నిజానికి చిన్న సినిమా… పాన్ ఇండియా సీన్ ఊహించలేం… హీరో నిఖిల్ రేంజ్ కూడా సెకండ్, థర్డ్ లేయర్… స్టారిజం ఇంకా తలకెక్కలేదు… కానీ హిందీలో కలకలం క్రియేట్ చేస్తోంది… ఎందుకంటే..? అమీర్‌ఖాన్ వంటి సూపర్‌స్టార్ చతికిలపడ్డాడు… అక్షయ్‌కుమార్ బోల్తాకొట్టాడు… వాళ్లను దాటేసి, ఒకవైపు వందలాదిగా వాళ్ల సినిమా షోలను ఎత్తిపారేస్తూ, కార్తికేయ సినిమా షోల సంఖ్య పెంచుతున్నారు… ఇంకా పెరుగుతోంది… ఎందుకిలా..? ఈ సినిమాను తొక్కడానికి దిల్‌రాజు ప్రయత్నించాడు, తను తెలుగు ఇండస్ట్రీకి మంకీపాక్స్ వైరస్ […]
సారీ, దానవీరశూరకర్ణ నేను రాయలేను… ఓ ఉద్దండుని పరిచయం చేస్తాను…
Bharadwaja Rangavajhala………… ‘‘కులము… కులము …. కులమనే పేరిట మన భారతదేశమున ఎందరి ఉజ్వల భవిష్యత్తు భగ్నమౌతోంది. ఎందరు మేధావుల మేధస్సు తక్కువ కులంలో పుట్టారనే కారణాన అడవి కాచిన వెన్నెల అవుతోంది. నేను సూత పుత్రుడననేగా ఈ లోకం నన్ను చూచి వెకిలిగా కూస్తోంది. నీ కుమార పంచకాన్ని కాపాడుకోవాలనే మాతృప్రేమతో వచ్చిన నీకు ఈనాడు కర్ణుడు కౌంతేయుడయ్యాడు. వీడు నీ వరాల తండ్రి కాదు. తెలిసీ తెలియని పడుచుతనపు ఉన్మాదంలో దూర్వాసదత్తమైన మంత్ర శక్తిని […]
Cadaver… వైద్య బోధనకు ఉపయోగపడే మృతదేహం… ఈ సిన్మా ఏంటంటే..?
Cadaver… కడవర్ అంటే మెడికల్ స్టూడెంట్స్ అనాటమీ నేర్చుకొనేందుకు ఉపయోగించే మృతదేహం….. అమలాపాల్ స్వయంగా ప్రొడ్యూస్ చేసి తీసిన ఈ కడవర్ సినిమా పేరు సజస్ట్ చేస్తున్నట్లుగానే ఒక మెడికో లీగల్ కేస్కి సంబంధించిన మిస్టరీ మూవీ… ముందుగా సినిమా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుందాం…. నాన్-లీనియర్ మెథడ్‌లో చెప్పిన ఈ కథని సాధ్యమైనంతవరకు ఇల్లాజికల్ అంశాలు లేకుండా తీయడానికి శ్రమించారు. అరవింద్ సింగ్ చేసిన సినిమాటోగ్రఫీకీ సంబంధించినంతవరకు తను ఎంచుకున్న కలర్ స్కీం, సీన్‌కి అవసరమైన, అనుగుణమైన […]
వెబ్ వరల్డ్‌లోకి నీహారిక… ఆ పాత ఆర్యన్ రాజేష్, నటి సదా… ఓ వృథా శ్రమ…
ఆర్యన్ రాజేష్… పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా..? ఈవీవీ పెద్ద కొడుకు… హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలని బాగా ప్రయత్నించాడు ఆయన… కానీ లెగ్గు… అసలు కెరీర్ కదిలితే కదా… ఇరవై ఏళ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు… ఏమాత్రం వెలగని తెలుగు వారసహీరోల్లో తన పేరూ ఉంటుంది… ఇక సినిమాలు చేయడమే మానేశాడు… తమ్ముడు అల్లరి నరేష్ కాస్త నయం… ఇప్పుడు కిందామీదా పడుతున్నాడు గానీ, అప్పట్లో కామెడీ జానర్‌తో కాస్త నిలబడ్డాడు… ఇలాంటోళ్లకు ఓటీటీలు మళ్లీ […]
కార్తికేయుడి విజయంతో… థియేటర్ల మాఫియా పెద్దలు కుళ్లుతో కుతకుత…
లాల్‌సింగ్‌చద్దా గతి ఏమైంది..? బాబ్బాబు, నా సినిమా చూడండి, పాత తప్పులన్నీ కాయండి అని అమీర్‌ఖాన్ బతిమిలాడుతున్నాడు… ఒక పరిమితి దాటితే, జనం తిరస్కరించడం మొదలైతే ఇక అంతే… మరి ఆ గతి దిల్‌రాజుకు కూడా పడుతుందా..? ఇదీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చను రేకెత్తిస్తున్న ప్రశ్న… పూర్తిగా థియేటర్లను చెరబట్టిన ఓ నలుగురి సిండికేట్ ఇండస్ట్రీని శాసిస్తోందనే విషయం బహిరంగ రహస్యమే… తాము అనుకున్న సినిమాలే రిలీజ్ కావాలి, తాము చెప్పినప్పుడే రిలీజ్ చేయాలి, తాము […]
ఓ దైవకార్యంలో నాస్తికుడు..! కృష్ణపురాణానికీ వర్తమానానికీ లంకె..!!
నిజానికి ఓ పురాణకాలానికి వర్తమానాన్ని జోడించి ఓ కథను ఆసక్తికరంగా చెప్పడం… అందులోనూ ఓ దైవకార్య సాధనలో ఓ నాస్తిక కథానాయకుడి సాహసయాత్రను ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించడం చాలా పెద్ద టాస్క్… అదంత వీజీ కాదు… అదే ఒక అడ్వెంచర్… అడుగు తప్పుగా పడితే ఇక ఢమాలే… కార్తికేయ-2 సినిమా దర్శకుడు చందు ఆ సాహసం చేశాడు… చాలావరకూ మెప్పించాడు… ఎంతసేపూ చెత్త ఫార్ములాలు, ఇమేజీ బిల్డప్పుల సోది కథలతో విసుగెత్తించే మన సినిమా కథల […]
…. ఇదుగో ఇందుకే ఓటీటీలు ప్రేక్షకులను ఆ-కట్టేసుకుంటున్నాయి..!
ఓ సినిమానో, సీరిసో చూస్తున్నప్పుడు… నెక్స్ట్ ఏం జరుగుతుందో… వందలకొద్ది చూసేవాళ్లు సులభంగానే పసిగట్టగల్గుతారు. ఇంకా ఆయా సినిమాల్లోనో, సీరిస్ ల్లోనూ కాస్త నెగటివ్ షేడ్స్ ఉండే అనుమానపు క్యారెక్టర్స్ తో కథ నడుపుతున్నప్పుడు… ఫలానావాళ్లే విలన్ అని కూడా ఇట్టే పట్టేస్తుంటారు. అయితే అలాంటి క్యారక్టర్స్ సంఖ్య ఎక్కువైనప్పుడు సగటు వీక్షకుల్లో ఫలానావాళ్లై అయిఉంటారని అనుకున్నాక… కాదుకాదు వీళ్లేమో అనిపించేలా అంచనాలు ఆ సినిమా, సీరిస్ చూస్తున్నంతసేపూ మారిపోతుంటాయి. కానీ, ఆ సస్పెక్టెడ్ క్యారెక్టర్సేవీ ఆ […]
లాల్‌సింగ్‌చద్దా… వందల షోలు ఎత్తేస్తున్నారు… మరేం చేస్తారు ఫాఫం..?!
కంగనా రనౌత్ హృదయం ఇప్పుడు హాయిగా ఉన్నట్టుంది… ఓ ప్రొఫెషనల్‌గా, బాలీవుడ్ పాపులర్ హీరోయిన్గా నిజానికి అలా ఫీల్ కాకూడదు… బాధపడాలి… ఆందోళన పడాలి… కానీ, అలా పడితే ఆమె కంగనా ఎందుకు అవుతుంది..? అప్పట్లో, మే నెలలో ఆమె సినిమా ధాకడ్ రిలీజైంది… ఉత్త రొటీన్ ఫైటింగుల పిచ్చి సినిమా అది… 2100 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తే రెండు రోజుల్లోనే 300 స్క్రీన్లలో ఎత్తిపారేశారు… మరీ కొన్ని షోలకు 10 నుంచి 15 మంది మాత్రమే… […]
ఏళ్లకేళ్లుగా దంచీ దంచీ నలగ్గొట్టేసిన ఫార్ములాతో నితిన్ కుస్తీపట్లు..!!
చూడబుల్ మొహం… బలమైన సినిమా నేపథ్యం… తండ్రి పాతుకుపోయిన ఎగ్జిబిటర్… ఫుల్లు సాధనసంపత్తి… అయితేనేం, హీరోగా దుమ్ము రేపాలంటే ఎక్కడో సుడి ఉండాలి… హీరో నితిన్‌ను చూస్తే… అప్పుడెప్పుడో 20 ఏళ్లయింది ఫీల్డుకొచ్చి… మూతి మీద మీసాలు కూడా రాకముందే చేసిన ఆ జయం సినిమా హిట్… అంతే… పదేళ్లు పల్టీలే… కృష్ణవంశీ వంటి దర్శకులు కూడా లైఫ్ ఇవ్వలేకపోయారు… వేరే అనామకులైతే ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యేవాళ్లు… కానీ తన బ్యాక్ గ్రౌండ్ బలమైంది కదా, నిలబెట్టింది… […]
బాయ్‌కాట్ పిలుపు దాకా దేనికి..? హీరో, దర్శకులే చంపేసుకున్నారు..!!
ముందుగా ఓ చిన్న డిస్‌క్లెయిమర్ :: సినిమా గనుక బాగుంటే ఎవరు ఎన్ని బాయ్‌కాట్ పిలుపులు ఇచ్చినా సరే, సోషల్ మీడియా క్యాంపెయిన్ నడిపించినా సరే, ప్రేక్షకుడు పట్టించుకోడు… సినిమాను చూస్తాడు… సినిమా బాగాలేకపోతే చిరంజీవి, నాగార్జునలు కాదు కదా, బాలీవుడ్ ప్రముఖులంతా కట్టకట్టుకుని డప్పులు కొట్టినా సరే ఆ సినిమా బతికి బట్టకట్టదు… తన్నేస్తుంది… లాల్‌సింగ్‌చద్దా మీద అందరి ఆసక్తి కేంద్రీకృతం కావడానికి రెండురకాల కారణాలు… ఒకటి) ప్రొఫెషనల్… రెండు) సినిమాయేతరం… మెల్లిగా ఎక్కడో మొదలైంది… […]
ఆ ఆపరేషనే ఓ అబ్బురం… ఓ సినిమాగా చిత్రీకరణ మరో అద్భుతం… అంతే…
ఓ అడ్వెంచరస్ సినిమా అంటే ఎలా ఉంటుంది.. అంటే… థర్టీన్ లైవ్స్ లా అని ఠకీమని చెప్పొచ్చు! అప్పటికే ఇక వాళ్ల పనైపోయినట్టేని నిర్ణయించుకునే స్థాయికొచ్చాక… అలాంటి ఆపదలో ఉన్నవారిని కాపాడాలంటే.. అదెంత రిస్క్…? ఎంత రెస్క్యూ ఆపరేషన్స్ లో నిష్ణాతులై ఉన్నా… వారిని కాపాడబోయి తామే ప్రాణాలను కోల్పోతే….? ఇదిగో ఈ ప్రశ్నే వేధిస్తే… తనకు మాలిన ధర్మముండదనేదే లోకరీతవుతుంది. కానీ, ఆ ఎక్స్పర్ట్స్ అలా చేయలేదు… ఎలాగైనా కాపాడాలనుకున్నారు. సంకల్పబలంతో… ఓ కోటగుహలో చిక్కుకున్న 13 […]
అదీ కిక్కిచ్చే పంచ్… వెగటు బుర్ర పగులుబారేలా..! కరణ్ కిక్కుమంటే ఒట్టు…!!
కొత్తేమీ కాదు… కానీ అత్యంత అరుదు… సినిమా ఇండస్ట్రీలో ఆడది అంటే ఓ సరుకు… సినిమా సెట్టింగ్ భాషలో చెప్పాలంటే ఓ ప్రాపర్టీ… ఓ ఆబ్జెక్ట్… దానికి దేహం తప్ప ఆత్మ ఉండటానికి వీల్లేదు… పొరపాటున ఆత్మ కనిపిస్తే చంపేస్తారు… తొక్కేస్తారు… ఇండస్ట్రీ పెద్దలకు వ్యతిరేకంగా నోరిప్పితే పాతేస్తారు… అంతే… మళ్లీ సెట్లలో కనిపించడానికి వీల్లేదు… వ్యక్తిత్వం, పనివాతావరణం, లైంగికవేధింపులు, కమిట్మెంట్లు, సమవేతనాలు గట్రా మాట్లాడటం కాదు… ఏ చిన్న వ్యాఖ్య చేయడానికి కూడా వీల్లేని దురవస్థే […]
ఏ గ్రాఫిక్కులూ లేకుండానే… మస్తు మ్యాజిక్కులు చేశాడు అప్పట్లోనే…
Bharadwaja Rangavajhala……… విఠలాచార్య…. ఈ పేరు వినగానే చిన్నప్పుడేమిటి ఇప్పుడూ పూనకం వచ్చేస్తుంది. మా స్కూల్ డేస్ లో క్లాసురూమ్ లో విఠలాచార్య ప్రభావంతో రైటింగ్ పాడ్ ను డాలుగా పట్టుకుని చెక్క స్కేలును కత్తిగా చేసుకుని చేసిన యుద్ధాలన్నీ గుర్తొచ్చేస్తాయి. కాస్త హయ్యర్ క్లాసులకొచ్చాక విఠలాచార్య మీద బోల్డు సెటైర్లేసేవాళ్లం. మా చిగులూరి శ్రీనివాస్ అయితే అట్టలాచార్య అనేవాడు. అంతా సెట్టింగుల్లోనే కానిచ్చేస్తాడనేది వాడి ఆరోపణ. ఇక విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలకైతే ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉంటాయి. అవి […]
మందుపాట ఘంటసాల పాడితేనే కిక్కు… వైరాగ్యపు మత్తు…
Bharadwaja Rangavajhala…………. ఘంటసాల మందు పాటలు…. తెలుగు సినిమా పాటల్లో మత్తు పాటలకు ఓ ప్రత్యేకత ఉంది. దేవదాసు సినిమా నుంచి మత్తు పాటలు పాడడంలో ఘంటసాల చాలా పర్ఫెక్ట్ అనే పాపులార్టీ మొదలైంది. తాగుబోతు పాటల్లో వేదాంతాన్ని గుప్పించేవారు మన సినీ కవులు. దేవదాసులో మల్లాది, సముద్రాల…ఆ తర్వాత రోజుల్లో ఆత్రేయ, దాశరధి ఇలా మధుగీతాలను అద్భుతంగా రాశారు. వాటిని ఘంటసాల అంతకన్నా గొప్పగా పాడారు. ఓ సారి శ్రీశ్రీ గారు ఆరుద్రతో కల్సి… దేవదాసులో […]
సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
ఒక కొత్త సినిమా వచ్చిందంటే బొచ్చెడు రివ్యూలు… పత్రికల్లో, టీవీల్లో, సైట్లలో, యూట్యూబ్‌లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో… ఇప్పుడు సినిమాల ప్రమోషన్లో భాగంగా ఫేక్ సోషల్ ఖాతాలు, కేవలం ప్రమోషన్ కోసమే పుట్టుకొచ్చిన చానెళ్లు, సైట్ల ద్వారా సినిమా మొదటి ఆట పూర్తిగాక ముందు నుంచే డప్పు రివ్యూలు రాయిస్తున్నారు… యాడ్స్ కోసం మీడియా, ఫ్యాన్స్‌కు కోపమొస్తుందనే భయంతో మెయిన్ స్ట్రీమ్ టీవీలు కూడా పెద్దగా విమర్శనాత్మక దృష్టితో వెళ్లవు… కథ చెప్పొద్దు… ట్విస్టులు చెప్పొద్దు… క్లైమాక్స్ […]
నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
ముందుగా వివాదం ఏమిటో చదువుదాం… నిత్యామేనన్ మొన్నామధ్య ఓ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఓ విషయాన్ని వెల్లడించింది… సాధారణంగా పెళ్లి కాని హీరోయిన్‌కు మన దిక్కుమాలిన సినిమా జర్నలిజం తరఫున పదే పదే ఎదురయ్యే ప్రశ్న ‘‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు..?’’… ఇక్కడా ఆ ప్రశ్నే ఎదురైంది… అంతకుముందే ఓ జాతీయ పత్రిక ఓ ప్రముఖ మలయాళ స్టార్ హీరోతో నిత్య ప్రేమలో పడిందనీ, త్వరలో పెళ్లి జరగబోతోందనీ ఏదో గాసిప్ గీకిపారేసింది… దాని […]
ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
Bharadwaja Rangavajhala……. ఆత్రేయా ప్రకాశరావూ … ప్రేమనగర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. హీరో ఓపెనింగ్ కోసం ఓ బర్త్ డే సాంగ్ పెడితే బావుంటుందనిపిస్తోంది …. అన్నారు కె.ఎస్ ప్రకాశరావు. బర్త్ డే సాంగా ? అన్నారు ఆత్రేయ … ఏమంట్లా, ముఖం చిట్లించావ్, బర్త్ డే సాంగ్ అయితే బావుంటుందనిపిస్తోంది అన్నారు ప్రకాశరావు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడి … పుట్టినరోజు పాట ఏం రాస్తాం ప్రకాశరావ్ … హ్యాపీ బర్త్ డే టూ యూ […]
హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!
ఓటీటీలో ఓ సుఖముంది… ఏదైనా డౌట్ వస్తే, మళ్లీ ఓసారి చూడాలనిపిస్తే, ఓ పాట లేక ఓ సీన్ మాత్రమే చూసి వదిలేయాలని అనుకుంటే… ఓటీటీని మించి సౌకర్యం లేదు… టీవీల్లో, థియేటర్లలో ఆ సౌలభ్యం ఉండదు… కొన్ని ఒంటరిగానే చూడాలి, దానికీ ఓటీటీయే బెటర్… ఈసారి చాలా హిందీ సినిమాలు ఫట్ ఫట్ అని పేలిపోవచ్చుగాక… కానీ కశ్మీర్ ఫైల్స్, భూల్ భులయ్యా-2, గంగూబాయ్ కథియావాడి సినిమాలు కమర్షియల్లీ సక్సెస్… గంగూబాయ్ మరొక్కసారి చూస్తుంటే అసలు […]
కడువ..! ఓహ్.., ఇది మలయాళీ సినిమాయేనా..? ఆశ్చర్యంగా ఉందే…!
కడువ… ఇది సినిమా పేరు… జుత్తు పీక్కోవాల్సిన పనిలేదు… ఇప్పుడు వేరే భాషల నుంచి వచ్చే సినిమాలేవీ తెలుగు పేర్ల కోసం ఆగం కావడం లేదు… జస్ట్, అవే పేర్లను తెలుగు లిపిలో రాసేసి నడిపించేస్తున్నారు… ట్రెండ్… కడువ కూడా అంతే… మలయాళ సినిమా… కాదు, కాదు, పాన్ ఇండియా సినిమా… అనగా, మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు… అంతేకదా మరి… హడావుడిగా ఆ భాషల్లోకి డబ్ చేసేసి, థియేటర్లలోకి తోసి […]
హమ్మయ్య… నందమూరి కల్యాణరాముడికి ఎట్టకేలకు ఓ హిట్టొచ్చింది…
ఒక్క ముక్కలో చెప్పాలంటే… చరిత్రను భ్రష్టుపట్టించిన ఆర్ఆర్ఆర్కన్నా… ఓ చందమామ, ఓ బాలమిత్ర తరహా కథను టైమ్ ట్రావెల్ అనే ఫార్ములాలోకి ఇమిడ్చి… గ్రాఫిక్స్‌తో భారీతనాన్ని అద్ది… కీరవాణి సంగీతంతో సానబెట్టి… పర్లేదు అనే స్థాయిలో ప్రజెంట్ చేయబడిన బింబిసార సినిమా చాలా బెటర్… ఆగండాగండి… బింబిసారుడనగానెవ్వరు అని గూగూల్‌ను చావగొట్టకండి… ఆ చరిత్ర చదవాలని చూడకండి… ఏదో పేరు బాగున్నట్టనిపించి పెట్టుకున్నారు తప్ప బింబిసారుడి చరిత్రకూ ఈ సినిమా కథకూ ఏమాత్రం సంబంధం లేదు… హిస్టారికలూ […]
- « Previous Page
- 1
- …
- 114
- 115
- 116
- 117
- 118
- …
- 122
- Next Page »