కొన్ని అంతే… ఐరనీ అనిపిస్తయ్… మరి లైఫ్ అంటే అంతే కదా… చైతూ సమంతల నడుమ చిచ్చు రాజుకోవడానికి కారణమైన ఓ పాత్ర ఆమెకు ఓ మంచి అవార్డును తెచ్చిపెట్టింది ఇప్పుడు… అదేనండీ, ఫ్యామిలీమ్యాన్ వెబ్ సీరిస్ తెలుసు కదా… అందులో డీగ్లామరస్‌గా, ఓ నల్ల విప్లవకారిణి పాత్ర పోషించింది కదా… అప్పటికే మనస్పర్థలు మొదలైన చైతూ సమంతల సంసారంలో ఆ పాత్ర, ఆ సీరిస్ షూటింగు కాస్త పెట్రోల్ పోసిందని అప్పట్లో వార్తలొచ్చినయ్… ఆమె మరీ […]
సమంత ఐటమ్ సాంగ్… మంగ్లీ చెల్లెలి వాయిస్… కొత్త గొంతులకై వెతుకులాట…
దర్శకుడు సుకుమార్ షేర్ చేసుకున్న ఫోటో ఒకటి కనిపించింది… అది అసలే బన్నీ సినిమా పుష్పకు సంబంధించింది… ప్రస్తుతం విపరీతమైన హైప్ క్రియేటవుతోంది కదా ఆ సినిమా మీద… పైగా సమంత ఓ ఐటమ్ సాంగ్ చేస్తోంది… (విడాకులయ్యాక ఆమె స్వేచ్ఛ ఆమెకు మళ్లీ లభించింది…) అసలు సమంత సాంగ్ అంటే అదో హైప్… ఆ పాట ఏమిటంటే… అ అంటావా, అ ఆ అంటావా… పదో తారీఖు లిరికల్ వీడియో రిలీజ్ చేస్తాం అని దర్శకుడు […]
గంధదగుడి..! పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్ కన్నీళ్లు… ఏమిటా కథ..?!
పునీత్ రాజకుమార్ అలియాస్ అప్పు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు… తన డ్రీమ్ ప్రాజెక్టు గంధదగుడి టీజర్‌ను రిలీజ్ చేశారు… ఇది పునీత్ సొంత సినిమా… నిజానికి నవంబరులోనే రిలీజ్ కావల్సిన సినిమా… అప్పు హఠాన్మరణంతో ఆగిపోయింది… వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, దర్శకుడు అమోఘవర్ష కూడా ఈ సినిమాలో నటించాడు, షూటింగ్ చాలావరకూ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు అప్పు చనిపోయాడు… ఇప్పుడిక సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు… అప్పు చివరి సినిమా కాబట్టి సహజంగానే […]
తెలుగు దర్శకులకు బాలయ్య సవాల్… కమాన్ నేను రెడీ అంటున్నాడు…
అఖండమైన ఉత్సాహంతో ఉన్నాడు బాలయ్య… ఇన్నాళ్లు ఫ్లాపుల వైరాగ్యం మొత్తం పోయింది… అఘోరా శివతాండవానికి బాక్సులు బద్దలవుతున్నయ్… ఎస్, బాలయ్యకు శాతకర్ణులు, కథానాయకులు, మహానాయకులు పనికిరారు… అఘోరాలే కరెక్టు అని తేలిపోయింది… (నిజానికి శాతకర్ణి వంటి సబ్జెక్టు ప్రస్తుత తెలుగు హీరోల్లో ఎవరికీ చేతకాదు… అంతేకాదు, అఖండ పాత్ర కూడా…) ఈ ఉత్సాహపు ఊపులో దర్శకులకు, నిర్మాతలకు ఓ సవాల్ వంటిది విసిరాడు… ‘‘నేను విలన్‌గా చేస్తాను’’ ఇదీ ఆ ప్రకటన… ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో […]
భారతీయ సినిమా తెర మీద… అత్యంత ఖరీదైన పందెంపుంజు…
గత కొద్దిరోజుల్లో కాస్త ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా వార్త… ప్రాజెక్ట్ కె..! ఆ సినిమా షూటింగు కోసం హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ దీపిక పడుకోన్‌కు సినిమా యూనిట్ పసుపు, కుంకుమ, గాజులతో స్వాగతం చెప్పారనే పాయింట్ కాదు… ఆమె వాటిని పెద్దగా పట్టించుకోదు కూడా… కాకపోతే సినిమాకు భిన్నమైన ప్రచారం దక్కాలంటే ఇలాంటివేవో చేయాలి కదా మరి… ఇంకా సరదాగా చెప్పుకోవాలంటే బహుశా ఆ స్వాగతం దీపికకు బదులు కంగనా రనౌత్‌కు సరిగ్గా సూటయ్యేదేమో… సినిమా […]
ఇది అఖండ రివ్యూలకు మరోకోణం… పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి…
మొత్తానికి బాలయ్య ప్రకంపనలు సృష్టిస్తున్నాడు… ఇప్పట్లో ఈ రణగొణ ధ్వని ఆగదు… నేను చెప్పేది కలెక్షన్ల గురించి కాదు, ఈ సినిమా చుట్టూ అల్లుకున్న, అల్లబడుతున్న వివాదాల గురించి… బాలయ్య బ్రీడ్, బ్లడ్ కమ్మ, టీడీపీ కాబట్టి కొందరికి నచ్చదు, సినిమా చూడకుండానే తిట్టేస్తుంటారు, ఇంకా ఈ ముసలోళ్ల పైత్యం ఎన్నాళ్లు అని వేరే సాకుతో ట్రోల్ చేస్తుంటారు… సినిమాలో హిందుత్వను ప్రమోట్ చేసినట్టుగా కథ సాగుతుంది కాబట్టి ఇక నాస్తికవాదులందరూ పెద్దపెట్టున శాపనార్థాలకు దిగారు… అయ్యో, […]
కథ అదుపు తప్పి… ఎక్కడో కూలిపోయిన స్కైలాబ్… నిత్యా, బ్యాడ్ లక్…
త్వరలో చచ్చిపోతాం అనే భావన మనిషిలో విపరీతమైన మార్పులకు దారితీస్తుంది… ఒక కుదుపు… కరోనా మరణాల సీజన్లో చూశాం కదా… ఎన్ని ఉద్వేగాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని బాధాకర అనుభవాలు… కుటుంబాలకు కుటుంబాలే కుప్పకూలాయి… కరోనా విపత్తు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఫార్మా మాఫియా విశ్వరూపం, ఆసుపత్రుల నిలువుదోపిడీ… బంధాలు కకావికలం… అలాంటిది ఒక ఊరు, ఒక సమాజం, ఒక ప్రాంతం ధ్వంసం అయిపోతుంది అంటే అప్పుడు చెలరేగే ఎమోషన్ల మాటేమిటి..? ఉంటామో, పోతామో అన్నట్టుగా… ఉన్నప్పుడే తిందాం, […]
ఆ రెండు సిరివెన్నెల పాటలు… రాసిందొకటి- కథాసందర్భం మరొకటి…
ఇప్పుడంతా సిరివెన్నెల పాటల మీద దుమారం నడుస్తోంది కదా… నిజానికి మనమూ చెప్పుకున్నాం… సినిమా పాట దాన్ని రాసే కవి కోసం కాదు, తన సొంత ఘోష కూడా కాదు… సినిమాలో ఒక సందర్భం కోసం, కథానుగుణంగా రాయబడే పాట… దర్శకుడి టేస్ట్, కథ డిమాండ్, హీరో ఇమేజీ, సీన్ ఇంపార్టెన్స్, సంగీత దర్శకుడి సహకారం వంటివి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తప్ప ఏ సినిమా కవీ తన కవిత్వాన్ని గుమ్మరించడం కోసం రాయడు సినిమా పాట… […]
అదే సీన్… రెండు పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…
ఆమధ్య తెలుగు పాట గురించి… సందర్భోచితం గురించి… పాత్రోచితం గురించి… సహజత్వం గురించి… ఏదేదో చెప్పుకుంటూ ఆగిపోయినట్టున్నాం కదా… అంతేకదా మరి… ఎహె, ఊరుకొండి సార్, తెలుగు సినిమా పాటల్లో విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది..? సొట్టలు పడిన సత్తురేకు డబ్బాలో గులకరాళ్ల మోతలా ఓ ట్యూన్, చిత్రవిచిత్ర పదాల్ని అందులో పేర్చేయడం అంటారా..? అలాగని అన్నీ ఒకేగాటన కట్టేసి తీసిపారేయలేం కదా… సహజత్వం, పాత్రోచితం, సందర్భోచితాల గురించే తీసుకుంటే… పర్ సపోజ్, ఓ జానపదుడు, […]
Marakkar… తారాగణం, ఖర్చు, చిత్రీకరణ… అత్యంత భారీతనం…
గ్రాండియర్..! కొన్ని ఇంగ్లిష్ సినిమాలు చూస్తుంటే ఈ చిత్రీకరణ, ఈ పర్ఫెక్షన్, ఈ భారీతనం మనవాళ్లకు ఎందుకు చేతకావు అనిపిస్తుంది కొన్నిసార్లు… బాహుబలి వంటి అట్టముక్కల సెట్టింగులు, గ్రాఫిక్కుల మాయలు, కొబ్బరి చెట్ల స్ప్రింగు అస్త్రాలు వదిలేయండి కాసేపు… దాని మార్కెట్ ఇంటర్నేషనల్, కానీ క్వాలిటీలో అంత సీన్ లేదు… పోనీ, ప్రాంతీయ సినిమా ఖర్చు, పెట్టుబడి, తిరిగి వచ్చే డబ్బు పరిమితం కాబట్టి, ఆ లెక్కల్లో భారీతనం రిస్క్ అనుకుందాం… అది కూడా గతం… ఇప్పుడు […]
అమెరికా అయితేనేం… అఖండ జాతరలు… కొబ్బరికాయలు, పూనకాలు…
అవును, ఎందుకు మారాలి..? ఛట్, రోమ్‌లో రోమన్‌లా ఉండాలనేది ఉత్త దండుగ మాట… మనం ఎక్కడున్నా మనలాగే ఉంటాం… అంగారక గ్రహం మీదకు వెళ్లినా, అక్కడ సరికొత్త నాగరికతల్ని నిర్మించుకున్నా సరే… మనం మనమే… మన మూలాల్ని, మూల సంస్కృతిని కాపాడుకోవాలి… అంతేకదా… అక్కడా థియేటర్లు ఉండాలి… అక్కడ మన హీరోల సినిమాల్ని రిలీజ్ చేయాల్సిందే… ఎంత రేట్లయినా సరే పోయాల్సిందే… తెర ముందు డాన్సులు వేయాల్సిందే… కార్ల ర్యాలీలు, జెండాలు, హంగామా ఉండాల్సిందే… థియేటర్ ముందు […]
జై బాలయ్య… కన్నెర్ర చేస్తే తెర నిండా నెత్తురే… కత్తిపడితే ఖైమాయే…
బాలయ్య సినిమాకు ఓ నిర్ణీత ఫార్ములా ఉంటుంది… అది అందరికీ నప్పదు… అది బాలయ్యకే ప్రత్యేకం… వేరే హీరోలకు ఆ ‘అతి’ అస్సలు సూట్ కాదు… చేయలేరు కూడా… అభిమానులకు కూడా బాలయ్య అలా కనిపిస్తేనే పండుగ… కథానాయకుడు, మహానాయకుడు, శాతకర్ణి ఎవరికి కావాలి..? బాలయ్య అంటే ఓ సింహ, ఓ లెజెండ్… అంతే… తెర మీద బాలయ్య అలాగే కనిపించాలి… కథాకాకరకాయ జాన్తా నై… హీరోయిన్ ఎవరైనా పర్లేదు, విలన్ ఎవరున్నా డోన్ట్ కేర్… హీరో […]
ఔనా..! థియేటర్లలో సీట్లు పీకేసి.., గోదాములుగా అద్దెకు ఇచ్చుకోవడమేనా..?!
ఎవరో అన్నారు… ఊళ్లలో ఉన్న నాన్-ఏసీ థియేటర్లలో ఎకానమీ రేటు కేవలం అయిదు రూపాయలు… అది కప్పు టీ ధరకన్నా తక్కువ… ఇండస్ట్రీ కుప్పకూలడం ఖాయం ఇక అని..! ఎస్, స్థూలంగా ఒక్కసారి జగన్ ప్రభుత్వం ఖరారు చేసిన రేట్లు పరిశీలిస్తే అలా అనిపించడం కరెక్టే… ఆ రేట్లతో థియేటర్లను గ్రామాల్లో, నగర పంచాయతీల్లో నడిపించడం అసాధ్యం… తక్షణం ఆ థియేటర్ల సీట్లు పీకేసి, ప్రొజెక్టర్ ఎవరో తెలంగాణ థియేటర్ వాడికి అమ్మేసి, ఇక థియేటర్లను రైస్ […]
భలే తెలివైన ఇంటర్వ్యూ… ఎంతైనా ‘చతురుడైన సినిమా వ్యాపారి’ కదా…
దగ్గుబాటి సురేష్… రామానాయుడి కొడుకు… నిర్మాత, ఫైనాన్షియర్, వ్యాపారి, స్టూడియోల ఓనర్, థియేటర్ల సిండికేట్ మెంబర్… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద తలకాయ… చాలా తెలివైన ఇంటర్వ్యూ ఇచ్చాడు… చతురుడైన ప్యూర్ వ్యాపారి… కర్ర విరగొద్దు, పాము చావాలి… సూటిగా మనసులో ఉన్నది చెప్పొద్దు, కాగల కార్యం జరిగిపోవాలి… ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో ఇండస్ట్రీకి నష్టం అని సూటిగా చెప్పడు, ప్రభుత్వంతో ఏదో మిస్ కమ్యూనికేషన్ ఉందంటాడు… అసలు కమ్యూనికేషన్ లేకపోవడం ఏమిటి..? మిస్ కమ్యూనికేషన్ […]
అయ్యా, అయ్యా… అదే థమన్… అదే అనంత శ్రీరాం… మళ్లీ ‘‘దింపేశారు’’
మీకు ఈమధ్య వచ్చిన ఏదో సినిమాలోని దిగు దిగు దిగు నాగ అనే దిక్కుమాలిన పాట గుర్తుందా..? కాపీ మాస్టర్ అనే విమర్శలున్న థమనుడు ప్లస్ ఈమధ్య తనకేమైందో తెలియని అనంత శ్రీరాముడి కాంబినేషన్ అది… బూతును దిగేశారు… రాబోయే అఖండ అనే జైబాలయ్య సినిమాలో కూడా ఓ పాట ఉందండోయ్… నిన్న ప్రిరిలీజ్ ఫంక్షన్లో దీన్ని కూడా ఆవిష్కరించినట్టున్నారు… ఈ పాటలో బూతులేమీ లేవు కానీ, మనుషుల్ని, సంగీత ప్రియుల్ని, సినిమా ప్రేమికుల్ని… ప్రత్యేకించి బాలయ్య […]
అనుభవించు రాజా తరుణ్..! నువ్వు పట్టిందల్లా ప్లాస్టికే కదా..!!
నో, నో… ఇది అనుభవించు రాజా సినిమా రివ్యూ కాదు, కానేకాదు… నిజానికి ఈ సినిమాకు రివ్యూ కూడా అక్కర్లేదు… ఓటీటీల్లో వచ్చినప్పుడు… అదీ అవసరం లేదు, ఏదో దిక్కుమాలిన టీవీలో ఎప్పుడో ఓసారి రాకపోదు, వీలుంటేనే చూడండి, చూడలేకపోతే వదిలేయండి… నిజానికి హీరో రాజ్‌తరుణ్ మీద కాదు, నాగార్జున టేస్ట్ చూసి జాలేసింది… ఎందుకంటే… ఇది అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ అట మరి… యార్లగడ్డ సుప్రియ నిర్మాత… ఓ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ, సాధనసంపత్తి పుష్కలంగా […]
విక్టరీ వెంకటేష్ ఖాతాలో మరో ‘విక్టరీ’… మళ్లీ ‘దృశ్యం’ చూపించాడు…
తవ్వి పాతేసిన కేసు మళ్లీ ఎప్పుడు పైకి లేస్తుందో, ఎప్పుడు కత్తి మెడ మీద పడుతుందోనని ప్రతి క్షణం భయపడుతూ, ఎవరి పట్లో తప్పు చేస్తాననే మనస్తాపంతో సగం చస్తూ బతికే బతుకూ ఓ బతుకేనా..? అదీ ఓ శిక్షే కదా….. అంతర్లీనంగా ఈ సూత్రమే చెబుతూ దృశ్యం-2 సినిమాను డైరెక్టర్ జీతూజోసెఫ్ జాగ్రత్తగా పేర్చాడు… నిజానికి ఈ సినిమా చూడాలనుకునేవాళ్లు ఫార్ములా రివ్యూలు చదవొద్దు, ప్రిజుడీస్గా సినిమా చూడొద్దు… అలాగే దృశ్యం ఫస్ట్ పార్ట్ చూసిన […]
ఇది ఫార్ములా రివ్యూ కాదు… ఈ సినిమా కూడా ఫార్ములాకు లోబడి లేదు…
………… By…. Bharadwaja Rangavajhala……….. కాదేదీ తీతకనర్హం అన్నారు పెద్దలు నేను పెద్దల మాటల్ని దారుణంగా గౌరవిస్తాను. రాముడేయాల్సిన ఎన్టీఆర్ ఆ కారక్టర్ హరనాథ్ కి ఇచ్చి … రావణుడు వేసి సీతారామకళ్యాణం తీస్తే అహో అనేశామా లేదా? అంతే … సహజంగా ఓ అభిప్రాయం ఉంటుంది. అదేమనగా … కథలో ప్రధానపాత్రను హీరో అనేసుకుని … హీరోకుండాల్సిన లక్షణాలు ఈ పాత్రకున్నాయా లేవా అని టేపులు పట్టుకుని రంగంలోకి దిగిపోతాం … కథానాయకుడు ప్రతి నాయకుడు […]
అద్భుతం..! మన కథల ప్లాట్లనే మనం కాపీ కొట్టడం ఓ అద్భుతం..!!
అద్భుతం… సినిమా అద్భుతం అని చెప్పడం లేదు… సినిమా పేరు మాత్రమే అద్భుతం..! ఆల్రెడీ ఎవరో సినిమా తీస్తున్న కథతో ఈ నిర్మాత, దర్శకుడు కూడా సినిమా తీయడం నమ్మలేని ఓ అద్భుతం… అదీ నమ్మలేని అంశంతో, కన్విన్స్ చేయలేని కథనంతో నానా ప్రయాసపడటం మరో అద్భుతం… ప్రేక్షకులు పిచ్చోళ్లే గానీ, మరీ ఇది మొన్నామధ్య వచ్చిన ప్లేబ్యాక్ అనే సినిమా కథే అని గుర్తించలేనంత పిచ్చోళ్లని ఈ నిర్మాతలు అనుకోవడం ఇంకో అద్భుతం… ముందే అమ్మేసుకున్న […]
ఫాఫం నాగార్జున..! గ్రహచార దోషాలేవో బాగా తన్నేస్తున్నట్టున్నయ్..!!
ఫాఫం నాగార్జున..! మళ్లీ అనిపించింది ఇలా..! ఎందుకు..? చెప్పుకుందాం… అప్పుడెప్పుడో తాతల జమానాలో వచ్చిన శ్రీరామదాసు… అప్పటి నుంచి నాగార్జున సినిమాలు బోలెడు వచ్చినయ్, ఒక్క హిట్టూ లేదు, సోగ్గాడే చిన్ని నాయనా, మనం కాస్త పర్లేదు… ఇక వర్మ అనే ఓ మెంటల్ కేసు ఉద్దరించిన ఆఫీసర్ అనే మూవీ నాగార్జునకు ఇప్పటికీ అప్పుడప్పుడూ కలలోకి వచ్చి వణికిస్తుంది… మన్మథుడు-2 ఢమాల్… మరోవైపు స్టూడియో వ్యవహారాలూ అంత బాగాలేవు… పెద్ద కొడుక్కి లవ్ స్టోరీ రూపంలో […]
- « Previous Page
- 1
- …
- 101
- 102
- 103
- 104
- 105
- …
- 117
- Next Page »