హనుమాన్, కాంతారా, కార్తికేయ… ఇంకేమైనా హిట్ సినిమాలుంటే… అన్నీ మిక్సీలో వేసి, తరువాత కిచిడీ చేసి… ఓ కథ వండి… ఓహ్ సూపర్ స్టోరీ లైన్ దొరికింది సుమీ అనుకున్నాడేమో దర్శకుడు… అదేనండీ శివం భజే సినిమా కథ గురించే… ఇప్పుడు ట్రెండ్ అదే కదా… దేవుడు, ఫాంటసీ కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు ఓ కథ రాసుకున్నాడు… హిడింబ అని ఆమధ్య ఏదో ఇదే తరహా డిఫరెంటు సినిమాలో చేశాడు కదా, అదే అశ్విన్ […]
ఒక శోభన్ బాబుని చంపడం ప్రేక్షకులకు నచ్చలేదేమో ! ఫట్..!
1975 వ సంవత్సరం శోభన్ బాబుకి కలిసొచ్చిన సంవత్సరం . ANR అనారోగ్య కారణాల వలన ఆయన నటించాల్సిన సినిమాలు కొన్ని శోభన్ బాబుకి వచ్చాయి . ఎనిమిది సినిమాలు రిలీజయ్యాయి ఈ సంవత్సరం . అన్నీ కలర్ సినిమాలే . రెండు సినిమాలు మినహాయించి మిగిలిన ఆరు సినిమాలు బాగా ఆడాయి . బాగా ఆడని రెండు సినిమాల్లో ఒకటి ఈ గుణవంతుడు సినిమా . ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో , శోభన్ బాబు ద్విపాత్రాభినయం […]
ఆడాళ్లకే కాదండీ… మొగాళ్లకు మొనగాళ్లకూ ఉన్నాయి గాజులు…
గురుశిష్యులు ఆదుర్తి-కృష్ణల కాంబినేషన్లో 1975 లో వచ్చిన ఈ గాజుల కిష్టయ్య సినిమా వంద రోజులు ఆడింది . ప్రముఖ నటి జరీనా వహాబ్ తెలుగులో నటించిన మొదటి సినిమా ఇది . హిందీలో అప్పట్లో ఆమె పాపులర్ హీరోయిన్ . ఈమధ్య అంటే 2010 లో వచ్చిన రక్తచరిత్రలో కూడా నటించింది . ఆదుర్తి స్వంత సినిమా కూడా ఇది . ఆదుర్తి మార్కు సినిమా . ఎమోషన్స్ , సాంగ్స్ , నీట్ ప్రెజెంటేషన్ […]
రష్మిక..! ఏ ప్రోగ్రామ్‌కు వచ్చినట్టు..? ఏం డ్రెస్ సెన్స్ కనబరిచినట్టు..!?
ఛిఛీ… బాగుంది బాగుంది అని మెచ్చకుంటుంటే,.. నో, ఆ పొగడ్తకు మేం అర్హులం కాము, కాము అని అరిచినట్టు ఆహా ఓటీటీ క్రియేటివ్ టీం దిగజారిపోతోంది… తెలుగు ఇండియన్ ఐడల్ షోను మరీ ఓ బిగ్‌బాస్ షోగా మార్చేస్తోంది… ఇన్నాళ్లు జీతెలుగు, స్టార్‌మా, ఈటీవీలలో వచ్చే మ్యూజిక్ కంపిటీషన్ ప్రోగ్రాములతో పోలిస్తే తెలుగు ఇండియన్ ఐడల్ షో బాగుంటోంది అని చెప్పుకున్నాం కదా పలుసార్లు… సింపుల్‌గా దాన్ని భ్రష్టుపట్టించేస్తున్నారు వేగంగా… థమన్ తన పరిచయాలను, సంబంధాలను వాడుతూ […]
వాణిశ్రీకి ఈ సినిమా కసికసి పాటలతో… ఇక వైరాగ్యమే వచ్చేసిందట…
ఎక్కడో తగలరాని తావులో తగిలింది, అది కంటికే కనపడని గాయమైంది… ఈ పాట గురించి సెన్సార్ వాళ్ళు ద్వందార్థం ఉంది అంటూ అభ్యంతరం చెబితే, నిర్మాత ఆత్రేయ గారినే అక్కడికి తీసుకుని వెళ్తే, ఆయనే వాళ్లకు వివరించాడని… మీరనుకున్నట్టు నేను బూతు రాయలేదు… తగలరాని తావు అంటే మనసు అనే అర్థం మాత్రమే అంటూ వివరణ ఇచ్చేసరికి సెన్సార్ వాళ్ళు ఇక చేసేది లేక కన్విన్స్ అయ్యారట….. నిన్న మనం చెప్పుకున్న ఎదురులేని మనిషి పోస్టుకు సంబంధించి… […]
అందరూ వెటరన్స్… అక్కాచెల్లెళ్ల రాగద్వేషాల కథ… మరాఠీ బంపర్ హిట్…!!
కుటుంబంలో అతివ పాత్ర అనన్య సామాన్యం. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో తనను తాను మార్చుకుంటూ ఏ పాత్రలోనైనా ఇమిడిపోగలనని, ఎటువంటి సవాలునైనా స్వీకరించగలనని నిరూపించుకుంటోంది. ఒక ఉమ్మడి కుటుంబం.. అన్యోన్యంగా ఉండే ఆరుగురు అక్కాచెల్లెళ్ళు. వివిధ కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రంగాల్లో స్థిరపడతారు. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో కనీసం పలకరించుకోవడం కూడా కష్టం. సహజంగానే అక్కాచెల్లెళ్ళలనగానే అందరిలోనూ ఉండే మూతి విరుపులు, ముక్కోపాలు, అసూయ, రాగ ద్వేషాలు వారిలోనూ ఉంటాయి. అందరూ నలభై ఏళ్ళు […]
ఎదురులేని ఎన్టీయార్… కసి పాటలతో అలవోకగా హిట్టు కొట్టేశాడు…
ఎదురు లేని మనిషి . కరెక్ట్ టైటిల్ . NTR కు ఎదురేముంది ?! 1970s తర్వాత ఫుల్ ఆయనిష్టం . నిప్పులాంటి మనిషి తర్వాత ఆయన్ని ఏంగ్రీ మేన్ , వెంజెన్స్ ఇమేజి లోకి తెచ్చేసారు తెలుగు సినిమా కధా రచయితలు , దర్శకులు , నిర్మాతలు . ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ స్వంత బేనర్ వైజయింతి మూవీస్ బేనర్ పై నిర్మించిన మొదటి సినిమా 1975 లో వచ్చిన ఈ ఎదురు లేని మనిషి […]
మన సినిమాలకు నవలలే కావాలా ఏం..? ఆంగ్ల సినిమాల అడాప్షన్ లేదా…!!
తెలుగులో వచ్చిన చాలా విజయవంతమైన సినిమాలకు … మన పురాణాలో, మన భాషలో వచ్చిన నవలలో లేక మరో భాషలో వచ్చిన నవలలో .. అలాగే మరో భాషలో వచ్చిన హిట్ చిత్రాలో ప్రేరణ. ఆ మరో భాషలో వచ్చిన చిత్రాలకు అక్కడి సాహిత్యంలోనే ప్రేరణ కనిపిస్తుంది. అది వేరు సంగతి . బాపు రమణలు తీసిన సాక్షికి కూడా ఓ హాలీవుడ్ కౌబాయ్ సినిమా ప్రేరణ … ప్రధానంగా పురాణాలు , తెలుగు నవలలు ఎందుకు […]
హీరో గీరో జాన్తా నై… మన రూల్స్ మనిష్టం… తమిళ నిర్మాతల గ్రిప్…
నుష్ మీద తమిళ నిర్మాతల మండలి ఆంక్షలు పెట్టింది… ఇకపై మండలి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గానీ మరో నిర్మాత తనతో సినిమా తీయకూడదు… ఇకపై ధనుష్‌కే కాదు, ఏ హీరోకూ, ఏ హీరోయిన్‌కూ ఎవరూ అడ్వాన్సులు ఇవ్వకూడదు… ఇప్పటికే అడ్వాన్సులు తీసుకున్నవాళ్లు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు మరో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయకూడదు… ఒక ప్రాజెక్టు పూర్తయ్యాకే మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాలి… ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులకు పనిచేయడం కుదరదు… ఇవన్నీ బాగానే ఉన్నాయి… తమిళ […]
అప్పట్లో చిత్రమైన కథలు చెప్పినా ప్రేక్షకులు బాగానే చూసేవాళ్లు…
శోభన్ బాబు – శారద జోడీలో 1975 లో వచ్చిన మరో చక్కటి ఎమోషనల్ సినిమా ఈ దేవుడు చేసిన పెళ్ళి . సినిమాకు శారద ద్విపాత్రాభినయమే కీలకం . ఏక్సిడెంట్ల ద్వారా కధలో మలుపులను సృష్టించిన రచయిత గొల్లపూడి మారుతీరావుని అభినందించాలి . అలాగే పదునైన మాటలను వ్రాసిన సత్యానంద్ ని , శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన టి చలపతిరావుని అభినందించాలి . బిర్రయిన స్క్రీన్ ప్లేను తయారు చేసుకుని , సినిమాను గోదావరి జిల్లాల […]
ఉంది… తెలుగు సాహిత్యంలో సినిమాలకు సరిపడా సరుకు ఉంది…
తెలుగు సాహిత్యంలో సినిమాలకు కావలసినంత బోలెడంత కంటెంట్ ఉంది. కానీ, తెలుగు సాహిత్యానికి పట్టిన దరిద్రం ఏమిటంటే, సాహిత్యాన్ని చదివే నాథుడే లేడు. ముఖ్యంగా యువత తెలుగు సాహిత్యాన్ని చదవడం లేదు. అందుకే, తెలుగులో సాహిత్య పత్రికలు అన్నీ మూతపడ్డాయి. ఒక్క స్వాతి వారపత్రిక, మాస పత్రికలు మినహా మరే పాపులర్ పత్రిక నడవడం లేదు. అదే ఇతర భాషల్లో ఆయా భాషల సాహిత్యం దినదిన ప్రవర్థమానమవుతుంది. చాలా కొత్త పత్రికలు పుట్టుకొస్తున్నాయి. మన తెలుగు సినిమా […]
ఓహ్… ఈ తెలుగు నట ఐశ్వర్యం కుటుంబానిదీ ఓ సినిమా కథే…
నేనూ నా మరదలు , పూర్వగాథ లాంటి కథలు రాసిన మానాపురం అప్పారావు పట్నాయక్ అనే పెద్దాయన నాటక రచయితకూడా. నాటకానుభవంతో సినిమాల మీద దండయాత్ర చేసి దర్శకుడుగా మారాడీయన. ఎన్టీఆర్ హరనాథ్ నటించిన పరువు ప్రతిష్ట, జమున గారు పాటపాడిన పెళ్లిరోజు, శోభన బాబుతో తారాశశాంకం, ఎన్టీఆర్ తోనే శాంత సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక్కడే ఓ విషయం చెప్పాలి లేకపోతే మర్చిపోతా … ఎన్టీఆర్ కు రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు […]
అప్పట్లో రాంచరణ్ మీద రచ్చ… ఇప్పుడు బన్నీ సర్జరీల మీద…
గుర్తుంది కదా… అప్పట్లో రాంచరణ్ మొహకవళికల్ని మార్పించడానికి సర్జరీలు చేయించినట్టుగా ప్రముఖ రచయిత యండమూరి ఏదో వేదికపై చెప్పాడు… ఇక చూసుకో రచ్చ… మామూలుగా చిరంజీవి ఇలాంటి సందర్భాల్లో నాగబాబును తెరపైకి తెస్తాడు కదా… ఇంకేముంది..? నాగబాబు యండమూరిపై ఫైరయ్యాడు… (సేమ్, రాంగోపాలవర్మ, గరికపాటిలపై కూడా…) తరువాత ఫ్యాన్స్ యండమూరి మీద విపరీతంగా ట్రోలింగ్ నడిపారు… అఫ్కోర్స్, ఇప్పుడు అదే రచయిత చిరంజీవి బయోగ్రఫీ రాయబోతున్నాడు.,. చిరంజీవే రాయించుకుంటున్నాడు… ప్లాస్టిక్ సర్జరీలు ఇప్పుడేమీ కొత్త కాదు, అప్పటి ఇందిరాగాంధీ […]
తెలుగు ఇండస్ట్రీలో ఈ గోక్కోవడం బాగా ఎక్కువైపోయింది ఈమధ్య..!!
ఈమధ్య కొన్ని సినిమా ప్రెస్మీట్లు విచిత్రంగా సాగుతున్నాయి… సినిమాకు సంబంధించిన కథలో, పాటలో, కాపీ వివాదాలో, సెన్సార్ చిక్కులో, డర్టీ డైలాగులో, యాక్టర్లో, నిర్మాణ వ్యయమో మాట్లాడుకోవడం లేదు… ఎటెటో సాగిపోతున్నాయి… ఏవో వివాదాలకు తలుపులు తెరుస్తున్నాయి… జనాన్ని ఎంటర్టెయిన్ చేస్తున్నారో, దిక్కుమాలిన ప్రశ్నలు, జవాబులతో చిరాకు పుట్టిస్తున్నారో… సందర్భం ఎలా మొదలైందో గానీ… మిస్టర్ బచ్చన్ సినిమా మీడియా మీట్లో హరీష్ శంకర్ ఎవరినో అడుగుతున్నాడు… మీరు (సినిమా జర్నలిస్టులు) యాంకర్ సుమతో వేదిక మీద […]
‘ఆడు జీవితం’ కథలెక్కడివి మనకు… అన్నీ ‘పాడు జీవితం’ కథలే కదా…
నవతరం దర్శకుడు వేణు ఊడుగుల అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను… సినిమా కథను ‘పెట్టుబడి- రాబడి సమీకరణం’ మాత్రమే నిర్దేశిస్తోంది… మార్కెటబుల్ కంటెంటే ఇక్కడ ప్రధానం… ఇతర భాషలతో పోలిస్తే సినిమాలకు అడాప్టబుల్గా ఉండే సాహిత్యం తక్కువ… ఆ కొరత ఉంది… ఒక నవలను సినిమాగా మల్చడం కూడా క్రియేటివ్ అంశమే… విస్తృతి, లోతైన తాత్వికత, భావోద్వేగాలతో ప్రజలు కనెక్టయ్యే కంటెంట్ కావాలి… అప్పుడే మన సినిమాలోనూ వైవిధ్యం కనిపిస్తుంది… ఇదీ స్థూలంగా తను ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక […]
చిన్మయిది కాస్త తిక్కే… అప్పటి అనసూయ వీడియోలో అంత తప్పేముంది..?
డౌట్ లేదు… సింగర్ చిన్మయికి కాస్త తిక్కే… వైరముత్తుతో వైరం, మిటూ ఉద్యమం తర్వాత కోలీవుడ్ ఆమె మీద ఆంక్షలు పెట్టాక పెద్దగా పని లేకుండా పోయింది… దాంతో సోషల్ యాక్టివిస్టు పేరిట ఏవేవో అంశాల మీద ఏవో పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో సంవాదాలతో పొద్దుపుచ్చుతున్నట్టుంది… సుచిత్ర, కస్తూరి, చిన్మయి… తమిళంలో చాలామంది కనిపిస్తారు ఇలా… మన అనసూయే కాస్త నయమేమో… అవునూ, అనసూయ అంటే గుర్తొచ్చింది… రాయాలనుకున్నది అనసూయపై చిన్మయి తాజా ఆక్షేపణ… అనసూయ […]
రంగనాయకమ్మ పాపులర్ నవలకు దాసరి మార్క్ స్క్రీన్ ప్లే..!!
శోభన్ బాబు- శారద జోడీలో వచ్చిన మరో గొప్ప సినిమా 1975 లో వచ్చిన ఈ బలిపీఠం సినిమా . 1962-63 లో ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ బలిపీఠం నవల సీరియల్ గా వచ్చింది . నవల , సినిమా రెండూ తెలుగు మహిళలకు బాగా నచ్చాయి . ప్రేమ వివాహాలలో ఆర్ధిక అంతరాల వలన , భేషజాల వంటి ఇష్యూలతో భార్యాభర్తలు విడిపోవటం అనే కధాంశంతో చాలా సినిమాలు వచ్చాయి . ఈ కధలో జంట […]
వాటీజ్ దిస్ మిస్టర్ బచ్చన్..? ఎందుకిలా నీకు నువ్వే ‘తగ్గించుకోవడం’..?
దర్శకుడు హరీష్ శంకర్ మరో జర్నలిస్టు మధ్య నడుమ సాగుతున్న మాటల యుద్ధం పరిశీలిస్తే… హరీష్ శంకర్ తొందరపాటే కనిపిస్తోంది… తను గతంలో కూడా నోరు పారేసుకున్న సందర్భాలున్నాయి… ఆవేశం ఎక్కువ… ఎందుకోగానీ సోషల్ మీడియాలో తన యాక్టివిటీకి సంబంధించి ఎవరో మిత్రుడు ‘మేల్ అనసూయ’ అన్నాడు… ఈమధ్య ఎవరో ఏదో మీడియా మీట్లో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అడిగినప్పుడు… మితిమీరితే మీరు అడగలేకపోతే నేను స్పందించాల్సి వచ్చింది అని ఓ పిచ్చి జవాబు ఇచ్చింది […]
ఒకటే అసంతృప్తి… అన్ని షోలలోనూ ఆ మూసపాటలే.., వైవిధ్యమేదీ..?!
నో డౌట్… ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ షో చాలా బాగుంటోంది… ఆర్కెస్ట్రా ఓ పే-ద్ద ప్లస్ పాయింట్… ఈసారి శివమణి వచ్చాడు… కంటెస్టెంట్లు పాటలు పాడారు… ఆహా ఓహో… మెచ్చేసుకున్నారు… పోయినసారి హరిప్రియకు స్పాట్ పెట్టినట్టే ఈసారి శ్రీ ధృతికి స్పాట్ పెట్టినట్టున్నారు చూడబోతే… ఇద్దరూ బాగా పాడగలిగేవాళ్లే… కాకపోతే దిక్కుమాలిన వోట్ల ప్రక్రియలో వెనుకబడినట్టున్నారు… శ్రీ ధృతి, శ్రీకీర్తి మాత్రమే కాదు… కీర్తన కూడా గతంలో సూపర్ సింగర్ జూనియర్స్‌లో పార్టిసిపేట్ […]
The Goat Life… సినిమా నాకంత దిగ్భ్రాంతిని ఏం కలిగించలేదు…
The Goat Life సినిమా నాకంత దిగ్భ్రాంతిని ఏం కలిగించలేదు. ఈ సినిమా వల్ల మనసుకి కలిగే పెయిన్ 21 ఏళ్ల కిందే అనుభవించా. అది 2003 july 22. Teacher గా మొదటి పోస్టింగ్ ప్లేస్ లో జాయిన్ అవ్వడానికి మా నాన్న, అన్నలతో కలిసి వేములవాడ పోయాను. అక్కడ జూనియర్ కాలేజ్ పక్కన నూకలమర్రి పోయే ఆటో ఎక్కి, చెక్కపల్లిలో అచ్చన్నపేట స్టేజీ దగ్గర దిగి బాలరాజుపల్లె బాట పట్టినం. బాటపొంటి నడుస్తాంటే చుట్టూ […]
- « Previous Page
- 1
- …
- 15
- 16
- 17
- 18
- 19
- …
- 121
- Next Page »