ఫిలిమ్ ఇండస్ట్రీ అంటే..? షిప్‌కు కెప్టెన్ వంటి దర్శకుడు అయితే..? అబ్బో, ఇంకేముంది..? ప్రాజెక్టు నడుస్తున్నంతసేపూ నిర్మాత ఖర్చుతో విలాసాలు, వైభోగాలు… అందుబాటులో అన్నిరకాల ప్రలోభాలు… బోలెడు సుఖ అవకాశాలు… అసలు ఇండస్ట్రీ అంటేనే రకరకాల ప్రలోభాలు, వ్యసనాలు కదా… కానీ కొందరుంటారు… వాళ్ల గురించి వింటే అస్సలు నమ్మబుద్ధి కాదు మొదట్లో… ఎహె, ఇండస్ట్రీలో అలాంటివాళ్లు ఉంటారా అనేస్తాం… అలాంటోళ్ల జాబితాలో దర్శకుడు ఎఎల్ విజయ్ ఉంటాడు… ఖచ్చితంగా ఉంటాడు… ఓ విశిష్టమైన కేరక్టర్ తను… […]
ఈ మూడు సినిమాలూ దేనికదే… కానీ ఏది బెటర్ రేటింగ్..? ఏది చూడొచ్చు..?!
గాలి సంపత్… జాతిరత్నాలు… శ్రీకారం…. ఈ మూడు సినిమాల్లో ఏది బెటర్, ఏది చూడొచ్చు అనడిగాడు ఓ మిత్రుడు… నిజమే, ఈ మూడూ బాగా ఆసక్తి రేపిన సినిమాలు… ఒకటి మంచి టేస్టున్న నాగ్ అశ్విన్ సొంత సినిమా… రెండు శర్వానంద్ చేసిన ఫీల్ గుడ్ సినిమా… మూడు రాజేంద్రప్రసాద్ రెచ్చిపోయి నటించిన సినిమా… పైగా ఇది రీసెంట్ పాపులర్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రజెంట్ చేసిన సినిమా… దేని విశిష్టత దానిదే… ఏ సినిమా కూడా […]
పాట పంచాయితీ ముగిసినట్టే… కానీ ఓ కొత్త బాట వేసిన శేఖర్ కమ్ముల..?!
సారంగదరియా పాట వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టేనా..? లేక ఎందుకొచ్చిన పంచాయితీలే అనుకుని శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటన ఓ కొత్త ఆనవాయితీకి శ్రీకారం చుట్టబోతున్నాయా..? నిజానికి ఈ వివాదం ఎక్కడ స్టార్టయిందనేది పక్కన పెడదాం కాసేపు… ‘‘అయ్యో, నాకు రావల్సిన పేరును ఇంకెవరో ఎత్తుకుపోతున్నారు, నేనే ఆ సినిమాలో ఆ పాట పాడితే బాగుండు’’ అనే ఆశ ఒరిజినల్‌గా అప్పట్లో ఈ పాట పాడిన కోమలికి ఉండటంలో తప్పులేదు… మొదటిసారి ఆమెతో పాడిద్దామని […]
హీరో అంటే అజిత్..! సోకాల్డ్ హీరోల లక్షణాలేమీ కనిపించని విశిష్ట హీరో..!!
అజిత్… అసలు ఈయన హీరో ఏమిటో అర్థం కాదు… ఎందుకు చెప్పుకుంటాడో కూడా తెలియదు… అసలు హీరో అంటే ఎలా ఉండాలి..? అందులోనూ ఓ ఇండియన్ హీరో… అదీ సౌతిండియా హీరో అంటే ఏ రేంజ్ ఉండాలి… ఫ్యాన్స్ గీన్స్ హంగామా రెచ్చిపోవాలి, చచ్చిపోవాలి… కానీ తనకు ఫ్యాన్స్ సంఘాలు అధికారికంగా ఏమీ లేవు, వద్దంటూ రద్దు చేశాడు… ఏమిటయ్యా అది… అసలు ఒక హీరో అంతటి అప్రాచ్యపు పని చేయొచ్చా..? ఫ్యాన్స్, ఏసీలు లేకపోతే హీరో […]
అప్పుడు హీరో క్రీజులోకి దిగి… హాకీ స్టిక్‌తో విలన్లను కబడ్డీ ఆడేసుకుంటాడు…
ఏ1 ఎక్స్‌ప్రెస్ నాతో కూడా చూడబడింది… సగటు సౌతిండియన్ సినిమాలకుండే కొన్ని విశిష్ట అవలక్షణాలు ఏమీ మిస్ కాలేదు… పైగా తమిళ డైరెక్టర్.., తమిళ కథ, తమిళ ఒరిజినల్ సినిమా, అవే తమిళ ట్యూన్లతో అక్కడక్కడా తమిళ వాసన కొట్టినా సరే… ఏదో హాకీ మీద ఇన్స్పిరేషనల్ స్టోరీ కావచ్చులే అనుకుంటే మొత్తం ఇర్రేషనల్ కథతో చావగొట్టాడు… హాకీ స్టిక్‌తో కొట్టినట్టే… అయోధ్య సుందరి లావణ్య త్రిపాఠీ ప్లస్ సందీప్ కిషన్ ఇద్దరూ హాకీ స్టిక్స్ పట్టుకున్న పోస్టర్లు […]
ఫార్ములా వేషాలకు అస్సలు బందీ కాదు… ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ హీరో…
అరణ్య… ట్రెయిలర్ చూస్తుంటే రానాను అభినందించాలనిపిస్తుంది… నో, నో, ఆ సినిమా గురించి కాదు… అదేదో నాలుగేళ్ల క్రితం ప్రారంభమైనట్టుంది… ఏడాది క్రితమే విడుదల కావల్సింది… ఓ డిఫరెంట్ స్టోరీ… అడవుల గురించి, వాటిపై నిజమైన హక్కులున్న జీవజాలం గురించిన ఓ కథ… అందులో బవిరిగడ్డంతో ఉన్న రానా వేషం చూస్తే ఇంట్రస్టింగు అనిపించింది… నిజానికి తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, తను పెరిగిన వాతావరణం, తనకుండే అవకాశాల నేపథ్యంతో రానా కెరీర్‌ను గనుక పోల్చి చూస్తే […]
నా మీదొట్టు… ఈ ప్రేమ సినిమాను పొరపాటున కూడా చూడొద్దు ప్లీజ్…
AAMIS (మాంసం ప్రేమ కథ)… సినిమా అంటే ఇలాగే ఎందుకు ఉండాలి.. ఇలా ఎందుకుండకూడదు అనిపించే సినిమా ఆమిస్.. అస్సామి సినిమా.. కాస్త ఓపికగా చూస్తే సినిమాలో విచిత్రాలు, విడ్డూరాలు, విన్యాసాలు, దరిద్రాలు, భాగోతాలు అన్నీ కనిపిస్తాయి.. సినిమా చూశాక మానసికపరమైన మార్పులేవైనా సంభవిస్తే మాత్రం కచ్చితంగా సైక్రియాట్రిస్టును సంప్రదించండి.. ఇది అదో టైపుప్రేమ కథ.. ప్రేమ కథలంటే ఎంతసేపూ అప్పుడెప్పుడో వచ్చిన మణిరత్నం గీతాంజలి.. ఈమధ్యే వచ్చిన ఉప్పెన మాత్రమేనా.. లేకపోతే ప్రేమ కథలంటే దేవదాసు, […]
మహాకవి సుద్దాల వెక్కిరిస్తాడని అప్పట్లో పల్లెజనం ఊహించి ఉండదు…!!
‘‘ఒక సూటి ప్రశ్న… అందరికీ సొంతమైన ఒక పాపులర్ జానపదంలో పల్లవిని తీసుకుని, దానికి కొనసాగింపు రాసుకుంటే తప్పెలా అవుతుంది..? లవ్ స్టోరీ సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ సారంగదరియా పాటను ఆ డైరెక్టర్ సూచనలకు అనుగుణంగా ట్యూన్‌కు తగినట్టుగా కొత్తగా రాస్తే ఎందుకు తప్పుపట్టాలి..? ఇది తన క్రియేటివ్ ఫ్రీడంను కించపరిచినట్టు కాదా..? అసలు ఆ జానపదం మీద ఎవరికీ రైట్స్ ఉండవు కదా… వాడుకుంటే తప్పేముంది..?’’…. ఒకాయన వేసిన ప్రశ్న ఇది… నిజమే… […]
ప్లే బ్యాక్..! ప్రేక్షకుడి మెదడుకు మేత… కొత్త పంథాలో ఓ సైన్స్ ఫిక్షన్…
సూపర్ హీరోయిక్ తెలుగు సినిమాల చీకటి దరిద్రం నడుమ అప్పుడప్పుడూ కొన్ని మెరుపులు మెరుస్తుంటయ్… మన తెలుగు సినిమా కూడా మారుతుంది, కాస్త టేస్టున్నవి, డిఫరెంటు సినిమాలు, బుర్ర ఉన్న కథాంశాలు కూడా వస్తాయి అనే ఆశలను అవి రేపుతుంటయ్… హీరోల కాళ్ల దగ్గర పొర్లుదండాలు పెట్టే మన సినిమా కథను బయటికి లాక్కొచ్చి, చెవులు మెలేసి, కొత్త దారిలో పెట్టే ప్రయత్నం, ప్రయోగం ఏ స్థాయిలో చేసినా అభినందించాలి… ఈరోజు రిలీజయిన ప్లే బ్యాక్ అనే […]
నీకు తెలంగాణ నియ్యతి ఉందా..? సోయి ఉందా..? సుద్దాలా, ఈ ప్రశ్న నీకే..?
Article By… Gurram Seetaramulu…….. పాట సామాజిక సంవాదానికి అదనపు చేర్పు. పూర్వకాలంలో అది శ్రమజీవుల నెత్తుటి చుక్కలకు సాంత్వన. ఒక నాటి ప్రజా వాగ్గేయ కారులు ఆయా పాయల ధార్మిక ఆద్యాత్మిక తాత్విక స్రవంతిని ప్రజాపరం చేయడానికి తమ యుక్తిని శక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకున్నారు. మధ్యయుగాల్లో వచ్చిన భక్తి ఉద్యమంలో పాటది ప్రధాన పాలు. జాతీయోద్యమానికి ఇఫ్టా- ప్రజానాట్య మండలి, నక్షల్బరికి జననాట్యమండలి, జనతన సర్కార్ కి చేతనా నాట్యమంచ్, ఆవాన్ నాట్య మంచ్, కబీర్ […]
లెంపలేసుకున్న అమెజాన్… తాండవ్ సీన్ల ఎడిటింగ్, బేషరతు క్షమాపణలు…
హిందూ దేవుళ్లను ఎవరైనా తూలనాడొచ్చు… అవమానించొచ్చు… కోట్లాది మంది హిందువుల మనోభావాలను కూడా గాయపరచొచ్చు… ఏమీ కాదు……. ఇదేనా ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం..? వరుసగా గుళ్లపై దాడులు జరుగుతుంటే, విగ్రహాలు ధ్వంసం అవుతుంటేనే ఎవరికీ పట్టదు అంటారా..? కాదు, ఏదో మార్పు కనిపిస్తోంది… కనీసం కొన్ని కేసుల్లోనైనా హిందూ సంస్థల నుంచి ప్రతిఘటన వార్తలు చదువుతున్నాం… కోపం, నిరసన, అసంతృప్తి వ్యక్తీకరణ గోచరిస్తోంది… అమెజాన్ ప్రైమ్ అంటే ప్రపంచంలోకెల్లా ఫేమస్, నంబర్ వన్ ఓటీటీ వేదిక కదా… […]
ఫాఫం అనసూయ..! ఆ పాట షాక్ నుంచి ఫ్యాన్స్ తేరుకోలేదు ఇంకా..!!
అసలే అనసూయ… తన డ్రెస్సులు, జబర్దస్త్‌తో తన గెంతులు… అప్పటి రంగస్థలం రంగమ్మత్త ఇమేజీ… ఇక ఓ మాంచి మసాలా ఐటం సాంగ్ చేస్తున్నదంటే తెలుగు ప్రేక్షకుల్లో కాస్త ఇంట్రస్టు క్రియేటవుతుంది కదా… అలాగే హైప్ క్రియేటైంది… పైగా మంగ్లి టోన్‌లో ట్యూన్… అనసూయ పాట ఎత్తుకోగానే ఓ స్టేజీ మీద ప్రత్యక్షం… తీరా చూస్తూ చూస్తూ పోతూ ఉంటే ప్రేక్షకులు జుత్తు పీక్కున్నారు… అసలు తెర మీద అనసూయ వ్యాంప్ మార్క్ స్టెప్పులు… హొయలు, ఆ […]
అసలే ఇది మనోభావాల సీజన్… పొగరు అంటే కుదరదు కదా..? ‘కట్’ చేశారు..!!
ఈమధ్య మనోభావాలు దెబ్బతినడం బాగా ఎక్కువయిపోయింది కదా… ఏ చిన్న సందు దొరికినా సరే పలు సంఘాలు మనోభావాల పేరిట ఆందోళనలు చేయడం, కోర్టుకెక్కడం, ఇతరత్రా బెదిరింపులు కామన్ అయిపోయాయి… కొన్నిసార్లు అసలు ఇష్యూ లేకపోయినా సరే, ఏదో ఒకటి క్రియేట్ చేసి మరీ గొడవలకు దిగుతాయి… కొన్ని సెటిల్ అవుతాయి, కొన్ని ఎవరూ పట్టించుకోక అవే చల్లారతాయి, కొన్ని కోర్టుల్లో పడి క్రమేపీ కాలం చెల్లిపోయి, నేచురల్ డెత్‌కు గురవుతాయి… సరే, అవన్నీ ఎలా ఉన్నా… […]
దృశ్యం సినిమాకు ఇది మరోవైపు దృశ్యం..! ఇదో డిఫరెంట్ (రి)వ్యూ..!!
Bharadwaja Rangavajhala………………. దృశ్యాభిమానులకు క్షమాపణలతో …. నా అనవగాహనే కావచ్చు … కానీ ఇలా అనిపించింది … అనిపించింది చెప్పేస్తే పోతుంది కదానీ …. జరిగిన నేరాన్ని కప్పిపుచ్చి తన వాళ్లను కాపాడాలనే తాపత్రయం … ఆ ప్రయత్నంలో … తెలివితేటలు … ఈ క్రమంలో మైండ్ గేమ్ , సీన్ రీ బిల్డ్ చేయడం లాంటి ప్రక్రియలు … తెరమీద చూపించాలనే తాపత్రయం కనిపించింది నాకు రెండు దృశ్యాల్లోనూ … ఆ కుర్రాడు చేసిన తప్పు […]
మట్టి మోసం చేయదు… ఉప్పెనలో తేలిపోయిన ఊక, ఉప్పు… అసలు కథ ఇదీ…
రివ్యూయర్ :: గుఱ్ఱం సీతారాములు ………… మట్టి మోసం చేయదు… ఉప్పెనలో తేలిపోయిన ఊక , ఉప్పు……….. హిల్లరీ జోర్డాన్ అనే అమెరికా అమ్మాయి కొలంబియాలో సృజనాత్మక సాహిత్యం చదువుకొని నేటికి సరిగ్గా పదమూడు ఏళ్ళ కింద ‘మడ్ బాండ్’ అనే నవల రాసుకుంది. డెబ్బై ఎనభై ఏళ్ళ కింద మిస్సిసిపి డెల్టా పత్తి క్షేత్రంలో అమానవీయమైన జాతివివక్ష నేపథ్యంలో రెండు విభిన్నమైన జాతుల మధ్య జరిగిన ఒక అంతర్యుద్దం కథ. ఒక నల్ల జాతి కుటుంబమూ […]
నో డౌట్… పాట బంపర్ హిట్…! కానీ సుద్దాల ఎక్కడ ఎత్తుకొచ్చాడు దీన్ని..?!
నో డౌట్… పాట సూపర్ హిట్… రాబోయే కమ్ముల శేఖర్ సినిమా లవ్ స్టోరీలోని సారంగ దరియా పాట యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల హిట్స్‌తో దూసుకుపోతోంది… నిజానికి తెలంగాణ పల్లె నుంచి పుట్టిన ఆ పురాతన ట్యూన్‌లోని పంచ్ అది… మంగ్లీ టోన్‌కు తగిన ట్యూన్ అది… తను కూడా హుషారుగా పాడింది… సాయిపల్లవి స్టెప్పుల గురించి చెప్పడానికేముంది..? పెద్ద పెద్ద తోపు డాన్సర్లే ఆమె ముందు వెలవెలబోతారు… శేఖర్ మాస్టర్ […]
కంగనా రనౌత్, ఆలియా భట్, దీపిక పడుకోన్… ఈ పాత్రకెవరు సూటబుల్..?
ఎవరైతే బెటర్..? ఇప్పుడు దేశంలో ఉన్న పాపులర్ తారల్లో ఎవరు సీత పాత్రకు బాగా సూటవుతారు..? అబ్బే, అందులో పెద్దగా చర్చించడానికి ఏముంది..? ఎవరైనా చేయగలరు..? ఎందరో తారలు సీత పాత్రల్ని పోషించలేదా..? న్యాయం చేయలేదా..? నాటి టీవీ రామాయణంలో దీపికి చికలియా నుంచి బాపు రామరాజ్యం నయనతార వరకు బోలెడు మంది సీత పాత్రల్ని పోషించారు.., ఇలాగే అనుకుంటాం కదా… కానీ నెటిజనంలో ఈ చర్చ జరుగుతోంది రెండు రోజులుగా… తలైవి, మణికర్ణిక పాత్రల్ని పోషించిన […]
రెడ్ వాల్..! కణకణ మండిన ఆ రోజుల్లోకి… వేలాది మంది జ్ఞాపకాల్లోకి…
ఒక ఫోటో… ఆశ్చర్యం వేసింది… బెంగుళూరు గూన కప్పిన ఓ పాత ఇల్లు… సిమెంటు పూతలతో మాసికలు వేసిన పాత గోడ… పక్కన ఓ జిల్లేడు చెట్టు… గోడపై విప్లవం వర్ధిల్లాలి అనే వాల్ రైటింగ్… సుత్తీకొడవలి గుర్తు… లంగావోణి, బుగ్గల జాకెట్ వేసుకున్న ఓ అమ్మాయి ఆ సుత్తీ కొడవలి గుర్తు చుట్టూ ఓ లవ్ సింబల్ గీస్తోంది… విప్లవాన్ని ప్రేమిస్తోందా..? విప్లవం కూడా ఓ ప్రేమ చర్యే అంటోందా..? ఆ కథలోకి తరువాత వెళ్దాం… […]
అక్షర..! సర్కారీ విద్యలాగే… లైన్ తప్పి, వెగటు కామెడీలో గింగరాలు..!!
అక్షర అనే సినిమా విడుదలైంది నిన్న… కరోనా కారణంగా పెండింగ్ పడిపోయిన సినిమాలన్నీ చకచకా గుమ్మడికాయలు కొట్టేసుకుని, థియేటర్లలో వచ్చి వాలుతున్నయ్… నిన్న పలు సినిమాలు రిలీజైనా అందరి దృష్టీ ప్రధానంగా నితిన్ సినిమా చెక్ మీదే కాన్సంట్రేట్ అయింది… అది కాస్తా ఛస్ అనిపించుకుంది… చాలా తక్కువ మంది ప్రేక్షకుల దృష్టి అక్షర అనే సినిమా మీద పడింది… అదీ నందిత శ్వేత మొహం చూసి…! కార్పొరేటు విద్య ఒక మాఫియాగా మారి, క్రమేపీ పేదవాడి […]
చెక్ నితిన్..! ఎంత ఏలేటి అయితేనేం… కమర్షియల్ లెక్కల్లో బోల్తా…!!
ఒక్కసారి ఆ హీరో నితిన్ కోణం వదిలేయండి… ఆ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ మీద మనకు సదభిప్రాయం ఉంది కదా… డిఫరెంటు కంటెంటు, మంచి స్క్రీన్ ప్లే, నాన్-ఫార్ములా…. కాదు కాదు.., తెలుగు సినిమా ప్రధాన అవలక్షణమైన నాన్-నాన్సెన్స్ ఉండదు కదా తన సినిమాల్లో అనే ఓ పాజిటివ్ ఒపీనియన్ మనలో ఉంది కదా… అందుకనే ఈ కొత్త సినిమా ‘చెక్’ మీద కాస్త ఇంట్రస్టు ఫోకసైంది… అంతేతప్ప ఇప్పటివరకు పెద్దగా తనకంటూ చెప్పుకోదగిన ఓ సినిమా […]
- « Previous Page
- 1
- …
- 106
- 107
- 108
- 109
- 110
- …
- 112
- Next Page »