అనుష్క శెట్టి… తెలుగు టాప్ స్టార్… ఆమే రేంజ్ నంబర్ వన్… ఎహె, తెలుగు ఏమిటి..? బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ ఆమె… తమిళం, మళయాళం, కన్నడ… వాట్ నాట్..? కానీ కేవలం ఆమె మొహాన్ని చూడటానికి… లేదా కష్టపడింది కదా, బక్కపడిందా లేదా చూడటానికి ప్రేక్షకుడు థియేటర్‌కు రాడు… ఓటీటీలో ఆ సినిమాను క్లిక్ చేయడు… టీవీ ముందు కూర్చోడు… సినిమాలో కథోకాకరకాయో కాస్త నచ్చాలి… అంతే కదా… అవును, అంతే… తాజా టీవీ […]
ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్…! మన ఆనంది మనోళ్లకు ఆనలేదు…!
జాంబిరెడ్డి అని ఓ కొత్త సినిమా వస్తోంది రేపోమాపో… హీరో సజ్జా తేజ అట… జబర్దస్త్ ఈటీవీషోలో ఓ ప్రమోషన్ స్కిట్ చేశాడు సుడిగాలి సుధీర్ టీంతో కలిసి… దర్శకుడు ప్రశాంత్ వర్మ… హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి కాదు… ఈ జాంబి అంటే ఏమిటి అనేవి కాసేపు పక్కన పెట్టేయండి… కానీ హీరోయిన్ ఆనంది అనే పేరు దగ్గర కాసేపు దృష్టి నిలిచిపోయింది… మన పిల్ల… మన వరంగల్ పిల్ల… మన తెలుగు పిల్ల… మన […]
బాబూ చిట్టీ..! ఏమో అనుకున్నాం, తమరూ గ్రంథచోరులే అన్నమాట..!!
సకాలంలో అందని న్యాయం అసలు న్యాయమే కాదు అంటారు పెద్దలు… నిజం, కారణాలెన్నున్నా సరే, మన న్యాయవ్యవస్థ చాలా అన్యాయం చేస్తోంది… చివరకు చిన్న చిన్న కేసుల్లో కూడా ఇదే పరిస్థితి..! ఒక వార్త చదువుతుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది… అప్పట్లో … అంటే 2010లో… పదకొండేళ్ల క్రితం… యంతిరన్ అని రజినీకాంత్ సినిమా వచ్చింది గుర్తుంది కదా… తెలుగులో రోబో… ఓ ఇంజనీర్ అంతులేని మేధస్సు, బలసంపన్నుడైన ఒక రోబోను అచ్చు తనలాగే సృష్టించడం, తీరా అది […]
దటీజ్ ఎస్వీఆర్..! ఎవరైనా సరే… సర్ఫ్ లేకుండానే కడిగేసేవాడు…
……… By…. Bharadwaja Rangavajhala……………… సినీరంగంలో ఎస్వీఆర్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకి ప్రధమకోపం … తనకు అనిపించినదేదో మాట్లాడేస్తారు తప్ప మనసులో ఒకటీ బైటకి ఇంకోటీ రకం కాదు. ఎవర్నైనా తిట్టాలనుకున్నా పొగడాలనుకున్నా … అది ముఖం మీదే తప్ప పరోక్షంగా కాదు. ఆయనతో ఏం చెప్పాలన్నా … చాలా జాగ్రత్తగా ఎలా చెప్తే వింటారో అలానే చెప్పి కన్విన్స్ చేసేవారు ఇండస్ట్రీ పెద్దలు. భక్త ప్రహ్లాద లో క్లైమాక్స్ రీషూట్ చేయాలనుకున్నప్పుడు … నిర్మాతలు డి.వి.నరసరాజుగారిని […]
ఆచార్యా.., తమరు ఏ పాత్ర తీసుకున్నా సరే.., బీభత్సమేనా..?!
టీజర్, ట్రెయిలర్… ఏ పేరయితేనేం… టీవీ ప్రోగ్రాముకు ప్రొమోలాగా… అవేమీ ‘ఉడికిన మెతుకులు’ కావు అన్నం మొత్తాన్నీ అంచనా వేయడానికి… జస్ట్, అవి ఇంట్రడక్షన్స్… సినిమా లైన్‌ను లీలగా చెప్పే సూచికలు… అంతే… రాంగోపాలవర్మ ట్రెయిలర్లు వేరు, అవి సినిమాను సగం చూపిస్తయ్… అసలు సినిమా చూడకపోయినా పర్లేదు, కాదు, చూడనక్కర్లేదు… చూడొద్దు కూడా… అవి ట్రెయిలర్ల కాన్సెప్టు, స్పిరిట్‌కే రివర్స్ ఫార్ములా అన్నమాట… ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమా ఆచార్య టీజర్ రిలీజ్ చేశారు… ఇంతటి […]
ప్రదీపే పెద్ద మైనస్..! మరో బుడగ ఫట్‌మని పేలిపోయింది… ఊహించినట్టే..!!
ప్రదీప్ నటనకు సంబంధించి చాలామందికి ముందే ఒక అంచనా ఉంది… కానీ శుభం పలకరా అంటే ఇంకేదో అన్నట్టుగా అమంగళం వద్దు అని ఎవరూ ఎక్స్‌ప్రెస్ చేయలేదు… చేయకూడదు కూడా… కాకపోతే ఎప్పుడో ఓసారి తప్పదుకదా… సినిమా విడుదల కాగానే, అసలు రంగు బయటపడక తప్పదు కదా… దాంతో ఆ బుడగ పేలిపోయింది… 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకు ప్రదీప్ ప్లస్ కాదు, తనే పెద్ద మైనస్ అని తేలిపోయింది… ఇక్కడ రెండు మూడు […]
ప్చ్.., బోర్ కొడుతోంది… ఈ స్తబ్దతను బద్దలు కొట్టే ఆ సినిమా ఎప్పుడో…!!
ఎట్టకేలకు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం… అసలు ఇన్నేళ్లు ఆగడమే తెలుగు చిత్రరంగానికి నష్టకారకం… అదుగో ఆ స్టార్ దర్శకుడేనా ఈ వారసుడికి మెరుగుపెట్టేది… ఆ బ్యానర్ కిందేనా తను దుమ్మురేపబోయేది…… ఇలా బోలెడు న్యూస్, గాసిప్స్ ఏళ్లుగా రాస్తూనే ఉన్నారు గానీ… నిజానికి వాటికన్నా బాలయ్యతో బోయపాటి తీయబోయే అఘోరా టైపు సినిమా మీదే అందరికీ ఆసక్తి ఉంది… అసలే బాలయ్య, అందులో బోయపాటి, పైగా అఘోరా… ఇక చూసుకో నా రాజా… కరోనా వచ్చి […]
అంతటి మర్యాదరామన్న మోడీ సైతం మౌనంగా ఉండిపోయాడు..!!
ఏవేవో పాత ఫోల్డర్లన్నీ తిరగేస్తుంటే… పాత పోస్టుల స్మృతుల్ని పలకరిస్తుంటే… ఓ ఫోటో దగ్గర ఆగిపోయింది కన్ను, మనసు, ఆలోచన… ఎంత గొప్ప ఫోటో… ఒక ప్రఖ్యాత నర్తకి మృతదేహం వద్ద ఆమె కూతురు నర్తిస్తూ నివాళి అర్పించడం, ప్రదర్శించడం, దుఖాన్ని వ్యక్తీకరించడం… చాలామందికి అర్థం కాకపోవచ్చు ఈ సీన్లోని ఉద్వేగం… కానీ ఓ బలమైన భావోద్వేగ ప్రదర్శన అది… మరణించిన ఆ తల్లి పేరు మృణాళిని సారాభాయ్… ఆ బిడ్డ పేరు మల్లికా సారాభాయ్… బహుశా […]
కాకి బంగారం..! అల్లరిపాలైన నరేష్..! బావురుమన్న బాలయ్య టైటిల్..!!
‘నా సినిమాల్లో కామెడీ తప్ప కథ ఉండటం లేదు, ఇప్పుడు కథ కూడా ఉంటుంది’ అని అల్లరి నరేషుడు చెప్పినప్పుడే… ఏదో కొత్త కథ చెబుతున్నాడులే ప్రమోషన్ కోసం అనిపించింది… సర్లె, కథలు చెబితే మంచిదేగా, ప్రమోషన్ కథలు ఎలా చెప్పినా సరే, సినిమాలో కథ బాగుంటే చాలు, అసలు కథలకు మొహం వాచిపోయి ఉన్నాం కదా అనుకున్నాం… ఈ బంగారు బుల్లోడు సినిమాలో కథ లేదు అనలేం, ఉంది… కానీ కథను సరిగ్గా చెప్పలేకపోయారు… జబర్దస్త్ […]
లక్-కీ..! దగ్గుబాటి సురేషుడు లక్కీయేనా..? తొక్క మీద కాలేశాడా కొంపదీసి..!
ఒకాయన ఎ అనే సినిమాను తీశాడు… దాని రీమేక్‌గా మరొకాయన బి అనే సినిమాను తీశాడు… ఇంకొకాయన ఈ సినిమాల ఆధారంగానే సి అనే సినిమాను తీయాలనుకున్నాడు… రైట్స్ ఎవరు అమ్మాలి..? ఎవరి దగ్గర కొనుక్కోవాలి..? ఒరిజినల్‌గా ఎ అనే సినిమాను తీసిన ఫస్ట్ నిర్మాత వద్దే కదా… కామన్‌గా అంతే కదా… కానీ మరేమిటి ఇంతటి సినీ వ్యాపారవేత్త, ఇండస్ట్రీ మీద ఫుల్ కమాండ్ ఉన్న దగ్గుబాటి సురేషుడు బి సినిమా తీసిన నిర్మాత దగ్గర […]
నాగార్జునకు కోపమొచ్చింది..? సమంత చెంపలేసుకుని డిలిట్ కొట్టేసింది..!
సమంత పోస్ట్ చేసిన ఒక ఫోటోను చూసి అంకుల్ నాగార్జున కోపగించాడా..? అందుకే సమంత లెంపలేసుకుని వెంటనే పోస్ట్ డిలిట్ చేసి సైలెంట్ అయిపోయిందా..? ఇదీ టాలీవుడ్ తాజా చర్చ… బాస్ కస్సుమన్నాడు కాబట్టే, సమంతే స్వయంగా డిలిట్ చేసుకుంది కాబట్టి… సమంత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఫైర్ బ్రాండ్ చిన్మయి దగ్గర్నుంచి మన అనసూయ వరకూ కిక్కుమనడం లేదు… లేకపోతే ఈ ఫోటో పోస్టుపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లపై భగ్గుమనేవాళ్లేమో… ఇందులో తప్పేముంది..? వల్గారిటీ ఏముంది..? […]
‘‘రూపాయికే సూర్య ఫ్లయిట్’’… బుల్లితెర ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు…
పెద్ద హీరో… ‘‘రూపాయికే విమానయానం’’ అనే భిన్నమైన కథాంశం, ఓ బయోపిక్… ఓటీటీలో విడుదల చేసినప్పుడు మంచి హిట్ టాక్ వచ్చింది… హీరో సూర్యకే గాకుండా డైరెక్టర్‌కు కూడా మంచి ప్రశంసలు లభించాయి… రివ్యూలు కూడా అధికశాతం పాజిటివ్‌గా వచ్చాయి… ఓ కొత్త మొహం హీరోయిన్… గుడ్… అన్నీ సానుకూలతలే… మరి అది టీవీలో ప్రసారం చేసినప్పుడు మంచి రేటింగ్స్ రావాలి కదా… వస్తాయని అనుకుంటాం కదా… ఫాఫం, బోలెడు రేటు పెట్టి టీవీ రైట్స్ కొనుగోలు […]
ఆలీ పిచ్చికూతలు సరే..! షకీలా ధర్మసందేహం మాత్రం అల్టిమేట్..!
అసలే ఒకప్పటి బోల్డ్ బాంబ్ షకీలా… పక్కన మరో బోల్డ్ డాన్సర్ అనూరాధ.,. అప్పుడప్పుడూ నాలుక అదుపు తప్పే ఆలీ… ఇలాంటివే ఇష్టపడే ఈటీవీ… ఇంకేముంది..? ఏమిటీ స్టార్టింగ్ ట్రబులా..? బండి స్టార్ట్ కాకపోతే వంచి, పడుకోబెట్టి, మళ్లీ కొడతారు తెలుసు కదా…? అంటూ తిక్కతిక్క పంచులు వేశాడు ఆలీ… సింపుల్‌గా షకీలా… ఐనా సరే, నేను రెడీ అనేసేసరికి, అంతటి ఆలీ నోటి వెంట మళ్లీ మాట రాలేదు… రాబోయే ఆలీతో సరదాగా ఎపిసోడ్ ప్రోమోలో […]
కిల్ రాజు దందా, బెల్లంకొండ దాదా…! మధ్యలో ఓయూజేఏసీ హేమిటి..?!
క్రాక్ అనబడే ఓ సినిమాకు సంబంధించి ఒక డిస్ట్రిబ్యూటర్ శ్రీనుకు ఎక్కడో కాలి దిల్ రాజును కాస్తా కిల్ రాజూ అని తిట్టి ఉండవచ్చు… శిరీష్నూ నిందించి ఉండవచ్చు…. చివరకు ఎవరెవరికి ఏ భాషలు వస్తాయి, రావనేది కూడా తిట్టడానికి స్కోప్ ఇవ్వవచ్చు… దానికి బెల్లంకొండ సురేష్‌కు కోపమొచ్చి ఉల్టా ఈ శ్రీనును తిట్టవచ్చు… ఒరే, దిల్‌రాజు, శిరీష్ వంటి మహా మహితాత్ములను తిట్టడానికి నీకు నోరెలా వచ్చింది, ఇకపై నీకు సినిమాలు ఎవడిస్తాడు అని బెదిరించవచ్చుగాక… […]
కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
కంగనా రనౌత్..! తన వ్యవహారధోరణి మీద బోలెడు విమర్శలు… కానీ ఆమె ధిక్కారి, సాహసి… అసలు ఆడదాన్ని ఓ భోగవస్తువుగా చూసే ఆ సినిమా రాజ్యంలో పెద్దపెద్ద తలలను ధిక్కరించి తలెగరేస్తోంది ఆమె… సేమ్, తన తత్వానికి తగిన ఓ కథను ఎంచుకుని ఓ సినిమా తీయబోతోంది… మణికర్ణిక మళ్లీ వచ్చింది అంటూ తీసే ఆ సినిమాకు తనే దర్శకురాలు… అయితే ఆ సినిమా కథ వర్తమానం కాదు, మణికర్ణిక ఒరిజినల్ ఝాన్సీరాణి తరహా రాణి కూడా […]
ఈ మైండ్‌లెస్ చిల్లర హీరోలకు ఈరోజుకూ ఫీల్డ్ సోయి రావట్లేదు..!!
సినిమా అంటే అందరినీ అలరించాలి… ఇంతటి కరోనా దుర్దినాల్లో కూడా రకరకాల భయాలను అధిగమించి థియేటర్ దాకా వచ్చే ప్రేక్షకుడిని ఎంటర్టెయిన్ చేయాలి… ఇండస్ట్రీ చుట్టూ అలుముకున్న భవిష్యత్తు ఆందోళన చీకట్లను తరిమేసేలా ఉండాలి… పర్లేదు, జనం వస్తారు అనిపించేలా ఉండాలి… హెబ్బే, అబ్బే, అవన్నీ ఆలోచిస్తే అది సౌతిండియన్ సినిమా ఎందుకవుతుంది..? మనం ఈరోజుకూ మనకు అలవాటైన రొడ్డకొట్టుడు రొటీన్ ఫార్ములా ఇమేజీ ఫార్మాట్ వదిలేస్తే కదా… దిక్కుమాలిన కథ, తలకుమాసిన కథనం, లాజిక్ లేని […]
అల్లుడు బెదుర్స్..! ఈ సంక్రాంతి పతంగుల పోటీలో మరొకటి గాయబ్..!!
తొమ్మిదేళ్ల క్రితం సినిమా… కందిరీగ… ఇప్పుడు సినిమా అల్లుడు అదుర్స్… ఇదే బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ దానికి నిర్మాత… అందులో కూడా సోనూసూద్ ఉన్నాడు… ఇదే దర్శకుడు అప్పుడూ ఇప్పుడూ… సంతోష్ శ్రీనివాస్… సేమ్, గిట్లనే ఒక్కతే పోరిని హీరో లవ్ చేస్తుంటడు, విలన్ ట్రై చేస్తుంటడు… కాకపోతే కందరీగలో హన్సిక -పోతినేని హీరోహీరోయిన్లు… గీ అల్లుడు అదుర్స్ సినిమాల అల్లుడు సీను, నభా నటేష్ హీరోహీరోయిన్లు… ఈ సినిమా చూస్తుంటే మల్ల గా సినిమానే […]
పోతినేని రెడ్ రాముడు… రుచీపచీ లేని ఓ పండుగ పిండివంట..!!
ఒక సకినం… దానికి ఊరగాయ, గడ్డ పెరుగు కాంబో… ఒక మొక్కజొన్న గారె… నేతిలో వేయించినది… ఒక భక్ష్యం… బెల్లం, వెన్న కాంబో… నిమ్మకాయ పులిహోర… కాస్త ఇంగువ… నువ్వుల ముద్ద, పల్లీల ముద్ద… పోనీ, పాయసం… బూరె… ఒకటి గాకపోతే ఒకటైనా సంక్రాంతి విస్తట్లో రుచిగా ఉండాలి కదా… నోట్లో కొన్ని గంటలైనా ఆ ఫ్లేవర్ తిరుగుతూ ఉండాలి కదా… పండుగ వంట అనే పేరు నిలుపుకోవాలి కదా… ఏ ఒక్కటీ బాగా లేకపోతే దాన్ని […]
వేస్ట్ బిల్డప్..! వ్యక్తిపూజ ఎక్కువైతే… ఇదుగో ఇలా ఉల్టా కాల్చుకోవడమే..!!
తెలుగు, తమిళం…. సో కాల్డ్ కమర్షియల్ సినిమా అనగానే ఓ రోగం హఠాత్తుగా కమ్మేస్తుంది… ఏ దర్శకుడైనా సరే, ఫ్యాన్స్ గురించే ఆలోచించాల్సి వస్తుంది.. ఇది వేక్సిన్ లేని ఇన్ఫెక్షన్… దీనికి సింపుల్ పరిష్కారం, సదరు హీరో తన ఇమేజీకి మాస్క్ కట్టేసుకుని, తనను తాను దర్శకుడికి అప్పగించుకోవాలి… లేకపోతే ఏమవుతుంది..? హాస్పిటల్ ఐసీయూలో ఆక్సిజన్ మాస్క్ కట్టుకుని కనిపిస్తారు… ఏ స్టార్ హీరో దీనికి మినహాయింపు కాదు… ఫాఫం, తమిళ హీరో విజయ్ ఎంత..? లోకేష్ […]
హతవిధీ… చివరకు స్టెప్పులు కూడా కాపీయేనా..? నెట్లో ఓ కొత్త డిబేట్…!!
మన సైట్లకు, యూట్యూబర్లకు, సోషల్ మీడియాకు ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ కావాలి… డిబేట్ జరుగుతూ ఉండాలి… సమయానికి ఏ ఇష్యూ లేకపోతే ఏదైనా అర్జెంటుగా వండేయాలి… ఏదో ఒకటి సెర్చి మరీ పుట్టించాలి… వాసన నెట్ నిండా గుప్పుమనాలి… అల వైకుంఠపురంలో అనే సినిమాలో అల్లు అర్జునుడు, పూజా హెగ్డే డాన్సిన ఓ పాట ఉంది కదా… బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా… అందులో బన్నీ వేసిన స్టెప్స్ నిజంగానే అదిరిపోయాయ్… చాలామంది దేశవిదేశీ సెలబ్రిటీలు […]