్ [5G Spectrum] వేలంలో కుంభకోణం జరిగింది ! గత నెల రోజులుగా ఒక సెక్షన్ మీడియా, నాయకులు చేస్తున్న ప్రచారం ఇది! ఇందులో వాస్తవం ఎంత ? నిజంగా లక్షల కోట్ల కుంభకోణం జరిగే చాన్స్ ఉందా అందులో..? లేక బట్ట కాల్చి మీద వేయడమే ప్రస్తుత రాజకీయం కాబట్టి, ఆ ప్రచారం సాగుతోందా..? టెలికాం స్పెక్ట్రమ్.., అది ఎలా పనిచేస్తుంది లేదా దానిలో ఉండే సాధకబాధకాలు అన్నీ డబ్బు […]
జగన్‌ను తిట్టేదే కదా… యెల్లో క్యాంపు రచనే కదా… ఈనాడు కుమ్మేసింది…
రాజకీయ ప్రత్యర్థులపై దాడికి తెలుగుదేశం శిబిరం అనుసరించే విధానాలు యూనిక్… బహుశా ప్రపంచంలోనే ఇలా బహుముఖ దాడులు చేసేవాళ్లు ఉండరేమో… మొదట ఈనాడులో గానీ, ఆంధ్రజ్యోతిలో గానీ (ఇప్పుడు ఏబీఎన్, టీవీ5 చానెళ్లు జతకూడాయి… అప్పట్లో టీవీ9 కూడా…) వార్తలు వేస్తారు… తరువాత వాటి ఆధారంగా పలుచోట్ల యెల్లో లీడర్లు ప్రెస్మీట్లు పెడతారు… మళ్లీ అవి వార్తలుగా వస్తాయి… రకరకాల ఆరోపణలతో పెద్ద పోస్టర్ ప్రిపేర్ చేస్తారు, దాన్ని ఆవిష్కరిస్తూ చంద్రబాబు ప్రెస్‌మీట్… ఈనాడు ఫుల్ పేజీ […]
బెంగుళూరు ఎందుకు మునిగిపోతోంది..? కారణాలపై అసలైన విశ్లేషణ..!!
పార్ధసారధి పోట్లూరి ……….. బెంగుళూరు వరదలని అదుపు చేస్తారా ? లేక ఎన్నికలకి వెళదామా ? కర్ణాటక pcc అధ్యక్షుడు DK శివకుమార్ ఛాలెంజ్ ! అవునా ? బెంగళూరు వరదలని అదుపు చేయలేకపోతే ఎన్నికలు జరపాలా ? DK శివకుమార్ ఛాలెంజ్ ని గట్టిగా ఎదుర్కోలేని కర్ణాటక బిజేపి నాయకులు. అసలు మూల కారణానికి బాధ్యులు ఎవరో గట్టిగా చెప్పలేని స్థితిలో కర్ణాటక బిజేపి నాయకత్వం! ప్రస్తుతం బెంగళూరుని ముంచెత్తుతున్న వరదలకి కారణం ఏమిటో ప్రస్తుత […]
అపోలోకు చికిత్సకు వెళ్లిన నిమ్స్ డైరెక్టర్… వార్త చదవడానికే ఏదోలా ఉంది…
నిజమే… ఒక వార్త కలిచివేసినట్టయింది… హైదరాబాద్ నిమ్స్‌కు బోలెడంత ప్రతిష్ట ఉంది… ఇతర దేశాలు సహా, ఎక్కడెక్కడి నుంచో రోగులు వస్తారు… అత్యంతాధునిక సౌకర్యాలు, వీవీఐపీలకు కూడా ట్రీట్మెంట్లు, నిపుణులైన డాక్టర్లు… వాట్ నాట్..? ఏ ప్రఖ్యాత కార్పొరేట్ హాస్పిటల్‌కు ఏమాత్రం తీసిపోదు… కానీ దాని అధిపతే తన చికిత్స కోసం అపోలో హాస్పిటల్లో చేరాడు… తద్వారా ఆ హాస్పిటల్ ప్రతిష్టను, అక్కడి డాక్టర్ల నైపుణ్యాన్ని, ఉద్యోగుల ప్రతిభను, స్థూలంగా ప్రభుత్వం పరువును కూడా నిలువెత్తు లోతులో […]
- « Previous Page
- 1
- …
- 88
- 89
- 90
- 91
- 92
- …
- 146
- Next Page »