మొన్నొకసారి చంద్రముఖి హీరోయిన్ల గురించి రాస్తున్నప్పుడు… చంద్రముఖి సీక్వెల్‌కు ఆ పాత దర్శకుడు వాసు దర్శకత్వం వహిస్తున్నాడనీ, చీప్ టేస్టున్న సదరు దర్శకుడు ఈ సినిమాను ఏం చేస్తాడో పాపం అని అభిప్రాయపడ్డాను… అనుమానించినట్టే జరిగింది… ఓ చెత్తా సినిమాను వదిలాడు ప్రేక్షకుల మీదకు… సీక్వెల్‌కూ స్పూఫ్కూ తేడా తెలియదు ఈ దర్శకుడికి… ఓ పాపులర్ కమర్షియల్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే మరీ ఆ ఒరిజినలే పదే పదే గుర్తొచ్చేలా (పాతదే నయం అని గుర్తొచ్చేలా… […]
ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు… కానీ ఆస్కార్ బరికి సరైన అధికారిక ఎంపిక…
1, ది స్టోరీ టెల్లర్ (హిందీ), 2, మ్యూజిక్ స్కూల్ (హిందీ), 3, మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 4, ట్వెల్త్ ఫెయిల్ (హిందీ), 5, విడుథలై పార్ట్-1 (తమిళ్), 6, ఘూమర్ (హిందీ), 7, దసరా (తెలుగు), 8, వల్వి (మరాఠీ), 9, గదర్-2 (హిందీ), 10, అబ్ తో భగవాన్ సే భరోసే (హిందీ), 11, బాప్ లాయక్ (మరాఠీ), 12, రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ (హిందీ), 13, జ్విగాటో […]
మౌనం రాగం మధురం మంత్రాక్షరం… కంపోజర్‌గా కూడా బాలు ఘనుడే…
Bharadwaja Rangavajhala…. స్వరకల్పన… చీకటిలో వాకిట నిలిచీ దోసిట సిరిమల్లెలు కొలిచీ … 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు. జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత బాపు, జంధ్యాల, సింగీతం లాంటి క్రియేటివ్ జీనియస్సుల దగ్గర సంగీతం చేశారు. అనేక గుర్తుండిపోయే గీతాలకు ప్రాణం పోశారు. కన్యాకుమారితో మొదలై జైత్రయాత్ర […]
దాదా సాహెబ్ ఫాల్కే… పద్మభూషణ్… కానీ అవార్డుల సంఖ్య చాలా తక్కువ…
1955… రోజులు మారాయి అనే తెలుగు సినిమా… కల్లాకపటం ఎరుగనివాడా, ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా అనే పాటలో తొలిసారి నర్తించింది వహీదా రెహమన్… అంటే 68 ఏళ్ల క్రితం… ఇప్పుడామె వయస్సు 87… సుదీర్ఘమైన సినిమా ప్రయాణం… అయితే ఈ ప్రస్థానంలో ఆమెకు లభించిన అవార్డుల సంఖ్య స్వల్పం… అది ఆశ్చర్యకరం… నిజానికి అవార్డులే ఆమె వెంటపడాలి… తెలుగు, తమిళంలో యాక్ట్ చేసినా సరే, ఆమె ప్రధానంగా పనిచేసింది హిందీ, మరాఠీ ఇండస్ట్రీల్లో…! ఇన్నేళ్ల పయనంలో […]
కంగనా రనౌత్ నార్త్ చంద్రముఖి… నాలుగు కాదు, ఆమె నంబర్ అయిదు…
సినిమా సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది… చంద్రముఖిగా ఎవరు బాగా చేశారు అని..! సరదాగా బాగానే ఉంది కానీ చాలామంది కంగనా రనౌత్‌ను నాలుగో నంబర్ చంద్రముఖిగా చెబుతున్నారు… అదీ బ్లండర్… ఆమె త్వరలో విడుదల కాబోయే చంద్రముఖి-2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది… నటిగా ఆమె మెరిట్‌కు వంక పెట్టలేం… కాకపోతే ఆమె సౌత్ సినిమాల్లో నటించి ఎప్పుడూ పెద్దగా క్లిక్ కాలేదు… ఈ సినిమా రిజల్ట్ చూడాలిక… దెయ్యం, […]
ఆ మూగజీవాలూ మన కుటుంబసభ్యులే… ఆ ఉద్వేగాల్ని పట్టించిన మూవీ…
“రామే ..అండాళుం రావణే అండాళుం” ఆనందంతోనో.. బాధతోనో రెండు కన్నీటి చుక్కలు రాల్చలేని కళ్లెందుకు?? .. బావోద్వేగాన్ని పంచలేని గుండె ఎందుకు ?? చివరికి అవయవదానం చేసుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు .. మనిషికి, రోబోట్ కి తేడా ఏంటి అంటే ?? ఫీలింగ్స్ లేకపోవడమే అంటాడు ..రోబో సినిమాలో వశీకరణ్..నిజమే స్పందనలు , బాధ , సంతోషం , ఉద్వేగం , ఆవేశం ఇవన్నీ ఉంటాయి కాబట్టే మనం మనుషులం అయ్యాం .. కానీ […]
సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
నిన్నో మొన్నో మిత్రుడు Yeddula Anil Kumar పోస్ట్ ఒకటి కనిపించింది… ‘‘ప్రముఖ కన్నడ నవలా రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారు మహాభారతం మీద వ్రాసిన నవల “పర్వ”… దాదాపు 90సార్లు ఈ పుస్తకం మరుముద్రణ కాబడింది… లక్షల కాపీలు అమ్ముడయ్యాయి… 7 దేశీయ భాషల్లో, మూడు విదేశీ భాషల్లో ఈ పుస్తకము అనువాదం అయ్యింది… ఇంత గొప్ప పుస్తకాన్ని కశ్మీర్ ఫైల్స్ చిత్రము తీసిన ప్రముఖ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి గారు సినిమాగా తీస్తున్నారు… అందుకోసం రచయితతో ఒప్పందం కూడా […]
సప్త సాగరాలు దాటి… వెలుగుతున్న నటనా ప్రభ… భేష్ రక్షిత్, భేష్ రుక్మిణి…
మనకు ప్రగాఢమైన ఓ నమ్మకం… హిందీ వాళ్లు కూడా సౌత్ బాట పట్టారంటే మన దగ్గర క్రియేటివిటీ, కొత్తదనం మత్తళ్లు దూకుతోందని… అందులోనూ తమిళ, మలయాళ దర్శకులైతే కథను కథలాగా… ఓ బేకార్ హీరోయిజాన్ని దగ్గరకు రానివ్వకుండా ఇంప్రెసివ్ కథనాన్ని ప్రజెంట్ చేస్తారనీ… భిన్నమైన కథలతో ప్రయోగాలు చేస్తారనీ మనకు బోలెడంత విశ్వాసం… అంతే కాదు, హీరోయిన్లలో మలయాళ లేడీస్ అయితేనే నటన ఇరగదీస్తారని కూడా ఓ అంచనా ఉండనే ఉంది… అందం గిందం గాకుండా మొహంలో […]
ఎట్టాగైనా ఏలుకుంటా… నేనే వాణ్ని సాదుకుంటా… జిల్లేలమ్మా జిట్టా…
నిన్ను ఆనాడు ఏమన్నా అంటినా తిరుపతీ… కాపోళ్ల ఇంటికాడ… తిన్నాతిరం పడతలే… బాధయితుందే నీ యాదిల మనసంతా… జిల్లేటమ్మా జిట్టా… ఫోటువ తీస్తున్నడే సీమదసరా సిన్నోడు… రెండేళ్లుగా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ దుమ్మురేపుతున్నయ్…! నిజానికి ఇవన్నీ ఏనాటి నుంచో పాడబడుతున్న జానపదాలేమీ కావు… రీసెంటుగా తెలంగాణ రచయితలు రాస్తున్నవే, తెలంగాణ గాయకులు పాడుతున్నవే… తెలంగాణ క్రియేటివ్ గ్రూప్స్ డాన్సులు కంపోజ్ చేసి, షూట్ చేయించి, అప్ లోడ్ చేయిస్తున్నవే… మొన్న చిరంజీవి సినిమా భోళాశంకర్ […]
షకీలాను పంపించేశారు… సీక్రెట్ రూంకు గరుణపురాణం… పాత బేకార్ తప్పులే మళ్లీ…
బిగ్‌బాస్ ఏదో ఉల్టాపుల్టా అన్నాడు… నిజంగానే అంతా ఉల్టాపల్టా యవ్వారమే కనిపిస్తోంది… రెండు వారాలకొచ్చింది… వీసమెత్తు ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఈ సీజన్ కూడా… గత సీజన్ పనిచేసిన క్రియేటివ్ టీమే పనిచేస్తున్నట్టుంది చూడబోతే… నాగార్జున రాగద్వేషాలు కూడా పనిచేస్తున్నట్టున్నయ్… వెరసి ఇప్పటికీ బిగ్‌బాస్ గాడిన పడలేదు, పట్టాలెక్కలేదు… ఈసారి ఏం చేశారు..? షకీలాను బయటికి పంపించేశారు… అబ్బే, ప్రేక్షకుల వోట్ల మేరకు అంటారేమో… అంత సీన్ లేదు… అదంతా బిగ్‌బాస్ ఇష్టారాజ్యం… పంపించాలనుకుంటే ప్రేక్షకుల వోట్లు […]
తలె కూతల్… తల్లిదండ్రుల మెర్సీకిల్లింగ్‌కు ఓ దిక్కుమాలిన ఆచారసమర్థన…
దక్షిణ తమిళనాడులో అమలులో ఉన్న తలైకూతల్ అనే ఆచారం ఆధారంగా తీసిన సినిమా బారం (బరువు అనే అర్ధం). ప్రియా కృష్ణస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2019 లో జాతీయ అవార్డు గెలుచుకుంది. తలైకూతల్ అనేది వృద్ధాప్యం వలన మంచం పట్టి ఇక వారు కోలుకునే అవకాశం లేదనుకున్న పెద్దవారిని కుటుంబసభ్యులే చంపివేసే దారుణమైన ఆచారం. మెర్సీ కిల్లింగ్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మెర్సీ కిల్లింగ్ ముసుగులో ఈ తలైకూతల్ అనేది ఒక organized crime […]
తమిళ నిర్మాతలు ఆ నిర్ణయమైనా తీసుకోగలిగారు… తెలుగువాళ్లకు చేతనవుతుందా..?
ఒక వార్త ఎందులోనో కనిపించింది… కాస్త ఆసక్తికరంగానే అనిపించింది… తమిళ సినీ నిర్మాతలకు అంత దమ్ముందా..? మన తెలుగు నిర్మాతలకు, దర్శకులకు అందులో వీసమెత్తు దమ్ము కూడా లేదెందుకు..? ఎందుకీ బతుకులు అని కూడా అనిపించింది ఓ దశలో… తీరా వార్త చివరకు వచ్చేసరికి ఓ వాక్యం ఉంది…‘‘గతంలోనే తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ఇలాంటి చర్యలు తీసుకుంది… కానీ పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాకపోవడం గమనార్హం…’’ అని వార్తకు చివరలో పంక్చర్ కొట్టారు… నిజమే… […]
బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ నిజంగా డ్రగ్ నేరస్తుడేనా..?
రామాయణం… సీతను రావణుడు కిడ్నాప్ చేస్తాడు… అంటే రామాయణం కిడ్నాపులను ప్రోత్సహించినట్టేనా..? జస్ట్, ఓ సందేహం… ఓ సినిమాలో ఓ అమ్మాయిని విలన్లు అత్యాచారం చేసినట్టు చూపిస్తారు… అంటే సదరు సినిమా అత్యాచారాల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టేనా..? ఓ నవలలో ఓ ముసలాయన్ని తన సొంత బంధువులే హతమారుస్తారు… అంటే సదరు రచయిత హత్యల్ని, హింసను ప్రమోట్ చేస్తున్నట్టేనా..? మద్యపానం సీన్లు, అమ్మాయిలకు వేధింపుల సీన్లు, హింస సీన్లు లేని సినిమాలు ఉన్నాయా ఈరోజుల్లో… ఇదంతా దేనికి అంటే… […]
ఖైదీ గుర్తుంది కదా… ఈమెను చూస్తే అందరికీ విశ్వామిత్ర తపోభంగమే…
Bharadwaja Rangavajhala….. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా… అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా, ఆ అక్క పేరు మాధవి. ఈ రోజు మాధవి బర్త్ డే. బాలచందర్ అపూర్వరాగంగళ్ తెలుగులోకి రీమేక్ చేసేప్పుడూ…. ఒరిజినల్ లో జయసుధ చేసిన కారక్టర్ కు తగ్గ నటి కోసం వెతుకుతున్నారు దాసరి. అనుకోకుండా రవీంద్రభారతిలో జరిగిన ఓ డాన్స్ ప్రోగ్రామ్ కు వెళ్లారాయన. నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని చూసి ఓకే అనేసుకున్నారు. విజయలక్ష్మి అనే పేరును మార్చారు. అలా తూర్పుపడమర […]
తెలుగు ఇండస్ట్రీకి దూరం… హిందీ వైపు సాయిపల్లవి తాజా అడుగులు…
సాయిపల్లవి ఓ హిందీ సినిమా చేస్తోంది… బాలీవుడ్‌కు చేరింది ఆమె ప్రస్థానం… నిజానికి ఇది వార్తేనా..? వార్తే..! ఎందుకంటే… విరాటపర్వం తరువాత ఆమె తెలుగు సినిమాలేమీ చేయడం లేదు… గార్గి అనే సినిమా వచ్చింది కానీ అదీ తమిళ డబ్బింగ్ కావచ్చు బహుశా… ఆ తరువాత చాలాకాలం మాయమైపోయింది… రకరకాల పుకార్లు… ఆమె ఇండస్ట్రీని వదిలేసిందనీ, సొంతంగా హాస్పిటల్ పెట్టుకుంటోందనీ… ఇలా… కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ ఆమధ్య శివకార్తికేయ హీరోగా నటించే ఓ తమిళ సినిమాకు […]
వాగ్దానం సినిమా… రచయిత ఆత్రేయ దర్శకుడు ఆత్రేయకు ద్రోహం…
Bharadwaja Rangavajhala…. బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఆత్రేయ గురించి ప్రచారమైనన్ని చలోక్తులు ఇంకెవరి గురించీ అయి ఉండవు. చక్రపాణి దీనికి కాస్త ఎగ్జెంప్షన్ కావచ్చు… ఆత్రేయ గురించి డీవీ నరసరాజు గారేమన్నారంటే … నాకు బ్యాంకు అక్కౌంటులో డబ్బు లేకపోతే నిద్రపట్టదు. ఆత్రేయకు అక్కౌంటులో డబ్బుంటే నిద్ర పట్టదు … సోగ్గాడు సినిమా స్క్రిప్టు వర్క్ జరుగుతున్న సందర్భంలో … మోదుకూరి జాన్సన్ : ఆత్రేయ గారూ …. నేనూ మీ పద్దతినే ఫాలో అవుతున్నానండీ […]
అలా ఓ మెరుపు గీతంలాగా వచ్చి… అంతే వేగంగా మటుమాయం…
Bharadwaja Rangavajhala …. బాలు + రామకృష్ణ = రాజ్ సీతారామ్. రాజ్ సీతారామ్ అసలు నామము రాజ్ సీతారామన్ . స్వగ్రామం తమిళనాడు తిరునల్వేలి . అతను క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఆ తర్వాతే సినిమాల్లోకి ప్రవేశించాడు. కె.వి.నటరాజభాగవతార్ దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించి .. పదహారేళ్ల వయసులో జేసుదాస్ బృందంలో చేరి వేదికల మీద పాటలు పాడడం ప్రారంబించారు. ఆ తర్వాత బాలు ట్రూపులో కూడా కొంత కాలం పాటలు పాడాడు. అదే బాలుకు పోటీగా పాడాల్సి […]
తలైవా.., ఉనక్కు వణక్కం సామీ! ఉత్తబక్వాస్ బండల్బాజ్ సినిమా…
Suraj Kumar……… తలైవా, ఉనక్కు వణక్కం సామీ! #ఉత్తబక్వాస్_బండల్బాజ్ సూపర్ స్టారా పాడా! #GoneAreThoseDays! డెబ్బయ్యో పడిలో పడి, మూతి ముప్పైఆరు వంకరలు పెడుతూ, రెండు చేతులు నడుం మీద పడేసి, రుబ్బు రోల్లా తిప్పుకుంటూ నడుస్తూ, బోర్డ్ మ్యానరిజంతో, మొనాటనీ డైలాగులు చెప్తూ, రజినీకాంత్ ఇప్పుడు ఓ #సత్రోల్_స్టార్ ఐపోయాడు! బాబోయ్, ఇక భరించడం కల్ల అనే కాడికి వచ్చాడు! తలైవా, #ఇప్పోదఇల్లై [ఇకవద్దు] సామీ! #సంపాకు [చంపకు] సామీ, #ఉనక్కువణక్కం [నీకుదండం] సామీ! వద్దూ.. […]
మనసు పెడితే క్లాసిక్… రేవు పెడితే డ్యూయెట్… మావోడు మహా ఘటికుడు…
Koppara Gandhi……. మనసు పెడితే క్లాసిక్… రేవు పెడితే డ్యూయెట్****** మా దద్ది చిరాగ్గా కూచుని రెండు కర్రముక్కలు తీసుకుని అడ్డదిడ్డంగా కళ్ళుమూసుకుని డ్రమ్స్ బాదేశాడనుకోండి.. అది ఓ సూపర్ హిట్ డ్యూయెట్ అయి పోతుంది.. ఆరోజుల్లో ఏ పెళ్లి మేళంలో అయినా.. ఏ సెలూన్లో అయినా ఆ పాట ఉండాల్సిందే.. అక్కడ జనం మూగి ఉర్రూతలూగాల్సిందే.. పోనీ అలాకాకుండా తీరిగ్గా కూకుని ఓ పిసర క్లాసిక్ పోపు వేసి.. మధ్యలో ఫ్లూట్ నూరి… చెంచాడు వయోలిన్ […]
రొంబ అరవ అతి తంబీ… ఓ తమిళ మాస్ సినిమాలో షారూక్ నటించాడు… అంతే…
ఆమధ్య ఇదే షారూక్ ఖాన్ సినిమా వచ్చింది… పఠాన్… అబ్బో, వందల కోట్ల వసూళ్లు, బంపర్ హిట్ అని మీడియా ధూంధాం రాసేసింది… తీరా తన సర్కిళ్లోని నటీనటులే ఆ లెక్కల మీద జోకులు వేశారు… అప్పుడు కూడా షారూక్ వైష్ణోదేవి గుడికి వెళ్లి వచ్చాడు… ఇప్పుడు తన సొంత సినిమా… ఇదీ పాన్ ఇండియాయే… ఇప్పుడు కూడా వైష్ణోదేవిని దర్శించుకున్నాడు… అదనంగా తిరుమలకూ వచ్చి వెళ్లాడు… ఎందుకనేది మనం ఇప్పటికే చెప్పుకున్నాం… నాలుగురోజులపాటు దీని వసూళ్ల […]
- « Previous Page
- 1
- …
- 53
- 54
- 55
- 56
- 57
- …
- 126
- Next Page »