అందరూ మోహన్‌బాబు సన్నాఫ్ ఇండియాను తిట్టిపోస్తున్నారు గానీ…. ఇంత ఫ్లాప్ ఈమధ్య ఏ సినిమా ఎదుర్కోలేదని ట్రోల్ చేస్తున్నారు గానీ… ది గ్రేట్ వర్మ అనబడే దర్శకరత్నం నాగార్జునతో తీసిన ఆఫీసర్ అనే సినిమా చెప్పనలవి కానంత ఫ్లాప్… ఈరోజుకూ ఆఫీసర్ అనే పదం వింటే చాలు నాగార్జున గజ్జున వణికిపోతాడు… నిజానికి సన్నాఫ్ ఇండియా సినిమా వల్ల మోహన్‌బాబు ఇజ్జత్ నష్టమే గానీ డబ్బు నష్టమేమీ లేదు… అదేమిటో తరువాత చెప్పుకుందాం గానీ… ఓ రెండు […]
దర్శకుడు విశ్వనాథుడు ఆ శంకరాభరణంకన్నా ముందు డిఫరెంటే సుమీ..!!
Bharadwaja Rangavajhala…………….. కె.విశ్వనాథ్ గారు శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారనే నా అవేదన. ఆయన తొలి సిన్మా హీరో అక్కినేని అయినప్పటికీ NTR తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా? NTR డేట్స్ దొరక్కే.. జీవన జ్యోతి శోభన్ బాబుతో తీశారు.. NTR తో విశ్వనాథ్ అంఖుల్ కి సినిమాల్లోకి రావడానికన్నా ముందే పరిచయం ఉందని తెల్సా? వాళ్లిద్దరూ… బెజవాడ నుంచి గుంటూరు వరకూ రోజు […]
ఈ రేంజ్ ప్రేక్షకుల తిరస్కరణ ఎప్పుడూ లేదు… మోహన్‌బాబు గొప్ప రికార్డు…!!
ఫాఫం మోహన్‌బాబును ప్రత్యేకంగా ఏమీ అనాల్సిన అక్కర్లేదు….. ది గ్రేట్ మంచు లక్ష్మి, మంచు విష్ణు… ప్లస్ మోహన్‌బాబు మాటల తీరు చూసిన వారెవ్వరికీ ఆ సినిమా చూడబుద్ధి కాదు… పైగా ఏవగింపు సరేసరి… వాళ్ళు మారడానికి కూడా ఇష్టపడరు… అదే అసలు సమస్య వాళ్లకు…!! అసలే మోహన్‌బాబు అంటే ఆ పొగరు తెలుగు జనం అందరికీ తెలిసిందే… దానికితోడు విష్ణు, లక్ష్మి అపరిపక్వ మాటలు సరేసరి… జనాల్లో పెద్ద ఎత్తున నవ్వులాటకు దారితీస్తున్నయ్ అవి… మా […]
ఈటీవీలో అంతటి బాపుకే తప్పలేదు అవమానాలు… నిషేధాలు..!!
అసలు టీవీ, మీడియా, సినిమా ఇండస్ట్రీలే అంత… ఏ పెద్ద తలకాయకు ఎప్పుడు కోపమొస్తుందో తెలియదు, ఎవడు ఏం మోస్తాడో, ఎవరేం నమ్ముతారో, ఎవరికి గేట్ చూపిస్తారో అర్థం కాదు… కొమ్మల దాకా ఎక్కించీ ఎక్కించీ చటాలున మొదలునే నరికేస్తారు… ఈటీవీ కూడా అంతే కదా… దాన్ని మొదట్లో రామోజీరావు చిన్నకొడుకు సుమన్ చూస్తుండేవాడు… తను స్వతహాగా కొన్ని సీరియళ్లు రాసేవాడు, నటించేవాడు, డైరెక్షన్… తెలుగు ప్రేక్షకులు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం… మరి అంత పెద్ద ఫిలిమ్ […]
బంగారు బప్పీ…! సినీసంగీతంలో ‘గ్యాంగ్‌లీడర్’… ఆ ట్యూన్లంటే ఓ వెర్రి…!!
అలోకేశ్ లహిరి అలియాస్ బప్పీలహిరి…! తన పాటల్లాగే ఒక జోష్… మొహంలో చింత, విచారం వంటివేమీ ఉండవ్… ప్రత్యేకించి తన ఆహార్యంలో కూడా విపరీతమైన బంగారు ఆభరణాలు కనిపించేవి… ఆయనకు అదొక ప్యాషన్ కమ్ ఫ్యాషన్… చేతులకు, మణికట్టుకు, మెడలో కడియాలు, హారాలు, ఉంగరాలు… బంగారమే కాదు, వెండి, డైమండ్స్… తను నడిచొస్తుంటే ఓ బంగారం షాప్ కదిలొస్తున్నట్టే… ఎప్పుడూ తన బంగారం పిచ్చిని దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు… కాలర్ ఎగరేసి, ప్రదర్శించుకునేవాడు… పదుగురిలో తనకు […]
థమన్ టేస్ట్ తెలిసిందే గానీ… ఫాఫం, అనంత శ్రీరాముడికి ఏమైంది..?
పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి, చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి… దాంతో నీ పనైపోయింది అధోగతి…… ఎక్కడో విన్నట్టు ఉంది కదూ… అవును, చూడాలని ఉంది… అనబడే చిరంజీవి సినిమాలో… ఆయనకూ, సౌందర్యకూ నడుమ సాగే ఫేమస్ సంభాషణ… ఎప్పుడు విన్నా, చూసినా నవ్వాపుకోలేం… చిన్నప్పుడు రేడియోలో బాలానందం సినిమాలో పిల్లల కవిత్వాలు వచ్చేవి కొన్ని… తరువాత ఇప్పుడు ఫేస్బుక్ కవిత్వాలు కూడా అదే టైపు… అఫ్ కోర్స్, తెలుగు సినిమా […]
ఫాఫం కొనఊపిరితో ఉందేమో… పరుచూరి డైలాగుల దెబ్బకు వెంఠనే హరీమంది…
ఆస్కార్ అవార్డుల పరిశీలనకు కూడా మన సినిమాలు పనికిరావా..? ఈ ప్రశ్న ఎప్పటిలాగే చర్చనీయాంశమవుతోంది… సోషల్ మీడియాలో చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నయ్… ఆస్కార్ దాకా ఎందుకు..? అసలు జాతీయ అవార్డుల పరిశీలనకు కూడా మన తెలుగు సినిమాలు పనికిరాకుండా పోతున్నయ్ కదా, మరి ఈ దరిద్రం మాటేమిటి..? ఏవో అరకొర అవార్డులు తప్ప మనం జాతీయ స్థాయిలోనే మన ముద్ర వేయలేకపోతున్నాం కదా అనే నిజం గుర్తొచ్చి, బాధ కాదు, నవ్వొచ్చింది… ఇదేసమయంలో సోషల్ మీడియాలో ఒక […]
బాబు గారూ… కాళ్లు మొక్కితేనే మర్యాద ఇచ్చినట్టా..? ఓ నమస్కారం సరిపోదా..?
సినిమా, టీవీ ఇండస్ట్రీలో కాళ్లు మొక్కించుకుని ఆత్మానందాన్ని పొందే సంస్కృతి ఇప్పుడు కొత్తేమీ కాదు… ఎప్పటి నుంచో ఉన్నదే… అదొక వింత ఆధిపత్య ప్రదర్శన… పాపులర్ దర్శకులు, హీరోలు తమను తాము దైవాంశ సంభూతులనే భ్రమల్లో బతుకుతూ, తమ ఫ్యాన్స్ కీర్తనలతో తాము ఉన్నతులమని పరమానందం పొందుతూ… ఇండస్ట్రీ జనం నుంచి కూడా ఆ కృత్రిమ గౌరవాన్ని పొందే ప్రయత్నం చేస్తుంటారు… షూటింగుకు వచ్చే సహనటులు, ఇతర క్రియేటివ్ సిబ్బంది నుంచి కూడా ఈ మర్యాదను, మన్ననను […]
అంతన్నాడు ఇంతన్నాడే టిల్లు గాడు…! నిజానికి నేహాయే ప్రైమరీ అట్రాక్షన్..!!
అంతన్నాడు, ఇంతన్నాడే…. అన్నట్టుగా… డీజే టిల్లు అనే సినిమా మీద హైప్ ఫుల్లు క్రియేటైంది… జొన్నలగడ్డ సిద్దూ… గతంలో చిన్నాచితకా సినిమాలతో కాస్త పరిచయం… తనదే కథ, తనదే స్క్రీన్‌ప్లే సహకారం… ఇంకేముంది..? ఫుల్లు తన కేరక్టర్ మీదే కాన్సంట్రేషన్… ఓవర్ యాంబిషన్స్… అచ్చం వంద కోట్ల సినిమా రేంజ్‌కు చేరాలనే తన వ్యక్తిగత ఆకాంక్షలాగే… ఈ పాత్ర కూడా ఓ ఆశావాది… అత్యాశావాది అనలేం, ఎవరి లక్కు ఏమిటో చెప్పలేం ఓ తలతిక్క మెగా జర్నలిస్టు […]
3 దేశాల్లో ఎఫ్ఐఆర్ బ్యాన్… హీరో నటన వోకే… మిగతా అంశాల్లో మాత్రం వీకే…
విష్ణు విశాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏముంది..? నిజానికి ఏమీ లేదు… తను పూర్తిగా తమిళనటుడు… ఆమధ్య రానాతో కలిసి అరణ్యలో కనిపించాడు… చాలామంది తమిళ హీరోల్ని తెలుగు ప్రేక్షకులు తమ సొంత హీరోల్లాగే అభిమానిస్తారు, ఆదరిస్తారు… కానీ ఈ విష్ణు పెద్దగా తెలుగు ప్రేక్షకులతో కనెక్టయిన హీరో ఏమీ కాదు… అంతెందుకు, తమిళంలోనే 2009 నుంచీ కష్టపడుతుంటే ఇప్పటికి స్కోర్ 16 మాత్రమే… అందులో నాలుగు తను సొంతంగా డబ్బులు పెట్టి తీసుకున్న సినిమాలే… రాక్షసన్ […]
భామాకలాపం..! ఈమె ఓటీటీ వంటలక్క… ప్రియమణి సరదాగా లాగించేసింది..!!
అదేదో ఢీ అనే డాన్స్ షోలో చూపించినట్టు… ఏదో హైపర్ ఆది అలా చెప్పగానే, అలాగే బావా అని పిలిచి గట్టిగా ఓ హగ్గు ఇచ్చేస్తుంది పాపం అనుకోకండి… మరీ అంత అమాయక కేరక్టర్ ఏమీ కాదు ప్రియమణి బయట… ఫీల్డులో స్ట్రగుల్ అయ్యీ అయ్యీ రాటుదేలి, కూలిపోయిన కెరీర్ గోడను ఎలాగోలా తిరిగి పేర్చుకుంటోంది… భామాకలాపం అనే ఓటీటీ సినిమా (ఆహా) చూస్తున్నంతసేపూ ఆమె మాత్రమే కనిపిస్తుంది… ప్లజెంట్‌గా ఉంది ఆమె… ఎహె, అందం చందం […]
ఖిలాడి..! రవితేజకు చివరి ప్రమాదహెచ్చరిక… ఐనా మారతాడనే ఆశే దండుగ..!!
నిజానికి 54 ఏళ్లు అనేది పెద్ద వయస్సు ఏమీ కాదు… డెబ్భయి దాటిన హీరోలే నడుముకు బద్దలు కట్టుకుని, వంగిపోకుండా, హీరోయిన్ల పిరుదులపై దరువులేస్తూ గెంతులేయడానికి ఆయాసపడుతున్నారు… పెద్ద పెద్ద గన్నులు పట్టుకుని రౌడీలను వందలుగా, మందలుగా నరికిపారేస్తున్నారు… ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు… వందల కోట్లను తెరపైకి వెదజల్లుతూనే ఉన్నారు… హుమ్… ఒకప్పుడు ఎన్టీయార్, ఏఎన్నార్, శోభన్, కృష్ణ, కృష్ణంరాజు తదితరులు ముసలోళ్లయినా ఇంకా ఈ యూత్ వేషాలేమిటీ అని చీదరగా చిరంజీవి వైపు, రాజశేఖర్ వైపు, […]
చిరంజీవికి పెద్దపీట నచ్చలేదా..? కొందరికి ఇష్యూ సెటిల్ కావడమే ఇష్టం లేదా..?!
జగన్ ప్రభుత్వం థియేటర్ల టికెట్ల ధరలు తగ్గిస్తూ ఆమధ్య ఓ నిర్ణయం తీసుకుంది… బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేస్తే, వసూళ్లు చేస్తే తాటతీస్తాను అని చెప్పింది… ఈ నిర్ణయం వెనుక జగన్ అహాన్ని ప్రదర్శిస్తున్నాడనీ, పవన్ కల్యాణ్ మీద కోపంతో ఇండస్ట్రీని తొక్కుతున్నాడనీ, తన ముఖ్యమంత్రిత్వాన్ని గుర్తించని-గౌరవించని ఇండస్ట్రీని కాళ్ల దగ్గర మోకరిల్లేలా చేసుకుంటున్నాడనీ, ఇండస్ట్రీలో ప్రధానంగా కమ్మ పెత్తనం కాబట్టి తన కమ్మ ద్వేషాన్ని ఇండస్ట్రీ మీద కూడా ప్రయోగిస్తున్నాడనీ బోలెడు కథనాలు, ప్రచారాలు […]
అయ్యాకొడుకులు ఏక్‌సేఏక్… ఎటొచ్చీ ఆ కేరక్టరైజేషనే మహాన్ వీక్…
గరికపాటి పుష్ప సినిమాపై కోపం తగ్గినా సరే, మహాన్ అనబడే తాజా చిత్రాన్ని కూడా చూడకుండా తమాయించుకోవడం బెటర్… పుష్పలో ఆఫ్టరాల్ అక్షరమ్ముక్క రాని ఓ కూలీ పెద్ద స్మగ్లర్‌గా ఎదుగుతాడు… అంతే, కానీ ఈ మహాన్ ఇది మరోరకం అరాచకం… రెండు లీడ్ రోల్స్, ఒకటేమో తండ్రి విక్రమ్ పోషిస్తే, మరొకటి తన సొంత కొడుకు ధ్రువ్ పోషించాడు… ఒక వయస్సు మళ్లిన తండ్రి కేరక్టరేమో లెక్చరర్ నుంచి, గాంధేయవాదం నుంచి ఏకంగా దారితప్పి మద్యం […]
‘మహాన్’ తెలివి..! మూవీలో హీరోయిన్ మొత్తం సీన్లన్నీ కత్తిరించి పారేశారు..!!
‘‘ఎందువల్లనైనా’’ దర్శకుడికి సరే కోపం వస్తే… హీరోకు కోపమొస్తే… పోనీ, హీరో కొడుక్కి కోపమొస్తే… నిర్మాతకే నచ్చకపోతే… ఏం జరుగుతుంది..? చెప్పినట్టు వినని హీరోయిన్‌కు కత్తెర పడుతుంది… సీన్స్ పడిపోతయ్… పేమెంట్స్ చిక్కుల్లో పడతయ్… మౌత్ పబ్లిసిటీతో తొక్కేస్తారు… కొత్త చాన్సులు రానివ్వరు… అసలు ఇండస్ట్రీ అంటేనే అది కదా… మరీ కోపమొస్తే మొత్తం ఆమెను సినిమాలో కనిపించకుండా, ఆమె సీన్లన్నీ తీసిపారేస్తారు… అవును మరి, ఎంత పేరున్న హీరోయిన్ అయినా సరే..!! మహాన్ అనే ఓ […]
‘దాసరి చిరంజీవి’..! తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి ‘పెద్దమనిషి’… కానీ..?!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవే సర్వస్వం అని జగన్ ప్రభుత్వం గుర్తిస్తోందా..? మొత్తం ఇండస్ట్రీకి ఆయనే ప్రతినిధి అని భావిస్తోందా..? చిరంజీవి మరో దాసరి అనే సర్టిఫికెట్, అక్రెడిటేసన్ జారీచేస్తోందా..? ఇక ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వంటి సంఘాల ఉనికికి, మనుగడకు అర్థమే లేదా..? లేక వాటి మీద కూడా కమ్మ ప్రభావమే ప్రధానంగా ఉందనే భావనతో జగన్ ప్రభుత్వం వాటిని పక్కకు తోసేసి చిరంజీవిని పైకి ఎత్తుతోందా..? […]
కజ్జాలు, అలకలు, కటీఫ్లు… ఆ గానకోకిల వెలుగుచిత్రానికి మరోవైపు…!!
అయిపోయింది, ఆమె దిగంతాలకు తరలిపోయింది… 80 ఏళ్ల గానం మూగబోయింది… అందరమూ కన్నీళ్లు పెట్టుకున్నాం… ఆ గొంతు కోసం, ఆ స్వర పారవశ్యాన్ని తలుచుకుంటూ…! అయితే ఆ గొంతు సరే, ఆ ప్రావీణ్యం సరే… కానీ ఆమె తత్వం..? స్వర వైవిధ్యం అనేది ప్రేక్షకుడికి దక్కకుండా, మోనోపలీ వైపు…. మొనాటనీని మాత్రమే ఇచ్చిన ఆమె పోకడ..? మరి వాటి మాటేమిటి..? అదంతా నథింగ్, ట్రాష్, మనకు కావల్సింది ఆమె గొంతులోని మాధుర్యం, ఆమె గానప్రావీణ్యం మాత్రమే, ఆమె […]
గానకోకిల… తెలుగు పాటను ఎందుకు ఇష్టపడలేదు..? ఎవరు కారణం..?
లత మంగేష్కర్ కొన్ని వేల పాటలు పాడింది నిజం… ఆమె సరిగ్గా రికార్డ్ చేసి పెట్టుకోలేదు… అందుకే ఎవరికితోచిన లెక్క వాళ్లు చెబుతారు… 36 భాషలు, 50 వేల పాటలు అంటారు… కాదు, కాదు, 20 భాషలు, 20 వేల పాటలు అంటారు మరికొందరు… చివరకు గిన్నీస్ బుక్ వాళ్లే జుత్తు పీక్కున్నారు… రకరకాల అంకెలు వేశారు మొదట్లో… నువ్వే నెంబర్ వన్ అన్నారు… తరువాత కొన్నాళ్లకే, లత కాదు, ఆశా భోంస్లే అన్నారు… మళ్లీ కొన్నాళ్లకు […]
గరికపాటీ… ఆ శోభరాజ్ మీద నోరు పెగలలేదేం..? పుష్ప మీద ఈ ఏడుపేమిటి..?!
ఎస్, సినిమా పాటల తీరు మీద కాస్త స్వరజ్ఞానం, బుద్ధీజ్ఞానం ఉన్నవాడెవడూ సంతృప్తిగా లేడు… పిచ్చి పిచ్చి పదాలు, వెర్రెక్కించే వాక్యాలతో వెగటును, అశ్లీలాన్ని జనం మీదకు వదులుతూ ఉంటారు… అది ఇప్పటి ట్రెండ్ ఏమీ కాదు… నిజానికి ఇప్పుడు చాలా తక్కువ…. ఆత్రేయ, వేటూరి తదితరులు టన్నుల కొద్దీ అశ్లీలాన్ని వండి, తెలుగు ప్రేక్షకుల మీదకు వదిలారు… ఎన్టీయార్, ఏఎన్నార్ దగ్గర్నుంచి ఎవరూ మినహాయింపు కాదు… బూతును దట్టంగా దట్టించిన పాటల్ని పిచ్చి గెంతులతో జనం […]
ఆలియాభట్… బాలీవుడ్ రాణి గంగూబాయ్… అందరికీ ఆమే కావాలి…
పుష్ప బన్నీకి ఆలియా కావాలి… జూనియర్‌కు ఆలియా కావాలి… అందరికీ ఆమే కావాలి… ఆల్రెడీ ఆర్ఆర్ఆర్లో తనే మెరుపు… ఇప్పుడు గంగూబాయ్… ఇంకా చేతిలో బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్, రాకీ ఔర్ రాణికి ప్రేమ కథ… ఇవి కాదు, ఆమె సంతకాలు పెట్టాలే గానీ, గేటు బయట బోలెడు మంది నిర్మాతల క్యూ… బక్కపలచగా, ఎండుకుపోయినట్టుగా, ఇప్పటికీ ఓ టీనేజ్ పిల్లలా కనిపించే ఆలియా భట్ ఈరోజు బాలీవుడ్ యువరాణి… సారీ, బాలీవుడ్ అనే కామాటిపుర రాజ్యానికి ఆమె […]
- « Previous Page
- 1
- …
- 96
- 97
- 98
- 99
- 100
- …
- 117
- Next Page »