కథ అందరికీ తెలుసు… ముగింపు అందరికీ తెలుసు… ఒరిజినల్ కథను బోలెడుసార్లు వీడియోల్లో కూడా చూసే ఉంటారు చాలామంది… అన్నీ తెలిసిన కథను చెప్పడంలో థ్రిల్ ఏముంది..? జనానికి ఆసక్తి ఏముంటుంది..? 1983లో అనూహ్యంగా భారత జట్టు క్రికెట్ ప్రపంచకప్పు గెలిచిన కథను 83 పేరిట తెరకెక్కించే ప్రాజెక్టుపై చాలామంది సినీపండితులు ఇలాగే భావించారు… పెదవివిరిచారు… నిజానికి మంచి సినిమా కథ అంటేనే ఎవరికీ తెలియని కథను చెప్పడం లేదా అందరికీ తెలిసిన కథను కొత్తగా చెప్పడం..! […]
నాని సరే.., సాయిపల్లవి మళ్లీ మెరిసింది… ఓవరాల్‌గా దర్శకుడు పాస్…
మళ్లీ ప్రేక్షకుడి దృష్టిని మొత్తం తనపైకి మళ్లించుకుంది సాయిపల్లవి… శ్యామ్ సింగరాయ్ సినిమాను నిలబెట్టిన ప్రధాన కారణాల్లో ఆమె కూడా ముఖ్యమైందే… ప్రత్యేకించి ప్రణవాలయ పాటలో నర్తన గానీ, దేవదాసి పాత్రలో తన పాత్రోచిత నటన గానీ ఆకట్టుకునేలా ఉన్నయ్… శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్లో ఆమె మాట్లాడటానికి రెడీ అయినప్పుడు, ఆమె ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆహుతులు కేకలు వేస్తే తమ అభిమానాన్ని ప్రదర్శించి, కాసేపు మాట్లాడనివ్వలేదు, ఆమె కన్నీళ్లపర్యంతం అయిపోయింది… వర్తమాన తెలుగు సినిమా […]
ఆ ప్రేమబంధం తెగిపోయింది… మళ్లీ ఒంటరిగానే మిగిలిపోయింది…
పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించలేదు… తనకన్నా పదిహేనేళ్లు చిన్నవాడైన రోహ్మన్ షాల్‌తో మూణ్నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న మాజీ ప్రపంచసుందరి సుస్మిత సేన్ తమ బ్రేకప్ను ప్రకటించింది… ఈ బంధాలు, ప్రేమలు, సహజీవనాలు, పెళ్లిళ్లు, పెటాకులు, బ్రేకప్పులు, అవసరార్థం కలయికలు గట్రా చాలా కామన్ ఫీల్డ్‌లో… బ్రేకప్ పెద్ద వార్తావిశేషం అనిపించలేదు, కానీ ఇంత వయోభేదంతో కొన్నాళ్లు సాగిన ఈ బంధమే సినిమా సర్కిళ్లలోనే ఓ విశేషం ఇన్నాళ్లు… పెళ్లీజంఝాటం జోలికి పోలేదు, ఇరవై ఏళ్ల క్రితం ఓ పాపను, […]
నానికి అకస్మాత్తుగా ఏం కుట్టింది..? నెటిజనంలోనూ తీవ్ర వ్యతిరేకత..!!
ఇదే మరి, గాలికి పోయే కంపను డ్యాష్కు తగిలించుకున్నట్టు… నిన్నామొన్నటివరకు ప్రేక్షకుల్లో నాని పట్ల ఓ సదభిప్రాయం ఉండేది… ఆచితూచి మాట్లాడతాడు, వివాదాల జోలికిపోడు, కాస్త నటన కూడా తెలిసినోడు, దిగువ స్థాయి నుంచి ఎదిగాడు, డిఫరెంట్ పాత్రలు చేస్తాడు అనేది ఆ సదభిప్రాయం… కానీ తను కూడా కొన్నాళ్లుగా పక్కా కమర్షియల్ అయిపోయాడు… దాంతోపాటు సగటు సినిమా హీరోల తాలూకు ‘దైవత్వం’ కూడా బాగానే అంటినట్టుంది… టికెట్ రేట్ల తగ్గింపు అనేది ఓ సంక్లిష్టమైన, సున్నితమైన […]
హమ్మయ్య… కమ్ముల శేఖర్‌కు, నాగచైతన్యకు ఒకింత ఖుషీ ఖబర్…
ఫాఫం… కమ్ముల శేఖర్ తనకు చేతకాని ఏదో సబ్జెక్టు డీల్ చేసినట్టనిపించింది… ఫలితం లవ్‌స్టోరీ సినిమా అంత పెద్ద ఇంప్రెసివ్‌గా రాలేదు… నెగెటివ్ మౌత్ పబ్లిసిటీ కారణంగా, ఈమాత్రం సినిమాకు థియేటర్ల దాకా ఏం వెళ్తాములే అనుకుని జనం కూడా పెద్దగా పట్టించుకోలేదు.., అంటే శేఖర్ కమ్ముల ఇన్నిరోజులు ఆగీఆగీ, విడుదల వాయిదా వేసీవేసీ, తన రేంజ్లో మంచి కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయాడు… మరి కనీసం టీవీల్లో రేటింగ్స్ సంగతేమిటి..? కాస్త బెటర్… కాస్త కాదు, బెటరే… […]
జయ్ జఖ్రిత్… భారీ నటుల నడుమ ఈ బ్యాంకాక్ కుర్రాడు భలే మెరిశాడు…
మోహన్‌లాల్‌తోపాటు కొడుకు ప్రణవ్, దర్శకుడు ప్రియదర్శన్ బిడ్డ కల్యాణి, సుహాసిని, అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, మంజూ వారియర్, కీర్తి సురేష్… ఇంకా తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో కాస్త పేరున్న నటీనటులు బోలెడు మంది… అంతటి భారీ తారాగణం నడుమ ఒక పాత్ర, ఒక నటుడు కాస్త మెరిసినట్టు అనిపించాడు… పేరు జయ్ జే జఖ్రిత్… పాత్ర పేరు చియాంగ్ జువాన్ అలియాస్ చిన్నాలి… చూడగానే ఓ చైనా యువకుడిలా కనిపిస్తాడు… సినిమాలో పాత్ర కూడా చైనా […]
లాజిక్కులు లేకపోతేనే అవి తెలుగు సినిమాలు అని పిలవబడును..!!
గతంలోలాగా కాదు… ఇప్పుడు సినిమాల్లో గానీ, టీవీల్లో గానీ, ఓటీటీల్లో గానీ ఏదైనా లాజిక్కు రాహిత్యాలు దొరికితే వదిలిపెట్టడం లేదు నెటిజనులు… ప్రత్యేకించి సబ్జెక్టు మీద అవగాహన ఉన్నవాళ్లు నవ్వుతూనే తమ ఫేస్బుక్ వాల్స్ మీద ప్రస్తావిస్తారు, బట్టలు విప్పేస్తారు… ప్రత్యేకించి దర్శకులు, కథా రచయితలు… అనగా స్క్రిప్టు రైటర్లు ముందుగా వర్తమాన ప్రాపంచిక విషయాల మీద అవగాహన పెంచుకోవడం అవసరం… లేకపోతే నవ్వులపాలే… డ్రామా, మెలోడ్రామా కోసం కథ చిత్రీకరణలో పాల్పడే అతిశయోక్తులు గట్రా వేరు… […]
అసలే ఆమె ఓ ఫైర్ స్టార్… బిర్యానీ పొట్లాలతో ఇంటికెళ్లేవాడు… తరువాత..?
‘‘ఎవరైనా స్త్రీని 14 సెకండ్లపాటు అలాగే తదేకంగా చూస్తుండిపోతే జైలుశిక్ష ఖాయం’’…. గత ఏప్రిల్‌లో, ఇన్‌స్టాగ్రాంలో తెగ వైరల్ అయిపోయిన ఓ రీల్ పోస్ట్ సారాంశం ఇది… ఎందుకయ్యా అంటే ఐపీసీ 354 -డి సెక్షన్ అదే చెబుతోంది అనేది పోస్టు వివరణ… నవ్వొచ్చిందా మీకు..? ఈ 14 సెకండ్లు అనే కాలవ్యవధికి ప్రాతిపదిక ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు, చాలామంది ఆ పోస్టును ట్రోల్ చేశారు… కానీ 14 సెకండ్లు అనే ప్రస్తావన హాస్యాస్పదమే అయినా […]
దూరపుకొండలు నునుపు..! భారీతనం వేరు- పనితనం వేరు ‘పుష్ప’ సుకుమారా..!!
నిజమే… పుష్ప సినిమా గురించి రివ్యూ రాస్తూ ఒకాయన ‘‘పోస్ట్ ప్రొడక్షన్’’ మీద దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయపడ్డాడు… ఎంతసేపూ సుకుమార్ హీరో మీద కాన్సంట్రేట్ చేశాడే తప్ప మిగతా అంశాల్ని నెగ్లెక్ట్ చేశాడనే మాట నిజమే అనిపించినా… దూరపు కొండలు నునుపు అన్నట్టుగా, భారీ ఖర్చుకు వెనుకాడకుండా కొంతమంది టెక్నీషియన్స్ ఎంపిక జరిగిందనీ, కానీ ఆ కొందరు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారనీ విమర్శ..! పైగా ఇద్దరేసి..! ఉదాహరణకు […]
పుష్ప దోస్త్ కేశవ..! ఈ మెరిక… మెరిసిన ఈ ‘కొత్త మెరిట్’ ఎవరో తెలుసా..?!
పుష్ప… ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నయ్… తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తరక్తం అన్వేషణలో ఉంది… పాతబడిన నీటిని బయటికి పంపేసి, కొత్తనీటిని నింపుకునే పనిలో పడింది… సింగర్స్ విషయంలో సంగీత దర్శకులు కొత్త సింగర్స్‌కు, ఫోక్ సింగర్స్‌కు కూడా ఎలా మంచి చాన్సెస్ ఇస్తున్నారో మనం మొన్న ఇంద్రావతి, మౌనిక వంటి ఉదాహరణలతో చెప్పుకున్నాం కదా… వాళ్లు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు… ఊ అంటావా ఊఊ అంటావా పాట మామూలు హిట్ కాదు కదా… […]
ఓహో… అప్పట్లో మహేష్ బాబు ‘పుష్ప కథ’ వద్దన్నది ఇందుకేనా..?!
ఓహో… పుష్ప కథ విని, కన్విన్స్ కాలేదా మహేష్ బాబు..? అందుకే వద్దన్నాడా..? వదులుకున్నాడా..? పుష్ప సినిమా కథ రిజల్ట్‌ను మహేష్ బాబు ముందే సరిగ్గా అంచనా వేశాడా..? దురదృష్టం కొద్దీ, సుకుమార్‌తో తనకున్న లాంగ్ అసోసియేషన్‌తో, నమ్మి ఓ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడా బన్నీ..? ఇవీ ఇప్పుడు ఫిలిమ్ సర్కిళ్లలో సాగుతున్న చర్చ… మీకు గుర్తుందా..? 2019 మార్చిలో మహేష్ బాబు ఓ ట్వీట్ కొట్టాడు… నిజానికి తను తెర వెనుక వ్యవహారాలను బహిరంగం చేయడు, కానీ […]
ఊహూఁ అంటున్నారు మావా..! ఇది పుష్ప పార్ట్-1 సినిమా రివ్యూ పార్ట్-1
నో డౌట్… అల్లు అర్జున్ నటుడిగా ఓ మెట్టు పైకి ఎక్కాడు… పుష్ప సినిమా తనలోని నటుడిని మరింత బాగా ఎక్స్పోజ్ చేసింది… ఆ మాస్ లుక్కు, ఆ చిత్తూరు యాస, తన బాడీ లాంగ్వేజీ పూర్తిగా ఓ భిన్నమైన బన్నీని చూపిస్తాయి… నిజానికి సినిమా అంతా తనే కనిపిస్తాడు… అవున్లెండి, తెలుగు సినిమాల్లో హీరోలు తప్ప మిగతావాళ్లు ప్రముఖంగా కనిపించకూడదని కదా అలిఖిత సూత్రం… వాస్తవంగా ఈ సినిమా మీద సూపర్ హైప్ ఏర్పడటానికి కారణాలు… […]
సామీ.., ఓ సామీ… నీ స్టెప్పులే తప్ప సర్కారీ ‘స్టెప్పులు’ పట్టవా సామీ…
అల్లు వారబ్బాయి, అర్జున్ అలియాస్ బన్నీ… సినిమా విలేకరులు, అభిమానులు రాసుకునే పేరు స్టయిలిష్ స్టార్… ప్రస్తుతం తెలుగులో టాప్ ఫైవ్ స్టార్లలో ఓ స్టార్… కేరళలోనూ బాక్సాఫీసుల్ని దున్నేసే స్టార్… పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న స్టార్… అల్లు వారి సొంత మెగా స్టార్… కదిలితే వార్త, కనిపిస్తే వార్త… అక్కడెక్కడో రోడ్డు పక్కన ఆగి టిఫినీ చేస్తే పుంఖానుపుంఖాల వార్తలు, ఫోటోలు, వీడియోలు, ప్రశంసలు, చప్పట్లు… అదీ బన్నీ… కానీ తాను బతుకుతున్న ఇండస్ట్రీ […]
హీరో, రచయిత, నిర్మాత, దర్శకుడు… ఈయన ఓ బహుముఖ అఖండ..!!
………… By….. Bharadwaja Rangavajhala……………. బాలయ్య … బాలయ్య అంటే ఇవాళారేపూ నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ … మన్నవ బాలయ్య ఎంత మందికి గుర్తొస్తారు… అందుకే ఆయన గురించి ఓసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనిపించి … ఇలా … నటుడు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే… తాననుకున్న కథలతో చిత్రాలు తీయడానికి నిర్మాణ రంగంలోకి దూకేస్తారు ఇంకొందరు. నటుడు మన్నవ బాలయ్య సెకండ్ కేటగిరీలోకి […]
తప్పేముందిర భయ్..? ఒకవేళ ఆ పాట తప్పే అయితే, ఆ తప్పు ఎవరిది..?!
పర్లేదు, పనీపాటా లేని సంవాదాలకు, వివాదాలకే కదా సోషల్ మీడియా, మీడియా, వెబ్ మీడియా, ట్యూబ్ మీడియా, టీవీ మీడియా ఎట్సెట్రా ఉన్నవి… అందుకే ఇదీ మాట్లాడుకుందాం… అకస్మాత్తుగా ‘పురుషుల సంఘం’ ఒకటి పుట్టుకొచ్చింది… అడవిలో సింహాలు తమ మనోభావాల రక్షణకు ఓ అసోసియేషన్ పెట్టుకున్నాయనేట్టుగా ధ్వనిస్తోంది… రాబోయే పుష్ప అనే సినిమాలో ఊ అంటావా మామా, ఊఊ అంటావా అనే పాట దురుద్దేశ పూరితమనీ, మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారన్న అర్థం వచ్చేలా ఉందనీ, ఆ […]
RRR … పాత్రల్ని జస్టిఫై చేసుకోలేక రాజమౌళి నానాతంటాలు… అయోమయం..!!
RRR …. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ ఆ సినిమా యూనిట్ రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్, ఆలియా, రాజమౌళి సహా ముఖ్యులు రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోషన్ ప్రెస్మీట్లు, ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు… సహజం… బాహుబలి తరువాత వస్తున్న మరో భారీ సినిమా కాబట్టి, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొంటున్నాయి కాబట్టి ఆ సినిమాలోని కేరక్టర్ల మీద ఆసక్తి కూడా క్రియేటవుతోంది… అంతేకాదు, రాజమౌళి తీసుకున్న కథ మీద, ఆయా పాత్రల చిత్రీకరణ మీద […]
బాలయ్య బలమైన కోరిక భేష్… కానీ తన చుట్టు మాయపొరల్ని ఛేదించగలడా..?
ఎందుకు చేయలేడు..? బాలయ్య మనసు పెడితే ఖచ్చితంగా చేయగలడు… శంకరాచార్య పాత్రను సమర్థంగా పోషించి, మెప్పించగలడు… మరీ ఆమధ్య తను సొంతంగా ‘‘శివశంకరీ శివానందలహరి’’ అనే పాట పాడి తెలుగు రాష్ట్రాల్ని కల్లోలితం చేసినట్టు గాకుండా… ఏ మంచి దర్శకుడో దొరికితే శంకరాచార్యుడిని కళ్ల ముందు ఆవిష్కరించగలడు… ఏం..? ఇంతకుముందు భైరవద్వీపంలో ఓ గూనివేషం గుర్తు లేదా..? కాకపోతే బాలయ్య మనసైతే మల్లి, లేకపోతే ఎల్లి టైపు… తను ముందుగా ఆ పాత్రను ప్రేమించాలి, జీవించాలి… ఇప్పుడు […]
నయీం డైరీస్..! ఇప్పుడిక అందరి దృష్టీ సాయిపల్లవి మీదకు మళ్లుతోంది..!!
నయీం..! పోలీసులే స్వయంగా ఓ విషపుమొక్కను పెంచి పోషిస్తే, అదెలా ఓ భూతాలచెట్టుగా మారుతుందో.., ఆ కొత్తరకం మాఫియా ఎంత అరాచకంగా ఉంటుందో చెప్పే పేరు అది… రాజ్యం పాలుపోసిన పాము, ఆ రాజ్యాన్నే ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చెప్పే కేరక్టర్ అది… అధికారులు, వ్యాపారులు, నాయకులు ఎవరైతేనేం, అందరికీ వణుకు… తను ఏది చెబితే అదే చెలామణీ… ఇక మామూలు ప్రజల గురించి చెప్పేదేముంది..? చిన్నప్పటి నుంచీ తనది క్రిమినల్ నేచర్… క్రుయల్… తనను నక్సలైట్లు […]
క్లీన్ మూవీ..! కథ బాగుంది… కథ మంద‘గమనమే’ కాస్త ఇబ్బంది..!!
కొన్ని అస్సలు మారవు… ఇళయరాజాను చూడండి, ఎన్నేళ్లయిందో ఫీల్డ్‌కు వచ్చి, ఎందరో పోటీదారులు వస్తున్నారు, పోతున్నారు… కానీ రాజా అంటే రాజాయే… ఈరోజుకూ అంతే… గమనం అనే సినిమా చూస్తున్నప్పుడు ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజికే కాదు, ఓ సిట్యుయేషన్ సాంగ్ కూడా… ఏమాత్రం తగ్గలేదు ఆయన… అసలు తన పోకడలోనే, అనగా స్వరప్రస్థానంలోనే ఓ భిన్నత్వం… ప్రత్యేకించి మెలొడీ… ఎమోషనల్ సీన్లలో వినిపించే సంగీతం… గమనం సినిమాకు వేరే రివ్యూ అవసరం లేదు నిజానికి, ఆ […]
గురితప్పి… దారితప్పి… ‘లక్ష్యం’ తప్పి… ప్రేక్షకుడి గుండెల్లో కసుక్కున దిగింది…
సినిమా వాళ్లకు ప్రేక్షకులంటే… వాళ్ల జ్ఞానమంటే పరమ అలుసు…. ఎందుకంటే, తామే గొప్పవాళ్లమనీ, తమకు అన్నీ తెలుసని, తామేం చెప్పినా ప్రేక్షకుడనే ఎడ్డి ఎదవ నమ్మేస్తాడనీ, చప్పట్లు కొట్టేసి, జేబులు ఖాళీ చేసేసి, తమ బొక్కసం నింపేస్తాడనీ ఓ పిచ్చి భరోసా… చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసేది దిక్కుమాలిన మీడియా… నిజం… నిన్న నాగశౌర్య అనబడే ఓ కుర్ర హీరో ఏమన్నాడో తెలుసా..? ‘‘దేహంలో నీళ్లుంటే కండలు ఎక్స్పోజ్ కావు, అసలు ఎయిట్ ప్యాక్, అందుకే తొమ్మిది […]
- « Previous Page
- 1
- …
- 100
- 101
- 102
- 103
- 104
- …
- 117
- Next Page »