కొన్ని కథలు ఇంతే… ఎవరిదీ తప్పు అని ఒకేసారి నిర్ధారణగా చెప్పలేం… బాహుబలి తరువాత ప్రభాస్ సరైన ప్లానింగుతో ఈరోజు పాన్ ఇండియా స్టార్‌గా వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు… తనతో సరిసమానంగా బాహుబలి విజయాన్ని ఎంజాయ్ చేసిన రానా మాత్రం సరైన పాత్రల ఎంపిక లేక, కెరీర్ ప్లానింగ్ సరిగ్గా లేక ‘అరణ్య’లు, 1945, విరాటపర్వం గట్రా చేస్తూ నానాటికీ మెట్లు దిగుతున్నాడు… సర్లె, ఎవరి అదృష్టానికి ఎవరు బాధ్యులు..? డెస్టినీ డిసైడ్స్…!! 1945 […]
ఇదేం పైత్యమో… ఓ హిట్ సినిమాకు మరో సినిమా పేరుపెట్టి సీక్వెల్‌గా విడుదల…
తెలుగు ప్రేక్షకులు ఉత్త అజ్ఞానులు అనేది తమిళ నిర్మాతలు, దర్శకుల బలమైన అభిప్రాయం… వాళ్ల సినిమాల్ని మనమీద రుద్దే విధానం అలాగే ఉంటుంది… ఇష్టారాజ్యంగా డబ్ చేసేసి వదుల్తుంటారు… ప్రత్యేకించి కమర్షియల్ సినిమాల్లోని ఆ పాటలు, ఆ మాటలు, ఆ సీన్లు ఓ అరాచకం… (ఉదాహరణ… అపరిచితుడు సినిమాలో కొండాకాకీ కొండేదానా, గుండిగలాంటి గుండేదానా, అయ్యారేట్టు పళ్లదానా, మట్టగిడస కళ్లదానా… కాళిదాసు దగ్గర్నుంచి లక్షల మంది రచయితలు ఆడదాన్ని కోటి రకాలుగా వర్ణించారు గానీ… ఇలా అండలు, […]
బహుశా సిద్ధార్థ్ ఇప్పట్లో లేవకపోవచ్చు… ఆ ప్రభావం శర్వానంద్‌పై కూడా…
కొందరిని చూస్తే జాలేస్తుంది… హీరో సిద్ధార్థ్‌ను చూసినా అంతే… ఒకప్పుడు తెలుగులో పాపులర్ హీరో… మంచి లవ్ బాయ్ ఇమేజీతో కుమ్మేశాడు… తరువాత గ్రహణం పట్టింది… అప్పుడప్పుడూ తన స్థాయికి మించిన ఏవో రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ నెటిజనంతో తిట్లు కూడా తింటుంటాడు… తమిళానికే పరిమితమయ్యాడు… అసలు తెలుగులో ఓ హిట్ లేక ఎన్నేళ్లయింది..? మొహంలో కూడా ఆ కళ లోపించింది… ఆమధ్య శర్వానంద్‌తో కలిసి ఓ సినిమా చేశాడు… సిద్ధార్థ్ దురదృష్టం శర్వాకు కూడా పట్టినట్టుంది… […]
నిజమే… నాగార్జున ‘‘వేరే ప్రాబ్లమ్స్’’ ముందు టికెట్ల ధరల ప్రాబ్లమ్ ఎంత..?!
నిఝంగా టికెట్ల ధరల తగ్గింపు మీద నాగార్జునకు అసంతృప్తి లేదా..? ఉంది… ఉండక ఎలా ఉంటుంది..? ఇండస్ట్రీ పట్ల జగన్ ధోరణి మార్చుకోవాలని అడగడానికి, సంప్రదింపులు జరపడానికి వెళ్లిన బృందంలో తను కూడా ఉన్నాడు కదా… ఆ నలుగురు హీరోలేనా అని మోహన్‌బాబు శోకాలు పెట్టిన టీంలో నాగార్జున కూడా ఉన్నాడు కదా…! నిజానికి పాన్ ఇండియా సినిమాలైతే ఏపీలో కాకపోతే ఇంకెక్కడో క్లిక్కయితే డబ్బులొచ్చేస్తాయి… కానీ నాగార్జున బంగార్రాజు ప్యూర్ తెలుగువాళ్లకు మాత్రమే కనెక్టయ్యే సినిమా… […]
అటు వర్మ, ఇటు పేర్ని… మరిచిపోయిన ఓ పాత NTR ముచ్చట..!
గుర్తుకొస్తున్నాయీ … గుర్తుకొస్తున్నాయీ … (… By… రంగావఝల భరధ్వాజ) ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు గురించి గొడవ జరుగుతోంది కదా … నాకు ఎన్టీఆర్ సిఎంగా ఉన్న రోజుల నాటి ఓ విషయం గుర్తొస్తోంది.ఇది వర్మగారికీ … ఇతరులకీ తెల్సి చావదని చెప్పడం లేదుగానీ .. గుర్తుందో లేదో అని సరదాగానే చెప్పేడుస్తున్నా …హోటళ్ల వారు జనాలను దోచుకుతినేస్తున్నారని ఓ ఫైన్ మార్నింగ్ ఎన్టీఆర్ కు అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది […]
ఎడమ భుజం కూడా రెడీ అయిపోయింది… ఇక ఒక్కొక్కడి దవడ పగిలిపోద్ది…
కదిలిస్తే చాలు, ఏ సెలబ్రిటీ అయినా సరే, సోషల్ మీడియాలో ఇలా రాశారు, ఈ చెత్తా వీడియో రిలీజ్ చేశారు, బాధ్యత లేదు, నాన్సెన్స్, ట్రాష్, ఫాల్స్ అంటూ ఏడుస్తుంటారు… నాలుగురోజులు ఏదో ఒక ప్రచారం లేకపోతే కూడా వాళ్లే ఏడుస్తారు… ఏదోరకంగా ప్రచారంలోకి రావాలని చూస్తారు… ఇవ్వాళారేపు మెయిన్ స్ట్రీమ్ వార్తల్లో ఏం రాసుకున్నా, రాయకపోయినా, చూపినా, చూపకపోయినా డోన్ట్ కేర్… సోషల్ మీడియాలో స్పందనే చూస్తున్నారు… అందుకే యూట్యూబులో ఇన్ని వ్యూస్, ఇదుగో ఇలాంటి […]
అదే పనిని మన స్టారాధిస్టారులు చేస్తారా..? అబ్బే, లెవల్ తగ్గిపోదూ…!!
నిజమే, ఓ తెలుగు పత్రికలో కనిపించింది ఓ ఇంట్రస్టింగ్ అబ్జర్వేషన్… బాలీవుడ్లో హీరోలుగా చెలామణీ అయ్యే పాపులర్ నటులు కూడా ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల్లో కేరక్టర్ పాత్రలు చేయడానికి సిద్ధపడుతున్నారు… చాలా ఉదాహరణలు కూడా కనిపించాయి… అభినందనీయం… అసలు వాస్తవంగా హీరో అనే పదానికే అర్థం లేదు… జస్ట్, లీడ్ యాక్టర్, లేదా లీడ్ యాక్ట్రెస్… ఈ హీరోయిజాన్ని జనం మీద రుద్ది, ఫ్యానిజాన్ని పెంచి, కంపుకంపు చేసింది మన టాలీవుడ్… అఫ్కోర్స్, కొంతవరకు కోలీవుడ్ […]
తమన్ మాత్రమేనా..? మణిశర్మ కూడా మనఖర్మే… సానాకష్టం బాసూ…
అబ్బే, ఒక్క తమన్ మాత్రమే అనుకున్నారా..? నో, నో… అందరూ అలాగే తయారయ్యారు… కొత్త ట్యూన్లు కట్టే క్రియేటివిటీ లేదు, పోయింది, కొత్తవాళ్లను రానివ్వరు… ఏదో పాత సినిమాల్లో పాటల్నో, విదేశీ పాటల్లోని ట్యూన్లలో కాపీ కొట్టేయడం, దానికి తెలుగు పదాల వాసనను తగిలించి జనం మీదకు వదిలేయడం… మణిశర్మ కూడా మనఖర్మ అనిపించుకోవడం తాజా విషాదం… ఏమో, అంతకుముందు ఏమేమున్నాయో తెలియదు గానీ తాజాగా ఏకంగా చిరంజీవి పాటకే ఓ పాత హిందీ పాట ట్యూన్ […]
బరోజ్..! నిధిరక్షకుడు..! మోహన్‌లాల్ ఏ వేషమైనా వేస్తాడు, ఏ కథైనా చేస్తాడు..!
మోహన్‌లాల్… ఓ గుండు, బవిరిగడ్డం… పురాతనకాలం నాటి వస్త్రధారణ… అదోరకం లుక్కుతో తన కొత్త సినిమా బరోజ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశాడు… ఎంత సూపర్ స్టార్లు అయినాసరే మలయాళ హీరోలు కొత్త వేషాలకు, ప్రయోగాలకు సై అంటారు… కథ హీరోయిజాన్ని ప్రమోట్ చేయాలే తప్ప కావాలని హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లను ప్రేక్షకులకు రుద్దరు… కథ ఎంతమేరకు పర్మిట్ చేస్తే అంతే బడ్జెట్… నేలవిడిచి సాము ఉండదు, మన తెలుగు హీరోల్లా సుప్రీం, సూపర్ నేచురల్, […]
బాబ్బాబు, మోహన్‌బాబు గారు… మీరే ఓమాట చెప్పి జగన్‌ను ఒప్పించొచ్చు కదా…
ఎవరన్నారు మోహన్‌బాబు మౌనం చేతకానితనం అని… చేవలేనితనం అని… ఎవరయ్యా..? ఇలా ముందుకురండి ఓసారి… మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండే కేరక్టర్లా కనిపిస్తున్నాడా..? శ్రేయోభిలాషులు వద్దన్నా సరే మౌనంగా ఉండిపోయేరకం అనుకున్నారా..? నో, నెవ్వర్… సినిమాను బతికించడానికి ఏం చేయడానికైనా రెడీ… ఏం తనను పిలిచారా..? కలిసి వెళ్దాం- రమ్మన్నారా..? జగన్ మీ చుట్టమే కదా, మీరు వస్తే మన ప్రయత్నాలకు సానుకూలత వస్తుంది, జగన్ ప్రభుత్వం దగ్గర మీ మాటలకు బరువుంది, విలువుంది, మీరు […]
పెద్దరికం అక్కర్లేదని చిరంజీవి ఎందుకన్నాడు..? ఏ తత్వం బోధపడింది..?!
నిజానికి చిరంజీవి అన్నదాంట్లో అనుభవం ఉంది, నిజాన్ని తెలుసుకున్న పాఠం ఉంది… పెద్దరికం అంటే అదెంత చిక్కుముడో తెలుసుకున్నట్టే ఉంది… తనేమన్నాడు అంటే..? ‘‘ఇండస్ట్రీ పెద్దరికం అనే హోదాలు, బాధ్యతలు నాకు వద్దు, పెద్ద అనిపించుకోవాలనీ లేదు… ఇండస్ట్రీకి ఆరోగ్యం, ఉపాధి వంటి సమస్యలు, సంక్షోభాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓ ఇండస్ట్రీ బిడ్డగా ముందుకొస్తా, బాధ్యత తీసుకుంటా, అదీ అవసరమైన సందర్భాల్లో మాత్రమే… అంతేతప్ప ఇద్దరి పంచాయితీలకో, రెండు యూనియన్ల తగువులకో తగుదునమ్మా అని దూరలేను’’ అని […]
ఏపీలో అదొక ఎక్స్ట్రీమ్… తెలంగాణలో ఇదో ఎక్స్ట్రీమ్…. భలే ప్రభుత్వాలు…!!!
ఒక మీమ్ చూడండి… మీమ్ అంటే ఓ సెటైర్… ఓ జోక్… అంతే అనుకుంటున్నారా..? కాదు… మీమ్ అంటే ఓ విశ్లేషణ… రియాలిటీ కూడా…! ఒక కార్టూన్, ఒక ఫోటో వంద వార్తా కథనాలను విప్పి చెప్పినట్టే… ఒక మీమ్ కూడా అంతే… ఇది కూడా అంతే… తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో టికెట్ రేట్లు పెంచింది… ఎగ్జిబిటర్ల మాఫియా అంటే మామూలుది కాదు కదా… అది తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేసింది… ఇదేమీ జగన్ ప్రభుత్వం […]
దిల్ రాజయ్యా… హీరో అంటే ఎవరు..? ఆర్టిస్ట్ అంటే ఎవరు..? క్లారిటీ ప్లీజ్..!
‘‘శ్రీ విష్ణును హీరో అనాలో, ఆర్టిస్టు అనాలో నాకు తెలియడం లేదు. కానీ సినిమాను లీడ్ చేస్తున్నప్పుడు హీరో అనే అంటాం. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశాలను ఇస్తూ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఏదో ఒక రోజు అతని ప్రయత్నం పెద్దవాడ్ని చేస్తుంది. అయితే తన ప్రయత్నాలను మాత్రం శ్రీ విష్ణు ఆపకూడదు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు…. ఇదీ ఒక వార్త.. శ్రీవిష్ణు నటించిన అర్జున ఫల్గుణ […]
అఖండ తమనుడు ఎందుకు హఠాత్తుగా భుజాలు తడుముకున్నట్టు..?!
ఓ సమయం వస్తుంది… అన్ని వివాదాలు ఒక్కసారిగా చుట్టుముడతయ్… ఎవరుపడితే వాళ్లు రాళ్లేస్తరు… వెక్కిరిస్తరు… దుర్దినాలు… నాని అనుభవిస్తున్నది అదేనేమో… లేకపోతే కాపీ ట్యూన్ల సంగీత దర్శకుడు అని పేరుగాంచిన తమన్ కూడా నానికి నీతులు చెబుతున్నాడు ట్విట్టర్లో… విషయం ఏమిటంటే..? నాని ఏపీలో సినిమా టికెట్ల ధరలపై తన అభిప్రాయం చెప్పాడు… పవన్ గొంతెత్తినప్పుడే అండగా నిలిస్తే బాగుండేదన్నాడు… థియేటర్లను కిరాణాకొట్లతో పోల్చాడు… దాంతో సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది… వైసీపీ కస్సుమంది… రోజా సహా పలువురు […]
కాస్త నోర్మూసుకోవోయ్…! నానికి దాదాపు ఇదే భాషలో నిర్మాతల హెచ్చరిక…!!
‘‘వీ ఫ్లాప్, టక్ జగదీష్ ఫ్లాప్… ఈ స్థితిలో నాని సినిమా రిలీజుకు ముందు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు… దీంతో బయ్యర్లు ఎవరూ రాలేదు… బిజినెస్ అనుకున్నట్టు జరగలేదు… దాంతో నిర్మాతే పలుచోట్ల సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు… నాని కూడా తన 8 కోట్ల రెమ్యునరేషన్లో 5 కోట్లు వాపస్ ఇచ్చాడు…’’ ఇదీ ఎక్కడో కనిపించిన వార్త… నిజానిజాలు పెరుమాళ్లకెరుక… కానీ నానికి తెలుగు చిత్రసీమ ఓ షాక్ ఇచ్చింది… నాలుకకు అదుపు అవసరం అనే నిజాన్ని […]
శ్యామ్‌సింగరాయ్… ఓ కొత్త వివాదంలో దర్శకుడు రాహుల్ తప్పు ఎంత..?
శ్యామ్ సింగరాయ్ సినిమా మీద అకస్మాత్తుగా ఓ వివాదం చెలరేగింది… హిందూవాదుల నుంచి ప్రత్యేకించి ఒక డైలాగ్ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది… సోషల్ మీడియాలో సదరు సినిమా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ మీద మాటల దాడి సాగుతోంది… ఆ డైలాగ్ ఏమిటంటే..? ‘‘కులం కాళ్లు పట్టుక్కూర్చోవడానికి ఇదేమీ రుగ్వేదం కాదు, స్వాతంత్ర్య భారతం….’’ ఓ కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్టుగా పెరిగిన ఓ నాస్తిక దర్శకుడు కావాలనే హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా రుగ్వేదానికి తప్పుడు బాష్యం […]
చివరకు వర్మ కూడా..!! ఓ పాత నక్సల్ పాటను కొత్త సినిమాలో దింపేశాడు..!!
ఆశ్చర్యం అనిపించింది… మన తెలుగులో చాలామంది దర్శకులు, సంగీత దర్శకులకు పాత పాపులర్ బాణీల్ని, విదేశీ బాణీల్ని కాపీ కొట్టడం అలవాటే… వాటి మీద వివాదాలు చూస్తూనే ఉన్నాం… కథలు, సీన్ల మీద కూడా ఈ వివాదాలు ఉన్నవే… కానీ వర్మ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నా సరే, ఒకప్పటి మంచి దర్శకుడు ఇప్పుడు పాతాళ స్థాయికి పడిపోయిన తీరు మీద తనపై జాలి, సానుభూతి కూడా వ్యక్తమవుతున్న తీరు కూడా చూస్తున్నదే… అయితే కథ, ట్యూన్లు, […]
ఫోన్లలో తెగ వీడియోలు చూస్తున్నారు సరే… ఓటీటీల్లో దేని ‘దమ్ము’ ఎంతో తెలుసా..?
ఈ సినిమా ఫలానా ఓటీటీలో చూడండి… ఆ వెబ్ సీరిస్ ఈ ఓటీటీలో చూడండి… ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు, ముచ్చట్లు, పోస్టులు ఎక్కువైపోయాయి కదా… ఎన్ని ఓటీటీ చందాలు కట్టగలడు ఒక ప్రేక్షకుడు..? దాదాపు 40 ఓటీటీ ప్లాట్‌ఫారాలు ఉన్నాయి ఇండియాలో… ఓ 30 మనకు అక్కరలేదు అని తీసేసినా, పది ఓటీటీల్లో చూడబుల్ కంటెంట్ ఉంటుందని అనుకున్నా, వాటన్నింటికీ చందాలు కట్టేంత స్థోమత ఉందా సగటు ప్రేక్షకుడి దగ్గర..? అవును గానీ, అసలు ఇండియాలో ఎంత […]
కృష్ణ డిష్యూం డిష్యూం సినిమాల వెనుక అసలు కెమెరా హీరో ఈయనే..!
…… By…… Bharadwaja Rangavajhala……….. పుష్పాల గోపాలక్రిష్ణ ఈయన పేరు క్రిష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. క్రిష్ణ గారి సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా క్రుషి చేస్తారు. ఈ ఏరియాలో పుష్పాల గోపీక్రిష్ణ కాస్త పాపులర్. విఎస్ఆర్ స్వామి తర్వాత ఈయనే క్రిష్ణ సినిమాలకు కెమేరా […]
కీరవాణి ఐతేనేం..? తప్పని కాపీ బాట..! మదనా సుందరి పాట ట్యూన్ ఎత్తేశాడు..!
వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటారు… లబ్దిప్రతిష్టులు మస్తు వర్క్ చేస్తున్నారు అంటారు… ఘనకీర్తి కలిగిన పెద్ద తలకాయలకు మస్తు క్రియేటివిటీ ఉంది అంటారు… తీరా చూస్తే ఏదో తెలంగాణ జానపద గీతం ట్యూన్‌ను కాపీ కొట్టడం, ఢమఢమ కొత్త వాయిద్యాలతో ఒరిజినల్ ట్యూన్ మధురిమను భ్రష్టుపట్టించడం… ఎందుకీ భావదరిద్రం అంటారా..? తెలంగాణ లైఫ్ ఉన్న ఫోక్ వాళ్లకు అంతుపట్టదు, కాపీ కొట్టేయడమే సులువు అనుకోవడం… ప్రస్తుతం తెలంగాణ గీతానికి ఆదరణ ఉంది కాబట్టి… తెలంగాణ వాయిద్యాలు, […]
- « Previous Page
- 1
- …
- 99
- 100
- 101
- 102
- 103
- …
- 117
- Next Page »