కాస్తోకూస్తో బెటర్ అనుకున్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌ను విజయవంతంగా భ్రష్టుపట్టించారు కదా… ఇప్పుడిక హఠాత్తుగా జీసరిగమప, ఈటీవీ పాడుతా తీయగా చాలా బెటర్ అనిపిస్తున్నాయి… నిజం… కంటెస్టెంట్లు గతంలో పలు పోటీల్లో పాల్గొన్నవాళ్లే… చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచీ పాడుతున్నవాళ్లే… కానీ ఈ షో కోసం ఎంపిక చేయబడిన పాటల్లో పెద్ద వైవిధ్యం లేదు, నిజంగా కంటెస్టెంట్లను పరీక్షించే భిన్న ప్రయోగాల పాటలు కానే కావు అవి… పైగా పాటల ట్రెయినర్ రామాచారి, ఆయన శిష్యురాలు […]
మనవాళ్లూ తీశారు బోలెడు వైవిధ్యభరిత కథాచిత్రాలు… చిలకమ్మ చెప్పిందీ అదే…
45 ఏళ్ల కింద ఇంత సంచలనాత్మక సినిమా తీసిన నిర్మాతలకు , దర్శకులకు హేట్సాఫ్ . ఇద్దరు స్త్రీల కధ . ముఖ్యంగా మల్లి అనే ఒక సాధారణ , సంచలనాత్మకంగా ఆలోచించగల స్త్రీ కధ . మల్లికి ఎన్నో కలలు . జీవితాన్ని అనుభవించాలనే పేద పిల్ల . సినిమా పేరు చిలకమ్మ చెప్పింది . మనిమనిషిగా ఉన్న మల్లిని ఇంటి యజమానురాలి తమ్ముడు ప్రేమించానని చెప్పి గర్భవతిని చేస్తాడు . ఆ యజమానురాలు ప్రమీలాదేవి […]
ఆ పాత ‘డర్టీ పిక్చర్’ ముద్రల్ని చెరిపేసుకునే ఓ బలమైన అభిలాష..!
విద్యాబాలన్… మంచి నటి… వీసమెత్తు సందేహం లేదు… ఆమె హఠాత్తుగా ప్రఖ్యాత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా ఓ ఫోటో షూట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది… విశ్వ స్వరవీథుల్లో భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని వినిపించిన ఆమెది పరిపూర్ణ, సార్థక జీవనం… ఆమె కథ ఖచ్చితంగా ఓ బయోపిక్ చిత్రానికి అర్హం… ఆమె కథ సినిమా కథల్ని మించిన కథ… ఈమధ్య కొన్నాళ్లుగా బాలీవుడ్ నిర్మాతలు ఎవరో సుబ్బులక్ష్మి బయోపిక్ తీయాలని […]
గుడ్ సుడిగాలి సుధీర్..! బేబక్క చేసిన ఓ ప్రాంక్ కాల్, కరాటే కల్యాణి అవాక్కు..!!
మామూలుగా ఫ్రాంక్ కాల్స్ మీద నాక్కొంచెం చిరాకు… టీవీ షోలలో ఇదొక దిక్కుమాలిన వినోదం… మనం హఠాత్తుగా వెనుక నుంచి ఎవరి కళ్లో మూసేసి ఎవరో చెప్పుకో చూద్దాం అంటుంటాం కదా సరదాగా… సరే, ఆటపట్టించడమో, సరదాయో… గుర్తుపడితే చెబుతాం, లేదంటే కాసేపటికి వాళ్లే ఎదుటకు వచ్చి నిలబడతారు, మొహం అదోలా పెట్టి చూస్తారు… కానీ ఈ ప్రాంక్ కాల్స్ ఇలాంటివే, డిఫరెంట్… ఎవరో ఏదో షోలో ఉంటారు, ఇంటర్వ్యూయర్ ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయండీ అంటారు… […]
ముగ్గురు ఉద్దండులు… సూపర్ పాటలు… గొప్ప కథ… ఐనా ఏదో ఓ అసంతృప్తి..!
భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి చాలా ప్రాశస్త్యం ఉంది . ముఖ్యంగా చంద్రగుప్తుడు , అశోకుడు . యన్టీఆరుకు ఈ రెండు పాత్రల మీద చాలా మక్కువ ఉందని అప్పట్లో చెపుతుండేవారు . రెండు పాత్రలూ ఆయనే వేసారు , తీసారు . చంద్రగుప్తుని చరిత్రలో కీలక పాత్రధారి చాణక్యుడు . నందులు ఆయన్ని అవమానించి ఉండకపోతే , చంద్రగుప్తుడు రంగంలోకి వచ్చేవాడే కాదేమో ! అలా చాణక్యుడే ముఖ్యుడు . అప్పట్లో గుమ్మడి పేరు , […]
రాధ, గోపీ… పునర్జన్మలు… అక్కినేనికి అప్పట్లో ఇదే హ్యాంగోవర్…
పులి బొమ్మను వేయాలని మొదలుపెడితే అది పిల్లి బొమ్మ అయి కూర్చుందని ఓ పాత సామెత ఉంది . వి బి రాజేంద్రప్రసాద్ మనుషులంతా ఒకటే సినిమాలాగా తీద్దామని అనుకున్నారో లేక మూగమనసులు సినిమాలాగా తీద్దామని అనుకున్నారో తెలియదు . అది మాత్రం బంగారు బొమ్మలు సినిమా అయి కూర్చుంది . ANR సెకండ్ ఇన్నింగ్సులో వచ్చిన ఈ సినిమాలో కూడా ఆలుమగలు సినిమాలోలాగానే చాలా ఎనర్జిటిక్ గా డాన్స్ చేసారు . బహుశా దసరా బుల్లోడి […]
ఇండియన్ ఐడల్ షోను చెడగొట్టేశారు… బిగ్‌బాస్ బాటలో థమన్ అడుగులు…
ఈసారి తెలుగు ఇండియన్ ఐడల్ షో కోసం ఏక్‌సేఏక్ కంటెస్టెంట్లను ఎంపిక చేశారు అనేది నిజం… మంచి మెరిట్ ఉన్న గాయకులు వాళ్లు… పాటల ఎంపిక దరిద్రంగా ఉన్నా సరే, వాళ్లు వీనులవిందుగా ఆలపించగలిగారు… వీరిలో చాలామంది గతంలో పాడతా తీయగా, ఇతర టీవీ మ్యూజిక్ షోలలో పార్టిసిపేట్ చేసినవాళ్లే… మరీ కొత్త మొహాలేమీ కాదు… కాస్తోకూస్తో శాస్త్రీయ సంగీతం చిన్నప్పటి నుంచీ అభ్యసిస్తున్నవాళ్లే… కానీ ఏదో తేడా కొట్టింది… కొడుతోంది… వద్దూ వద్దని తరిమేసిన ఓ […]
Amara Deepam..! కృష్ణంరాజు రజతోత్సవ సినిమా… అవార్డులూ వచ్చినయ్…
రాఘవేంద్రరావు దర్శకత్వ జైత్రయాత్రలో మరో అడుగు 1977 లో వచ్చిన ఈ అమరదీపం సూపర్ హిట్ సినిమా . కృష్ణంరాజుకు బాగా పేరు తెచ్చిన సినిమా . సినిమా ప్రారంభంలో హాయిహాయిగా తిరిగే స్త్రీలోలుడిగా , నేర నేపధ్యంలో కోటీశ్వరుడుగా , తమ్ముడు దొరికాక అతనిని ప్రేమించే అన్నగా , చెల్లెలిని అభిమానించే గొప్ప అన్నగా , తమ్ముడి భార్య మీద వచ్చిన అపోహలను తొలగించేందుకు తన జీవితాన్నే త్యాగం చేసే అమరజీవిగా కృష్ణంరాజు బాగా నటించారు […]
రాజ్ తరుణ్ భలే ఉన్నాడే… లావణ్య వదలదు… పరాజయాలూ వదలవు…
ఒకవైపు లావణ్య నిను వీడని నీడను నేనే అన్నట్టుగా వెంటాడుతోంది… సహజీవనం తాలూకు విషాదం, వివాదం రాజ్ తరుణ్ కెరీర్‌కు మబ్బులు కమ్మినట్టే ఇక అనుకుంటున్న దశలో… వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి తనకు… నిర్మాతలు దొరుకుతున్నారు… చేతినిండా పని, సంపాదన ఉంది… అటు ప్లస్, ఇటు మైనస్… వరుసగా సినిమాలు వస్తున్నాయి సరే, కానీ అన్నీ తన్నేస్తున్నాయి… చెప్పుకోదగిన హిట్ పడటం లేదు… ఏమాటకామాట తను మాత్రం వీలైనంతగా కష్టపడుతున్నాడు… వరుస పరాజయాలు తనను ఇక […]
హీరో బాగా నీరసపడిపోయి… కమెడియన్ హీరోలా చెలరేగిన గ‘మ్మత్తు’వదలరా…!!
మొన్నామధ్య ఏదో సినిమా వచ్చింది కదా… హీరో నాని సినిమా… సరిపోదా శనివారం… ఇందులో హీరో నానిని విలన్ ఎస్ జే సూర్యా ఫుల్ డామినేట్ చేశాడు… కొత్త సినిమా మత్తువదలరా సీక్వెన్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది… హీరో కీరవాణి కొడుకు శ్రీసింహా… ఫస్ట్ పార్ట్‌లో పాపం బాగానే ఇంపార్టెన్స్ ఉంది తన పాత్రకు… ఈ సీక్వెల్ వచ్చేసరికి తను నీరసపడిపోయి, తెరను పూర్తిగా కమెడియన్ సత్యకు అప్పగించేశాడు… అప్పగించేయాల్సి వచ్చింది… కథ, కేరక్టరైజేషన్లు అలా ఉన్నాయి […]
ఇప్పటి వసూళ్ల లెక్కల్లో చూసుకుంటే… ఓ పది బాహుబలులు సరిపోతాయేమో…
వేల కోట్ల వసూళ్ల లెక్కలు చెబుతున్నారు కదా ఇప్పుడు..? పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాదు, జస్ట్ తెలుగులోనే ఆడిన ఈ సినిమా వసూళ్లు ఇప్పటి విలువలో చెప్పాలంటే పదీపదిహేను బాహుబలుల పెట్టు..! ఎన్టీయార్ వసూళ్ల స్టామినా అది… ఆశ్చర్యం ఏమిటంటే, ఈ బ్లాక్ బస్టర్‌ను ఏ భాషలోకి రీమేక్ చేయలేదు, డబ్ చేయలేదు… రికార్డుల సునామీ . రికార్డు బ్రేకింగ్ సూపర్ డూపర్ మాస్ ఎంటర్టైనర్ . 1977 లో వచ్చిన ఈ అడవిరాముడు సినిమా […]
కుర్చీలు మడతబెట్టే పిచ్చి పాటల నడుమ ఓ మెలొడియస్ రిలీఫ్..!
మంచి టేస్టున్న పాట… చెప్పలేని అల్లరేదో, తొంగిచూసే కళ్లలోనా అని స్టార్టవుతుంది… పేరున్న సంగీత దర్శకులు కాదు, పేరున్న గాయకుడు కాదు… పేరున్న లిరిసిస్ట కాదు… కానీ హాయిగా ఆహ్లాదాన్ని నింపేలా ఉన్న మెలొడీ… ఈ పాట నరుడి బత్రుకు నటన అనే సినిమాలోనిది… టేస్టున్న అమెరికన్ నిర్మాతలు తీశారు… చాన్నాళ్లయింది… ఏదీ..? ఇండస్ట్రీలో విడుదలకు ఒక్కరైనా సహకరిస్తే కదా… భిన్నమైన కథ, విభిన్నమైన ప్రజెంటేషన్ అని విన్నాను… ఐతేనేం, ధర్మదాత దొరికితే కదా, ప్రేక్షకుల్ని చేరేది… […]
జై ఎన్టీయార్ నినాదాలు ఇప్పిస్తే… సినిమాకు హైప్ పెరుగుతుందా మాస్టారూ…
నిజానికి ఇందులో జూనియర్ ఎన్టీయార్‌ను తప్పుపట్టడానికి ఏమీ లేదు… కాకపోతే ఇలాంటి వివాదాలు అంతిమంగా తనకే చెడ్డపేరు తీసుకొస్తాయి… జరిగిందేమిటంటే..? దేవర సినిమా ట్రెయిలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో ఏర్పాటు చేశారు… ఆర్ఆర్ఆర్ తరువాత రాబోయే జూనియర్ సినిమా ఇది, పాన్ ఇండియా రేంజ్… తనకూ బాగా హోప్స్ ఉన్నాయి… శ్రీదేవి బిడ్డ జాన్వి తనతో నటిస్తుండటం ఓ ప్లస్ పాయింట్ కాగా… సైఫ్ ఆలీ ఖాన్ మరో ప్లస్ పాయింట్… హిందీలో సినిమా సక్సెస్ కోసం […]
చార్జి షీటు దాఖలు… హేమ మాటల్లాగే ఆ నెగెటివ్ డ్రగ్స్ రిపోర్టు కూడా ఫేకేనా..?
తాజా వార్త ఏమిటంటే..? నటి హేమ కథ మళ్లీ మొదటికొచ్చింది… అదేనండీ, బెంగుళూరులో ఓ రేవ్ పార్టీకి వెళ్లి డ్రగ్స్ తీసుకుందని పోలీసులు కేసు పెట్టారు కదా, ఆమెను అరెస్టు కూడా చేశారు కదా… బెయిల్ తెచ్చుకుంది… ఇప్పుడు ఆ రేవ్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు… అందులో హేమను నిందితురాలిగానే చూపించారని టైమ్స్ ఇండియా కథనం చెబుతోంది… మొత్తం 1086 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేయగా, అందులో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు… ఐతే వారిలో […]
బొడ్లు, పండ్లు కాదు… అప్పట్లో ఆయనా కాస్త మంచి సినిమాలే తీశాడు…
బొడ్ల మీద పండ్లు , పూలు వేస్తాడని ఇప్పుడు రాఘవేంద్రరావుని ఆడిపోసుకుంటారు . మొదట్లో ఆయన కూడా బాలచందర్ లాగా ఆఫ్ బీట్ , లో బడ్జెట్ , సందేశాత్మక , ప్రయోగాత్మక సినిమాలు తీసారు . 1977 లో వచ్చిన ఈ ఆమె కధ సినిమాలో ఉత్తమ నటనకు జయసుధకు రెండో సారి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది . 1976 లో వచ్చిన జ్యోతి సినిమాలో నటనకు మొదటిసారి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది […]
సొసైటీయే సినిమాల్ని చెడగొడుతున్నదట… ఆహా, ఏం చెప్పావమ్మా…
సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని జనాన్ని తప్పుదారి పట్టించేది సినిమా కాదా? ……………………………………………………………………… వాస్తవానికి సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని సమాజాన్ని తప్పుదారి పట్టించేది సినిమాలు కాదని ప్రసిద్ధ హిందీ కవి, స్క్రీన్‌రైటర్ జావేద్ అఖ్తర్ చెప్పారని మంగళవారం సినీ నటి విద్యా బాలన్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. కేరళలోని పాలక్కాడు తమిళ బ్రాహ్మణ అయ్యర్ కుటుంబంలో పుట్టిన విద్యా బాలన్‌కు సమాజానికి దిశానిర్దేశం చేసే బరువుబాధ్యతలను కొందరు అన్యాయంగా సినిమాపై పడేశారని ఎప్పటి నుంచో నిష్టూరంగా […]
ఆ పాత్రను ఎందుకంత చీపుగా షేప్ చేశారు..? ఆయనెందుకు వోకే చెప్పాడు..?
1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక 1977 లో వచ్చిన ఈ ఆలుమగలు సినిమాలో అక్కినేని దసరాబుల్లోడు , ప్రేమనగర్ సినిమాలలో లాగా జయమాలినితో పోటాపోటీగా డాన్స్ చేసి , సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు . ఈ సినిమా ప్రేక్షకులకు , బహుశా మహిళలకు , బాగా నచ్చింది . ఆలుమగలు ఇగో గొడవలతో కీచులాడుకోవటం , కొట్టుకోవటం , విడిపోవటం , సినిమా ఆఖరికి ఎవరో ఒకరు కలపటం , లేదా వాళ్ళకే జ్ఞానోదయం కావటం […]
యండమూరి గారూ… ప్రేక్షకుడు ఈరోజుల్లో మరీ అంతర్ముఖుడు కాగలడా..?!
శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తన 67 వ పుట్టినరోజు సందర్బంగా ప్రఖ్యాత రచయిత – దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్’తో ఓ చిత్రం ప్రకటించారు. యండమూరి రాసిన నవలల్లో అగ్ర తాంబూలం అందుకునే “అంతర్ముఖం”ను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై 117వ చిత్రంగా యండమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్నది ఈ చిత్రం… ఈ వంద చిత్రాలు నిర్మించిన తుమ్మలపల్లి ఎవరో నాకు తెలియదు… నా అజ్ఞానానికి క్షమించగలరు… కానీ యండమూరి తెలుసు… విద్యార్థి దశ […]
భలే భలే మగాడివోయ్… కృష్ణ ఇంగ్లిష్ డబ్బింగు సినిమాకూ డైలాగులు ఈయనవే…
బ్లాస్ట్ ఫ్రమ్ పాస్ట్ భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్… ఈ పాట డెబ్బై దశకం చివరల్లో కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది. అప్పటికే ఫిఫ్టీస్ క్రాస్ చేసేసిన ఆత్రేయ, ఎమ్మెస్ విశ్వనాథన్ లు ఆ పాట సృష్టి కర్తలు. ఆ మద్దెల విడుదలై హిట్టు కొట్టిన భలే భలే మగాడివోయ్ సినిమా ప్రారంభంలోనూ ఈ ఇద్దరు ప్రముఖులకూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాటకు సంబంధించి చాలా మందికి తెలియని రహస్యం ఒకటుంది. సుమారు ముడున్నర […]
అద్వితీయుడైన అంతటి ఎన్టీయార్ ఓ ద్వితీయ పాత్రలో… కొడుకు కోసం..!!
వేములవాడ భీమకవి . 1976 సంక్రాంతికి రిలీజయింది . టైటిల్ రోల్లో బాలకృష్ణ నటించారు . ఈ సినిమా గురించి చెప్పేముందు నాదో సినిమా చెపుతా . సెకండ్ ఫారంలోనో , థర్డ్ ఫారంలోనో మాకు తెలుగు పాఠంలో ఈ వేములవాడ భీమకవి పాఠం ఉంది . భీమకవికి భీమేశ్వరుడు వాక్సిద్ది వరం , శక్తిని ఇస్తాడు . భీమకవి ఏమంటే అది జరుగుతుంది . నేను గుడికి వెళ్లి దేవుడుని ఈ వాక్సిద్ది వరం ఇవ్వమని […]
- « Previous Page
- 1
- …
- 20
- 21
- 22
- 23
- 24
- …
- 131
- Next Page »