భాగ్యశ్రీ బోర్సె మాత్రమే బాగుంది… అనే శీర్షిక చూసి మరి రవితేజ మాటేమిటి అనడక్కండి… రవితేజకు ప్రత్యేకంగా ఎవరూ కొత్త సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పనిలేదు… ఈ వయస్సులోనూ ఆ ఎనర్జీ, ఆ ఈజ్ తనకు బలం… తన అన్ని సినిమాల్లాగే తనే ఈ సినిమాకు బలం, తనే మోశాడు, ఐతే… సగటు రొటీన్ తెలుగు ఫార్ములా మాస్ సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా రవితేజ సినిమాల జాబితాలో ఒకటి మాత్రమే… పెద్ద విశేషాల్లేవు, మెరుపుల్లేవ్… జస్ట్, ఒక […]
ఇది ఓరకంగా శ్రీశ్రీ సినిమా… కానీ ఒక్క పాటా రాయలేదు… అదోరకం ‘తీర్పు’…
రాష్ట్ర ప్రభుత్వం వినోద పన్నును రద్దు చేసిన మొదటి తెలుగు సినిమా . NTR జడ్జిగా నటించిన మొదటి సినిమా , అప్పట్లో అది అరుదైన పాత్రే… (తరువాత కాలంలో జస్టిస్ చౌదరి సూపర్ హిట్)… 1975 లో వచ్చిన ఈ తీర్పు సినిమా . సినిమాగా ఒక వినూత్న ప్రయోగం . చనిపోయిన వ్యక్తుల కంకాళాలు కోర్ట్ బోన్లోకి ఎక్కి తమ గోడును వెళ్ళబోసుకునే సరికొత్త ప్రయోగాన్ని చేసారు . డబ్బులు ఎలా వచ్చాయో నాకు […]
ఓహ్… సమంతకూ పెళ్లి ఫిక్స్ చేసేశారా..? గుడ్… ఇంతకీ ఎవరాయన..?!
మీకేమైనా పిచ్చా..? అన్నింటినీ వేణుస్వామితో ముడిపెడితే ఎలా..? ఆయనేదో చెప్పాడు… తప్పో ఒప్పో… దొరికిండు కదాని ఆడుకుంటున్నది మీడియా, సోషల్ మీడియా, నాస్తిక మీడియా… ప్రత్యేకించి కాబోయే టీటీడీ చైర్మన్ (అనగాా బాబు మార్క్ ఆస్తికుడు అని మీరర్థం చేసుకోవాలి, గ్రేట్ చంద్రబాబు మార్క్ ఆస్తికుడు… ఉద్దరించేది ఏమీ లేదు, చంద్రబాబు ఆబ్లిగేషన్ తప్ప…) ఛానెల్లో ఓ ప్రముఖ గోగినేని మూర్తి గారి బాబు గారు మరీనూ… తనెవరో అయిదో చానెల్ సినిమా జర్నలిస్టు అట… నువ్వు […]
బాపు అంటే ముళ్లపూడి కూడా… ఈ ఒక్క రాముడి కథే మినహాయింపు…
బుధ్ధిమంతుడు , అందాలరాముడు , ముత్యాలముగ్గు వంటి సాంఘిక సినిమాలే పౌరాణికాల్లాగా ఉంటాయి . ఇంక సీతాకల్యాణం , శ్రీరామాంజనేయ యుధ్ధం వంటి పౌరాణికాలు తీస్తే ఎలా ఉంటాయో చెప్పవలసిన అవసరం లేదు . వాల్మీకి , వ్యాసుడు , పోతన కూడా ఆశ్చర్యపోవాల్సిందే . అంతటి కళాకారుడు బాపు . 1975 లో వచ్చిన ఈ శ్రీరామాంజనేయ యుధ్ధం సినిమా చూస్తే నాస్తికుడు కూడా ఆస్తికుడు కావాల్సిందే . అంత కళాత్మకంగా , కన్నుల పండగ్గా […]
హీరోయిన్‌పై లైంగికదాడి… ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే!
హీరోయిన్‌పై లైంగికదాడి.. ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే! (THE KERALA STORY) 2017 ఫిబ్రవరి.. కేరళ రాష్ట్రం కొచ్చిలోని నెండుంబసేరిలో దారుణం జరిగింది. దక్షిణాది సినిమాల్లో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ భావన (‘ఒంటరి’, ‘మహాత్మ’ ఫేం) (బాధితురాలి పేరు బయటపెట్టకూడదు. కానీ ఆమె స్వయంగా బయటకు వచ్చి చెప్పింది కాబట్టి తప్పు లేదు)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ కారులో ఎక్కించుకున్నారు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కొంతదూరం వెళ్లాక ఆమెను వదిలేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా […]
ఎనిమిదేళ్ల క్రితమే వంశీ ఆ చెట్టు గురించి కలతపడి… ఇప్పుడేమో కంటతడి…
కొవ్వూరు… గోదావరి తీరం… ఒక సినిమా చెట్టు… వయస్సు 150 ఏళ్లు… కుమారదేవం చెట్టు అంటారు… రెండుమూడొందల తెలుగు సినిమాల షూటింగులకు ఆ చెట్టుతో అనుబంధం ఉంది… ఈమధ్య కూలింది… బోలెడు వార్తలు రాశారు… ఒక చారిత్రిక వృక్షం నేలకూలిపోయింది అనే తరహాలో కథనాలు… నిజానికి గోదావరి వంటి ప్రవాహగతి రువ్వడిగా ఉండే నదీతీరాల్లోని చెట్లకు ఎప్పుడూ ఈ ప్రమాదం ఉన్నదే… ఐతే దీని వయస్సు ఎక్కువ, వేళ్లు చాలాదూరం వరకూ విస్తరించాయి… ఇన్నేళ్లు నిలదొక్కుకుంది… విశేషమే… […]
ఈ దేశపు ఇరుకు గృహాల లోపల ఎన్నెన్ని వ్యథలున్నాయో తెలుసా?
ఇంతకుముందు బాలీవుడ్ అంటే ఖాన్ల కాలం. ఇప్పుడు కపూర్ల కాలం. అయితే బాలీవుడ్లో దర్శకుల కాలం ఒకటి నడిచింది. శాంతారాం, గురుదత్, రాజ్‌కపూర్.. ఆ తర్వాత కాలంలో బాసు చటర్జీ, హృషికేశ్ ముఖర్జీ, యష్‌చోప్రా.. ఇంకా నాకు తెలియని ఎంతోమంది. నటీనటులు ఎవరైనా కానీ, ఈ దర్శకుల పేరు చెప్పుకొని జనం థియేటర్లకు వచ్చేవారు. ఇప్పటికీ కొందరి పేరిట ఆ అభిమానం కొనసాగుతూ ఉంది. బాసు చటర్జీ గురించి చెప్పాలి. ఆయన్ని బాలీవుడ్ కె.బాలచందర్ అనొచ్చు. జిగేలుమనే […]
మోహన్‌బాబుకు నిత్యస్మరణీయుడు దాసరి… ఇక్కడే అసలు పరుగు ఆరంభం…
స్వర్గం- నరకం సినిమాను ఆదుర్తి సుబ్బారావు తర్వాత మళ్ళా అంతా కొత్తవాళ్ళతో సినిమా తీసింది దాసరి నారాయణరావే . హోటల్లో కాఫీ అందించే కుర్రాడితో సహా అందరూ కొత్తవారే అని ఒక ఇంటర్వ్యూలో దాసరే చెప్పారు . అంత చొరవ , సాహసం , ధైర్యం ఏ కొద్ది మందికో ఉంటుంది . వారిలో దాసరి ఒకరు . తేనెమనసులు సినిమాలో అందరూ కొత్త వారయినా ఫీల్డులో నిలబడి ఒక వెలుగు వెలిగింది కృష్ణ మాత్రమే . […]
మరీ మమ్ముట్టి మార్క్ కొత్తదనం కాదు… పక్కా రొటీన్ సౌత్ సినిమా సరుకు…!
మమ్ముట్టి… వయస్సు మీద పడే కొద్దీ… ఇక అమ్మడూ కుమ్ముడూ బాపతు సౌత్ హీరోయిక్ వేషాలను కాదనుకుని… బాగా వైవిధ్యమున్న పాత్రలు, తనను నటుడిగా గొప్పగా ఆవిష్కరించే పాత్రల వైపు పయనిస్తున్నాడు… సర్వత్రా ప్రశంసలు, చప్పట్లు… ఒకవైపు రజినీకాంత్ రా రా రావాలయ్యా వంటి వెగటు పాటలు చేస్తుంటే, చిరంజీవి పాటల గురించి చెప్పాల్సిన పనేలేదు… కమల్, వెంకటేశ్, నాగార్జున, రాజశేఖర్ ఎవరూ తక్కువ కాదు… అందుకే మమ్ముట్టిని మెచ్చుకోవాలనిపిస్తుంది… నటనలో తిరుగులేదు, ఈరోజుకూ తను నేర్చుకోవడానికి […]
అప్పట్లో తాగుడు వద్దనే పాటలు… ఇప్పుడు ‘మామా ఏక్ పెగ్‌లా’ పాటలు…
NTR ఖాతాలో మరో వంద రోజుల సినిమా . NTR సినిమా వంద రోజులు ఆడకపోతే న్యూస్ . ప్రేక్షకులు లాగిస్తారు . దానికి తోడు సంసారం టైటిల్లో కూడా ఓ మేజిక్ ఉంది . 1950 లో యల్ వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం సినిమా 11 సెంటర్లలో వంద రోజులు ఆడింది . సిల్వర్ జూబిలీ కూడా చేసుకుంది . ఆనాటి ఉమ్మడి రాష్ట్రం మద్రాసు రాష్ట్రానికి రాజధాని , దక్షిణ భారత […]
సినిమా అంటేనే మనకు ఓ సెలబ్రేషన్… కానీ ఈ ధోరణులేమిటి..?!
నాకు హీరో మహేశ్ బాబు అంటే కొంత ఇష్టం… తన హీరోయిజం కాదు, ఎక్కడా పిచ్చి ప్రేలాపనలకు పోడు, తన పనేదో తనది, పాలిటిక్స్‌కు దూరం… పిల్లలకు గుండె ఆపరేషన్లు గట్రా ఉదారంగా చేయిస్తుంటాడు… కొన్ని పాత్రలు తను చేసినట్టుగా ఇతర హీరోలు చేయలేరు… స్టామినా, లుక్, ఫిజిక్కు భలే మెయింటెయిన్ చేస్తాడు… సగటు ఆడపిల్లలకు కలల హీరో తను… కానీ తన ఫ్యాన్స్..? నిజానికి తను ఇతర హీరోల్లాగా పిచ్చి ఫ్యాన్స్‌ను ఎంకరేజ్ చేయడు, కానీ […]
అంతటి ఎన్టీయార్, వాణిశ్రీలున్నా… ప్చ్, ప్రేక్షకుడికి ఎందుకో రుచించలేదు…
హిందీలో హిట్టయిన హమ్ దోనో సినిమా ఆధారంగా తెలుగులో 1975 లో వచ్చింది ఈ రాముని మించిన రాముడు సినిమా . రెండూ బ్లాక్ & వైట్ సినిమాలే . కలర్ సినిమాల విజృంభణ ప్రారంభం అయ్యాక కూడా అగ్ర నటుడు అయినప్పటికీ NTR బ్లాక్ & వైట్‌లో నటించటం గొప్పే . హిందీలో దేవానంద్ , నందా , సాధన నటించగా తెలుగులో NTR , వాణిశ్రీ , శ్రీవిద్య నటించారు . హిందీ సినిమా […]
పాత్రకు తగినట్టు నటించడమే… బాగా నటించడం అంటే… షబానా ఆజ్మీ
ఓ హిందీ ఇంటర్వ్యూలో నటి షబానా అజ్మీ చెప్పిన విషయాలు.. * ‘అంకుర్'(1974) సినిమా చేసేనాటికి నా వయసు 23. అప్పటిదాకా నేను పల్లెటూళ్లు అసలు చూడలేదు. మొదటి రోజు షూటింగ్లో నాకో చీర ఇచ్చి కట్టుకొని నడిచి చూడమన్నారు దర్శకుడు శ్యాం బెనగల్. నడవడం బాగానే ఉంది కానీ కూర్చుని పనులు చేయడం, భోజనం చేయడం ఇబ్బందిగా అనిపించింది. శ్యాం బెనగల్ అది చూసి, “నువ్వు మాతో డైనింగ్ టేబుల్ మీద కాకుండా నేల మీద […]
పర్లేదు, గీతామాధురి జడ్జిగా కాస్త ఎదిగింది… ఆ థమనుడికన్నా బెటరే…
గీతామాధురి… ప్రముఖ సింగరే గాకుండా లైవ్ కచేరీల ట్రూప్ కూడా ఉన్నట్టుంది… తెలుగు ఇండియన్ ఐడల్ రెండో సీజన్లో… అంటే గత సీజన్లో అడ్డదిడ్డం జడ్జిమెంట్లతో బదనాం అయ్యింది… సంగీత పరిజ్ఞానం లేక కాదు… తను పట్టుకున్న తప్పుల్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక..! కానీ ఇప్పుడు జడ్జిగా కాస్త ఎదిగింది… ప్రస్తుత కంటెస్టెంట్లలో కీర్తన అనే అమ్మాయి బాగా పాడుతోంది… ఈసారి ఎపిసోడ్‌కు ఆడజన్మకు ఎన్ని శాపాలో అనే పాట ఎంచుకుంది… (లాస్ట్ సీజన్లో విజేత […]
ఫాఫం అనసూయ ప్రధాన పాత్రలో ఓ సినిమా… ఓ దర్శకుడి సాహసం…
అనసూయ… ఏమైనా అంటే కస్సుమని లేస్తుంది… తన తప్పున్నా సరే అంగీకరించదు… తన ధోరణేదో తనది… విమర్శను పాజిటివ్‌గా తీసుకునే గుణం ఏమాత్రం లేదు, వయస్సు 40 ఏళ్లకొచ్చినా సరే… పొట్టిబట్టలు, దురుసు మాటలు, దూకుడు కౌంటర్లు… అదేమంటే నువ్వెవడివోయ్ అంటుంది… దాడి చేస్తుంది… అదొక మెంటాలిటీ… సరే, పలు సినిమాల్లో చేసింది… యాంకరిణిగా చేయడం వేరు, సినిమాలో ఓ పాత్రలోకి దూరి మెప్పించడం వేరు… ఏదో రంగమ్మత్త, దాక్షాయణి వంటి చిన్న చిన్న పాత్రలకు వోకే […]
పాత రోజుల్లోకి తీసుకెళ్లారు కుర్రోళ్లు… తరువాత వాళ్లే బాట మరిచిపోయారు…
నిజంగా మంచి ప్రయత్నం… నిర్మాతగా పలు వెబ్ సీరీస్ నిర్మించిన అనుభవం ఉన్నా ఓ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్ నిర్మాతగా నీహారికకు ఇదే తొలి అనుభవం… టేస్టు బాగానే ఉంది… కానీ..? ఏ వంటయినా సరే, రకరకాల దినుసులన్నీ గుమ్మరించేయకూడదు… కలగాపులగం అయిపోతుంది… పులగం, కిచిడీ అయిపోతుంది… మొదట మంచి ధమ్ బిర్యానీ కోసం వంట మొదలుపెట్టి చివరకు ఏం వంటకం తింటున్నామో తెలియని జానర్ తయారవుతుంది… కమిటీ కుర్రోళ్లు సినిమా కూడా అంతే… దర్శకుడు […]
పూజలు చేయ పూలు తెచ్చాను… నీ గుడి ముందే నిలిచాను… తీయరా తలుపులను…
A musical & visual feast . నోము సినిమా తర్వాత రామకృష్ణకు సూపర్ హిట్ సినిమా 1975 లో వచ్చిన ఈ పూజ సినిమా . మహిళలు మెచ్చిన చిత్రం . మహిళలకు నచ్చిన చిత్రం . రాజన్ నాగేంద్ర సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం . ఈరోజుకీ ఈ సినిమా లోని పాటలు ఆ తరం వారి చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి . అంత గొప్ప శ్రావ్యమైన పాటలు . ఎన్నెన్నో […]
అసలు నిశ్చితార్థం వార్తలకన్నా… కొసరు సరదా వార్తలు, ఫోటోలే ఫుల్ ట్రెండింగ్…
అక్కినేని నాగచైతన్య నటించిన ఓ సినిమాలో… ఎస్ అనే అక్షరంతో ఉన్న అమ్మాయే నా జీవితంలోకి వస్తుందని నా జాతకంలో ఉంది, నా ఎస్ నువ్వే అని ఎవరితోనో అంటాడు… ఇప్పుడు ఆ వీడియో వైరల్… పాత అమ్మాయి సమంత- ఎస్… కొత్త అమ్మాయి శోభిత- ఎస్… ఇది ఒక వార్త… సమంత అక్కతో నాగ చైతన్య నిశ్చితార్థం అని మరో వార్త… ట్విస్టింగ్, యూబ్యూబ్ బాపతు థంబ్ నెయిల్ వార్త అన్నమాట… ఐతే నాగ చైతన్య […]
వర్గపోరాటం కథ… జయప్రద తొలి సినిమా… ప్రభాకర్‌రెడ్డిని ‘ముంచేసింది’…
Class war movie . గాంధీ పుట్టిన దేశం , భూమి కోసం సినిమాల్లాగా ఎర్ర సినిమా . ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకుడు . ప్రభాకరరెడ్డి 27 సినిమాలు తీస్తే , కమర్షియల్ గా రెండు సినిమాలు నష్టాలు తెచ్చాయట . ఆ రెండింటిలో ఇది ఒకటి . సుమారు పది లక్షల రూపాయల నష్టం వచ్చిందట . జయప్రద మొదట బుక్ అయిన సినిమా ఇదేనట . […]
ఆహా… ఈ మంచి షోను సైతం సగటు టీవీ షోలాగా మార్చేశారు కదరా బాబూ…
ఆహా ఓటీటీలో ఓ కొత్త ధోరణి… ప్రతి ప్రోగ్రామ్‌కు ఓ కేరక్టర్ ఉంటుంది… ఉండాలి… దానికి ప్రేక్షకులు అలవాటు పడతారు, దాన్ని బ్రేక్ చేయొద్దు, చేస్తే ఓ రకమైన చిరాకు పుడుతుంది ప్రేక్షకుడికి… అప్పట్లో అన్‌స్టాపబుల్ అని బాలయ్యతో ఓ ప్రోగ్రామ్ చేశారు, సూపర్ హిట్… కానీ సీజన్‌కూ సీజన్‌కూ మధ్యలో అనుకుంటా, ఏదో తన సినిమాకు ప్రమోషన్ అవసరపడింది… ఇంకేముంది..? తెర మీదకు వచ్చేసి ఒకటో రెండోె ఎపిసోడ్లు ప్రమోషన్ కోసం లాగించేసి వదిలేశాడు, ఇప్పటికీ […]
- « Previous Page
- 1
- …
- 13
- 14
- 15
- 16
- 17
- …
- 121
- Next Page »