S D లాల్- NTR కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన రీమేక్సులో ఒకటి 1978 లో వచ్చిన ఈ లాయర్ విశ్వనాథ్ . నిజాయితీకి మారుపేరుగా న్యాయసేవ చేస్తున్న లాయర్ gangster గా మారి , దోషుల్ని పోలీసులకు పట్టించే కధానాయకుడి పాత్ర లాయర్ విశ్వనాథ్ . లాయరుగా NTR చాలా హుందాగా , బేలన్సుడిగా నటించారు . నాకు బాగా నచ్చిన పాత్ర , నటన . Gangster అయిన తర్వాత కూడా ఆయనకు గంతులు వేసే […]
ఆ కృష్ణ జింక ఆ ధూర్త సల్మాన్ను వేటాడుతూనే ఉంది… మద్దతుదార్లనూ…!!
తల్లిలేని జింక పిల్లలకు చనుబాలిచ్చే స్త్రీలున్న బిష్ణోయీ సమాజంలో పుట్టిన లారెన్స్ బిష్ణోయీ! రాంగోపాల్ వర్మ సిన్మా తీస్తాడట! ………………………………………………………………………… జింక పిల్ల తల్లి మరణిస్తే.. ఆ పిల్లను బిష్ణోయీ మహిళ తన చాతి దగ్గరకు తీసుకుని పాలు ఇస్తుంది. పిల్లలకు ఆవుపాలు తాగించి పెంచే మన సమాజంలో ఇది వింత. ఇలాంటి దృశ్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ––కిందటేడాది భారత నటుడు వివేక్ ఓబెరాయ్ దుబాయిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బిష్ణోయీ సమాజం గురించి […]
ఆఫ్టరాల్ సినిమా ప్రేక్షకులు… మీకు మాట్లాడే హక్కెక్కడిదిరా..!
ఆఫ్టరాల్ ప్రేక్షకులు… మీకు మాట్లాడే హక్కెక్కడిదిరా! ఒక్కొక్కడికి ఎముకలు విరగ్గొడతా! నిజమే కదా! ఆ వినిర్మాత అన్నదాంట్లో తప్పేముంది? ఈ భూప్రపంచంలో సామాన్యులకు సినిమా తప్ప ఇంకేదీ వినోదం కానప్పుడు, లేనప్పుడు ఒక సినిమాకు ఒక కుటుంబానికి ముష్టి పదిహేను వందల రూపాయలు పెట్టలేరా? ప్రభుత్వాలే బెనిఫిట్ ఆఫ్ వినోదం కింద బెనిఫిట్ షోలకు సూర్యుడు లేవకముందే తెరలేపడానికి ప్రత్యేక జి ఓ లు జారీ చేసి అనుమతులిస్తున్నప్పుడు- మొదటి వారం, మొదటి పదిరోజుల్లో రెండింతలు, మూడింతలు […]
కథ రొటీనే… ఐనా కశ్మీర్ లొకేషన్లు, కృష్ణ ట్రిపుల్ యాక్షన్తో హిట్టయింది…
కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన మొదటి సినిమా 1978 లో వచ్చిన ఈ కుమారరాజా సినిమా . కుమార రాజా అంటే ఇద్దరు కృష్ణలు . ఒక కృష్ణ పేరు కుమార్ , మరో కృష్ణ పేరు రాజా . కన్నడంలో సూపర్ డూపర్ హిట్టయిన శంకర గురు అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . కన్నడ హీరో రాజకుమార్ స్వీయ నిర్మాణంలో వచ్చింది . అందులో మూడు పాత్రలూ ఆయనే వేసారు . జయమాల […]
నాగవంశీ మాత్రమే కాదు… ఇండస్ట్రీ ఘొప్పోళ్లందరిదీ అదే బుర్ర… నాని సహా…
పైకి చెప్పేది ప్రేక్షకదేవుళ్లు అని..! ధోరణి మాత్రం నిండా గొరగడం..! పర్సులకు కత్తెర పెట్టడం… ప్రేక్షకుడంటే ఏమాత్రం గౌరవం లేదు, సొసైటీ మీద అవగాహన లేదు… మరి ఇలాంటోళ్లు తీసే సినిమాలు చెత్త గాక మరేమిటి..? దిక్కుమాలిన ఫార్ములా సినిమాలు తప్ప ఇంకేమిటి..? యథా నిర్మాత, తథా చిత్రము… నాగవంశీ అనే ఘనమైన దర్శకరత్నం ప్రతి కుటుంబం ఒక సినిమాకు రూ. 1500 పెట్టలేరా అని ఏదో కూశాడు తెలుసు కదా… నెటిజనం కూడా ఆడుకుంటోంది బాగానే… […]
కథనంలో తడ‘పాట్ల’తో… కథ కాస్తా నాసిరకం కండోమ్ అయిపోయింది…
కొత్త దర్శకులు, కొత్త హీరోలు కొందరు మెల్లిమెల్లిగానైనా సరే… తెలుగు సినిమాను కొత్తదనం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు… సోకాల్డ్ స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు ఇంకా మూస ప్రపంచంలోనే బతుకుతుంటే… చిన్న హీరోలు, చిన్న దర్శకులు మాత్రమే ప్రయోగాలు, భిన్నమైన కథల వైపు వెళ్తున్నారు… సుహాస్ వారిల్లో ఒకడు… తను భిన్నమైన కథల్ని ఎంచుకుంటున్నాడు.., అభినందనీయం… పాత్రకు తగినట్టుగా… అతి చేయడు, తక్కువ చేయడు… ఈమధ్య వచ్చిన ‘జనక అయితే గనక’ మూవీలో కథ ట్రీట్మెంట్ […]
కుంతీకర్ణులు… భిన్నమైన స్టోరీ లైన్… కృష్ణంరాజు రెబల్ స్టార్గా సెటిల్డ్..!!
A pucca commercial entertainer . బంగారు తల్లి సినిమాతో రెబల్ హీరోగా చేసిన ప్రయత్నం ఈ సినిమాతో పక్కా అయిపోయింది కృష్ణంరాజుకి . 1978 లో వచ్చిన ఈ కటకటాల రుద్రయ్య సినిమాలో కూడా బంగారు తల్లిలోలాగా జమున , కృష్ణంరాజులు తల్లీకొడుకులే . అయితే కృష్ణంరాజు ఈ సినిమాలో కుప్ప తొట్టి కుంతీపుత్రుడు . క్లైమాక్సులో NTR , హేమలతల కుంతీ కర్ణుల సంవాదాన్ని కూడా చూపుతారు దర్శకులు దాసరి నారాయణ రావు . […]
చినుకులా రాలి… నదులుగా సాగి… వరదలై పోయి… కడలిగా పొంగిన సంగీతం…
. రాజన్ నాగేంద్ర… యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ధ్వయం. కర్ణాటక మైసూరు శివరాంపేట నుంచి వచ్చిన అన్నదమ్ములతో ఎక్కువ సినిమాలకు పనిచేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, జంధ్యాల. అంతకుముందే వారు విఠలాచార్య గారి సినిమాలతో సహా కొన్ని తెలుగు చిత్రాలకు పన్జేశారు. కానీ ఈ ఇద్దరి సినిమాల్లోనూ ముఖ్యంగా వేటూరి కాంబినేషన్ లో వచ్చిన పాటలూ గొప్పగా ఉంటాయి. నవగ్రహ పూజా మహిమలో ఎవ్వరో ఎందదుకీరీతి సాధింతురో లాంటి […]
వాడు మనపై హిందీ రుద్దును… వీడు అదేపనిగా అరవం రుద్దును… మనకే దద్దులు…
ఏయ్! ఎవర్రా అక్కడ! వేట్టయన్ తెలుగు కాదన్నది? దుడ్డు కర్ర అందుకోండి! భీమయ్య:- ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రామయ్య:- ఏమీ లేదు భీమయ్యా! మన తెలుగు కొంపకు ఏ పైకప్పు వేద్దామా అని ఆలోచిస్తున్నా. భీమయ్య:- ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! మన్నికకు, నాణ్యతకు పేరెన్నికగన్న వేట్టయన్ తమిళ పైకప్పులు వేస్తే సరి! రామయ్య:- …అంటే అవి అరవ పైకప్పులు కదా! తెలుగు ఇనుప రేకులు, సిమెంట్ రేకులు, పెంకులు, రెల్లు గడ్డి, బోద, మట్టి, ఆర్ […]
కదిలిందీ కరుణరథం… సాగిందీ క్షమాయుగం… అప్పట్లో పాన్- వరల్డ్ మూవీ…
రాముడు , కృష్ణుడు అనగానే NTR ఎలా గుర్తుకొస్తారో అలాగే యేసుక్రీస్తు అనగానే విజయచందర్ గుర్తుకొస్తారు . 1978 క్రిస్టమస్ సందర్భంలో రిలీజయిన ఈ కరుణామయుడు సినిమా ద్వారా అంతటి పేరు ప్రఖ్యాతులను విజయచందర్ సంపాదించుకున్నారు . యేసుక్రీస్తు మీద వచ్చిన అన్ని సినిమాలలో కమనీయంగా తీయబడింది ఈ సినిమా . 14 భాషల్లోకి డబ్ చేయబడింది . విదేశాలలో ఇంగ్లీషు సబ్ టైటిల్సుతో ప్రదర్శించబడింది . యేసుక్రీస్తు పాత్రను వేయాలని మొదలుపెట్టిన వారు చివరిదాకా బతకరు […]
మధ్యలో కథ దారితప్పింది కాసేపు… అది తప్ప సినిమా అభినందనీయమే…
హీరో సుధీర్ బాబు… కాదు, నటుడు సుధీర్ బాబు… ఎందుకంటే, తను టిపికల్ తెలుగు హీరో కాదు, ఒక నటుడిగా భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ, అంగీకరిస్తూ… ఆయా పాత్రలకు అతి గాకుండా, తగ్గకుండా సరైన నటనను అందిస్తూ… భిన్నమైన కెరీర్ నిర్మించుకునే సుధీర్ బాబుకు ఆ కోణంలో అభినందనలు… అర్జెంటుగా తెలుగు స్టార్ హీరో తరహాలో తరమడాలు, తురమడాలు… తెగ నరకడాలు, నెత్తుటేర్లు… సోకాల్డ్ కమర్షియల్ వాసనలు, పాన్ ఇండియా ప్రయాసలు, ఎలివేషన్లు గట్రా గాకుండా వైవిధ్యమైన […]
నను వలచావని తెలిసేలోగా నివురై పోతానూ… నేటికీ జ్వలించే పాటే అది…
ఏడు రంగుల ఇంద్రధనసు ఈడు వచ్చిన నా సొగసు , నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి . ఇంద్రధనస్సు సినిమా అనగానే ఈ రెండు పాటలే ముందుగా గుర్తుకొచ్చేవి . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో ఆత్రేయ వ్రాసిన పాటలు అద్భుతంగా పండాయి . మిగిలిన పాటలు ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా , తడిసిన కోక కట్టుకుని కడవ సంకన పెట్టుకుని వస్తుంటే , మూసుకో మూసుకో తలుపులన్నీ […]
ఫాఫం రజినీకాంత్… కాదు, కాదు… ఫాఫం జ్ఞానవేల్… శృతి కుదరని కలయిక..!!
వేట్టయన్… అంటే వేటగాడు… ఆ తమిళ పేరే తెలుగులో, ఇతర భాషల్లోనూ… తెలుగు పేరే దొరకలేదా..? అనే ప్రశ్నకు పంపిణీదారుల నుంచి ఓ శుష్క సమర్థన వచ్చింది… ఎవరికీ నచ్చలేదు… ఆ సినిమాలాగే..! అరె, అదేమిటి..? జైభీమ్ వంటి మంచి ఆలోచనాత్మక సినిమాను ప్రజెంట్ చేశాడు దర్శకుడు జ్ఞానవేల్… ఈ వేట్టయన్ను అదే రేంజులో ఎందుకు ప్రజెంట్ చేయలేకపోయాడు..? ఇదీ ప్రశ్న… పైగా ఒకరా ఇద్దరా..? అసలే రజినీకాంతుడు… దానికితోడు అంతటి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్… […]
మేకప్ లేకపోతేనే వాణిశ్రీ అందంగా సహజంగా ఆకట్టుకునే గోరంతదీపం..!!
వాణిశ్రీ మేకప్పు లోనే కాదు , మేకప్పు లేకపోయినా కూడా అందంగానే ఉంటుందని రుజువు చేసిన సినిమా 1978 లో వచ్చిన ఈ గోరంతదీపం సినిమా . ఈ సినిమా కూడా వాణిశ్రీ సినిమాయే . ఆమే షీరో . అమాయకపు మెగుడు , జులాయి మామ , ఆరళ్ళు పెట్టే అత్త , అమాయకపు మొగుడి బెస్ట్ ఫ్రెండ్ అవతారంలో ఓ స్త్రీలోలుడు , వాడి వెంట ఓ గాలి బేచ్ , అత్తారింటికి పోయాక […]
ఆ పాత దేవదాసును దాసరి మళ్లీ అంతే క్లాసిక్గా పుట్టించలేకపోయాడు..!!
ఓ సూపర్ హిట్ సినిమాకు ఇరవై అయిదేళ్ళ తర్వాత సీక్వెల్ తీయాలనే ఆలోచన రావటమే సంచలనం . హేట్సాఫ్ టు దాసరి . దానికి తగ్గట్టుగా ప్రధాన పాత్రధారులు జీవించి ఉండటం. ఇదీ గొప్ప విషయమే . దేవదాసు సినిమాలో ఎక్కువ మందికి దేవదాసు , పార్వతిల పాత్రలు నచ్చుతాయి . నాకు ఆ రెండు పాత్రల కన్నా ఎక్కువ నచ్చే పాత్ర , నేను గౌరవించే పాత్ర చంద్రముఖిదే . ఒక వేశ్య ఒక అభాగ్యునికి […]
శివ ఇంపాక్ట్..! యువతలో హింసా ప్రవృత్తిని ఖచ్చితంగా పెంచిన మూవీ..!
. లల్కార్, ది ఓపెన్ ఛాలెంజ్! సిచుయేషన్ ఆఫ్టర్_ శివ శివ సినిమా ప్రభావం మా ఊరు కరీంనగర్ పై బలంగా పడిందనే చెప్పాలి! తస్సాదియ్యా, ఆ మూవీ రిలీజ్ ఐన తరవాత మంకమ్మతోటలో యూత్ ఏకంగా శివ గ్యాంగ్, భవానీ గ్యాంగ్ అంటూ రెండుగా చీలిపోయి కొట్టుకున్నారంటే, దానమ్మా ఎఫెక్టా మజాకా! తరవాత పోలీసోళ్లు ఆ పోరగాళ్లను టూ టౌన్ కు తీసుకుపోయి రోకలిబండలు ఎక్కిచ్చిన్రు, అది వేరే విషయం! అంతకుముందు టౌన్లో గ్యాంగ్ వార్స్ […]
అదేమిటో గానీ ఆయన సినిమాల్లో వాణిశ్రీ ఎక్కువ అందంగా కనిపిస్తుంది..!!
చీరెలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు చిత్తమే దోచాడీ చిలిపికృష్ణుడు . ఈ సినిమా అనగానే ఎవరికయినా గుర్తుకొచ్చే పాట ఇదే . నాకు ఈ పాట కూడా చాలా చాలా ఇష్టం . ఆత్రేయ గారు వ్రాసారు . 1978 లో వచ్చిన ఈ చిలిపి కృష్ణుడు సినిమా జనానికి బాగా నచ్చింది . ఇరవై అయిదు వారాలు ఆడింది . ఈ సినిమాలో ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది ANR రంగురంగుల , పువ్వుల పువ్వుల చొక్కాలు . రాజబాబువి కూడా […]
భారీ సినిమాలపై ఓటీటీల పునరాలోచనలు… పాత ఒప్పందాలూ జాన్తా నై…
. ముందుగా కోరా జాన్ పోస్టు చదవండి ఓసారి… ఇది తంగలాన్ – నెట్ఫ్లిక్స్ వివాదం పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ లీడ్ రోల్లో వచ్చిన తంగలాన్ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 20న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదల […]
పద్దెనిమిది చలిచీమలు కలిసి… తలా పది వేలు వేసుకున్న శ్రామిక చిత్రం…
బక్కోళ్ళ సినిమా . అంటే కేవలం బక్క జీవుల మీద సినిమా అనే కాదు . నిర్మాతలు , నటులు అందరూ ఈ సినిమా తీసేనాటికి బక్కోళ్ళే . 18 మంది నిర్మాతలు తలా పది వేలు వేసుకుని ఈ సినిమాను నిర్మించారట . సినిమా ప్రొడక్షన్ పేరు కూడా శ్రామిక చిత్ర . కమర్షియల్ గా కూడా నిరుత్సాహపరచలేదట . ఈ 18 మంది నిర్మాతల్లో వేజెళ్ళ సత్యనారాయణ కూడా ఉన్నారు . తర్వాత కాలంలో […]
కృష్ణకు ఏసీ కాటేజ్..! రజినీకాంత్ రూమ్ బాగాలేక వరండాలో పడుకున్నాడు…!!
. ఇద్దరు సూపర్ స్టార్లు కృష్ణ , రజనీకాంతులు నటించిన ఈ అన్నదమ్ముల సవాల్ సినిమా 1978 లో వచ్చింది . కన్నడంలో హిట్టయిన సహోదర సవాల్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . రెండు సినిమాలకూ కె యస్ ఆర్ దాసే దర్శకులు . రజనీకాంత్ రెండు భాషల్లోనూ నటించారు . తెలుగులో కూడా వంద రోజులు ఆడింది . రొటీన్ కధే అయినా స్క్రీన్ ప్లే బాగుంటుంది . దర్శకుడు స్పీడుగానే నడిపిస్తాడు […]
- « Previous Page
- 1
- …
- 17
- 18
- 19
- 20
- 21
- …
- 131
- Next Page »